Health

ఔషధ గుణాల ‘ఉసిరి’

ఔషధ గుణాల ‘ఉసిరి’

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. వ్యాయామం చేయాలి. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఈ ఇమ్యూనిటీ పెంచుకుంటే బ్యాక్టీరియా, వైరస్‌ వ్యాధులు దరిచేరవు. ఒకవేళ ఆ వ్యాధులు వచ్చినా త్వరగా రికవర్‌ అవుతాం. మనకు సులువుగా దొరికే ఔషధ సిరి.. ‘ఉసిరి’తో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు!ద్రాక్ష, అరటి పండ్లలా ఉసిరి పండును కొరికి తినలేం. తినటం అలవాటు చేసుకుంటే మామూలైపోతుంది. ఉసిరిలో పులుపెక్కువ. అదే దాని బలం. అది మనశరీరంలోకి చేరితే మనక్కూడా బలమే. నిమ్మ, నారింజలో దొరికే సి-విటమిన్‌ కంటే దాదాపు పాతికరెట్లు దీనిలో సి-విటమిన్‌ ఎక్కువ. యాంటీ యాక్సిడెంట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. అందుకే దీన్ని సర్వరోగ నివారిణిగా పిలుస్తారు.పొడి, రసం, ట్యాబ్లెట్ల రూపంలో కూడా ఉసిరి దొరుకుతుంది. గ్యాస్ర్టిక్‌ సమస్యలు పోగొట్టే గుణం ఉసిరికి ఉంది. ఎండబెట్టిన ఉసిరి చూర్ణంలో చిటికెడు పసుపు, తేనె కలిపి సేవిస్తే మధుమేహగ్రస్తులకెంతో మంచిది. ఎండిపోయిన ఉసిరిపొడికి, బెల్లంకలిపి తింటే.. పొట్లలో పేగులు శుభ్రపడతాయి. జీర్ణం సులభంగా అవుతుంది. ఉసిరిరసం, ఉసిరిపచ్చడి రూపంలో నిల్వ చేసుకుంటారు. ఉసిరిపొడితో పులిహోర కూడా చేసుకుని తినొచ్చు. శరీరంలోని మలినాలను తొలగించే గుణం వీటికి ఉంది.ఉసిరిలో పీచుపదార్థం ఎక్కువ. కాల్షియం, ఐరన్‌ కూడా పుష్కలమే. ఇన్‌ఫెక్షన్లతో పాటు ఫ్లూ జ్వరాలు తగ్గుముఖం పడతాయి. ఉసిరిని ఏ రూపంలో తీసుకున్నా సరే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని కొలెస్ర్టాల్‌ తగ్గిపోతాయి. పరగడుపున తీసుకుంటే అలసట, నీరసం దరిచేరవు. దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్నా, అలర్జీ, ఆస్తమా ఉంటే.. ఉసిరి దరి చేరితే సమస్యలు తొలగిపోతాయి.చ్యవన్‌ప్రాశ్‌ను ఉసిరితోనే తయారు చేస్తారు. దీన్ని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చు. అయితే పిల్లలు, గర్భిణులు డాక్టర్‌ సలహా మేరకే తీసుకోవాలి.ముఖ్యంగా ఉసిరిరసం కడుపులో పడితే నులిపురుగులు, ఇతర క్రిమిలు నశిస్తాయి. అందానికి ఉసిరి చేసే మేలెంతో. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఉసిరితో స్నేహం చేయాల్సిందే. ఉసిరిపొడిని ముఖంమీద పేస్ట్‌ లా రాసుకుంటే మొటిమలూ తగ్గిపోతాయి.