DailyDose

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రవాసీ సహాయ కేంద్రం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రవాసీ సహాయ కేంద్రం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాసీ సహాయ కేంద్రాన్ని బుధవారం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి రాణీ కుముదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) భాగస్వామ్యంతో కువైట్‌, ఖతార్‌ తదితర దేశాలకు వెళ్లే వలస కార్మికుల కోసం 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. సురక్షితమైన, చట్టబద్ధమైన ప్రవాసంపై ఈ కేంద్రం అవగాహన పెంచుతుందని చెప్పారు. ప్రతి ఏడాది వేలాది మంది బ్లూకాలర్‌ కార్మికులు ఉపాధికోసం తెలంగాణ నుంచి మధ్యప్రాచ్య దేశాలకు వెళ్తుంటారని, వారికి ఎమిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కోసం సరైన పత్రాలు సమర్పించే విషయంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్‌ ఫణిక్కర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.