ScienceAndTech

ఎవరు ఎంత ఎత్తు పెరుగుతారు?

ఎవరు ఎంత ఎత్తు పెరుగుతారు?

కొన్ని దేశాల్లోని చిన్నారులు యుక్త వయసు వచ్చేసరికి ఎత్తు తగినంత పెరగడం లేదు. అందుకు పోషకాహార లోపమే కారణం కావొచ్చని ఈ మధ్య ఓ తాజా అధ్యయనంలో తెలిసింది.
**దేశాల వారీగా సగటు ఎత్తును చూస్తే.. కొన్ని దేశాల మధ్య 20 సెం.మీ. (8 అంగుళాల) వరకూ వ్యత్యాసం ఉంటుందని ఆ అధ్యయనం చెబుతోంది.
*2019లో 19 ఏళ్ల అబ్బాయిల సగటు ఎత్తు నెదర్లాండ్స్‌లో అత్యధికంగా 183.8 సెంటిమీటర్లుగా ఉందనీ, అత్యల్పంగా తూర్పు టీమోర్‌లో 160.1 సెంటీమీటర్లుగా ఉందనీ ఈ అధ్యయనం పేర్కొంది.
*ఇదే వయసు అమ్మాయిలు సగటు ఎత్తు నెదర్లాండ్స్‌లో అత్యధికంగా 170.4 సెం.మీ., గ్వాటెమాలాలో అత్యల్పంగా 150.9 సెం.మీ ఉందని లెక్కగట్టింది.
*19 ఏళ్ల అబ్బాయిల సగటు ఎత్తు భారత్‌లో 166.5 సెం.మీ, బ్రిటన్‌లో 178.2 సెం.మీ, అమెరికాలో 176.9 సెం.మీ, చైనాలో 175.7 సెం.మీ.గా ఉన్నాయి. అత్యధిక ఎత్తున్న దేశాల జాబితాలో బ్రిటన్‌, అమెరికా, చైనా వరు సగా 39, 47, 65 ర్యాంకుల్లో నిలిచాయి. భారత్‌ 180వ స్థానంలో ఉంది.
*ఇక 19 ఏళ్ల అమ్మాయిల సగటు ఎత్తు విషయంలో భారత్‌ ర్యాంకు 182. భారత్‌లో వీరు సగటున 155.2 సెంటీమీటర్ల పొడవు ఉంటున్నారు. అదే బ్రిటన్‌, చైనా, అమెరికా ఈ జాబితాలో వరుసగా 49, 54, 58 స్థానాల్లో నిలిచాయి. 19 ఏళ్ల అమ్మాయిల సగటు ఎత్తు బ్రిటన్‌లో 163.9 సెం.మీ., చైనాలో 163.5 సెం.మీ., అమెరికాలో 163.3 సెం.మీ.గా ఉంది.
*ఐదేళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 6.5 కోట్ల మంది ఎత్తుకు సంబంధిం చిన సమాచారాన్ని పరిశోధకుల బృందం విశ్లేషించి, ఈ సమాచారం వెల్లడిం చింది. ఇందుకోసం 1985-2019 మధ్య జరిగిన రెండు వేల అధ్యయనాల సమాచారాన్ని పరిశీలించింది. లాన్సెట్‌ మ్యాగజైన్‌లో ఈ అధ్యయన ఫలితాల్ని ప్రచురించారు.
*వాయువ్య, మధ్య యూరప్‌ల్లో చిన్నారులు, యువత పొడుగ్గా ఉంటు న్నారని… దక్షిణాసియా, ఆగేయా సియా, లాటిన్‌ అమెరికా, తూర్పు ఆఫ్రికాల్లో పొట్టిగా ఉంటున్నారని ఈ అధ్యయనం తెలిపింది.
నెదర్లాండ్స్‌లో 13 ఏళ్ల బాలురు, లావోస్‌లో 19 ఏళ్ల యువకుల ఎత్తు (ఐదడుగుల నాలుగు ఇంచెలు) సమానంగా ఉంది.
*నెదర్లాండ్స్‌లోని 11ఏళ్ల అమ్మాయిలు, గ్వాటెమాలా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, తూర్పు టీమోర్‌ల్లో 19ఏళ్ల అమ్మాయిలు ఒకేఎత్తు (ఐదడుగులు) ఉంటున్నారు.
*శరీరం బరువు, ఎత్తుకు మధ్య నిష్పత్తి ఆధారంగా బీఎంఐని లెక్కగడతారు. బీఎంఐ 18.5 నుంచి 25 మధ్య ఉంటే మనిషి ఎత్తుకు తగిన బరువు ఉన్నట్లుగా పరిగణిస్తారు. 18.5 కన్నా తక్కువ ఉంటే ఉండాల్సినదాని కన్నా బరువు తక్కువ ఉన్నట్లు, 25 కంటే ఎక్కువ ఉంటే ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువ ఉన్నట్లు భావిస్తారు.
*తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ బీఎంఐని కూడా విశ్లేషించారు. పసిఫిక్‌ ద్వీపాలు, గల్ఫ్‌ దేశాలు, అమెరికా, న్యూజీలాండ్‌ల్లో యువత బీఎంఐ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
*బీఎంఐ అతితక్కువగా ఉన్న దేశాల వారికి, అతిఎక్కువగా ఉన్న దేశాల వారికి మధ్య వ్యత్యాసం చూస్తే, దాదాపు 25 కేజీల తేడా కనిపిస్తోందని చెప్పారు.
*పిల్లల ఎత్తు, బరువు విషయంలో జన్యువులూ ముఖ్య పాత్ర పోషిస్తాయని పరిశోధకులు అన్నారు. కానీ దేశం మొత్తం జనాభా విషయంలో మాత్రం పోషకాహారం, సామాజిక పరిస్థితులు కీలకమవుతాయని వారు చెబుతున్నారు.
*అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పోషకాహార విధానాలూ ఎక్కువగా ఐదేళ్ల లోపు పిల్లలను దృష్టిలో పెట్టుకునే ఉంటున్నాయని, పెద్ద వయసున్న పిల్లలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అంటున్నారు.
‘చిన్నతనంలో, టీనేజీలో ఆరోగ్యకరమైన ఎత్తు, బరువు ఉన్నవారు తదనంతర జీవితంలోనూ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ’ని ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌ పరిశోధకురాలు డాక్టర్‌ ఆండ్రియా రోడ్రిగేజ్‌ మార్టినెజ్‌ అన్నారు.
*’పోషకాలు బాగా ఉండే ఆహారపదార్థాల లభ్యత పెరిగేందుకు, వాటి ధరలు తగ్గేందుకు మన అధ్యయన ఫలితాలు తోడ్పడాలి. చిన్నారుల బరువు అతిగా పెరగకుండా, ఎత్తు పెరగడానికి పోషకాలు చాలా ముఖ్యం. స్కూళ్లలోని ఉచిత భోజన పథకాల్లో వీటిని భాగం చేయాలి. అల్పాదాయ కుటుంబాలకు పోషకా హారాలను అందించే పథకాలను తేవాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
*’మొదటిసారిగా ఈ అధ్యయనం చిన్నపిల్లలు, టీనేజీ వారిపైనా దృష్టి పెట్టింది. పిల్లలు చిన్నప్పుడే కాదు, పెద్దయ్యే క్రమంలోనూ ఆరోగ్యంగా ఉండాల్సిన విష యమై వివిధ దేశాలు తగినంత చేయడంలేదని బయటపెట్టింది’ అని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రోపికల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ అలన్‌ డంగూర్‌ అన్నారు.