NRI-NRT

2020లో ఎంతమంది భారతీయ పిల్లలు జన్మించారు.. ఎంతమంది ప్రవాసులు చనిపోయారంటే..

2020లో ఎంతమంది భారతీయ పిల్లలు జన్మించారు.. ఎంతమంది ప్రవాసులు చనిపోయారంటే..

రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) 2020 ఏడాదికి సంబంధించి విదేశాల్లో భారతీయుల జననమరణాల గణాంకాలను తాజాగా విడుదల చేసింది. ఆ గణాంకాల ప్రకారం 2020లో 170 దేశాల్లో మొత్తం 51వేల మంది భారతీయ పిల్లలు జన్మించారు. అలాగే ఇదే ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 10,187 మంది భారతీయులు మరణించారు. ఇక జననాల్లో అత్యధికంగా UAE లో నమోదయ్యాయి. అక్కడ ఏకంగా 16,469 మంది భారతీయ పిల్లలు పుట్టారు. ఆ తర్వాత సౌదీ అరేబియా (6,047), కువైత్ (4,202), ఖతార్ (3,936), ఇటలీ (2,352), ఆస్ట్రేలియా (2,316), ఒమన్ (2,177), బహ్రెయిన్ (1,567), జర్మనీ (1,400), సింగాపూర్ (1,358), స్పెయిన్ (768), దక్షిణాఫ్రికా (620), యూకే (578), స్వీడన్ (388), జాంబీయా(156), అమెరికా (37), పాకిస్తాన్ (04) మంది పిల్లలు జన్మించారు. ఇక విదేశాల్లో భారత ప్రవాసుల మరణాల విషయాన్ని వస్తే.. 2020లో వరల్డ్‌వైడ్‌గా 10,817 మంది చనిపోయారు. అత్యధిక మరణాలు సౌదీ అరేబియాలో నమోదయ్యాయి. ఆ దేశంలో 3,754 మంది భారతీయులు మరణించారు. ఆ తర్వాత వరుసగా యూఏఈలో 2,454 మంది, కువైత్‌లో 1,279 మంది, ఒమన్‌లో 630, ఖతార్‌లో 386, బహ్రెయిన్‌లో 312 మంది, యూఎస్‌లో 254 మంది, ఇటలీలో 216 మంది, సింగపూర్‌లో 166 మంది, యూకేలో 19 మంది, పాకిస్తాన్‌లో ఆరుగురు చనిపోయారు.