Movies

రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎన్టీఆర్‌ ఏమన్నారంటే?

రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎన్టీఆర్‌ ఏమన్నారంటే?

ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘన విజయం సాధించిన సందర్భంగా తారక్‌ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

– అందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యంగ్​ టైగర్ ఎన్టీఆర్​.

★ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా.. అని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

★ ఈ నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల్లోకి రావడంపై తాజాగా తారక్‌ స్పందించారు.

★ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఘన విజయం సాధించిన సందర్భంగా తారక్‌ బాలీవుడ్‌ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

★ ఇందులో భాగంగా తాజాగా ఓ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌తో ఆయన ముచ్చటించారు.

సక్సెస్‌, ఫెయిల్యూర్‌ పట్టించుకోను

★ నటుడిగా కెరీర్‌ ప్రారంభించి సుమారు 20 యేళ్లు అవుతోంది. 17 ఏళ్ల వయస్సలో పరిశ్రమలోకి వచ్చాను. ఆ సమయంలో హిట్‌ వచ్చినా, ఫ్లాప్‌ వచ్చినా.. ఎక్కువగానే తీసుకునేవాడిని. కానీ, ఇప్పుడు దేనినైనా సులభంగా తీసుకోవడం అలవాటైంది.

★ విజయం వచ్చినప్పుడు దక్కే ఆనందాన్ని, పరాజయం వచ్చినప్పుడు కలిగే బాధను.. ఆ క్షణానికే తీసుకుంటా. వెంటనే దాని నుంచి తేరుకొని మళ్లీ నా పని నేను చూసుకుంటాను.

★ ప్రతి ఫెయిల్యూర్‌ ఏదో ఒకటి నేర్పుతుందని వ్యక్తిగతంగా నమ్ముతాను.

★ ఒకసారి జరిగిన తప్పును గ్రహించి మళ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా.

గేటు దాటితేనే ఎన్టీఆర్‌

★ ప్రతిఒక్కరూ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్‌ చేసుకుంటేనే సంతోషంగా ముందుకు వెళ్లగలమని నమ్ముతుంటాను. అదే మాదిరిగా సినిమా సెట్‌లో ఉన్నంతవరకే ఒక నటుడ్ని, ‘ఎన్టీఆర్‌’ అనే స్టార్‌ని అనుకుంటా.

★ ఒక్కసారి సెట్‌ నుంచి బయటకు రాగానే నేనూ ఒక సాధారణ వ్యక్తినే అని భావిస్తా.

★ ఇంటి గేటు దాటి బయటకు రాగానే మళ్లీ ‘ఎన్టీఆర్‌’ అని ఫీల్‌ కలుగుతుంది.

వాళ్లు రక్త సంబంధీకులు కాదు కానీ

★ మా తాతయ్య ఎన్టీఆర్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన నాలో ఎంతో స్ఫూర్తి నింపారు.

★ సొసైటి మనకు ఎంతో ఇస్తుంది. మనం కూడా ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలి అనే విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా.

★ ముఖ్యంగా ఎలాంటి రక్తసంబంధం లేకపోయినప్పటికీ ఎంతోమంది నన్ను అమితంగా ప్రేమిస్తున్నారు.

★ నేను బాధలో ఉంటే వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటారు.

★ నేను సంతోషంగా ఉంటే వాళ్లు మరింత ఆనందంగా ఉంటారు.

★ ఏం చేసి వాళ్లకు ప్రేమను తిరిగి ఇవ్వగలను.

★ మంచి సినిమాలు చేసి వాళ్లని గర్వపడేలా చేయడం తప్ప.

రాజకీయాల్లోకి

★ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎంతో మంది అడుగుతున్నారు.

★ నేను భవిష్యత్తు గురించి నమ్మను.

★ కేవలం ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే వ్యక్తిని.

★ ప్రస్తుతం ఒక నటుడిగా ఈ ప్రయాణాన్ని అన్నివిధాలుగా ఎంజాయ్‌ చేస్తున్నా.

★ నటుడిగా మంచి సినిమాలు చేసుకుంటూ ఎంతో సంతృప్తిగా ఉన్నాను అని ఎన్టీఆర్‌ వివరించారు.