Politics

వాళ్లు ఎలా పోటీ చేసినా.. మాకు 151 సీట్లు ఖాయం – TNI రాజకీయ వార్తలు

వాళ్లు ఎలా పోటీ చేసినా.. మాకు 151 సీట్లు ఖాయం – TNI రాజకీయ వార్తలు

* జనసేన అధినేత పవన్ ఇటీవల చేసిన పొత్తు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసినా.. వైకాపా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. వైకాపాకు మళ్లీ 151 సీట్లు పక్కాగా వస్తాయని జోస్యం చెప్పారు.వచ్చే ఎన్నికల్లో వైకాపాకు మళ్లీ 151 అసెంబ్లీ సీట్లు రావటం ఖాయమని.. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడతాయని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని జోస్యం చెప్పారు. పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా.. విడిగా పోటీచేసినా.. వైకాపా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో నిర్వహించిన ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 22వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అమలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటూ లేదని కొడాలి అన్నారు. పవన్ పొత్తు వ్యాఖ్యల్లో ఎటువంటి లాజిక్ లేదని చెప్పారు. చంద్రబాబు తన కొడుకు, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ.., పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందకుండా కోర్టులకు వెళ్తున్నాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి పురస్కారాలు పొందిన వాలంటీర్లను కొడాలి సత్కరించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

*ఆ రెండు పార్టీలు దేశానికి హానికరం : మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు హానికారక పార్టీలని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో అందోలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు.అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సిద్దన్న పాటిల్‌, శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు నాగరాజు తమ అనుచరులతో కలిసి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

*నాలాల సమగ్ర అభివృద్ధితో వరద ముంపు సమస్య దూరం
నాలాల సమగ్ర అభివృద్ధి తో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు. రూ.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట లోని నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి నేడు పరిశీలించారు, మయూర్ మార్గ్, బ్రాహ్మణవాడి లలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. SNDP, GHMC, ఎలెక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీడిమెట్ల, బాలానగర్, పతే నగర్ ల మీదుగా ఉన్న బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరదముంపు సమస్యను పరిష్కరించేందుకు గాను బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్ మరియు ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లోని కూకట్పల్లి నాలాపై రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, నీటి సరఫరా మరియు మురుగునీటి లైన్లను పునరుద్దరించడం, నాలా వెంట రహదారులను VDCCతో అభివృద్ధి చేయడం వంటి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణవాడి మరియు ప్రకాష్ నగర్ ప్రాంతాలలో గ్యాప్ పోర్షన్లలో కొత్త రిటైనింగ్ వాల్ల నిర్మాణం మరియు ఇప్పటికే ఉన్న రిటైనింగ్ గోడల ఎత్తును పెంచడం జరుగుతుందని వివరించారు. 8 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరదనీటితో నాలాల పరిసర ప్రాంతాలు, కాలనీలు వరదముంపుకు గురవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. నగరంలోని అనేక నాలాల పరిధిలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను మున్సిపల్ శాఖ మంత్రి కేసీఆర్ చొరవతో నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (SNDP) చేపట్టడం జరిగిందని తెలిపారు. నాలాల పూర్తిస్థాయి అభివృద్ధి పనులకోసం 108 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ప్యాట్నీ నాలా పై వంతెన నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు.

*మహిళలను కాంగ్రెస్ పార్టీ అత్యంత గౌరవంగా చూస్తుంది: మహేష్ కుమార్ గౌడ్నా
రాయణపేట డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు టీపీసీసీ దృష్టికి తీసుకెళ్లామని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీటి విషయంలో టీపీసీసీ సీరియస్‌గా ఉందన్నారు. వాస్తవాలను పరిశీలించేందుకు టీపీసీసీ వాస్తవ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయించింది. మహిళలను కాంగ్రెస్ పార్టీ అత్యంత గౌరవంగా చూస్తుందన్నారు. వారి సమస్యల విషయంలో వేగంగా, సీరియస్‌గా స్పందిస్తామన్నారు. సాధ్యయమైనంత తొందరగా కమిటీ వేసి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

*మత‌మార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయి: Kanna
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మత‌మార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయని, హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ చేశారని, ఆత్మకూరులో హిందువుల ప్రాంతంలో మసీదు ఎందుకు కడుతున్నారని అడిగితే తమ జిల్లా ప్రెసిడెంట్‌పై దాడి చేశారన్నారు. తెనాలిలో హిందూ మహిళని వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. శ్రీశైలంలో అన్యమత మతస్థులు అత్యధికంగా దుకాణాలు, ఇతరత్రా కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కాకినాడ జేఎన్‌టీయులో ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్‌పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

*KCR దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామసభ రసాభస
యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలం సీఎం కేసీఆర్(KCR) దత్తత గ్రామం వాసాలమర్రిలో గ్రామసభ రసాభసగా మారింది. గ్రామ పునర్నిర్మాణానికి గ్రామపంచాయితీ తీర్మానం కోసం కలెక్టర్ప మేలా సత్పతి సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా జీపీ తీర్మానం ఆమోదిస్తున్నట్లు సర్పంచ్ ఎలా చెప్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పునర్నిర్మాణంపై గ్రామసభ కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల అనుమానాలపై క్లారిటీ‌ ఇచ్చాకే జీపీ తీర్మానం చేయాలని ప్రజలు స్పష్టం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ… ఇప్పుడున్నట్లుగానే కమ్యూనిటీ వర్గాల వారీగా గ్రామ పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు. జీపీ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కలెక్టర్‌ పమేలా మధ్యలోనే వెళ్లిపోయారు.

*పని పాటలేని చంద్రబాబు, పవన్ ఆరోపణలు తిప్పికొడతాం: Kodali nani
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పని పాటలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడతామన్నారు. గుడివాడ 22వ వార్డులో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని ప్రసంగించారు. పవన్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదని తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసినా, తమకు అనుకూల ఓటు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా తమకు ఉండేది ఏమీ లేదన్నారు. మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని తెలిపారు. ‘‘మా 151సీట్లు పక్కగా తిరిగి మాకు వస్తాయి’’ అంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

*బీజేపీ పొత్తు జనసేనతోనే…: somu veerraju
కార్పొరేటర్ కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని… ఏపీలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ దగ్గర నవరత్నాల కంటే ఎక్కువ రత్నాలు ఉన్నాయన్నారు. బీజేపీ పొత్తు జనసేనతోనే అంటూ మరోసారి తేల్చిచెప్పారు. ఏపీలో ఫామిలీ పార్టీలు లేకుండా అద్భుతం జరుగుతోందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉందని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఒకే చేసి పంపుతామని సోమువీర్రాజు పేర్కొన్నారు.

*హద్దు మీరి ప్రవర్తించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొందరు అధికారులు సైతం శృతిమించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబానికి నోటీసులిస్తామంటూ లీకులతో గందరగోళం సృష్టిస్తున్నారని, హద్దు మీరి ప్రవర్తించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని గతంలో సభలో అవమానించి పైశాచిక ఆనందం పొందారని, ఇప్పుడు భువనేశ్వరిపై అక్రమ కేసులు బనాయించేలా కుట్ర పన్నుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

*కక్ష సాధింపు చర్యలతో ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది: పీతల సుజాత
రాష్ట్రంలో అరాచక పాలనా కొనసాగుతోందని టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. నేడు జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ రాక్షసానందం పొందుతోందన్నారు. నారాయణ విద్యాసంస్థల అధినేతపై కేసులే ఇందుకు నిదర్శనమన్నారు. తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని పీతల సుజాత పేర్కొన్నారు. నారాయణ బెయిల్‌పై విడుదల అవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతోందన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాల్సింది పోయి, హోమ్ మంత్రి , సీఎం కలిసి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వారిని పరామర్శించేందుకు వెళితే తమపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమాలలో ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పీతల సుజాత తెలిపారు.

*మంగళగిరిలో లోకేష్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే…
మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే ఆళ్ల రామకృష్ణారెడ్డి… లోకేష్ తల్లి, సతీమణిని అక్రమ కేసుల్లో ఇరికించేలా కుట్ర పన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేయని రింగ్ రోడ్డుకు ఇన్నేళ్ల తర్వాత కేసు పెట్టడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యుల్ని లక్ష్యంగా వ్యక్తిగతంగా కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇన్ని సార్లు కోర్టులు తప్పుపడుతున్నా ప్రభుత్వ తీరు మారదా అని ప్రశ్నించారు. నారాయణ కేసుకు సంబంధించి 408సెక్షన్ ఎవరి మీద పెట్టాలో కూడా తెలియని పరిస్థితిలో చిత్తూరు ఎస్పీ ఉన్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

*కొవ్వూరులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది: జవహర్కొ
వ్వూరు నియోజకవర్గంలో గోదావరి లంకల్లో రెండు కోట్ల కలపను నరికేశారని మాజీ మంత్రి జవహర్ తెలిపారు. భారీ యంత్రాలతో చెట్లు నరికేసి అమ్ముకుంటున్నారన్నారు. కొవ్వూరులో కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్నారు. ఇంకా జవహర్ మాట్లాడుతూ.. ‘‘బాట చార్జీల పేరుతో లారీకి 500 వసూళ్లు చేస్తున్నారు. అక్రమ వసూళ్లను హోంమంత్రి తానేటి వనిత స్వయంగా జగన్‌కు తీసుకువెళుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ దోపిడీ చేస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి దళితులకే అన్యాయం చేస్తున్నారు. హోంమంత్రి తానేటి వనిత కనుసన్నల్లో దోపీడీ జరుగుతోంది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు. హోంమంత్రి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’’ అని పేర్కొన్నారు.

*భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు అవసరమైన సహాయక చర్యల్లో పాల్గొనాలని ట్విట్టర్‌ (Twitter)లో చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోవైపు తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా ‘అసాని’ బలహీనపడింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కిలోమీటర్ల, కాకినాడకు 130 కిలోమీటర్ల, విశాఖ 272 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం ఉదయం వాయుగుండంగా తుఫాన్ బలహీనపడనుంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి.. ఏపీ తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

*సత్యం పలకడం దేశభక్తి అవుతుంది : రాహుల్ గాంధీ
బ్రిటిష్ కాలంనాటి రాజద్రోహ చట్టం (Sedition Law) అమలును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు. సత్యం పలకడం దేశభక్తి అవుతుందని, రాజద్రోహం కాబోదని చెప్పారు. సత్యాన్ని వినడం కర్తవ్యమని, దానిని అణచివేయడం దురహంకారమని పేర్కొన్నారు. భయపడొద్దని ప్రజలను కోరారు. భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 124ఏ అమలును సుప్రీంకోర్టు (Supreme Court) తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నిబంధనను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కసరత్తు కోసం వేచి చూడాలని కోరింది. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తూనే, కాలం చెల్లిన వలస చట్టాలను తొలగించడానికి కట్టుబడి ఉన్నట్లు వివరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, ఈ రాజద్రోహ చట్టాన్ని నిలుపుదల చేయడం సరైనదవుతుందని తెలిపింది. రాజద్రోహం నేరారోపణలపై ఇకపై కొత్త కేసులను నమోదు చేయవద్దని రాష్ట్రాలకు తెలిపింది. ఈ నేరారోపణలపై ఇప్పటికే నమోదైన అన్ని కేసులు, అపీళ్ళపై విచారణను నిలిపేయాలని తెలిపింది. నిందితులకు మంజూరు చేసిన ఉపశమనం కొనసాగుతుందని వివరించింది. ఈ నేరారోపణలపై ప్రస్తుతం జైళ్ళలో ఉన్నవారు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. తదుపరి విచారణ జూలైలో జరుగుతుందని పేర్కొంది.

*బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తాం: Sajjalat
ఏపీ మాజీ మంత్రి, TDP సీనియర్ నాయకుడు Narayanaకు బెయిల్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయిస్తామని AP ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ విద్యా సంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత కోసం ఓ వ్యవస్థ మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ పిల్లల జీవితాలలో ఆడుకుంటోందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.నారాయణ అరెస్టుపై చంద్రబాబు స్పందించిన తీరు బాధాకరమన్నారు. ఓ విప్లవకారుడిని అరెస్టు చేసినట్లు హడావిడి చేస్తున్నారని.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టాలా? అని సజ్జల ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్నందువల్లే నారాయణను పోలీసులు అరెస్టు చేశామని, రాజకీయ ముసుగులో ఎన్ని రోజులు తప్పించుకుంటారో చూస్తామన్నారు.

*BJP బలహీనత Modi
Bharatiya Janata Party బలం దాని సంస్థాగత వ్యవస్థ అయితే బలహీనత Prime Minister Narendra Modi అని Political strategist Prashant Kishor అన్నారు. అన్నింటికి మోదీపై ఆధారపడటం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన అన్నారు. మంగళవారం నిర్వహించిన ఒక ఆన్‌లైన్ చర్చా వేదకలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీని నిలువరించడం, ఓడించడం అంత చిన్న విషయమేమీ కాదన్న పీకే.. ప్రతిపక్షాలు సరైన పంథాలో నడిస్తే బీజేపీకి ప్రత్యామ్నాయం సృష్టించవచ్చని అన్నారు.బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం అవుతుందనే వాదనలను పీకే కొట్టి పారేశారు. బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం కాదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. అయితే దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని సూచించారు. 30 శాతం ఓట్లు సాధించే స్థితిలో ఉన్న పార్టీ దానంతల అదే పడిపోతుందనుకోవడం పొరపాటని, సరైన ప్రత్యామ్నాయం లేకపోతే రాబోయే కొన్నేళ్లు అదే పార్టీ అధికారంలో ఉండొచ్చని పీకే అన్నారు. ఇక బీజేపీకి మోదీ బలహీనత అని చెప్పిన పీకేకు ప్రస్తుతం బతికున్న నాయకుల్లో ఎల్‌కే అద్వాణీ అంటే ఇష్టమని చెప్పడం గమనార్హం

*పనీ పాటలేని చంద్రబాబు, పవన్ ఆరోపణలు తిప్పికొడతాం: Kodali nani
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పని పాటలేని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలు తిప్పి కొడతామన్నారు. గుడివాడ 22వ వార్డులో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని ప్రసంగించారు. పవన్ చెప్పే తీరులో ఎటువంటి లాజిక్ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేక ఓటు లేదని తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క దాన్ని అమలు చేసినా, తమకు అనుకూల ఓటు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఇతర అవసరాలు తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా తమకు ఉండేది ఏమీ లేదన్నారు. మిగిలిన ఇరవై నాలుగు సీట్ల కోసమే ప్రతిపక్షాలు పోరాడాలని తెలిపారు. ‘‘మా 151సీట్లు పక్కగా తిరిగి మాకు వస్తాయి’’ అంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు

*శ్చంద్రబాబు జోలికొస్తే…: Devineni uma
టీడీపీ అధినేత చంద్రబాబు జోలికొస్తే 60 లక్షల మంది కార్యకర్తలు రోడ్డెక్కుతామని మాజీ మంత్రి దేవినేని ఉమామాహేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ‘‘నేను బురద చల్లుతా మీరు కడుక్కు చావండి అన్నట్లు జగన్ రెడ్డి తీరుంది’’ అని ఆయన మండిపడ్డారు. తుఫాన్ ప్రభావంతో రైతులు గగ్గోలు పెడుతుంటే సీఎం రాజకీయ కక్షసాధింపుల్లో బిజీగా ఉన్నారని ఆగ్రహించారు. తుఫాన్ ప్రభావం పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అవినీతికి పాల్పడి జైలుకెళ్లిన జగన్ రెడ్డి, తన లానే అంతా ఉంటారని భావిస్తున్నారని విమర్శించారు. తమపై తప్పుడు కేసులు పెట్టడమంటే ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్లే అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు

*ఫోన్లను ట్యాప్‌ చేసి అరెస్టు చేశాం-మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకూ 60 మందిని అరెస్టు చేసిందని, దీనిపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి.. నిజమైన బాధ్యులను అరెస్టు చేశారని విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎక్కువగా లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని వెల్లడించారు. మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా ప్రశ్నపత్రాలు లీకవ్వలేదని ప్రకటించారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అదే మంత్రి 60 మందిని అరెస్టు చేయించారుగా.. అయినా విచారణ పూర్తయ్యేదాకా ఎవరైనా విలేకరుల ముందుకొచ్చి పేపర్‌ లీకైందని.. ఇంత మందిని అరెస్టు చేశామని చెబుతారా?’ అని బదులిచ్చారు. మీ విద్యాశాఖ మంత్రే చెప్పారు కదా? అని విలేకరులు మళ్లీ ప్రశ్నించగా.. ‘నేను విద్యాశాఖ మంత్రిని కాదు. సీఎంవోకు వెళ్లి అడిగితే అరెస్టు విషయం చెప్పారు’ మంత్రి సమాధానమిచ్చారు.

*తీగలాగితే డొంక కదిలింది.. నారాయణ అరెస్ట్‌ రాజకీయ కక్ష కాదు: సజ్జల
Tenth ప్రశ్నపత్రం LEAK CASEలో నారాయణ అరెస్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తీగలాగితే డొంక కదిలిందని, 100కు 120 మార్కులు తెచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. నారాయణ అరెస్ట్‌ వెనక రాజకీయ కక్ష లేదని సజ్జల అన్నారు. విద్యా వ్యవస్థకు కొంతమంది చీడపురుగుల్లా తయారయ్యారని విమర్శించారు. కుంభకోణాలపై జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సజ్జల తెలిపారు. ఉపాధ్యాయ వ్యవస్థకు మచ్చతెచ్చేలా మాజీ మంత్రి నారాయణ వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని సజ్జల అన్నారు.

*Narayana కాలేజీ నుంచే టెన్త్ పేపర్‌లు లీక్
నారాయణ కాలేజీ నుంచే 10 క్లాస్ పేపర్‌లు లీక్ చేశారని మంత్రి అంబటి (Ambati) రాంబాబు అన్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి ఆదారాలు ఉన్నాయని, అందుకే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. నారాయణ నెంబర్ వన్ అని.. ఇలా పేపర్లు లీక్ చేసి చెప్పుకోగలుగుతున్నారని అన్నారు. తిరుపతిలో నారాయణ కళాశాల ప్రిన్సిపాల్ వాగ్మూలం ఆధారంగానే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. విద్యను వ్యాపారరం చేసుకున్న వ్యక్తి నారాయణ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.

*ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణ అరెస్టు
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారన్నారు. కక్షపూరితంగానే Narayanaను అరెస్టు చేశారని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందన్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి.. ఆయనను దోషిగా చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మాస్ కాపీయింగ్‌కు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు.. నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా… విచారణ చేయకుండా, అధారాలు లేకుండా నేరుగా అరెస్టు చెయ్యడం కక్ష పూరిత చర్య కాదా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారాయణను జైల్లో పెట్టేందుకు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు

*పేపర్‌ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశాం
పేపర్ల మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో విచారణ జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పేపర్‌ లీకేజీ కేసులో మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. అందులో భాగంగానే మాజీమంత్రి నారాయణను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇతర కేసులపై తన దగ్గర సమాచారం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.

*కక్ష సాధింపు చర్యల్లో భాగమే నారాయణ అక్రమ అరెస్ట్: దేవినేని ఉమ
మాజీ మంత్రి నారాయణ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని.. కక్షసాధింపు చర్యల్లో భాగమే ఈ అక్రమ అరెస్ట్ అని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన వైసీపీ సర్కార్, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమాలకు తెగబడిందన్నారు. మీ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడబోరని దేవినేని ఉమ పేర్కొన్నారు.

*నాకు భద్రత పెంచండి: అచ్చెన్నాయుడు
సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున తనకు భద్రత పెంచాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభలో ఆ పార్టీ ఉప నాయకుడిగా ఉన్న తాను.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను తీవ్రంగా నిరసిస్తున్నానని మంగళవారం డీజీపీకి రాసిన లేఖలో అచ్చెన్న పేర్కొన్నారు. అనేక మంది ప్రజలు తనను నిత్యం కలుస్తారని, తానూ ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తనకు ప్రస్తుతం ఉన్న 1ప్లస్‌1 భద్రత సరిపోదని, 4ప్లస్‌4 భద్రత కల్పించాలని కోరారు.

*అప్పులు తప్ప ఆదాయ మార్గాలేవీ?: సోము వీర్రాజు
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు నానాటికి పెరుగుతున్నాయని, ప్రతినెలా అప్పు కోసం ముందుకు వెళ్లటమే తప్ప ఆర్థికంగా పుంజుకునే మార్గాలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ‘‘అప్పులు చేయటమే ఏకైక ప్రత్యామ్నాయమా? ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు లేవా? సింగిల్‌ పాయింట్‌ అజెండానే జగన్‌ ప్రేమిస్తున్నారా?’’ అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం రోటరీ ఆడిటోరియం లో మంగళవారం బీజేపీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు

*ఐదారు నెలలైనా జీతాలివ్వరా?: రాంగోపాల్‌రెడ్డి
కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులకు ఐదారు నెలలకు కూడా జీతాలివ్వకుండా జగన్‌రెడ్డి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ హెచ్‌ఆర్‌డీ విభాగం సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్‌ చేస్తానని చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

*వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అరెస్టులా?: టీడీపీ’
గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌రెడ్డి వారి సమస్యల్ని గాలికొదిలేశారని టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సివేరి దొన్నుదొర, ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎం.దారునాయక్‌ ధ్వజమెత్తారు. గిరిజనుల సమస్యలపై కనీసం వినతి పత్రం కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు. గిరిజన గురుకులాలను సాధారణ పాఠశాలలుగా మార్చవద్దని తాడేపల్లిలోని గిరిజన గురుకుల విద్యాసంస్థ కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన దాదాపు 150 మందిని పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

*బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌!: ఏఐసీసీ
బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ అని, ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీ నాక్ష్మి నటరాజన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ విమర్శించా రు. మంగళవారం నెల్లూరులోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా, బ్లాక్‌ రిటర్నింగ్‌ అధికారుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల, కరెన్సీ నోట్ల రద్దు, నిత్యావసరాలు, గ్యాస్‌, ఇంధన ధరల పెంపు, రైతు వ్యతిరేక చట్టాల వల్ల అన్ని రంగాలూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు.

*బలహీనవర్గాలకు ఉచితంగా టిడ్కో ఇళ్లు: సురేశ్‌
బడుగు బలహీన వర్గాలకు టిడ్కో ఇళ్లను పూర్తి ఉచితంగా అందజేస్తామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. టిడ్కో ఇళ్లపై మంగళవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ‘ఊరికే కట్టాం.. అయిపోయింది’ అనే పద్ధతిలో కాకుండా ప్రజలు సంతృప్తి చెందేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

*పెండింగ్‌ నిధులు ఇవ్వండి: మంత్రి కారుమూరి
రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కేంద్ర అధికారులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు రోహిత్‌ కుమార్‌ సింగ్‌, సుధాన్షు పాండే, సుబోధ్‌ కుమార్‌ సింగ్‌ను కలిశారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ….రాష్ట్రానికి దాదాపు రూ. 7-8 వేల కోట్లు రావాల్సి ఉందని తెలిపారు.

*ఆర్టీసీని ప్రజలకు దూరం చేసే కుట్ర: సీపీఎం
ఆర్టీసీ యాజమాన్యం ప్రజా రవాణాను ప్రజలకు దూరం చేసే కుట్ర పన్నుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆదాయం రావడం లేదనే సాకుతో అనేక బస్‌ సర్వీసులను రద్దు చేసి, డిపోలను మూసేస్తున్నారన్నారు. ఆర్టీసీ చార్జీల సర్దుబాటు పేరుతో 20 రోజుల్లోనే బస్‌ టికెట్ల ధరను రూ.10 వరకు, బస్‌పాస్‌ రేట్లను రూ.250-500 వరకు పెంచిందన్నారు. ధరలను మరోసారి పెంచేందుకు యాజమాన్యం సిద్ధమవుతోందని ఆరోపించారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు, పీఎఫ్‌, నివాస వసతి, వినోద స్థలాలు, విశ్రాంతి తదితర సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సింగరేణిలో అవినీతి, అక్రమాలు, సీఎ్‌సఆర్‌, డీఎంఎ్‌ఫటీ నిధుల మళ్లింపుపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తెలిపారు. సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక చైతన్య యాత్ర మంగళవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ముగిసింది. ముగింపు సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ముఖ్య అతిఽథిగా మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను దివాళా తీయించడం వల్ల వచ్చిన డబ్బుతో ఓట్లు కొనుక్కోవాలనుకుంటున్న కేసీఆర్‌ విధానాలను ప్రజలు బొంద పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. 2014 నాటికి రూ.3,500 కోట్ల బ్యాంకు డిపాజిట్లతో ఉన్న సంస్థ ప్రస్తుతం రూ.8,500 కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయిందన్నారు. అవినీతి, అక్రమాలతో సింగరేణిని సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీయిస్తోందని ఆరోపించారు.

*ఉద్యోగుల‌ జీతాలపై KCR స‌ర్కార్ తీవ్ర నిర్ల‌క్ష్యం: Vijayashanthi
KCR స‌ర్కార్ ఉద్యోగుల‌ను తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోందని బీజేపీ నాయకురాలు Vijayashanthi విమర్శించారు. మే నెల ప్రారంభమై 10వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ వేతనాలు వెయ్య‌లేదని మండిపడ్డారు. ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు ఇలాగే నిరీక్షించాల్సి వస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ”కేసీఆర్ స‌ర్కార్ ఉద్యోగుల‌ను తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోంది. మే నెల ప్రారంభమై 10వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ వేతనాలు వెయ్య‌లేదు. ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు ఇలాగే నిరీక్షించాల్సి వస్తోంది. ఏ జిల్లా ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయోనని తమలో తాము చర్చించుకునేలా పరిస్థితి దిగజారిందని ఉద్యోగులే అంటున్నరు. జీతాలు సకాలంలో రాకపోవడంతో బ్యాంకుల నుంచి తాము పొందిన రుణాలకు గడువులోగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నమని ఉద్యోగులు వాపోతున్నరు. ఈ పరిస్థితి ఆసరాగా చేసుకుని బ్యాంకులు పెనాల్టీ రూపంలో సొమ్ము చేసుకుంటున్నయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే ఏప్రిల్‌ వేతనాలు ప్ర‌భుత్వం చెల్లించింది. ఇంకా ఎనిమిది జిల్లాలవారికి చెలించాల్సి ఉంది. మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్‌, కొత్తగూడెం జిల్లాల ఉద్యోగులకు వేతనాలు, సర్వీసు పెన్షనర్లకు పెన్షన్ల సొమ్ము కూడా అందలేదు. వరంగల్‌ జిల్లాలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించినా… పెన్షనర్లకు పెన్షన్‌ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఉద్యోగుల‌కు ఎంతో చేశామ‌ని చెప్పుకునే కేసీఆర్ దగ్గర దీనికేం స‌మాధానం ఉంది? ఇప్ప‌టికైనా వారి వేతనాలు చెల్లించాలి. ఉద్యోగుల‌తో పెట్టుకున్న ఏ ప్ర‌భుత్వం కూడా బ‌తికి బట్ట క‌ట్టిన‌ట్టు చ‌ర్రిత‌లో లేదు. ఉద్యోగుల జీవితాల‌తో ఆడుకునే కేసీఆర్‌కి ఈ ఉద్యోగులే త‌గిన జవాబు చెబుతారు.” అని విజ‌య‌శాంతి అన్నారు.

*పాదయాత్రతో ప్రగతి భవన్‌లో ప్రకంపనలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ప్రగతి భవన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తమ సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఓర్వలేని సీఎం కేసీఆర్‌ బీజేపీపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుకు భంగం కలిగించిన సీఎం కేసీఆర్‌కు మహబూబ్‌నగర్‌ జిల్లా గురించి మాట్లాడే అధికారం లేదని విమర్శించారు. రాజకీయ భిక్ష పెట్టిన ఆ జిల్లాను కేసీఆర్‌ విస్మరించారని మండిపడ్డారు. ఈ నెల 14న మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహిస్తున్న సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా హాజరవుతారని తెలిపారు. విద్యార్థుల స్కాలర్‌షి్‌పలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయకుండా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీయే బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని, అందుకే కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ అవసరం లేదని తమ పార్టీ భావిస్తున్నదని, అయినా ఈ అంశంపై తాము కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

*భవిష్యత్‌లో లక్ష డ్రోన్‌ పైలట్‌ ఉద్యోగాలు: సింధియా
భవిష్యత్తులో భారత్‌కు లక్ష మంది డ్రోన్‌ పైలట్ల అవసరం ఉంటుందని పౌరవిమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ఇక్కడ మంగళవారం జరిగిన నీతిఆయోగ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రోన్‌ సేవల రంగంలో స్వదేశీ డిమాండ్‌ను పెంచేందుకు కేం ద్రంలోని 12 శాఖలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు డ్రోన్‌ పైలట్‌ శిక్షణ పొందొచ్చన్నారు. యువతీయువకులు 2, 3 నెలలు శిక్షణ పొందితేచాలని, నెలకు రూ.30 వేల జీతం పొందొచ్చని చెప్పా రు. డ్రోన్‌ రంగాన్ని విధానం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం, దేశీయంగా డిమాండ్‌ సృష్టించడం అనే మూడు చక్రాలపై ముందుకు తీసుకువెళుతున్నట్లు పేర్కొన్నారు. విమానయాన శాఖ 2021 ఆగస్టు 25న సరళీకృత డ్రోన్‌ నిబంధనలను విడుదల చేసింది. ఆ తరువాత సెప్టెంబరులో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ(పీఎల్‌ఐ) పథకాన్ని ప్రవేశపెట్టారు.