NRI-NRT

బోస్టన్లో మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు

బోస్టన్లో మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు

అమెరికాలో 50వేల తెదేపా సభ్యత్వ నమోదుకు సన్నాహాలు
* సంవత్సరం పొడవునా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.
* బోస్టన్‌లో మహానాడు నిర్వహణకు భారీగా ఏర్పాట్లు.
* TNI ఇంటర్వ్యూలో అమెరికా తెదేపా కన్వీనర్ కోమటి జయరాం వెల్లడి.

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతున్నట్లు ఇటీవలే ప్రవాస తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌గా నియమితులైన కోమటి జయరాం ‘TNI’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో తెలుగుదేశ సభ్యత్వ నమోదు ప్రారంభించామని. 50వేల మందిని సభ్యులుగా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వచ్చే మే 20,21 తేదీల్లో బోస్టన్ నగరంలో మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
Whats-App-Image-2022-05-13-at-11-46-46-AM
* ఏడాది పొడవునా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
బోస్టన్ మహానాడుతో ప్రారంభించి ఏడాది పొడవునా వివిధ నగరాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. 2023 మే 28వ తేదీన అమెరికాలో మహానాడును నిర్వహిస్తామని తెలిపారు. ఏడాది పొడవునా అమెరికాలో జరిగే ఉత్సవాలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర సీనియర్ నేతలు పాల్గొనే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు కూడా శత జయంతి వేడుకల్లో చురుకుగా పాల్గొనే విధంగా మహిళా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

* అసెంబ్లీ ప్రాతిపదికగా ప్రవాస కమిటీలు
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రవాస కమిటీలను ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు జరుపుతున్నామని కోమటి జయరాం తెలిపారు. తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించే విధంగా ఈ కమిటీలు తమవంతు సహాయ సహకారాలను అందిస్తాయని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చే విధంగా ప్రవాస తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు జయరామ్ తెలిపారు.