Movies

షారుక్‌తో గొడవలు అవాస్తవం

షారుక్‌తో గొడవలు అవాస్తవం

షారుక్‌ఖాన్‌తో తను గతంలో గొడవలు పడినట్లు తరుచూ వచ్చే వార్తలపై స్పందించారు బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌. తమ ఇద్దరి మధ్య జరిగిన హిస్టారిక్‌ ఫైట్‌ గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇద్దరు హీరోల మధ్య సఖ్యత లేదని, ఓసారి గొడవ పడ్డారని ఇండస్ట్రీతో పాటు అభిమానుల మధ్య పుకార్లు బయటకొచ్చాయి. ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన అజయ్‌ దేవగణ్‌ షారుక్‌ తన మధ్య అలాంటి గొడవేదీ జరగలేదన్నారు. అజయ్‌ దేవగణ్‌ మాట్లాడుతూ…‘నేను, సల్మాన్‌, అమీర్‌ ఖాన్‌, షారుక్‌, అక్షయ్‌ కుమార్‌..ఇలా అరడజను మంది హీరోలం 90 దశకంలో దాదాపు ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యాం. ఒకటీ రెండేళ్లలో మేమంతా స్నేహితులుగా మారిపోయాం. అప్పటి నుంచి సినిమాల విషయంలో పోటీనే తప్ప మా మధ్య వ్యక్తిగత గొడవలు లేవు. నాకూ షారుక్‌ మధ్య గొడవ కొందరు దురభిమానులు సృష్టించిందే