Business

కొత్త లోగో ఆవిష్కరించిన హెటిరో – TNI వాణిజ్య వార్తలు

కొత్త లోగో ఆవిష్కరించిన హెటిరో  – TNI వాణిజ్య వార్తలు

* ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ హెటిరో కొత్త లోగో, కార్పొరేట్‌ బ్రాండ్‌ గుర్తింపును ఆవిష్కరించింది. ప్రజలే తొలి ప్రాధాన్యతగా ఈ విలక్షణమైన గుర్తింపు హెటిరో వ్యాపార వృద్ధి, వికాసానికి మార్గనిర్దేశంతోపాటు వేగవంతం చేస్తుందని కంపెనీ బుధవారం ప్రకటించింది. ‘భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా అసమానమైన పరిశోధన, తయారీ, మార్కెటింగ్‌ సామర్థ్యంతో ప్రజలకు సేవ చేయడానికి మేము మంచి స్థానంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య అవసరాలకు తగ్గట్టుగా కంపెనీ పరిధిని విస్తరించడానికి, సామర్థ్యం పెంపునకు చురుకుదనంతో ప్రతిస్పందించడాన్ని మా కొత్త గుర్తింపు ప్రతిబింబిస్తుంది’ అని హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ బి.పార్థ సారథి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ ఆరోగ్యం అనే ఆలోచన ఆధారంగా నూతన లోగో రూపుదిద్దుకుందని సంస్థ ఎండీ వంశీ కృష్ణ బండి వివరించారు.

*అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.

*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.

*దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూ*సరికొత్త కార్పొరేట్‌ బ్రాండ్‌ ఐడెంటిటీ కోసం హెటిరో గ్రూప్‌ కొత్త లోగోను ఆవిష్కరించింది. హెటిరో భవిష్యత్‌ వ్యాపార వృద్ధి, మార్పులు, ‘హెల్త్‌కేర్‌ ఫర్‌ ఆల్‌’ భావనకు అనుగుణంగా కొత్త లోగోను రూపొందించామని హెటిరో గ్రూప్‌ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు.

*హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఆప్టిమస్‌ డ్రగ్స్‌లో ఆల్టర్నేటివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థ పీఏజీ, సీఎక్స్‌ పార్ట్‌నర్స్‌, సమరా క్యాపిటల్‌ కన్సార్షియం మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నాయి. అయితే వాటా వివరాలు, డీల్‌ విలువను మాత్రం వెల్లడించలేదు. ఆప్టిమస్‌ డ్రగ్స్‌ అడ్వాన్స్‌డ్‌ ఇంటర్మీడియెట్లు, ఏపీఐలు, ఫినిష్డ్‌ డ్రగ్స్‌ను తయారు చేస్తోంది. 40కి పైగా దేశాలకు 100కు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. 2004లో ఈ కంపెనీని డీ శ్రీనివాస్‌ రెడ్డి ఏర్పాటు చేశారు. ఆప్టిమస్‌ విలువను దాదాపు రూ.2,000 కోట్లుగా లెక్కకట్టినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

*సైయెంట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డికి ‘జియోస్పేషియల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ అవార్డు లభించింది. జియోస్పేషియల్‌ పరిశ్రమకు ఇన్నోవేషన్‌, పరిశోధన, అభివృద్ధి ఇంజినీరింగ్‌ సేవల ద్వారా ఆయన చేసిన సేవలకు జియోస్పేషియల్‌ వరల్డ్‌ ఫోరమ్‌ (జీడబ్ల్యూఎఫ్‌) 2022 ఈ అవార్డు ఇచ్చినట్లు సైయెంట్‌ వెల్లడించింది.

*అధిక ఆదాయం ఆశజూపి అమాయక ప్రజలను బురిడీ కొట్టించే వారికి చెక్‌ పెట్టేందుకు మనీ పూలింగ్‌ స్కీమ్‌లుగా పిలిచే సామూహిక పెట్టుబడి పథకాల (సీఐఎస్‌) నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. ఈ పథకాలకు సంబంధించిన కొత్త నియమావళిని బుధవారం విడు దల చేసింది. సీఐఎస్‌ పథకాల నిర్వాహకులకు కనీస నెట్‌వర్త్‌ పరిమితిని పెంచింది. అలాగే, సీఐఎ్‌సలను నిర్వహించేవారికి గత ట్రాక్‌ రికార్డు కలిగి ఉండాలన్న నిబంధనను సైతం ప్రవేశపెట్టింది. అంతేకాదు, సీఐఎ్‌సలకు క్రాస్‌ హోల్డింగ్‌ నియమావళినీ ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకా రం.. ఏదైనా సంస్థ ఒకటి కంటే ఎక్కువ కలెక్టివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో 10 శాతానికి మించి వాటా కలిగి ఉండటానికి వీల్లేదు. ఈ నిబంధనలను సవరించడం 1999తర్వాత ఇదే తొలిసారి.

* భారత్‌ సహా మరో ఆరు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి ఉదరకోశ సంబంధ (గ్యాస్ట్రోఇన్‌టెస్టినల్‌) వ్యాధుల చికిత్సకు కొత్త ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అందుబాటులోకి తీసుకురానుంది. దక్షిణ కొరియా కంపెనీ హెచ్‌కే ఇన్నో.ఎన్‌ కార్పొరేషన్‌కు చెందిన వినూత్న, పేటెంటెడ్‌ ‘టెగోప్రాజన్‌’ మాలిక్యూల్‌ను వాణిజ్యపరంగా ఈ మార్కెట్లలోకి విడుదల చేయడానికి ఆ కంపెనీతో డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రత్యేక భాగస్వా మ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం టెగోప్రాజెన్‌ తయారు చేసి హెచ్‌కే ఇన్నో సరఫరా చేస్తుంది.

*భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 845.55 పాయింట్లు పతనమై 54,000 దిగువకు పడిపోయిన బీఎ్‌సఈ సెన్సెక్స్‌.. చివరికి 276.46 పాయింట్ల నష్టంతో 54,088.39 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72.95 పాయింట్లు కోల్పోయి 16,167.10 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ భవిష్యత్‌ వడ్డీరేట్ల పెంపు తీవ్రతపై సంకేతాలివ్వగలిగే ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ఈక్విటీ మదుపర్లు ముందు జాగ్రత్త ధోరణితో వ్యవహరించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎ్‌ఫపీఐ) అమ్మకాలు కొనసాగించడంతో పాటు ముడి చమురు ధరలు పెరగడమూ స్టాక్‌ మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. అమ్మకాలు హోరెత్తడంతో గడిచిన నాలుగు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌ సంపద రూ.13.32 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. గడిచిన నెల రోజుల్లో (ఏప్రిల్‌ 11తో పోలిస్తే) రూ.28 లక్షల కోట్లకు పైగా తగ్గి ప్రస్తుతం రూ.246.32 లక్షల కోట్లకు పరిమితమైంది. బుధవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 21 నష్టాల్లోనే ముగిశాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌-రూపాయి మారకం విలువ మరో 10 పైసల మేర బలపడి రూ.77.24కు చేరుకుంది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు ధర 3.12 శాతం ఎగబాకి 105.7 డాలర్లకు పెరిగింది.
* గత ఆర్థిక సంవత్సరం (2021-22) చివరి త్రైమాసికానికి న్యూలాం డ్‌ లేబొరేటరీస్‌ రూ.21.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.17.2 కోట్లతో పోలిస్తే 26.7 శాతం పెరిగింది. ఆదాయం మా త్రం 1.1 శాతం తగ్గి రూ.259.3 కోట్ల నుంచి రూ.256.5 కోట్లకు చేరింది.

*రక్షణ,స్పేస్‌, అణు విద్యుదుత్పత్తి రంగాలకు సేవలందిస్తున్న ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌.. హైదరాబాద్‌కు చెందిన జీ పీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ కంపెనీని రూ.8.82 కోట్లకు సొంతం చేసుకోనుంది. ఇందుకు ఎంటీఏఆర్‌ బోర్డు ఆమోదం తెలిపింది. జీ పీ ఏరోస్పే్‌సను సొంతం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గ్లోబల్‌ ఓఈఎంలతో ఆఫ్‌సెట్‌ పార్టనర్‌షి్‌పలకు ఈ కొనుగోలు దోహదం చేస్తుందన్నారు.

* స్విస్‌ రీ గ్లోబల్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ సెప్టెంబరులో హైదరాబాద్‌లో జీబీఎస్‌ కేంద్రాన్ని ప్రారంభించనుంది. అంతర్జాతీయంగా సొల్యూషన్లను అందించడానికి కంపెనీ డిజిటల్‌, డేటా, టెక్నాలజీ సామర్థ్యాలను ఈ కేంద్రం పెంచగలదని స్విస్‌ రీ గ్రూప్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ప్రవీణ లడ్వా తెలిపారు. ఇప్పటికే కంపెనీకి బెంగళూరులో గ్లోబల్‌ కేంద్రం ఉంది. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్‌ కేంద్రాల కోసం నిపుణుల నియామక ప్రక్రియను చేపట్టినట్లు లడ్వా చెప్పారు.

*సేవలను మరింత మెరుగుపర్చుకోవడంతో పాటు పెరుగుతున్న వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించకుంటే కఠిన చర్యలు తప్పవని ఓలా, ఉబెర్‌ వంటి క్యాబ్‌ అగ్రిగేటర్లను కేంద్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. ఈ ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్‌ సేవల సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారుల సమావేశం మంగళవారం జరిగింది. క్యా బ్‌ బుకింగ్‌ రద్దుతో పాటు ఈ సంస్థలు అనుసరిస్తున్న పలు వ్యాపార విధానాలు అనుచితంగా ఉన్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ భేటీ నిర్వహించింది.

*ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ షేర్లు మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నమోదయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 7 శాతం తక్కువ ధరకు నమోదు కావడమే కాక తొలిరోజు 17 శాతం నష్టంతో ముగిశాయి. ఒక్కో షేర్‌ను రూ.542కు జారీ చేయగా బీఎస్‌ఈలో 6.64 శాతం నష్టంతో రూ.506 వద్ద లిస్టయింది. ఒక దశలో 22.32 శాతం నష్టపోయి రూ.421కు పడిపోయింది. చివరకు ఇష్యూ ధరతో పోలిస్తే 16.95 శాతం నష్టంతో రూ.450.10 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 16.97 శాతం నష్టంతో రూ.450 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈలో 9.19 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 1.73 కోట్లకు పైగా షేర్లు చేతులు మారాయి. రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ రూ.1,581 కోట్ల సమీకరణకు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి స్పందన బాగా ఉండడంతో మొత్తం ఇష్యూకు 12.43 రెట్ల స్పందన లభించింది.