Health

సాబుదాన …. ఆరోగ్యప్రయోజనాలు

సాబుదాన …. ఆరోగ్యప్రయోజనాలు

సగ్గుబియ్యం అంటే వెజిటేరియన్ ప్రొసెస్డ్ ఫుడ్. అందువల్లే వ్రతాల సమయం లొ దీనిని ఎక్కువగా వాడతారు. సాగొ అనే పేరుతొ ప్రాచుర్యం పొందిన సగ్గుబియ్యం కర్ర పెండలం నుండి తీసుకోబడిన పొడి నుండి తయారుచేయబడుతుంది. ఛౌవ్వరి, సగుదనా, అవ్వరిషి గా సగ్గుబియ్యం ప్రసిద్ది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తూ కొవ్వు తక్కువగా ఉండే పదార్ధం ఇది. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. పాలు తరువాత చిన్న పిల్లలకి తినిపించదగిన ఆహార పదార్ధం ఇది. అలాగె పండుగల సమయం లో కూడా వీటిని వాడతారు.స్టార్చ్ శాతం ఎక్కువగా ఉండి కౄత్రిమ తీపి పదార్ధాలు అలాగే రసాయనాలు లేకపొవడం వల్ల సగ్గు బియ్యాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే రోగులకు కూడా ఇది తక్షణ శక్తి నిచ్చే అహార పదార్ధం గా దీనిని వాడతారు. అలాగే ఒంట్లో వేడిని తగ్గించే లక్షణం ఇందులో ఉన్నందువల్ల దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

***సాబుదాన(సగ్గు బియ్యం)తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు:
*జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
సగ్గుబియ్యం మంచిగా జీర్ణం అయ్యే నాన్ ఇరిటేటింగ్ బేబీ ఫుడ్, అదే విధంగా ఇన్ఫ్లమేషన్ తో బాధపడే వారు కూడా సగ్గుబియ్యంను తీసుకోవచ్చు . సగ్గు బియ్యంను పాల లేదా నీటితో ఉడికించి తర్వాత పంచదార మిక్స్ చేసి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలన్నీ మాయం అవుతాయి. శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అంధిస్తుంది.

పోషకాంశాలు:
సగ్గు బియ్యం 2mm డయామీటర్ లో ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం, మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. వంద గ్రాముల సగ్గుబియ్యంలో 355క్యాలరీలు, 94గ్రాముల కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మరియు ప్రోటీనులు కలిగి ఉంటాయి.

శరీరానికి ఏవిధంగా ఉపయోగపడుతుంది:
సగ్గుబియ్యంలో ఉండే ప్రాధన అంశం కార్బోహైడ్రేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన హెర్బల్ మెడిసిన్స్ లో వీటిని ఉపయోగించే వారని చెబుతుంటారు. సగ్గుబియ్యంతో పాటు బియ్యం కూడా వండి తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరం ఎప్పుడూ వేడితో బాధపడే వారు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల సహాయపడుతుంది.

సగ్గుబియ్యం వంటలు:
సగ్గుబియ్యంతో వివిధ రకాల వంటలను వండుతుంటారు. సగ్గుబియ్యంతో వివిధ రకాలుగా కారంగా మరియు స్వీట్స్ కూడా తయారుచేస్తారు . అందువల్ల, సగ్గుబియ్యంలో తక్కవు ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ కలిగి ఉండటం వల్ల ఇతర పదార్థాలు జోడించడం తయారుచేయడం వల్ల ఇది అధిక న్యూట్రీషియన్స్ మరియు రుచి కలిగి ఉంటుంది . ఇండియాలో వివిధ ప్రదేశాల్లో సగ్గుబియ్యంను ఫాస్టింగ్ ఫుడ్ గా కిచిడి, లేదా పిలాఫ్, నానబెట్టి సాబుదానను బంగాళదుంప మరియు ఇతర వెజిటేబుల్స్ తో పాటు తీసుకుంటుంటారు.

అధిక ఎనర్జీ బూస్టర్:
సగ్గు బియ్యం ఎక్కువ శక్తిని అంధిస్తుంది, అప్పుడు అప్పుడు దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం మంచిది. చాలా సన్నగా ఉన్న వారికి, దీని వల్ల ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. మరీ సన్నగా, బలహీనంగా ఉన్నవారు సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల, ఇది ఎక్కవు శక్తిని అంధిస్తుంది. మరియు బలహీనతను పోగొడుతుంది.