Movies

ధీటైన జవాబులు 

ధీటైన జవాబులు 

నెమ్మది నెమ్మదిగా ఎదిగే యత్నాలు చేస్తున్న తార నివేదా పెతురాజ్. సినిమాలను సెలక్టివ్ చేసుకుంటున్నా చేసిన పాత్రలకు, నటనకు మంచి పేరునే అందుకోగలుగుతున్నది. విశ్వక్సేన్తో కలిసి ‘పాగల్’ సినిమా చేసింది. అయితే, సినిమా వైఫల్యాల బాటలో నడిచింది. ఇప్పుడు తనతోనే ‘ధమ్కీ’ చేస్తోంది. ‘బ్లడేమేరీ’ చిత్రం చేస్తోంది. ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధమయింది. ఇవన్నీ పక్కనపెడితే అప్పుడప్పుడు అంత ర్జాలంలో అభిమానులతో చిట్ చాట్లు చేస్తుంటుంది. వారి ప్రశ్నలకు నివేద తెలివిగా, వివాదానికి తావులేకుండా ఇచ్చే సమాధానాలు వినిన వాళ్ళంతా’ ఔరా’ అంటుంటారు. కాగా, విశ్వక్సేన్’తో వరుసబెట్టి సినిమాలు చేయడంపైనా గుసగుసలాడేవాళ్ళు లేకపోలేదు.