NRI-NRT

యూరప్‌ పార్లమెంట్‌లో డ్యాన్సులు… వెల్లువెత్తిన విమర్శలు

యూరప్‌ పార్లమెంట్‌లో డ్యాన్సులు… వెల్లువెత్తిన విమర్శలు

యూరప్‌ పార్లమెంట్‌లో డ్యాన్స్‌ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐరోపా భవిష్యత్‌ ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో మండిపడ్డారు. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్‌లో ఇటీవల నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. యూరప్‌ భవిష్యత్‌పై సమాలోచన జరిగింది. సమావేశాల చివరి రోజైన సోమవారం పౌరుల సూచనల ఆధారంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న దానిపై చర్చించారు. అయితే సమావేశాల చివర్లో పది నిమిషాల పాటు నిర్వహించిన వినోదాత్మక కార్యక్రమాలు సభ్యులతోపాటు ఇతరులను షాక్‌కు గురి చేసింది. ఐరోపా పార్లమెంట్‌ సమావేశాల ముగింపునకు ముందు కొందరు డ్యాన్స్‌ ప్రదర్శన ఇచ్చారు.మరోవైపు తన కీలక ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్ ప్రదర్శనపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అసహనం వ్యక్తం చేశారు. కాగా, డ్యాన్స్ ప్రదర్శన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు కూడా ఐరోపా పార్లమెంట్‌ తీరుపై మండిపడ్డారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) భవిష్యత్తు ఇదే అయితే మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లే అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇది హాస్యాస్పదం. ఈయూతో బ్రేకప్‌ పట్ల సంతోషంగా ఉందంటూ బ్రిటన్‌కు చెందిన ఒకరు కామెంట్‌ చేశారు. ‘దరిద్రంలో ఉన్నాం. ఇది చూడటానికా బాధాకరంగా పన్నులు చెల్లించేది. ఏం స్థాయి ఇది. స్టుపిడ్’ అని మరొక ట్విట్టర్ యూజర్‌ విమర్శించారు.