Politics

మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ

మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ

ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్స్ప ష్టం చేశారు. శుక్రవారం జిల్లాలోని జరిగిన వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… 1,08,755 మత్స్యకార కుటుంబాలకు రూ.109 కోట్లు జమ చేశామని తెలిపారు. పేదల కోసం 32 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. చేపల వేట నిషేధ సమయంలో రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. మత్స్యకార భరోసా కింద రూ.419 కోట్టు అందివ్వగలిగామన్నారు. ఓఎన్‌జీసీ పైప్‌లైన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు సాయం అందజేయనున్నట్లు తెలిపారు. నెలకు రూ.11,500 చొప్పున 5 నెలల పాటు ఆర్థిక సాయం ఇస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
Whats-App-Image-2022-05-12-at-11-45-54-PM1