Movies

ఊహించని అవకాశం

ఊహించని అవకాశం

ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంబ్రేకర్ ‘ గని’తో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు సినిమాలంటే తనకెంతో ఇష్టమని.. ఇక్కడి నటీనటులంటే అమిత గౌరవమని, ప్రతి సినిమానూ చూస్తుంటానని చెప్పింది . తెలుగు సినిమాలో నటిస్తానని నేనస్సలు అను కోలేదు . ఇది ఊహించని అవకాశం . తొలి అడుగు లోనే మంచి పాత్ర దక్కింది . ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా . హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించాలని ఉంది ” అని చెప్పింది .