Politics

ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని చెప్పలేదుగా.. నేనేమన్నానంటే …?- TNI రాజకీయ వార్తలు

ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని చెప్పలేదుగా.. నేనేమన్నానంటే  …?- TNI రాజకీయ వార్తలు

* తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో.. ఫోన్లు ట్యాప్ చేశామన్న మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ మాట మార్చారు. ఫోన్లు ట్రాకింగ్ చేశారని మాత్రమే తాను అన్నానని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఫోన్లు ట్యాపింగ్ చేశారని తాను చెప్పిఉంటే అది తప్పేనని అన్నారు.ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని నేను చెప్పలేదుపదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఫోన్లు ట్యాప్ చేశామన్న మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ మాట మార్చారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేశామని తాను చెప్పలేదని.., ఫోన్లు ట్రాకింగ్ చేశారని మాత్రమే తాను చెప్పినట్లు వెల్లడించారు. ఫోన్లు ట్యాపింగ్ చేయటం నేరమని అందరికీ తెలుసని అన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేశారని తాను చెప్పిఉంటే అది తప్పేనని అన్నారు.వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాడు బిగించినట్లేనని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించటం సరికాదని పెద్దిరెడ్డి అన్నారు. పారదర్శకత కోసమే వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం మీటర్లు బిగిస్తుందన్నారు. కరెంటు బిల్లు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని, రైతులే నేరుగా డిస్కంలకు విద్యుత్ బిల్లులు కడతారన్నారు. మీటర్లు ఏర్పాటు విజయవంతమైతే రైతులు తనకు ఓట్లేయరని చంద్రబాబు భావిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారన్న పెద్దిరెడ్డి.. ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 14 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా పని చేసిన చంద్రబాబు.. ఎక్కడా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రం శ్రీలంకలా తయారవుతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.., శ్రీలంకకు ఇక్కడికీ పోలికే లేదని అన్నారు. ప్రభుత్వంపై కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆక్షేపించారు.ఫోన్ ట్యాపింగ్పై పెద్దిరెడ్డి ఏమన్నారంటే..: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేసిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి నిజమైన బాధ్యులను అరెస్టు చేశారన్నారు. లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని వెల్లడించారు. మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా ప్రశ్నపత్రాలు లీకవ్వలేదని ప్రకటించారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అదే మంత్రి 60 మందిని అరెస్టు చేయించారుగా.. అయినా విచారణ పూర్తయ్యేదాకా ఎవరైనా విలేకరుల ముందుకొచ్చి పేపర్‌ లీకైందని.. ఇంత మందిని అరెస్టు చేశామని చెబుతారా ?’ అని బదులిచ్చారు. మీ విద్యాశాఖ మంత్రే చెప్పారు కదా? అని విలేకరులు మళ్లీ ప్రశ్నించగా.. ‘నేను విద్యాశాఖ మంత్రిని కాదు. సీఎంవోకు వెళ్లి అడిగితే అరెస్టు విషయం చెప్పారు’ అని మంత్రి సమాధానమిచ్చారు.

*పక్షాన మాట్లాడే ప్రజాగొంతుక నరసింహారావు: Achenna
సీనియర్ పాత్రికేయులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, ప్రముఖ రచయిత సి.నరసింహారావు మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు Achennaidu అన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణలో నరసింహారావు తనదైన ముద్ర వేశారని, ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాగొంతుకని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్ద్వందంగా ఖండించిన వ్యక్తి అని అన్నారు. నరసింహారావు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నానని అచ్చెన్నాయుడు అన్నారు.

*మాన‌వ‌త్వానికి మారు పేరు సీఎం కేసీఆర్ : మంత్రి హ‌రీశ్‌రావు
జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 18 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల వెంట ఉండే స‌హాయ‌కుల‌కు మూడు పూట‌లా భోజ‌నం అందించే కార్య‌క్ర‌మం ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ గొప్ప మాన‌వ‌తావాది. మాన‌వ‌త్వానికి మారు పేరు సీఎం కేసీఆర్ అని హ‌రీశ్‌రావు కొనియాడారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో మూడు పూట‌లా భోజ‌నం కార్య‌క్ర‌మం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.రాష్ట్రం వ‌చ్చిన తొలి రోజుల్లోనే పేద‌లు క‌డుపు నిండా భోజ‌నం చేయాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికే అందించార‌ని మంత్రి తెలిపారు. కుటుంబంలోని ప్ర‌తి ఒక్క‌రికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో మాత్రం ఎంత మంది ఉన్న ఒక్కొక్క‌రికి 4 కేజీల చొప్పున‌.. మొత్తం 20 కేజీల‌కు మించ‌కుండా ఇచ్చేవార‌ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్ట‌ళ్ల‌లో ఒక్కో విద్యార్థికి 200 గ్రాముల చొప్పున ఆహారం అందించేవారు. అర్ధాక‌లితో బాధ‌ప‌డుతున్న పిల్ల‌ల‌ను గుర్తించి, స‌న్న బియ్యంతో భోజ‌నం పెట్టాల‌ని కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ అన్ని హాస్ట‌ళ్ల‌లో స‌న్న‌బియ్యంతో తిన్నంత భోజ‌నం పెడుతున్నారు.

*ఇప్పటి వరకూ భంగపడింది చాలు.. ఇకనైనా ఆగండి: వర్ల రామయ్య
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసి భంగపడింది చాలని.. టీడీపీ అధినేతను సాధించాలని అక్రమ కేసులు పెట్టి భంగపడవద్దని టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యుడు వర్ల రామయ్య ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! ఈఎస్ఐలో ఏదో జరిగిందని అచ్చెన్నాయున్ని, పేపర్ లీకైందని నారాయణను అరెస్టు చేసి భంగపడ్దారు. లేని ఇన్నర్ రోడ్దులో ఏదో జరిగిందని ఊహించుకొని, చంద్రబాబును సాధించాలని అక్రమ కేసులు పెట్టి భంగ పడకండి. ప్రత్యర్ధులపై కక్ష్య తీర్చుకోడం మాని, పాలనపై దృష్టి పెట్టండి’’ వర్ల రామయ్య సూచించారు

* చేనేత కుటుంబాలకు అండగా ఉంటా: మంత్రి Roja
చేనేత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని ఏపీ టూరిజం మంత్రి రోజా(Roja) అన్నారు. గురువారం పిన్నమనేని పాల్ క్లినిక్ రోడ్ ఆప్కో షోరూమ్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం రోజా మాట్లాడుతూ… ఆప్కో సమ్మర్ సారీ మేళాకి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కలెక్షన్స్‌ను ఆప్కో అందిస్తుందని తెలిపారు. ఆప్కో షోరూమ్ బ్రాంచెస్‌ను ప్రతి ఊరిలోనూ ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక ఆఫర్లతో ఆప్కో షోరూమ్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. చేనేత కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఏడాది రూ.24 వేలు నేతన్న చేనేత పథకం కింద అందిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు

*కార్యకర్తల ఆశీస్సులూ ఎమ్మెల్యేలు కోరుతున్నారు: సజ్జల
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ వాళ్ల ఇళ్లకూ వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల ఆశీస్సులూ ఎమ్మెల్యేలు కోరుతున్నారని తెలిపారు. కొందరు సంక్షేమ పథకాలకు అర్హులు కాకున్నా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని, టీడీపీ నేతలు వాటిని వీడియో తీసి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన కౌలు రైతులందరికీ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు శాశ్వత లబ్ది, డిపార్ట్‌మెంట్‌కు అకౌంటబులిటీ కోసమే మోటార్లకు మీటర్లు బిగించామని తెలిపారు. మీటర్ల ఏర్పాటుతో కేంద్రం నుంచి ఆర్థిక వెసులుబాటు వస్తుందన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.

*మంత్రి అంబటిని ఉద్దేశించి అయ్యన్న సంచలన ట్వీట్మం
త్రి అంబటి రాంబాబును ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్ చేశారు. ‘‘సార్‌ మీ ఇంటర్వ్యూ కావాలంటూ కాంబాబుకు యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ వాట్సాప్ మెసేజ్‌. ఇంటర్వ్యూ ఇస్తే నాకేం ఇస్తావు అంటూ కాంబాబు రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు…త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్‌ అవ్వడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.

*ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాగొంతుక నరసింహారావు
సీనియర్ పాత్రికేయులు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు, ప్రముఖ రచయిత సి.నరసింహారావు మృతి బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు Achennaidu అన్నారు. సమకాలీన రాజకీయ విశ్లేషణలో నరసింహారావు తనదైన ముద్ర వేశారని, ప్రజల పక్షాన మాట్లాడే ప్రజాగొంతుకని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిర్ద్వందంగా ఖండించిన వ్యక్తి అని అన్నారు. నరసింహారావు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నానని అచ్చెన్నాయుడు అన్నారు.

*ఏపీలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువు
ఏపీలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… సీఎం కావాలనే టార్గెట్‌తో అక్క చెల్లెమ్మలచే ఓట్లేయించుకొని సీఎం అయ్యాక అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగినా నిమ్మకునీరెత్తినట్లున్నారని మండిపడ్డారు. అత్యాచారాలకు ఎల్లప్పుడు కామాయేనా, పుల్ స్టాప్ ఎప్పుడు అని ప్రశ్నించారు. ప్రతినిధుల వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్షం, జగన్ బాధ్యతా రాహిత్యమే నిదర్శనమన్నారు. అత్యాచారాలపై పోలీసుశాఖతో, డీజీపీతో సమీక్షలు జరిపిన దాఖలాలు లేవని టీడీపీ నేత అన్నారు. అత్యాచారాలు యాధృచ్ఛికమని హోం మంత్రి మాట్లాడటం బాధ్యతా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణను అరెస్టు చేయడం కొండను తవ్వి ఎలకను పట్టడమే అని వ్యాఖ్యానించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ సామాన్యులకేం చేయగలరని ప్రశ్నించారు. రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చినా అఘాయిత్యాలప్పుడు జగన్ రారని అన్నారు. జగన్‌కు భజన చేసే మంత్రులైనవారు ఇప్పటికైనా అత్యాచారాలపై స్పందించాలని అనిత డిమాండ్ చేశారు.

*ఇప్పటి వరకూ భంగపడింది చాలు.. ఇకనైనా ఆగండి: వర్ల రామయ్య
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసి భంగపడింది చాలని.. టీడీపీ అధినేతను సాధించాలని అక్రమ కేసులు పెట్టి భంగపడవద్దని టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యుడు వర్ల రామయ్య ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! ఈఎస్ఐలో ఏదో జరిగిందని అచ్చెన్నాయున్ని, పేపర్ లీకైందని నారాయణను అరెస్టు చేసి భంగపడ్దారు. లేని ఇన్నర్ రోడ్దులో ఏదో జరిగిందని ఊహించుకొని, చంద్రబాబును సాధించాలని అక్రమ కేసులు పెట్టి భంగ పడకండి. ప్రత్యర్ధులపై కక్ష్య తీర్చుకోడం మాని, పాలనపై దృష్టి పెట్టండి’’ వర్ల రామయ్య సూచించారు.

*చేనేత కుటుంబాలకు అండగా ఉంటా: మంత్రి Roja
: చేనేత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని ఏపీ టూరిజం మంత్రి రోజా(Roja) అన్నారు. గురువారం పిన్నమనేని పాల్ క్లినిక్ రోడ్ ఆప్కో షోరూమ్‌ను మంత్రి సందర్శించారు. అనంతరం రోజా మాట్లాడుతూ… ఆప్కో సమ్మర్ సారీ మేళాకి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి కలెక్షన్స్‌ను ఆప్కో అందిస్తుందని తెలిపారు. ఆప్కో షోరూమ్ బ్రాంచెస్‌ను ప్రతి ఊరిలోనూ ప్రారంభించారని చెప్పారు. ప్రత్యేక ఆఫర్లతో ఆప్కో షోరూమ్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. చేనేత కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఏడాది రూ.24 వేలు నేతన్న చేనేత పథకం కింద అందిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.

*kcr గొప్ప మనసున్న మారాజు కేసీఆర్:Talasani
గొప్ప మనసున్న మారాజు ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పశుసంవర్డక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. గురువారం గాంధీ హాస్పిటల్, ఎర్రగడ్డ లోని చెస్ట్ హాస్పిటల్ లో MLA మాగంటి గోపీనాథ్ తో కలిసి పేషంట్ సహాయకులకు మూడు పూటల ఆహరం అందించేందుకు ఏర్పాటు చేసిన 5 రూపాయల బోజన కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా పేషంట్ సహాయకులతో మాట్లాడి హాస్పిటల్ లో అందిస్తున్న వైద్యసేవల గురించి, ఆహారం కోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. తాము భోజనం కోసం దూరంగా ఉన్న హోటళ్ళ వద్దకు వెళ్ళి తెచ్చుకుంటున్నామని, రోజుకు 300 రూపాయల వరకు ఖర్చవుతుందని మంత్రికి వివరించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్య సేవల కోసం వచ్చే పేషంట్ తరపు కుటుంబ సభ్యులు, బంధువులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేక బోజన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. కార్పోరేట్ హాస్పిటల్స్ కు దీటుగా గాంధీ హాస్పిటల్ లో వైద్య సేవలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. కోట్లాది రూపాయల విలువైన CT స్కాన్, MRI, క్యాత్ ల్యాబ్ వంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి వేలాది రూపాయల విలువైన పరీక్షలను ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. పేద ప్రజలు వైద్యసేవల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళి ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం పేద ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆధునీకరించి మరింత మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

*జనాభాకు అనుగుణంగా పోషకాహార భద్రత పెద్ద సవాలు:Niranjan reddy
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వారికి పోషకాహార భద్రత కల్పించడం పెద్ద సవాలు వంటిదేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.ప్రపంచ జనాభా ఇప్పటికే 7.6 బిలియన్లకు చేరుకుంది.అది 2050 నాటికి 9.9 బిలియన్లకు చేరుతుందని అంచనా అని ఆయన అన్నారు.జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ఆహార ధాన్యాల కోసం ప్రపంచ డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. అందుకే పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో నాణ్యమైన విత్తనానిది కీలక పాత్ర అన్నారు.భారత వ్యవసాయోత్పత్తి ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతూ వస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో ఇస్టా 2022 – 2025 ఎగ్జిగ్యూటివ్ కమిటీ ఎన్నిక సంధర్భంగావ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్టా వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రముఖ పాత్ర, బాధ్యతను వహిస్తున్నాయని అన్నారు.విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఇప్పటికీ ప్రారంభ దశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమల అభివృద్ధి స్థాయి ఒకేరీతిగా లేదు, ప్రాంతాలు/దేశాల మధ్య గణనీయంగా మారుతున్నాయన్నారు. విత్తన నమూనా,పరీక్ష కోసం ప్రామాణిక విధానాలను అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. “ప్రపంచవ్యాప్తంగా విత్తన పరీక్షలో ఏకరూపత” అనే లక్ష్యం ద్వారా విత్తన నాణ్యత పరీక్షా వ్యవస్థలపరంగా అన్ని ప్రాంతాలను సమం చేయడానికి, అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా విత్తన వాణిజ్యాన్ని పెంచడానికి ఇస్టా కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నదన్నారు.

*మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారు?: dasoju sravan
టీఆర్ఎస్ పేదల సొమ్మును దోచుకుంటోందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. రూ.100కోట్ల విలువైన భూమిని టీఆర్ఎస్ పార్టీకి ఎలా కేటాయిస్తారు?, టీఆర్ఎస్ భవన్‌కు దగ్గరలోనే మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారు? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామన్నారు.
*యాసంగి వడ్లు కొంటామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి
ఐకేపీ సెంటర్లు, కల్లాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం షర్మిల పత్రికా ప్రకటనను విడుదల చేశారు. యాసంగి వడ్లు కొంటమని ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలని అన్నారు. అసని తుఫాన్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనలో పడిందన్నారు. ఎక్కడ వడ్లు తడుస్తాయో అని రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొన్నది కేవలం 17 శాతమే అని తెలిపారు. వడ్లు తడిసిపోయి అన్నదాత కన్నీరు పెడుతుంటే చూడలేని గుడ్డోని పాలన కేసీఆర్‌దని వైఎస్సార్టీపీ అధినేత్రి మండిపడ్డారు. ఆదుకొంటాడు అనుకొన్న దొరగారు వడ్లు కొనని పుణ్యానికి ఎకరాకు రూ.10 వేలు నష్టం రైతులకు వస్తోందన్నారు.
*కాపులంతా పవన్‌ అంటుంటే.. ఆయన చంద్రబాబు అంటున్నారు: మంత్రి అంబటి
‘మా కాపులందరూ పవన్‌ కల్యాణ్‌.. పవన్‌ కల్యాణ్‌ అని అంటున్నారు.. ఆయనేమో చంద్రబాబు అంటున్నారు’ అని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో బుధవారం నిర్వహించిన ‘గడపకు గడపకు మన ప్రభుత్వం’ సభలో ఆయన మాట్లాడారు. ‘వెంటనే తాను సీఎం కావాలని.. క్విట్‌ జగన్‌ అని చంద్రబాబు అంటున్నారు. ఆయన ప్రజలకు మేలు.. సేవ చేసి ప్రధానమంత్రిగా కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు. పవన్‌ కల్యాణ్‌, సీపీఐ, భాజపాల మెడలపై కూర్చుని అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రజాదరణ, విశ్వాసంతో సింహంలా జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. మూడేళ్లలో ప్రభుత్వం ప్రజలకు 1.39 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది. రానున్న రెండేళ్లలో మరో రూ.లక్ష కోట్లు అందించనుంది’ అని పేర్కొన్నారు.

*ఇప్పటి వరకూ భంగపడింది చాలు.. ఇకనైనా ఆగండి: వర్ల రామయ్య
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసి భంగపడింది చాలని.. టీడీపీ అధినేతను సాధించాలని అక్రమ కేసులు పెట్టి భంగపడవద్దని టీడీపీ పొలిట్‌బ్యూర్ సభ్యుడు వర్ల రామయ్య ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి గారూ! ఈఎస్ఐలో ఏదో జరిగిందని అచ్చెన్నాయున్ని, పేపర్ లీకైందని నారాయణను అరెస్టు చేసి భంగపడ్దారు. లేని ఇన్నర్ రోడ్దులో ఏదో జరిగిందని ఊహించుకొని, చంద్రబాబును సాధించాలని అక్రమ కేసులు పెట్టి భంగ పడకండి. ప్రత్యర్ధులపై కక్ష్య తీర్చుకోడం మాని, పాలనపై దృష్టి పెట్టండి’’ వర్ల రామయ్య సూచించారు

*రామకృష్ణది ప్రభుత్వ హత్యే: లోకేశ్‌
‘‘బైక్‌ ప్రమాదంలో గాయపడిన లెక్చరర్‌ రామకృష్ణ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడమే శాపమా? డ్యూటీ డాక్టర్‌ ఉండి కూడా స్వీపర్‌, సెక్యూరిటీ గార్డుతో చికిత్స చేసి ప్రాణంతో చెలగాటమాడటం దారుణం. రామకృష్ణది ప్రభుత్వ హత్యే’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. రోజురోజుకూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు దిగజారుతున్నా వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని ధ్వజమెత్తారు. ‘‘జగన్‌రెడ్డి ప్రజారోగ్య ప్రచారంలో దేవుడు.. నిజానికి ప్రజల పాలిట యముడు. జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపుల్లో ఉంటే.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమై జనం ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. జగన్‌కు ఇచ్చిన ఒక్క చాన్స్‌తో జనం బతకడానికి చాన్స్‌ లేకుండా పోయింది’’ అని ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.

*అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే కేసీఆర్ సర్కార్ ప‌నిగా పెట్టుకుంది: vijayashanthi
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు vijayashanthi విమర్శలు గుప్పించారు. KCR స‌ర్కార్ పేరుకు మాత్రం ప్ర‌జా ప్ర‌భుత్వమ‌ని చెప్పుకోవ‌డం… చేసేది మాత్రం ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డమే అని ఆమె ఆరోపించారు. అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే తెలంగాణ సర్కార్ ప‌నిగా పెట్టుకుందని, గత ప్ర‌భుత్వం పేద‌ల‌కు.. ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికే విధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిందని విజయశాంతి అన్నారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..”కేసీఆర్ స‌ర్కార్ పేరుకు మాత్రం ప్ర‌జా ప్ర‌భుత్వమ‌ని చెప్పుకోవ‌డం… చేసేది మాత్రం ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డం. అసైన్డ్ భూముల్ని లాక్కోవడమే తెలంగాణ సర్కార్ ప‌నిగా పెట్టుకుంది. గత ప్‌నభుత్వం పేద‌ల‌కు… ముఖ్యంగా దళితులు వారి కాళ్ల మీద వారు బతికే విధంగా 48 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అయితే జీవనోపాధిని కొనసాగించాలని… అమ్ముకోవడానికి వీల్లేదని చిన్న క్లాజు పెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసైన్డ్ భూములపై దృష్టిపెట్టి వాటిని లాక్కోవడమే పనిగా పెట్టుకున్నడు. ఇందులో ప్ర‌భుత్వ అధికారుల ముఖ్య‌ పాత్ర ఉంది. అన్ని జిల్లాల్లో నిషేధిత భూమిని ప్ర‌భుత్వ‌ అధికారులే తెల్లకాగితాలపై రాయించుకుంటున్నరు. బెదిరించి, నిషేధిత జాబితాలో ఉన్నయని భయపెట్టి… బెదిరించి రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలో భూములు కొనేశారు. బ్లాక్ మెయిల్ చేసి అసైన్డ్ భూములు లాక్కుని… వాటితో వేరే రూపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 90 శాతం భూమి రైతుల వద్ద లేదు. అంతా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఆక్రమణలోనే ఉన్నాయి. కేసీఆర్… నీ అక్ర‌మాలు ఎంతో కాలం సాగ‌వు. తొంద‌ర్లోనే నీ స‌ర్కార్‌కు, నీ కారుకు తెలంగాణ ప్ర‌జానీక‌మే త‌గిన బుద్ధి చెబుతుంది.” అని విజయశాంతి అన్నారు.

*నిరుద్యోగుల ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి: రేవంత్‌రెడ్డి
తెలంగాణలో నిరుద్యోగుల ధ్రువపత్రాల సమస్యపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 8 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేశారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సంతోషపడాలో.. ఏడ్వాలో అనే సందిగ్ధంలో నిరుద్యోగులున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కుల, ఆదాయ, ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల దగ్గర నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. అవసరమైన ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

*రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా సీఎం కేసీఆర్‌: ఈటల
సీఎం కేసీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట పేదలకు, రైతులకు అసైన్డ్‌ భూములు దక్కకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జనగామలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారం చేపట్టిన కేసీఆర్‌ రాష్ట్రంలో వినాశకరపాలనతో ప్రజల బతుకులు దుర్భరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ప్రభుత్వ భూములు రియల్టర్లకు అప్పగించే కుట్రపూరిత పథకాలు అమలు చేయడం సిగ్గుచేటన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు

*జగన్‌, ఆళ్లవి తప్పుడు ఫిర్యాదులు: శ్రావణ్‌
అమరావతి నిర్మాణం ముందుకెళ్లకూడదని, కోర్టు ధిక్కరణ ఆదేశాల సెగ తన ప్రభుత్వానికి తగలకూడదన్న దురాలోచన జగన్‌ సర్కార్‌ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ విమర్శించారు. నిర్మాణమే జరగని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరుతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు.

*వ్యవసాయ యాంత్రీకరణలో ఈజిప్ట్ ముందున్నది: మంత్రి Niranjan reddy
వ్యవసాయ యాంత్రీకరణలో ఈజిప్ట్ ముందున్నదని, 5శాతం భూమి పై ఎన్నో అద్భుతాలుచేస్తున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి రైతులు వ్యవసాయ పంటల నుండి ఉద్యాన పంటల ప్రాధాన్య తెలుసుకుని అటు వైపు మళ్లుతున్నారని ఈజిప్ట్ లో 95 శాతం ఎడారి ప్రాంతమని, అయినా యూరప్ దేశాలకు ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నారని అన్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ (ARC) ని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి శాస్త్రవేత్తలు, అక్కడి అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏఆర్ సి ప్రెసిడెంట్ మహ్మద్ సోలిమన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మెగా హెడ్ హెచ్ అమ్మర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రీసెర్చ్ షిరీన్ అస్సెమ్, డైరెక్టర్ ఆఫ్ వెటర్నరీ సెరమ్ అండ్ వాక్సిన రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ అహ్మద్ సాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

*మద్యం, బిర్యానికి అమ్ముడుపోతే అధోగతే: ప్రవీణ్‌కుమార్‌
ఓట్లను మద్యం, బిర్యానికి అమ్ముకున్నంత కాలం బతుకుల్లో మార్పు ఉండదని, జీవితం అధోగతి పాలు కావాల్సిందేనని బహుజన సమాజ్‌పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపోయినంతకాలం పాలకులు మోసగిస్తూనే ఉంటారన్నారు. దొరలు అనాది నుంచి బహుజనులను మద్యం మత్తులో ఉంచి ఎదగనీయకుండా చేశారని, అగ్రవర్ణాలు దళితులను ఇళ్లలో పాచిపనులకే పరిమితం చేశారని ఆరోపించారు. రాబోయేది బహుజన రాజ్యమేనని, అగ్రవర్ణాల పిల్లల్లా దళితుల పిల్లలను అన్నిరంగాల్లో తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాజ్యాధికార యాత్రకు అపూర్వ స్పందన రావడం.. కేసీఆర్‌ పాలనపై పెరిగిన విసుగు, వ్యతిరేకతకు నిదర్శనమని ప్రవీణ్ కుమార్ తెలిపారు.

*BJPలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. తాండూరులో కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పటికీ.. అక్కడ సమర్ధవంతుడైన నాయకుడు లేడని పేర్కొన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ మాత్రం బలహీనపడిందని ఆయన తెలిపారు. బీజేపీ కూడా బలపడుతున్నప్పటికీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వస్తున్నందున.. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాననే విషయంలో తొందర పడటం లేదన్నారు. ఇప్పటికీ తాను స్వతంత్రంగా ఉన్నానని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

*చంద్రబాబు జోలికొస్తే బలవుతారు : దేవినేని
చంద్రబాబు జోలికొస్తే 60లక్షల మంది టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి బలి అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. చంద్రబాబుకు నోటీసులిచ్చి, అరెస్ట్‌ చేస్తే కార్యకర్తల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. తిరుపతి సభలో ముఖ్యమంత్రి మాట్లాడాకే నారాయణ విద్యా సంస్థల్ని, నారాయణ పేరును ప్రశ్నపత్రాల లీకేజీ కేసుకు జత చేశారని ఆరోపించారు.

*ఫోన్‌ ట్యాపింగ్‌లపై జగన్‌ సమాధానం చెప్పాలి: వర్ల
జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఏ కారణంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, తమకు గిట్టని వారి ఫోన్లు ట్యాప్‌ చేస్తుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌, ఇతర టీడీపీ నేతల ఫోన్లను ఎప్పటి నుంచి ట్యాప్‌ చేస్తున్నారో చెప్పాలన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

*పీఆర్సీ జీవోలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది: బొప్పరాజు
పీఆర్సీ జీవోలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు తెలిపారు. పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు స్కేల్‌లు తగ్గిస్తున్నారనేది అవాస్తవమన్నారు.26 జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లకు ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ 16 శాతం ఇవ్వాలని అడిగామన్నారు. కారుణ్య నియామకాలు ఇప్పటివరకు జిల్లాల్లో జరగలేదని చెప్పారు. కారుణ్య నియామకాలు సచివాలయాల్లో ఇస్తామంటే ఎవరూ రావడం లేదని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 56 వేల మందికి ప్రొబేషన్ జూన్ నెలాఖరులోగా డిక్లేర్ చేస్తామని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు అన్నారు.

*అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు: Chandrababut
అక్రమ కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీమంత్రి నారాయణ ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారు? అని ప్రశ్నించారు. టీడీపీని రాజకీయంగా దెబ్బ తీసేందుకే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలను అరెస్ట్‌ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అంశంలో తనపై తప్పుడు కేసు పెట్టారని, తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే సీఎం జగన్ జీవితాంతం జైళ్లలోనే ఉంటారని హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ దొంగలు పడ్డారని, అన్నింటిని దోచుకుంటున్నారని ఆరోపించారు. కొత్తగా అక్రమ బియ్యం రవాణా వ్యాపారం మొదలుపెట్టారని చంద్రబాబు ఆరోపించారు.

*‘రైతు కోసం తెలుగుదేశం’ కమిటీ ఏర్పాటు
రైతాంగానికి అండగా నిలిచి, వారి పక్షాన పోరాడేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ‘రైతు కోసం తెలుగుదేశం’ కమిటీని ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. కమిటీలో మాజీ మంత్రులు సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కూన రవికుమార్‌, తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనుందని, రైతుల పక్షాన పోరాడుతుందని అన్నారు.

*5వ విడత పల్లెప్రగతి విజయవంతం చెయ్యండి: ఎర్రబెల్లి
ల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు. 5వ విడత పల్లెప్రగతి కార్యచరణ ప్రణాళికపై డీపీఓలు, డీఆర్‌డీఓలతో మంత్రి రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని టీఎ్‌సఐఆర్‌డీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… దేశానికి తెలంగాణ గ్రామాలే ఆదర్శంగా నిలిచాయన్నారు.

*కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీకి స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టాలి : రేవంత్‌
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నందున కుల, ఆదాయ ధ్రువపత్రా ల జారీకి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ బుధవారం ట్వీట్‌ చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత నోటిపికేషన్లు వచ్చినందుకు సంతోషించాలో, ధ్రువపత్రాల కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితికి ఏడవాలో తెలియని స్థితిలో నిరుద్యోగులున్నారన్నారు.

*టీడీపీలో గ్రీష్మ ప్రతాపం : రాజాం అభ్యర్ధిగా ఆమె…?
డీపీలో మాటలకు చేతలకు మధ్య ఎపుడూ తేడా ఉంటుందని అంటారు. కానీ ఈసారి మాత్రం అలా కాదు నో మొహమాటాలు అంటూ అధినాయకత్వం గట్టిగానే చెబుతోంది. ఈ నేపధ్యంలో సీనియర్లను త్యాగాలు చేయమని చెబుతూనే మరో వైపు జూనియర్లకు భారీ ఎత్తున పార్టీలో ప్రోత్సాహం ఇస్తున్నారు.ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో భాగమైన రాజాం అసెంబ్లీ స్థానంలో కీలక నాయకురాలిగా ఉన్న కావలి గ్రీష్మను పార్టీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు నియమించారు. ఉన్నత విద్యావంతురాలు అయిన గ్రీష్మ మంచి మాటకారి. అలాగే ఫైర్ బ్రాండ్ కూడా ఇప్పటిదాకా చూస్తే ఉత్తరాంధ్రాలో మాజీ ఎమ్మెల్యే అనిత ఒక్కరే వైసీపీని గట్టిగా అటాక్ చేస్తూ వస్తున్నారు.ఇపుడు గ్రీష్మ కూడా తోడు అవుతారు అని అంటున్నారు. ఆమె మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె. 2017లో టీడీపీలో చేరిన ఆమెకు 2019 ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని అంతా భావించారు. కానీ నాడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు మద్దతు తో టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ కి టికెట్ ఇచ్చారు. ఆయన పరాజయం పాలు అయ్యారు.ఇపుడు రాజాం కి మురళీమోహనరావు ఇంచార్జిగా ఉంటున్నారు. అయితే ఆయనకు టికెట్ దక్కపోవచ్చు అని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇక గ్రీష్మ రాజాంలో యాక్టివ్ గా ఉన్నారు. ఆమెకు టికెట్ ఇవ్వాలని మాజీ స్పీకర్ కూడా కోరుతూ వస్తున్నారు. దీంతో అధినాయకత్వం సుముఖంగా ఉందనే అంటున్నారు.అందులో భాగంగానే యంగ్ బ్లడ్ ని పార్టీలో కీలక స్థానానల్లో ఉంచాలని గ్రీష్మను అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక రాజాం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీకి రెడీ అయిపోవడమే అంటున్నారు. మరో వైపు చూస్తే గత రెండు సార్లు రాజాం నుంచి కంబాల జోగులు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.ఆయన హ్యాట్రిక్ కొడతారా లేక గ్రీష్మ గెలిచి అసెంబ్లీకి వస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా గ్రీష్మ ఇప్పటికే నియోజకవర్గ నాయకురాలిగా సత్తా చాటుతున్నారు. ఇపుడు కొత్త పదవితో నేరుగానే వైసీపీ సర్కార్ ని ఢీ కొడతారు అని అంటున్నారు