Business

స్టేట్ బ్యాంక్కు లాభాల సునామీ- 3 నెలల్లోనే రూ.9వేల కోట్లు – TNI వాణిజ్య వార్తలు

స్టేట్ బ్యాంక్కు లాభాల సునామీ- 3 నెలల్లోనే రూ.9వేల కోట్లు – TNI వాణిజ్య వార్తలు

* భారతీయ స్టేట్ బ్యాంక్కు లాభాల పంట పండింది. నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ ఏకంగా రూ.9,114 కోట్లు లాభం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది 41శాతం అధికం కావడం విశేషం.మొండి బకాయిల వసూలుతో భారతీయ స్టేట్ బ్యాంక్కు కాసుల పంట పండింది. 2021-22 నాలుగో త్రైమాసికంలో(జనవరి-మార్చి) ఎస్బీఐ నికర లాభం ఏకంగా 41శాతం పెరిగి రూ.9,114 కోట్లకు చేరింది. 2020-21 క్యూ4లో ఈ మొత్తం రూ.6,451కోట్లుగా ఉంది.2021-22 క్యూ4లో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆదాయం రూ.82,613 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో స్థూల ఆదాయం రూ.81,327కోట్లుగా ఉంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఈ స్థాయిలో మెరుగుపడేందుకు మొండి బకాయిల వసూలులో పురోగతే ప్రధాన కారణమని రెగ్యులేటరీ ఫైలింగ్స్లో పేర్కొంది ఎస్బీఐ. 2021 క్యూ4తో పోల్చితే 2022 మార్చి 31 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 4.98 నుంచి 3.97శాతానికి దిగొచ్చినట్లు తెలిపింది. మొండి బకాయిల నికర విలువ 1.5 నుంచి 1.02శాతానికి తగ్గినట్లు వివరించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.31,676కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2020-21లో వచ్చిన రూ.20,410కోట్ల నికర లాభంతో పోల్చితే ఇది 55శాతం అధికం కావడం విశేషం. భారీ లాభాల నేపథ్యంలో వాటాదారులకు శుభవార్త చెప్పింది స్టేట్ బ్యాంక్. ఒక్కో షేరుపై రూ.7.10 డివిడెండ్ ప్రకటించింది. మరోవైపు.. మెరుగున ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో స్టేట్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు.. ప్రైవేటు రంగంలోని బంధన్ బ్యాంక్.. 2022 క్యూ4లో భారీ స్థాయిలో లాభాలు గడించింది. 2022 జనవరి-మార్చి మధ్య ఏకంగా రూ.1,902.30 కోట్లు ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.103 కోట్లు మాత్రమే కావడం విశేషం. 2022 క్యూ4లో బంధన్ బ్యాంక్ ఆదాయం 43శాతం వృద్ధితో రూ.3,504.2కోట్లకు చేరింది.

*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.

* దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు.

*కో లొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్ర మణియన్‌ బెయిల్‌ దరఖాస్తులను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. వారికి బెయిలు మంజూరు చేయడానికి తగి న ఆధారాలు లేవని ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

*ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందిస్తున్న జియో ఫైబర్‌ తెలుగు రాష్ట్రాల్లో సేవలను 71 ప్రధాన పట్టణాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు ఏలూరు, నెల్లూరు, ఒంగోలు వంటి పట్టణాల్లో కూడా జియో ఫైబర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఏపీలో మొత్తం 43 పట్టణాల్లో సేవలు అందిస్తున్నామని జియోఫైబర్‌ తెలిపింది. కాగా తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు జగిత్యాల్‌, అదిలాబాద్‌, కోదాడ వంటి మొత్తం 28 పట్టణాల్లో జియోఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

* గత ఆర్థిక సంవత్సరానికి అవంతీ ఫీడ్స్‌ వాటాదారులకు 625ు డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై రూ.6.25 డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన త్రైమా సికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ.1,116 కోట్ల నుంచి రూ.1,348 కోట్లకు పెరిగింది.

*ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ స్థానాన్ని యాపిల్‌ కోల్పోయుంది. ఆ స్థానాన్ని ఇప్పుడు సౌదీ ఆరామ్కో చేజిక్కించుకుంది. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సౌదీ ఆరామ్కో 2.42 లక్షల కోట్ల డాలర్లతో మార్కెట్‌ విలువలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండగా యాపిల్‌ 2.37 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానానికి దిగజారింది. క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదల సౌదీ ఆరామ్కో ప్రథమ స్థానానికి చేరడానికి దోహదపడింది. ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్‌ మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్లు, సౌదీ ఆరామ్కో విలువ 1 ట్రిలియన్‌ డాలర్లుంది. ఈ నాలుగు నెలల కాలంలో యాపిల్‌ 20 శాతం విలువను నష్టపోగా సౌదీ ఆరామ్కో విలువ 28 శాతం పెరిగింది

*జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌.. భారత మార్కెట్లోకి సరికొత్త వెర్షన్‌ సీ-క్లాస్‌ సెడాన్‌ను విడుదల చేసింది. మూడు వేరియంట్లలో సీ-క్లాస్‌ సెడాన్‌ అందుబాటులో ఉండనుంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన సీ 200 ధర రూ.55 లక్షలుగా ఉండగా 2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌తో కూడిన సీ 220డీ ధర రూ.56 లక్షలు, సీ 330 డీ ధర రూ.61 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. ఐదో తరం సీ-క్లాస్‌ కోసం ఇప్పటికే 1,000 పైగా ప్రీ బుకింగ్స్‌ వచ్చినట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ తెలిపింది. ఈ ఏడాది భారత మార్కెట్లోకి కొత్తగా 10 మోడళ్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో భాగంగానే తొలుత మేబాక్‌ ఎస్‌-క్లా్‌సను తీసుకురాగా తాజాగా సీ-క్లాస్‌ సెడాన్‌ను తీసుకువచ్చినట్లు మెర్సిడెస్‌ వెల్లడించింది.

*దేశంలోనే అత్యంత వేగవంతమైన హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తునన జియో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తన ఉనికిని మరింత పటిష్టం చేసుకుంటోంది. సేవల విస్తరణలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన 71 నగరాలు, పట్టణాలకు జియో ఫైబర్ చేరుకుంది. జియో సేవలు ఇప్పుడు విజయవాడ, విశాఖపట్టణం వంటి ముఖ్య నగరాలతోపాటు అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, ఉయ్యూరు వంటి 43 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి

*సరికొత్త కార్పొరేట్‌ బ్రాండ్‌ ఐడెంటిటీ కోసం హెటిరో గ్రూప్‌ కొత్త లోగోను ఆవిష్కరించింది. హెటిరో భవిష్యత్‌ వ్యాపార వృద్ధి, మార్పులు, ‘హెల్త్‌కేర్‌ ఫర్‌ ఆల్‌’ భావనకు అనుగుణంగా కొత్త లోగోను రూపొందించామని హెటిరో గ్రూప్‌ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు.

*ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా రూ.20 లక్షలకు పైబడి డబ్బు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేయాలన్నా లేదా విత్‌డ్రా చేయాలన్నా, కరెంట్‌ అకౌంట్‌ లేదా క్యాష్‌ క్రెడిట్‌ అకౌంట్‌ తెరవాలన్నా పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఆదాయ పన్ను అవసరాలకు పాన్‌ లేదా ఆధార్‌ ఏదైనా ఒక దానితో ఒకటి మార్పిడికి అవకాశం ఉంది. ఐటీ శాఖతో ఎలాంటి సంప్రదింపులు జరపాలన్నా పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుం ది. పాన్‌కు బదులుగా బయోమెట్రిక్‌ ఐడీ ఇవ్వవచ్చు.

*సైయెంట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డికి ‘జియోస్పేషియల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ అవార్డు లభించింది. జియోస్పేషియల్‌ పరిశ్రమకు ఇన్నోవేషన్‌, పరిశోధన, అభివృద్ధి ఇంజినీరింగ్‌ సేవల ద్వారా ఆయన చేసిన సేవలకు జియోస్పేషియల్‌ వరల్డ్‌ ఫోరమ్‌ (జీడబ్ల్యూఎఫ్‌) 2022 ఈ అవార్డు ఇచ్చినట్లు సైయెంట్‌ వెల్లడించింది.