DailyDose

22 నుంచి దావోస్‌ పర్యటనకు జగన్‌ – TNI తాజా వార్తలు

22 నుంచి దావోస్‌ పర్యటనకు జగన్‌ – TNI తాజా వార్తలు

* దావో్‌సలో ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం హాజరుకానుంది. ఈ నేపథ్యంలో సదస్సులో ఏయే అంశాలను చర్చించాలి, ఏయే రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించాలనే అంశంపై గురువారం సచివాలయంలో కర్టెన్‌రైజర్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సహా పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీఐఐసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

**14న హైదరాబాద్‌కుAmit Shah
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఎల్లుండి మద్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్‌ ల్యాబరేటరీని సందర్శించనున్నారు. తుక్కుగూడలో రెండోవిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించనున్నారు. సాయత్రం 6 గంటలకు ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్‌షా పాల్గొననున్నారు. ఎల్లుండి రాత్రి 8.20 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

*16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగనుంది. ఈ మేరకు 16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. రైతు డిక్లరేషన్‌పై 300 మంది నేతలతో జనంలోకి కాంగ్రెస్ వెళ్లనుంది. పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఒక్కో నేతకి 30 గ్రామాల బాధ్యత అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

*తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డుపై సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు సమావేశం.హాజరైన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ,మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, అదిమూలపు సురేష్, ఉన్న‌తాధికారులు

*గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ క్రిస్టినా భర్త సురేష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడిగా కత్తెర సురేష్ ఉన్నారు. FCRA నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు పొందడంపై కేసు నమోదైంది. పిల్లల దత్తత, విదేశాలకు తరలింపుపై కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆరీఫ్ హఫీజ్‌కి బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

*మంత్రి అంబటి రాంబాబు ను ఉద్దేశించి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు సంచలన ట్వీట్ చేశారు. ‘‘సార్‌ మీ ఇంటర్వ్యూ కావాలంటూ కాంబాబుకు యూట్యూబ్‌ ఛానల్‌ యాంకర్‌ వాట్సాప్ మెసేజ్‌. ఇంటర్వ్యూ ఇస్తే నాకేం ఇస్తావు అంటూ కాంబాబు రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదు…త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి, మహిళా జర్నలిస్ట్‌‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం. సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరింది. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్‌ అవ్వడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్టర్‌లో పేర్కొన్నారు

*నూతనంగా జిల్లాగా ఏర్పడిన తరువాత తొలిసారిగా కోనసీమలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు ఈనెల 13న ఐ.పోలవరం మండలం మురమళ్ళలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందజేయనున్నారు. రాష్ట్రంలో లక్ష 19 వేల మంది లబ్ధిదారులకు మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఓఎన్‌జీసీ మత్స్యకారులకు అందిస్తున్న నష్టపరిహారం 108 కోట్ల రూపాయలు కూడా ఇదే వేదికపై నుండి సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీంతోపాటు ముమ్మిడివరం నియోజకవర్గంలో మూడు ప్రధానమైన వంతెనలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు ‌ కాన్వాయ్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు.

*హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ కేసులో ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు బయటపడుతున్నాయి. బ్యాంకు నుండి డబ్బులు తాను తీసుకెళ్ళలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపాడు. అయితే బుధవారం డబ్బు తానే తీసుకెళ్లినట్లు ప్రవీణ్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. తాను బెట్టింగ్ లో డబ్బు కోల్పోయానని మెసేజ్ పెట్టాడు. అయితే ఈరోజు తాను డబ్బు తీయలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని…. బ్యాంకు మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయాడు. గతంలోనూ పలుమార్లు నగదు తక్కువగా ఉండటంపై నిలదీసినా మేనేజర్ పట్టించుకోలేదని తెలిపాడు. బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించాడు. బ్యాంకులో సరైన నిఘా లేదని క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు.

*మొత్తానికి కాంగ్రెస్( పార్టీ ఎన్నికల రణరంగంలోకి దిగనుంది. ఈ మేరకు 16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. రైతు డిక్లరేషన్‌పై 300 మంది నేతలతో జనంలోకి కాంగ్రెస్ వెళ్లనుంది. పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఒక్కో నేతకి 30 గ్రామాల బాధ్యత అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

*రాజ‌ద్రోహ సెక్ష‌న్‌పై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిర‌ణ్ రిజిజు చేసిన వ్యాఖ్య‌ల‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం కౌంట‌ర్ ఇచ్చారు. సుప్రీంకు ల‌క్ష్మ‌ణ రేఖ గీసే అధికారం కేంద్రానికి లేద‌ని చిదంబరం కౌంట‌ర్ ఇచ్చారు. రాజ్యాంగంలోని 13 వ సెక్ష‌న్‌ను కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి చ‌దువుకోవాల‌ని చిదంబ‌రం హిత‌వు ప‌లికారు. ప్రాథ‌మిక హ‌క్కుల‌ను హ‌రించేలా ప్ర‌భుత్వాలు చ‌ట్టాల‌ను చేయ‌లేవ‌ని, అలాంటి చ‌ట్టాల‌ను అనుమ‌తించ‌ర‌ని చిదంబ‌రం పేర్కొన్నారు

*కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌దుప‌రి ప్ర‌ధాన క‌మిష‌నర్‌గా రాజీవ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా ఉన్న సుశీల్ చంద్ర ప‌ద‌వీ కాలం ఈ నెల 14 తో ముగియ‌నుంది. ఈ నెల 15 న నూత‌న ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా రాజీవ్ కుమార్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

*సీఎం యోగి కీలక నిర్ణ‌యం.. అక్కడ జాతీయ గీతం తప్పనిసరి
ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తంర్వులు గురువారం జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు.

*కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ తో బీజేపీ నేత లక్ష్మణ్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ వినతి చేశారు. 10 అంశాలపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. పేద విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందించాలని కోరారు. బీసీ కులాల స్థితిగతులపై అధ్యయనానికి రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులపై.. పరిశీలన కోసం ప్రత్యేకంగా ఓబీసీ సెల్ ఏర్పాటు చేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

*Machilipatnam దళితుల భూములపై హైకోర్టులో విచారణ
మచిలీపట్నం దళితుల భూములపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. 60 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన 112 ఎకరాలను.. అనుచరులకు కట్టబెట్టాలని వైసీపీ సర్కార్ భావించింది. అయితే వాదనలు విన్న హైకోర్టు… ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. తమ భూమి స్వాధీనం చేసుకోవడంపై బాధితుల పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. 60 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన భూములను లాక్కోవడం చట్టవిరుద్దమని లాయర్ శ్రవణ్‌కుమార్ వాదించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు భూమి బదలాయించవద్దని హైకోర్టు ఆదేశించింది.

* సీఎం జగన్అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో బయో ఇథనాల్‌ ప్లాంట్‌కు ఆమోదం తెలిపారు. 100 ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటుతో 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా ఎగుమతులు అవుతున్నాయని, ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో మెరైన్‌ ఎగుమతుల్లో 46 శాతం ఏపీ నుంచే వెళ్తున్నాయని తెలిపారు. మెరైన్ రంగాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. సింగిల్ డెస్క్‌ విధానంలో పరిశ్రమలకు అనుమతిపై నిరంతర పర్యవేక్షించాలని సూచించారు. విశాఖలో త్వరగా డేటా సెంటర్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని జగన్‌ తెలిపారు.

*యూజీ, పీజీ కోర్సులను తీసేయడం దారుణమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వర్సిటీని నామరూపాలు లేకుండా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కొత్త కోర్సులు తేకుండా.. ఉన్న కోర్సులు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. వర్సిటీలో కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు.

*క్రోసూరు మండలంలో కలుషిత నీరు కలకలం రేపింది. కస్తల ట్యాంక్ నుంచి రంగు మారిన నీరు సరఫరా అవుతోంది. కస్తల, ఊటుకూరు, బయ్యవరం, విప్పర్ల, బాలెమర్రు గ్రామాలకు కలుషిత నీరు వెళుతోంది. కలుషిత నీరు సరఫరా చేయడంపై గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్తల ఫిల్టర్ ట్యాంక్ వద్ద ప్రజలు నిరసన ప్రదర్శనకు దిగారు. స్వచ్ఛమైన మంచి నీరు అందించాలని నినాదాలు చేశారు. గత మూడేళ్ల నుంచి ఫిల్టర్ ప్లాంట్ శుభ్రపరచడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

*జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ వద్ద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఏప్రిల్ నెలలో 8 వ తేదీన పడ్డ జీతాలు.. ఈ నెల 12వ తేదీ వచ్చినా ఇంకా పడలేదు. జీతాల మీద ఆధారపడి విద్యుత్ శాఖ ఉద్యోగులు లోన్లు తీసుకున్నారు. జీతాలు సక్రమంగా పడకపోవడం వల్ల తమకు చెక్ బౌన్స్ అవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు లేటుగా పడడం వల్ల ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజుల్లో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్ అయిన విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఇంతవరకు పెన్షన్ డబ్బులు పడని పరిస్థితి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తక్షణమే జీతాలు చెల్లించాలి లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

*నంద్యాల: జిల్లాలోని నందికొట్కూరులో మునిసిపాలిటీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పగిడ్యాల రోడ్డులోని డ్రైనేజీ కాలువలపై ఉన్న బండలను జేసీబీలతో తొలగించేందుకు అధికారులు యత్నించారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఆక్రమణ పన్నును అధికారులు వసూలు చేసినట్లు స్థానికులు తెలిపారు.

* మూడేళ్ల పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించాలని లేఖముఖ్యమంత్రి, వీఐపీల కాన్వాయ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ లేఖ రాసింది. మూడేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలు రూ.17.5 కోట్లు వెంటనే చెల్లించకపోతే ముఖ్యమంత్రి, ఇతర ముఖ్యనేతల జిల్లాల పర్యటనలకు వాహనాలు సమకూర్చలేమని తేల్చి చెప్పారు. రవాణామంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒంగోలు లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బకాయిలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో కాన్వాయ్ వాహనాల ఏర్పాటు కోసం తక్షణం బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు. వీఐపీల కాన్వాయ్ ల కోసం ఏటా కనీసం నాలున్నర కోట్ల రూపాయలు అవసరమని లెక్క వేసినట్లు రవాణా అధికారులు తెలిపారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయించి, ప్రత్యేక ఖాతా ద్వారా వాహనాల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో రవాణా శాఖ పేర్కొన్నారు….

*ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 2827 నమోదయ్యాయి.దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,13,413 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3230 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 99.20 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 24 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,181 కి చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 19,067 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,90,83,96,788 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14,85,292 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,70,165 కు చేరింది.

*కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌(Dharmendra Pradhan)తో బీజేపీ నేత లక్ష్మణ్(Laxman) గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ వినతి చేశారు. 10 అంశాలపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. పేద విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందించాలని కోరారు. బీసీ కులాల స్థితిగతులపై అధ్యయనానికి రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులపై.. పరిశీలన కోసం ప్రత్యేకంగా ఓబీసీ సెల్ ఏర్పాటు చేయాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.

*శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం యం.సున్నాపల్లి సముద్ర తీరానికి మంగళవారం బంగారు వర్ణంతో ఉన్న రథం కొట్టుకు వచ్చింది. బుధవారం తహసీల్దార్‌ చలమయ్య, భావనపాడు మెరైన్‌ సీఐ దేవుళ్లు, నౌపడ ఎస్‌.ఐ.సాయికుమార్‌ ఈ రథాన్ని పరిశీలించారు. రఽథంపై విదేశీ భాష ఉన్నట్టు గుర్తించారు. మయన్మార్‌ దేశానికి చెందినదిగా తేలిందని తెలిపారు.

* చేపల పెంపకం పేరుతో వ్యవసాయ రుణం తీసుకొని, ఆ మొత్తాన్ని సినిమాకు పెట్టుబడిగా పెట్టి బ్యాంకును మోసం చేసిన వ్యవహారం వెలుగు చూసింది. వీనస్‌ ఆక్వా ఫుడ్స్‌ లిమిటెడ్‌ సంస్థకు నిమ్మగడ్డ రామకృష్ణ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన చేపల పెంపకం చేపడతానంటూ ఆంధ్రా బ్యాంకు(ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకు) నుంచి వ్యవసాయ రుణం తీసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరుతో బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ ఎస్‌. రామచంద్రరావు రుణాలు మంజూరు చేశారు. ఆ నిధులను పాత బాకీలు తీర్చడానికి, స్థిరాస్తుల కొనుగోలుకు వినియోగించారు. అంతేకాకుండా ‘ఆకాశమే హద్దు’ అనే సినిమాకు పెట్టుబడి కూడా పెట్టారు. దీనిపై సమాచారం అందడంతో బాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదుచేసింది. తాజాగా మరో ఫిర్యాదు అందడంతో ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో వడ్డీతో కలిసి రూ.54.64 కోట్లు రావలసి ఉండగా, నిందితులకు చెందిన రూ.13.75 కోట్ల ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేశారు. ఈ కేసును విశాఖపట్నం స్పెషల్‌ కోర్టు విచారిస్తోంది.

*పోలీస్‌ కస్టడీలో జరిగే మరణాలపై ఆర్‌డీఓలతో కాకుండా పూర్తిగా మెజిస్టీరియల్‌ విచారణ చేయాలని మానవ హక్కుల వేదిక బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో ఎం.అప్పారావు, ఫిబ్రవరిలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో బేతా రాంబాబు పోలీసు కస్టడీలో మరణించారని, ఆర్‌డీఓలతో కలెక్టర్లు విచారణ చేయించారని హెచ్‌ఆర్‌ఎఫ్‌ పేర్కొంది. తక్షణమే ఆయా ఘటనలపై పునర్విచారణ చేయించాలని హెచ్‌ఆర్‌ఎఫ్‌ ఏపీ అధ్యక్షులు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కె.సుధ డిమాండ్‌ చేశారు.

* ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోతున్న తమకు మొదట పునరావాసం కల్పించి, పరిహారం చెల్లించిన తర్వాతే గ్రామ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సీఎం కేసీఆర్‌ పలుసార్లు హామీ ఇచ్చారు. దీంతో గ్రామ పునర్నిర్మాణంలో ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సమక్షంలో సర్పంచ్‌ ఆంజనేయులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. తమ అభిప్రాయం తీసుకున్న తర్వాత, అన్ని అనుమానాలపై అధికారులు స్పష్టత ఇచ్చిన తర్వాతే గ్రామపంచాయతీ తీర్మానం చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ వర్గాల వారీగా పునర్నిర్మాణం చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఇళ్లను తొలగించిన తర్వాత తామంతా ఎక్కడ నివసించాలని గ్రామస్థులు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించేవరకూ గ్రామపంచాయతీ తీర్మానం చేయవద్దని పట్టుబట్టారు. ప్రజల మధ్య గ్రామ పునర్నిర్మాణంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమావేశం మధ్యలోనే కలెక్టర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

* ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించే క్రమంలో రైతులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా పలువురు వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మిల్లరు క్వింటాల్‌కు 10 కిలోల కోతకు అంగీకరిస్తేనే ధాన్యం లోడు దింపుకుంటానని షరతు పెట్టాడు. సదరు మిల్లర్‌ తీరుకు నిరసనగా జిల్లాలోని అనాసాగరం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు బుధవారం ధర్నా చేశారు. ఈ కేంద్రం నుంచి తరలించే ధాన్యంలో క్వింటాకు 10 కిలోలు తారం ఇస్తేనే లోడు దించుకుంటామని వైరా మండలం కొణిజర్లలోని ఏఎ్‌సఆర్‌ మిల్లు వారు స్పష్టం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. తాము ఐదు కిలోలకు అంగీకరించామని, మిల్లర్‌ ఒప్పుకోలేదని వెల్లడించారు. దీంతో ధర్నాకు దిగిన రైతులు.. ఎటువంటి తారం లేకుండా మిల్లర్లు వడ్లు దించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కేంద్రం నుంచి ఇప్పటివరకు ఐదు లారీల ధాన్యం మిల్లర్ల వద్దకు వెళ్లింది. మరో 20 లారీల ధాన్యం సిద్ధంగా ఉంది. మండలంలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

*గత ఏడాది, ఈ ఏడాది యాసంగి సీజన్లకు సంబంధించి రాష్ట్రం నుంచి మరో 6.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. బాయిల్డ్‌ రైస్‌కు బదులు ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఇవ్వడానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28, ఈ నెల 5వ తేదీల్లో కేంద్రానికి లేఖలు రాసింది. ఢిల్లీ వెళ్లి కృషి భవన్‌లో దీనికి సంబంధించి మాట్లాడాలని మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించటంతో… కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, జనరల్‌ మేనేజర్‌ రాజిరెడ్డిల ఆధ్వర్యంలో అధికారుల బృంధం ఢిల్లీకి చేరుకుని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఈ క్రమంలో కేంద్ర ఆహారమంత్రిత్వశాఖ కార్యదర్శి జైప్రకాష్‌ ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రం నుంచి ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ సేకరించేందుకు అంగీకరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

**మహిళలు ఎదుర్కొనే న్యాయ పరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ముం దుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ లో నమోదు అయ్యే కేసులపై బుధవారం కమిషన్ కార్యాలయము నందు సమీక్ష నిర్వహించారు. సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఒంటరి మహిళలకు సహకార సంఘాల అధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కమిషన్ భావిస్తోందని చైర్ పర్సన్ వెల్లడించారు. హైదరాబాద్ లోని కమిషన్ కార్యాలయంలో జరిగిన కమిషన్ సర్వ సభ్య సమావేశానికి ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించగా సభ్యులు షాహిన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీ భాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

*సీఎం కేసీఆర్‌తో సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌ్‌సలో బుధవారం ఈ భేటీ జరిగింది. పది రోజులుగా ఫామ్‌హౌ్‌సలోనే ఉంటున్న సీఎంను.. ప్రకాశ్‌రాజ్‌ వరుసగా రెండో రోజూ కలవడం విశేషం. ఈ సందర్భంగా ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

* తమిళనాడులో అమలవుతున్న 69ు రిజర్వేషన్లపై అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ బుధవారంనాడు చెన్నై చేరుకుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల దరిమిలా ఉత్పన్నమైన అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులలోని ‘టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌’ నేపథ్యంగా ఈ అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కమిషన్‌ సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌ పటేల్‌ నూలి, కే.కిశోర్‌గౌడ్‌ల బృందం.. తమిళనాడు బీసీ కమిషన్‌ చైర్మన్‌ తనికాచలం నేతృత్వంలోని సభ్యుల బృందంతో భేటీ అయింది. వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి కొలమానాలు, విధివిధానాలపైనా చర్చసాగింది.

*ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన పాదయాత్రకు కొన్ని రోజులు విరామం ఇచ్చినట్టు ఆ పార్టీ వెల్లడించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఈ నెల 28న పాదయాత్ర పునఃప్రారంభం కానుంది. పాదయాత్రలో భాగంగా షర్మిల ఈ నెల 5న సత్తుపల్లి వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటారు.

*ఒంటరి మహిళలకు సహకార సంఘాల ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు కమిషన్‌ చర్యలు తీసుకుంటున్నదని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. కమిషన్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మహిళల రక్షణే ప్రధాన ఎజెండాగా, మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని సభ్యులకు సూచించారు. జిల్లాల వారీగా తరచూ సమావేశాలు నిర్వహించడం ద్వారా మహిళల సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన పరువు హత్య ఘటనలో బాధితురాలికి ప్రభుత్వ పరంగా సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

*సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని, వేతన బకాయిలు చెల్లించాలని కోరేందుకు ప్రయత్నిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ దర్శనం లభించడం లేదు. మంగళవారం సచివాలయానికి వచ్చి.. సీఎస్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేక వెనుదిరిగారు. దీంతో మరోసారి బుధవారం ఏబీ అమరావతి సచివాలయానికి వచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల నకలును అందజేసి, తనకు పోస్టింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలని సీఎ్‌సకు విన్నవించే ప్రయత్నం చేశారు. అయితే, వెంకటేశ్వరరావు వచ్చే సమయంలో.. తన చాంబర్‌లోనే ఉన్న సీఎస్‌, కొన్ని క్షణాలకే సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారని సమాచారం. దీంతో చాలా సేపు ఎదురు చూసినా సీఎ్‌సను ఏబీ కలవలేకపోయారు. సీఎస్‌ ఎంతకీ రాలేదన్న సమాచారంతో ఆయన వెనుదిరిగారు.

*రోడ్డు పనుల కాం ట్రాక్టు సంస్థ ఉద్యోగులను బెదిరించిన వైసీపీ నేత వైఎస్‌ కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించాలని ప్రతిపాదన పంపినట్లు కడప ఎస్పీ అన్బురాజన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చక్రాయపేట మండలంలో నాలుగులేన్ల రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ కంపె నీ ఉద్యోగులను బెదిరించిన కేసుతో పాటు కొండారెడ్డిపై పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. వేంపల్లె నుంచి రాయచోటికి వేస్తున్న రోడ్డు పనులకు సంబంధించి గత నెలలో కొండారెడ్డి తమకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి కొండారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వివరించారు. ఆయనపై ఇప్పటికే పలు కేసులు ఉండడంతో జిల్లా నుంచి బహిష్కరించేందుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా వెంటనే అవినీతి నిరోధక శాఖ ఫోన్‌ నెంబర్‌ 14400 లేదా డయల్‌ 100 లేదా తన ఫోన్‌ నెంబర్‌ 9440796900కు సమాచారం అందించాలని ఎస్పీ సూచిం చారు. కాగా, ఉద్యోగులను బెదిరించిన కేసులో కొండారెడ్డికి బెయిల్‌ మంజూరైంది. లక్కిరెడ్డిపల్లె సివిల్‌ కోర్టు జడ్జి శారద బెయిల్‌ మంజూరు చేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.

*అసాని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్సీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తుఫాన్‌ ప్రభావ పరిస్థితులపై సమీక్షించారు. కలెక్ట ర్లు, ఎస్పీలు, అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని, తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మరి న్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోండి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించండి. వారికి భోజనం, వసతి సహా అవసరమైన సౌకర్యాలు కల్పించండి. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి రూ.1000, కుటుంబానికి కనీసం రూ.2000 సాయం అందజేయాలి. వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి’’ అని జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో 454 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. హెల్ప్‌లైన్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుఫాన్‌ ప్రభావం ఉంటుందన్నారు. ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెన్నై ఐఐటీ నిపుణులతో మాట్లాడి, ఉప్పాడ రోడ్డుకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు నగదు సాయం అందిస్తామని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు.

*రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పరస్పర, జీవిత భాగస్వామి(స్పౌస్‌) కేటగిరిలో అంతర జిల్లా బదిలీలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. అంతర జిల్లా బదిలీ కోరే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను ఈనెల 13న రిలీవ్‌ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.14వ తేదీన బదిలీలకుదరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. రిలీవ్‌ అయిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పోస్టింగుల కోసం సంబంధిత డీఈవోలు 15వ తేదీనకౌన్సెలింగ్‌ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కౌన్సెలింగ్‌ పూర్తయిన వెంటనే పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. స్పౌస్‌ కేటగిరిలో బదిలీ అయిన ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ ప్రక్రియను అనుసరించే పోస్టింగ్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. కౌన్పెలింగ్‌ కోసం స్పష్టమైన ఖాళీల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు.

*ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. మండలంలోని మురారిపల్లె గ్రామంలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నాడు నేడు శిలాఫలకాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఇక్కడి యూపీ పాఠశాల అభివృద్ధి కోసం వేసిన శిలాఫలకంపై స్థలదాత, వైసీపీ నాయకుడు బిజ్జం రమణారెడ్డి పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు బుధవారం శిలాఫలకాన్ని పగులగొట్టారు. అందుకు ప్రతి చర్యగా సర్పంచ్‌ ఏకుల జయమ్మ భర్త ముసలారెడ్డి అనుచరులు బిజ్జం ఫ్లెక్సీలను చించివేశారు. ఈ రెండు ఘటనలు మంత్రి సురేష్‌ మరికొద్ది నిమిషాల్లో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే ముందే జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకొని ఘర్షణలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

*దేశరక్షణలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్‌ జశ్వంత్‌రెడ్డికి శౌర్యచక్ర అవార్డును ప్రదానం చేశారు. గతేడాది జూలై 8న జమ్ముకశ్మీర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో బాపట్ల జిల్లా దరివాదకొత్తపాలెం గ్రామానికి చెందిన జవాన్‌ ఎం.జశ్వంత్‌రెడ్డి అమరుడైన సంగతి తెలిసిందే. దేశం కోసం ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా 15 రోజుల క్రితం కేంద్రం శౌర్యచక్ర అవార్డును ప్రకటించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని రాష్ట్రపతి రామనాఽథ్‌ కోవింద్‌ నుంచి జశ్వంత్‌ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ అందుకున్నారు.

* పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో ఉన్న చిరుమామిళ్ల గ్రామ సచివాలయానికి వైసీపీ నాయకుడు, నాదెండ్ల సొసైటీ అధ్యక్షుడు శింగారెడ్డి కోటిరెడ్ది తాళం వేశారు., అంతేకాదు.. సచివాలయానికి సంబంధించిన అధికారులపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఇక్కడి సిబ్బందిని కలెక్టరేట్‌కు ఎలా డిప్యుటేషన్‌పై పంపిస్తారని చిందులు తొక్కారు. సిబ్బంది లేనప్పుడు సచివాలయం ఎందుకని ప్రశ్నిస్తూ దానికి తాళం వేశారు. ఈ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వీఆర్వోలను కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పై పంపారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా, స్వాతి అనే కార్యదర్శిని కూడా డిప్యుటేషన్‌పై పంపించారు. ఆమె డిప్యుటేషన్‌ కూడా రద్దు కావడంతో కార్యదర్శి సుబ్బారావును ఇన్‌చార్జిగా నియమించారు. గడచిన కొద్దిరోజులుగా సుబ్బారావు కూడా సెలవుపై వెళ్లడంతో గొరిజవోలు కార్యదర్శిని ఇన్‌చార్జిగా నియమించారు. ఈ క్రమంలో కోటిరెడ్డి బుధవారం ఉదయం సచివాలయానికి రాగా డిజిటల్‌ అసిస్టెంట్‌ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఏఎన్‌ఎం కూడా సెలవులో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఎవరూ లేకుండా సచివాలయం తెరిచి ఉండటం దేనికంటూ తాళం వేశారు. మధ్యాహ్నం తర్వాత విధుల నిమిత్తం క్షేత్రస్థాయికి వెళ్లి వచ్చిన కొంతమంది సిబ్బంది ఆయన వద్దకు వెళ్లి తాళాలు తీసుకుని సచివాలయాన్ని తెరిచారు. ఈ విషయమై ఎంపీడీవో మోషేను వివరణ కోరగా తాళం వేసిన విషయం వాస్తవం కాదన్నారు.

*పదవులున్నా, లేకున్నా ప్రజాసమస్యలపై స్పందిస్తామని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల ఫోరం నేతలు పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ హాలులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 524 మంది సభ్యులున్న తమ ఫోరానికి అసెంబ్లీ హాలులో ప్రత్యేకంగా ఒక చాంబర్‌ కేటాయించాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్లు పెంచాలని కోరనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఫోరం నేతలు కనకసుందరరావు, సాంబయ్య, రాజగోపాల్‌, శివారెడ్డి, గాంధీ, పద్మ పాల్గొన్నారు.