ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.., తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈనెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది.నామినేషన్ల స్వీకరణ గడువు మే 31 కాగా.., జూన్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీ.జీ వెంకటేశ్, సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, ప్రభు సురేశ్ పదవీకాలం జూన్ 21తో ముగియనుంది.
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. రాష్ట్రంలో ఎన్ని సీట్లంటే?
