Movies

కథను మలుపుతిప్పే నాయిక

Auto Draft

గ్లామర్‌ పాత్రలతోనే కాదు నటనకు ఆస్కారమున్న పాత్రలతో అలరిస్తున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. వెంకటేష్‌కు జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘ఎఫ్‌ 3’. ఈ సినిమాలో కథను మలుపుతిప్పే హారిక పాత్రలో తమన్నా కనిపించనున్నారు. సర్‌ప్రైజ్‌ ఇచ్చే ఎలిమెంట్స్‌తో సినిమాకు హారిక పాత్ర ఓ హైలెట్‌గా నిలవబోతోంది. ‘ఎఫ్‌ 3’ కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరిగేలా అనిల్‌ రావిపూడి డిజైన్‌ చేశారట. వెంకటేష్‌-తమన్నా మధ్యన వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదం పంచేలా ఉంటాయి. ‘మన ఆశలే మన విలువలు’ అంటూ తమన్నా పలికిన డైలాగ్‌లు ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. మొత్తం మీద తమన్న కెరీర్‌లో హారిక పాత్ర ది బెస్ట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో రెడ్‌ హాట్‌ డ్రెస్‌లో ఉన్న తమన్నా లుక్‌ను రిలీజ్‌ చేశారు.