Politics

పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరిస్తున్నాం – TNI రాజకీయ వార్తలు

పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరిస్తున్నాం – TNI రాజకీయ వార్తలు

*రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గడంతో పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. ఇప్పటి వరకూ పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉందని తెలిపారు. పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్ను కూడా 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు.

*ప్పు చేస్తే ఎవరినీ వదలం.. చేయలేదని నిరూపించుకోగలరా? : మంత్రి బొత్స
పదో తరగతి పేపర్‌ను వాట్సాప్‌లో పంపి మాస్ కాపీయింగ్‌కు యత్నించారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సచివాలయంలో సీఎం జగన్ను కలిసిన మంత్రి బొత్స.. పదోతరగతి పేపర్‌ లీకేజీ కేసులో నారాయణ అరెస్టు, ఇతర అంశాలపై చర్చించారు. మాస్ కాపీయింగ్‌లో నారాయణ కాలేజ్‌ వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని మంత్రి వెల్లడించారు.తప్పు చేస్తే ఎవరినీ వదలంపదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేసినట్లు.. మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్‌ లీకేజీ ఘటనపై 60 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదన్న ఆయన.. తప్పు చేయలేదని ఎవరైనా నిరూపించుకోగలరా? అని ప్రశ్నించారు. సచివాలయంలో సీఎం జగన్ను కలిసిన మంత్రి బొత్స.. పదోతరగతి పేపర్‌ లీకేజీ కేసులో నారాయణ అరెస్టు, ఇతర అంశాలపై చర్చించారు. పదో తరగతి పేపర్‌ను వాట్సాప్‌లో పంపి మాస్ కాపీయింగ్‌కు యత్నించారని అన్నారు. మాస్ కాపీయింగ్‌లో నారాయణ కాలేజ్‌ వైస్ ప్రిన్సిపల్ కూడా ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని మంత్రి బొత్స వెల్లడించారు.

*పంజాబ్ పేరు పాడు చేయాలని చూస్తేవదిలిపెట్టం: సీఎం మాన్
పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి పేలుడు సంభవించింది. అయితే పంజాబ్ పేరును పాడు చేయాలని చూడొద్దని, అలాంటి ప్రయత్నాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హెచ్చరించారు.ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, తొందరలోనే వాస్తవాలు వెల్లడవుతాయని స్పష్టం చేశారు. ”మొహాలీ పేలుడపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్ పేరును పాడు చేయాలని ఎవరు చూసినా వదిలిపెట్టేది లేదు” అని సీఎం మాన్ అన్నారు.కాగా, ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ దాడి పిరికిపందల చర్యగా ఆయన చెప్పుకొచ్చారు. నిందితులు శిక్ష అనుభవించాల్సిదేనని అని అన్నారు. ”పంజాబ్‌లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీయాలనే మొహాలీలో బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఇది పిరికిపందల చర్య. పంజాబ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వెనకడుగు వేయదు. ప్రజల సహకారంతో పంజాబ్‌లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. అదే సమయంలో నింతితులు శిక్ష అనుభవించక తప్పదు” అని కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా అన్నారు.
మొహాలీలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ భవనంలో పేలుడుతో మూడో అంతస్తులో ఉన్న ఓ కిటికీ, గోడలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పేలుడు పదార్థం క్యాడ్రిడ్జ్‌ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. అది రాకెట్‌-ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌(ఆర్పీజీ)గా స్పష్టమవుతోంది. ఆర్పీజీలను గ్రనేడ్‌ లాంచర్ల ద్వారా ప్రయోగిస్తారు. ఇటీవల పంజాబ్‌లోని కర్నాల్‌, తరణ్‌తరణ్‌ ప్రాంతాల్లో ఖలిస్థానీ ఉగ్రవాదులను అరెస్టు చేసి, పేలుడు పదార్థాల స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్‌ భవనంపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. పోలీసులు మాత్రం ఉగ్రవాదుల నుంచి సీజ్‌ చేసిన పేలుడు పదార్థాలను ఇంటెలిజెన్స్‌ కార్యాలయ భవనంలోని మూడో అంతస్తులో భద్రపరుస్తామని, వాటిల్లో ఒకటి పేలి ఉంటుందని చెబుతున్నారు.

*డబుల్‌ బెడ్రూంలు సీఎం కేసీఆర్‌ కానుక : కేటీఆర్‌
డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ ఇస్తున్న కానుక అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ‘కోరుట్లపేట గ్రామంలో డబుల్‌ బెడ్రూంలో గృహ ప్రవేశం చేసిన అన్నదమ్ములకు, అక్కా చెల్లెల్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మూడు ఇండ్లలో లాంఛనంగా వారికి ఇండ్లు అందజేసి, గృహ ప్రవేశం చేయించాం.లాంఛనంగా గృహప్రవేశం చేయించే సందర్భంగా ముగ్గురిని ఒకటే అడిగిన. మీరు ఎక్కడ ఉండేది అని అడిగిన?. ఇక్కడే గుడిసెలో ఉండేవాళ్లమని చెప్పారు. మరి ఇదే ఇల్లుగనక మీరు కట్టి ఉంటే ఎంత ఖర్చయ్యేదని అడిగిన.. రూ.8లక్షల నుంచి రూ.10లక్షలు ఖర్చవుతుండే, కానీ ప్రభుత్వమే మాకు నిర్మించి ఇచ్చిందని చెప్పారు. ఒక్క రూపాయి గానీ, ఒక పైసా గానీ ఎవరికైనా లంచం ఇచ్చారా?.. మీ సర్పంచో.. ఉప సర్పంచో.. వార్డు మెంబరో.. ఎంపీటీసీ ఎవరికైనా పైసా లంచం ఇవ్వాల్సి వచ్చిందా? అని అడిగిన. ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం పడలేదు.మమ్మల్ని వెతికి.. ఇల్లు లేదని గుర్తించి.. అర్హత ఉందని భావించి డబుల్‌ బెడ్రూం ఇచ్చారు.. సంతోషం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.20వేలకోట్లతో ప్రభుత్వం బ్రహ్మాండంగా 2.70లక్షల ఇండ్లు నాణ్యంగా నిర్మించి పేదలకు అందజేస్తున్నది. ఇలాంటి కార్యక్రమం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో మాత్రమే ఉన్నది. కావాలంటే దేశంలో ఎక్కడైనా చూడొచ్చు. ఏ రాష్ట్రమైనా పోవచ్చు.. అక్కడ మీకు చుట్టాలున్నా.. అక్కడ మీకు దోస్తులున్నా ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. రెండు బెడ్రూంలు, రెండు టాయిలెట్లు, ఒక హాలు, ఒక కిచెన్‌.. భారతదేశంలో ఇంత నాణ్యత ఇండ్లు కడుతున్న ప్రభుత్వం ఎక్కడా లేదు.500 చదరపు అడుగుల్లో ఇంత బ్రహ్మాండంగా పేదవారికి రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. మేం ఏం కోరుతున్నమంటే.. ఇంత నాణ్యమైన ఇండ్లను చేతిలో పెట్టినప్పుడు.. చుట్టుపక్కల పరిశుభ్రత పాటించండి. మొక్కలు నాటండి. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇండ్లను కాపాడుకోవాలని చెబుతున్నాం. ఈ ఇండ్లు మీకు కేసీఆర్‌ ఇస్తున్న కానుక. దీన్ని మీరు పిల్లలకు ఇచ్చుకునే విధంగా బ్రహ్మాండంగా మేయింటెన్‌ చేయాలని కోరుతున్నాం. గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలు తెలుసు. పల్లె ప్రగతిలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు, మిషన్‌ భగీరథలో భాగంగా మంచినీళ్లు, మంచినీళ్ల ట్యాంకులు, రైతులు వేదికలు, వైకుంఠధామాలు, నర్సరీలు ఇవన్నీ దేశంలో ఒక తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు. 24 గంటల కరెంటు వస్తున్నది, రైతుబంధు ద్వారా 50వేలకోట్ల రూపాయాల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.

*ఖబర్దార్.. టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచంలోనే 10 శాతం పెంచిన వ్యక్తి మంత్రి కేటీఆర్(KTR) అని మంత్రి ప్రశాంత్ రెడ్డి(Prashant Reddy) అన్నారు. మంగళవారం ఉదయం బీబీ పేట మండలం కోనాపూర్‌లో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ…బీబీపేట మండలంలోని కొనాపూర్‌లో కేటీఆర్ నానమ్మ జ్ఞాపకార్థం రూ.2 కోట్లతో పాఠశాలను నిర్మించడం గర్వించదగ్గ విషయమన్నారు. వందల ఎకరాల భూములు కలిగిన కుటుంబంలో జన్మించిన వ్యక్తి కేసీఆర్(KCR) అని చెప్పుకొచ్చారు. మహబుబ్‌నగర్‌లో సున్నాలు వేసుకొనేటోడు, నిజామాబాద్‌లో చందాలు వసూలు చేసుకొనేటోడు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఖబర్దార్.. టీఆర్ఎస్ కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెబుతారు’’ అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

*మహబూబాబాద్ అణగదొక్క బడ్డది…ఆ పాపంలో మేము ఉన్నాం
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు లేదు, ఇక్కడ అమలయ్యే పథకాలు లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Errabelli dayakar rao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… దమ్ముంటే అక్కడ పథకాలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని సవాల్ విసిరారు. గిరిజన తండాల అభివృద్ధికి వెయ్యికోట్లు ఖర్చుచేస్తామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా అణగదొక్క బడ్డదని, ఆ పాపంలో తాము కూడా ఉన్నామని తెలిపారు. అప్పటి పార్టీలు చెప్పినట్టు నడుచుకోవాల్సివచ్చిందని వివరించారు. పిచ్చికూతలు కూసే కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను తిప్పికొట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

*కేసీఆర్ పోలీసు డిపార్ట్మెంట్‌కి అధిక ప్రాధాన్యమిచ్చారు: మహమూద్ అలీ
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95 శాతం పూర్తయ్యాయని హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో ఈ సెంటర్‌ని ప్రారంభిస్తామన్నారు. రూ.585 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 450 కోట్లు ఖర్చు అయిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పోలీసు డిపార్ట్మెంట్‌కి అధిక ప్రాధాన్యమిచ్చారని మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉండటంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నామన్నారు. ఇదొక యూనిక్ బిల్డింగ్‌గా ఉండిపోతుందన్నారు. విదేశీ టెక్నాలజీ ఉపయోగించి ఈ సెంటర్‌ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటయ్యాక పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.

*ఏపీలో దయనీయంగా రైతుల పరిస్థితి
రాష్ట్రంలో రైతల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ నేత సోము వీర్రాజు(Somu Veerraju) అన్నారు. గన్నవరంలో బీజేపీ పదాధికారుల, శక్తి కేంద్రాల ప్రతినిధులు సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ… ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. 151 స్థానాలు ఇస్తే.. అప్పులు చేసి పాలన చేయమని కాదని అన్నారు. రాష్ట్రాన్ని, ప్రజలను అభివృద్ధి పధంలో పయనించకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులను వాడుకుని ఆదాయం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మాత్రం ఆస్తులను పెంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో అంశాలపై సమీక్ష చేసే జగన్(Jagan) .. అప్పుల మీద ఎందుకు సమీక్షించరని నిలదీశారు. నేడు అప్పు కూడా పుట్టని పరిస్థితికి తెచ్చారని అన్నారు. రాష్ట్రంలో దారుణాలు పెరిగిపోతున్నా జగన్‌కు పట్టదని ఆయన విమర్శించారు.

*నారాయణ అరెస్ట్ వెనుక జగన్ కుట్ర
మాజీ మంత్రి నారాయణ(Narayana)అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నేత బుద్దా వెంకన్న(Budda venkanna) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… నారాయణ అరెస్టు వెనుక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపించారు. మొన్న ఉపాధ్యాయుల ఆందోళనలో జగన్ తీరుపై టీచర్లు ధ్వజమెత్తారని… అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) వారిపై కక్ష కట్టారన్నారు. పదో తరగతి పేపర్‌ను ప్రభుత్వ పెద్దలే లీక్ చేశారని అన్నారు. ఇప్పుడు కొంతమంది టీచర్‌లను టార్గెట్ చేసి కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. నారాయణను కూడా ఈ కేసులో ఇరికించారన్నారు. ప్రభుత్వంపై పడిన మచ్చను చెరిపేయాలని మాజీ మంత్రిగా నారాయణను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు భయపడవద్దని.. తాడోపేడో తేల్చుకుందామని తెలిపారు. నారాయణ అక్రమ అరెస్ట్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని టీపీపీ శ్రేణులకు బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు.

*అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే అక్రమ అరెస్ట్‌లు
మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్‌లు అని వ్యాఖ్యానించారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్‌లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయన అన్నారు. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే.. నారాయణను ఏవిధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని అన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్ట్‌ల పట్ల భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

*వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డ Sailajanatht
వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శైలజానాథ్(Sailajanath) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళతారని ప్రశ్నించారు. ‘‘మూడేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏది అంటూ నిలదీశారు. ‘‘ప్రత్యేక హోదా సాధనలో విఫలమైనందుకా?… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినందుకా?.. ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఏవి?.పన్నులు పెంచినందుకా…? ప్రాజెక్టులు పూర్తి చేయనందుకా?.అప్పులు చేసి ప్రజలపై భారం మోపినందుకా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు. అరాచక పాలనపై ప్రజలే తిరగబడే రోజు వచ్చిందన్నారు. తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చుని బటన్ నొక్కటం అభివృద్ధి కాదని సూచించారు. ప్రజలే బటన్ నొక్కి తాడేపల్లి ప్యాలస్‌లో పెర్మనెంట్‌గా కూర్చోబెట్టే రోజులు వస్తున్నాయన్నారు. పొత్తుల గోల వదిలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని శైలజానాథ్ హితవుపలికారు.

*బీజేపీది మాటల ప్రభుత్వం: మంత్రి Harish rao
కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హరీష్ రావు(Harish rao) స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం టీటీడీ కల్యాణ మండపంలో మెగా హెల్త్ క్యాంప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీది మాటల ప్రభుత్వమని విమర్శించారు. వరంగల్‌లో అద్భుతంగా హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పేదలు బతికే పరిస్థితి లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్ళు ఇవ్వబోతున్నామని తెలిపారు. సంవత్సరంలోగా 24 అంతస్తులలో 2000 పడకల పెద్ద ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయనున్నట్లు మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

*నేను గాంధీని కాను.. నా జోలికొస్తే గట్టిగా సమాధానం చెబుతా: మంత్రి దాడిశెట్టి రాజా
‘నేను గాంధీని కాను… ఎవరి జోలికీ వెళ్లను. నా జోలికి వస్తే గట్టిగా సమాధానం ఉంటుంది…’ అని రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో సోమవారం జరిగిన వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘తునిలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి ఓ పార్టీ వారిపై నేను కేసులు పెట్టించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది నాకు సంబంధం లేని విషయం. సామాజిక మాధ్యమాల వేదికగా ఇద్దరి మధ్య జరిగిన వివాదం పెరిగి వారు కొట్లాడుకున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో పెట్టిన వారిని నేనే విడిపించాను. ఇప్పటికైనా వాస్తవాలను ఆ పార్టీ నాయకులు గుర్తించాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జనసేన నాయకులు ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి రాజా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పార్టీలు పెట్టిస్తూ, వాటితో పొత్తులు పెట్టుకుంటూ వస్తారని మంత్రి విమర్శించారు. జగన్‌ సమర్థుడని, ఆయన ఒంటరిగానే పోటీ చేస్తారని తెలిపారు.

*KCR కారణంగా నీలగిరి నందనవనం ధ్వంసమవుతోంది
CM Kcr కారణంగా నల్గొండ పట్టణంలో 5 ఎకరాల్లో ఉన్న నీలగిరి నందనవనం ధ్వంసమవుతోందని BJP సీనియర్ నేత Vijayashanti విమర్శలు గుప్పించారు. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్ కోసం ఆఫీసర్లు వనాన్ని నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు విజయశాంతి ఫేస్‌బుక్‌‌లో ఓ పోస్ట్ చేశారు.ఫేస్‌బుక్ పోస్ట్ యథాప్రకారం.. ‘ సీఎం కేసీఆర్ హ‌రిత‌హారం పేరుతో వేల చెట్ల‌ను నాటించిన‌ట్టు చెప్పుకుంటారు. కానీ ఆ సీఎం కారణంగానే ఒక ఉద్యాకన‌వ‌నం ధ్వంసం అవుతోంది. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్ కోసం నల్గొండ పట్టణంలో ఐదెకరాల్లో ఉన్న నీలగిరి నందనవనాన్ని ఆఫీసర్లు నాశనం చేస్తున్నరు. దగ్గర్లో 150 ఎకరాల భూములున్నా… కేవలం జిల్లా కలెక్టరేట్ పక్కనే హెలిప్యాడ్ ఉండాలనే ఒకే ఒక్క కారణంతో సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు నరికేస్తున్నరు. ఒక ఎకరం ఉంటే సరిపోయే హెలీప్యాడ్ కోసం జనావాసాల మధ్య తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రెండెకరాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన మరో మూడెకరాలు స్వాధీనం చేసుకున్నరు. నీలగిరి నందనవనంలోని మూడెకరాల్లో వేప, మద్ది, దిరిసెన తదితర చెట్లు పట్టణ ప్రజలను దశాబ్దాలుగా ఆహ్లాదపరుస్తున్నయి. కానీ కొద్దిరోజులుగా వీటితో పాటు తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ ఆవరణలో లక్షలు ఖర్చుపెట్టి నాటిన మొక్కల్ని కూడా తొలగిస్తున్నరు. హెలీప్యాడ్ నిర్మించడానికి పట్టణ పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల్లో ఖాళీ స్థలం ఉంది. ఎస్ఎల్బీసీ వద్ద సుమారు 150 ఎకరాలుండగా, దీంట్లో ప్రభుత్వ భవనాలకు వంద ఎకరాలు కేటాయించారు. అయినప్పటికీ ఇందులో ఇంకా 50 ఎకరాల వరకు ఖాళీగా ఉంది. కానీ నీలగిరి నందనవనాన్ని నరికేసి అక్కడే హెలీప్యాడ్ నిర్మించడానికి అధికారులు మొగ్గు చూపుతున్నరు. హ‌రిత‌హారంతో ఎంతో చేశామ‌ని చెప్పుకునే కేసీఆర్ దగ్గర దీనికి జవాబుందా? ఇప్ప‌టికైనా ఈ విధ్వంస కాండ‌ను ఆపాలి’ అని విజయశాంతి పేర్కొన్నారు.

*మత విధ్వేషాలకు BJP యత్నం: తమ్మినేని
తెలంగాణ ప్రజల మధ్య మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుటిల యత్నాలకు పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. మతోన్మాద శక్తులకు తెలంగాణలో చోటివ్వవద్దని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలతో దేశానికి, పేదలకు ఎం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సరూర్‌నగర్‌లో హత్య చేయపడ్డ నాగరాజు హత్యను సీపీఎం ఖండిస్తోందన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కులాంతర వివాహాలపై చట్టం తేవాలని వీరభద్రం డిమాండ్ చేశారు.

*మన బస్తీ మన బడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా:Talasani
మన బస్తీ-మనబడి దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు. సోమవారం ముషీరాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో మన బస్తీ -మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులను స్థానిక MLA ముఠా గోపాల్(Muta gopal), MLC సురభి వాణి దేవి( surabhi vani devi)తో కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంత్రి తలసాని పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నదని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ యాదవ్ ను పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

*ఇంకో ఏడు సీట్లు గెలవాల్సిందే!
ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం).. మజ్లిస్‌ పార్టీ.. తెలంగాణలోనే కాదు.. దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. మజ్లిస్‌ పార్టీకి రాష్ట్రంలో ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఈ సీట్లను రెట్టింపు చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ కసరత్తు ప్రారంభించింది. మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఈ మేరకు పావులు కదుపుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోనే కాకుండా ముస్లిం మైనారిటీ కుటుంబాలు అధికంగా నివసించే శాసనసభ నియోజకవర్గాల్లో పాగా వేయడానికి పార్టీ యంత్రాంగం కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో ముస్లిం జనాభాతో పాటు దళితులు, గిరిజనులు, బీసీ వర్గాలను పార్టీ వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీని వ్యతిరేకిస్తున్న మజ్లిస్‌..రాష్ట్రంలో అఽధికార టీఆర్‌ఎ్‌సతో ఎన్నికల్లో పొత్తులు లేకుండానే మిత్ర పక్షంగా వ్యవహరించడం గమనార్హం. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే పార్టీ పరంగా వచ్చే ప్రయోజనం కంటే పరస్పర అవగాహనతో పనిచేస్తేనే ఎక్కువగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. అవగాహనతో పనిచేస్తేనే మేలని అంటున్నారు. అందుకు అనుగుణంగా ఆయా జిల్లాల్లో, గ్రేటర్‌, శివారు ప్రాంతాల్లోనూ ఇతర పార్టీల్లో క్రియాశీలంగా ఉన్న ముస్లిం నాయకులను సమన్వయం చేసుకోవడంతోపాటు దళిత వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు పార్టీ యంత్రాంగం కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. భవిష్యత్‌లో మజ్లిస్‌ జాతీయ స్థాయిలో బీజేపీకి రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని.. కొత్తగా పార్టీలో చేరే నాయకులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని సీనియర్లు ప్రచారం చేస్తున్నారు.

*KCR కుటుంబానికి కృతజ్ఞత లేదు: మల్లు రవి
సీఎం కేసీఆర్ (KCR) కుటుంబానికి కృతజ్ఞత లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కుటుంబాన్ని అవమానిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ విమర్శలను ప్రజలు హర్షించడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలపై రాహుల్ మాట్లాడలేదని తెలిపారు. కేవలం కాంగ్రెస్ ఏం చేయబోతుందో రాహుల్ చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ డిక్లరేషన్‌తో టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయని మల్లు రవి పేర్కొన్నారు.

*తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: ktr
తెలంగాణకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr) అన్నారు. బిజెపి నాయకులు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.జాతీయ పార్టీ నేతలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. మోదీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే సుష్మాస్వరాజ్ చెప్పినట్లు పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.రాష్ట్రానికి చేసిందేమీలేదు కానీ.. సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అమిత్‌షా సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. బిజెపి నాయులు ఉర్దూ భాషపై విషపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రం నిర్వహించే పోటీ పరీక్షల్లో ఉర్దూ ఉంటే తప్పు లేదు కానీ తెలంగాణలో ఉర్దూ ఉంటే వద్దంటున్నారని మంత్రి ఆరోపించారు.

*2024లో జగన్‌ ఓడితే మీరూ ఓడినట్లే
జగన్‌ను మళ్లీ సీఎంను చేయాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలదేనని గృహనిర్మాణ మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోతే అది ఈ వర్గాల ఓటమే అవుతుందని చెప్పారు. నూతన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అగ్ర స్థానం కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌, మహాత్మా ఫూలే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారమిక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ నిర్వహించారు. పలువురు మంత్రులు పాల్గొన్నారు. మంత్రి జోగి మాట్లాడుతూ.. బలహీనులుగా ఉన్న తమను జగన్‌ బలవంతులను చేశారని.. 25 మందితో కూడిన కేబినెట్‌లో ఈ వర్గాలకు చెందిన 17 మందికి అవకాశం కల్పించడమంటే జగన్‌ది ఎంత పెద్ద మనసో ఆలోచన చేయాలన్నారు.

*జగన్‌ ప్రభుత్వం హిందూ ద్రోహి: వీర్రాజు
‘‘రాష్ట్ర ప్రభుత్వం మతతత్వ వైఖరి అవలంబిస్తోంది. క్రిస్టియన్లను, ముస్లింలను వెనకేసుకొచ్చి హిందువులపై దాడులకు తెగబడుతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాకినాడ జేఎన్‌టీయూ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే, ముస్లింలకు మసీదు కట్టుకోవడానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. మా వాళ్ళను ముస్లింలతో కొట్టిస్తానని ఎమ్మెల్యే అన్నారు. నేనే కాకినాడ వస్తాను. ఎంత మందితో నన్ను కొట్టిస్తారో చూస్తా’’ అని సవాల్‌ విసిరారు.

*బిహార్‌ని తలపించేలా ఏపీలో గన్‌కల్చర్‌: లోకేశ్‌
బిహార్‌ని తలపించేలా ఏపీలో గన్‌కల్చర్‌ రావడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. ఆడబిడ్డలపై పెరిగిపోతున్న ఈ అఘాయిత్యాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాన్నారు.

*విదేశాల్లో సీఎం పిల్లలు మాత్రమే చదువుకోవాలా?: జవహర్‌
‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పిల్లలు మాత్రమే విదేశాల్లో చదవాలా? పేద దళితుల పిల్లలు చదవకూడదా? దళితుల పిల్లలకు విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సాయం అందించే అంబేద్కర్‌ విదేశీ విద్య పఽథకాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది?’’ అని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ సోమవారం ప్రశ్నించారు. మూడేళ్లుగా దళితులకు జగన్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోందని విమర్శించారు.

*అంగన్‌వాడీలు… Play schoolsగా మార్పు: బొత్స
అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లగా మార్పు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ వెల్లడించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘ఒకటి, రెండు తరగతిలను కలిపి ఒక యూనిట్‌గా మార్పు చేస్తున్నాం. ఇక్కడ ఫౌండేషన్‌ కోర్సును తీసుకువస్తున్నాం. 3 నుంచి 10వ తరగతి వరకు ఒక యూనిట్‌గా పరిగణిస్తాం. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నాం. పాఠశాలల పరిధి మూడు కిలో మీటరు నుంచి ఒక కిలో మీటరు వరకు కుదించాం. అవసరమైన చోట జూనియర్‌ కళాశాలలను డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. కానీ కొత్తగా కళాశాలలు ఇవ్వం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు

*Chandrababu పచ్చి అబద్దాల కోరు: కొడాలి నాని
ఎన్ని గుంపులొచ్చినా ఎదుర్కొనేందుకు సింహం రెడీగా ఉందని సీఎం జగన్‌ను ఉద్దేశించి మాజీమంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు కలిసినా జగన్‌ను ఏం చేయలేరని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాల కోరని దుయ్యబట్టారు. జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే బాబుకు ఇంకో పార్టీ ఎందుకు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలు చివరివి అని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు అధికారం కావాలి.. పవన్‌కు డబ్బు కావాలన్నారు. చంద్రబాబు, పవన్‌తో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని కొడాలి నాని ఎద్దేవాచేశారు.

*Jagan సజ్జల నేర మంత్రుల బృందంతో దోచుకున్నారు: పిల్లి మాణిక్యరావు
సీఎం Jagan ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేర మంత్రుల బృందంతో దోచుకున్నారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిని మార్చి మరో నేర మంత్రుల బృందంతో మళ్లీ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీకి ఉన్న నేర భావసారూప్యత మరే పార్టీకి ఉండదన్నారు. అందుకే అన్ని పార్టీలు వైసీపీని చీదరించుకుంటున్నాయని తెలిపారు. జగన్‌కు దమ్ముంటే వ్యూహకర్తలు లేకుండా గెలవాలని పిల్లి మాణిక్యరావు సవాల్ విసిరారు.

*మంత్రి బొత్స, సీఎం Jagan చేసిన విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూశారు: Lokesh
చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులను చేయడం జగన్ (Jagan) అండ్ కో ట్రేడ్ మార్క్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) విమర్శించారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సీఎం జగన్ రెడ్డి చేసిన విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారన్నారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. సంబంధంలేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని వదిలేసి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందొచ్చు కానీ.. పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదని నారా లోకేష్ అన్నారు.

*ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణ అరెస్టు: Chandrababu
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారన్నారు. కక్షపూరితంగానే Narayanaను అరెస్టు చేశారని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి.. ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాస్ కాపీయింగ్‌కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు.. నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా… విచారణ చేయకుండా, అధారాలు లేకుండా నేరుగా అరెస్టు చెయ్యడం కక్ష పూరిత చర్య కాదా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

*కక్ష సాధింపు చర్యల్లో భాగమే నారాయణ అక్రమ అరెస్ట్: దేవినేని ఉమ
మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని.. కక్షసాధింపు చర్యల్లో భాగమే ఈ అక్రమ అరెస్ట్ అని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీపీ సర్కార్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందన్నారు. మీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడబోరని దేవినేని ఉమ పేర్కొన్నారు.

*పేపర్‌ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశాం: బొత్స
టెన్త్‌ పేపర్ల మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో విచారణ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్‌ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. అందులో భాగంగానే మాజీమంత్రి నారాయణను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇతర కేసులపై తన దగ్గర సమాచారం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.