DailyDose

“పుల్లారెడ్డి స్వీట్స్” మనువడిపై గృహహింస కేసు.. – TNI నేర వార్తలు

“పుల్లారెడ్డి స్వీట్స్” మనువడిపై గృహహింస కేసు..  – TNI  నేర వార్తలు

*స్వచ్ఛమైన నేతి మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్గా పుల్లారెడ్డి స్వీట్స్ ప్రఖ్యాతిగాంచగా.. దాని యజమాని పుల్లారెడ్డి కుటుంబం వార్తల్లోకెక్కింది. పుల్లారెడ్డి మనువడైన ఏక్నాథ్రెడ్డిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఏక్నాథ్రెడ్డిపై ఫిర్యాదు చేసింది అతడి భార్యే కావటం చర్చనీయాంశమైంది.ప్రముఖ మిఠాయి దుకాణం యాజమాని పుల్లారెడ్డి మనువడిపై వరకట్నం, గృహహింస కేసు నమోదైంది. పుల్లారెడ్డి మనువడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై అతని భార్య హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఏక్‌నాథ్రెడ్డి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. వీరుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్నాథ్ రెడ్డి తలచాడు. మెట్ల వద్ద.. రాత్రికి రాత్రే అడ్డు గోడ కట్టించాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.ఇదంతా గ్రహించిన బాధితురాలు డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితురాలు.. తన తండ్రితో కలిసి ఠాణాకు వచ్చి ఏక్‌నాథ్ రెడ్డిపై వరకట్న వేధింపులతో పాటు గృహహింసకు పాల్పడుతున్నాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.

*తిరుపతి జిల్లా వెంకటగిరిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం పేరుతో పాల్పడిన రూ. 30 లక్షల సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అహ్మదాబాద్లో అరెస్టు చేశారు. వెంకటగిరి పట్టణంలో నివాసముంటున్న పవన్ అనే వ్యక్తి.. 2020లో లాక్డౌన్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోం జాబ్కి ఆన్లైన్లో అప్లై చేశాడు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కిన పవన్.. జాబ్ కోసం రూ. 30 లక్షలు ఆన్లైన్లో చెల్లించాడు. చివరకు తాను మోసపోయానని తెసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించిన పోలీసులు.. అహ్మదాబాద్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ముంబాయిలో ఉన్న ప్రధాన నిందితుడు రవి అనే వ్యక్తిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

*విజయవాడ దుర్గగుడి హుండీల లెక్కింపులో కానుక‌లు కాజేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దేవ‌స్థానానికి చెందిన ఓ చిరుద్యోగే ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్ధరించారు. కొద్ది రోజుల కిందట మ‌హామండ‌పం ఆరో అంత‌స్తులోని బాత్‌రూంలో ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల ప్యాకెట్‌ను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు. ఈవో ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వ‌న్‌టౌన్ పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 110మంది సేవ‌కులు, ఉద్యోగులు లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. నిందితుడి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

* తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేశారని.. అప్పగింతలు కాకముందే.. ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్లోని పాతతోటకు చెందిన గజ్జల పద్మకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడే భర్త మరణించడంతో కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివించింది.ఉదయం బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో.. సాయంత్రానికి చావు డబ్బులు వినిపించాయి. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. అప్పటి వరకు వరుడితో కలిసి స్టెప్పులేసి.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంది. ఈ విషాద ఘటన తెెలంగాణలోని మహబూబ్నగర్లో చోటుచేసుకుంది.

*అమృత్‌సర్‌లోని గురునానక్‌ దేవ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగి ఆస్పత్రికి వ్యాపించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 8 ఫైరింజన్లతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను వెంటనే అదపు చేసింది. అయితే అగ్ని కీలక ధాటికి ఆస్పత్రి ఆవరణలోని పార్కింగ్‌లో ఉన్న వాహనాలు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

*చార్ధామ్ యాత్రకు వెళ్లి 31మంది భక్తులు మృతి
ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లి ఇప్పటివరకు 31 మంది భక్తులు మరణించారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల వీరు మృతిచెందినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మే 3వ తేదీన చార్ధామ్ యాత్ర మొదలైంది. అప్పటి నుంచి మే 13 శుక్రవారం వరకు 31 మంది భక్తులు మరణించినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట వంటి కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో ఛార్ధామ్ యాత్ర మార్గాల్లో భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఉత్తరాఖండ్ ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డా.శైలజ భట్ వివరించారు.

*ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. చిలకలూరిపేట మంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పధకం ప్రారంభ సమయంలో జరిగిన గొడవలో టీడీపీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ను కులం పేరుతో దూషించారని మున్సిపల్ సూపర్‌వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ పీఏఓ యాక్ట్ 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఏ1గా పుల్లారావు, ఏ2గా మదన్ మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, ఏ5గా రాష్ట్ర టీడీపీ నాయకులు కరీముల్లాలపై కేసులు నమోదు అయ్యాయి

*కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మధురానగర్ కాలనీకి చెందిన యమున అనే నవవధువు అదృశ్యం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి యమున బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త దత్తు ఆందోళనకు గురయ్యాడు. గత మూడు నెలల క్రితం దత్తుతో యమున వివాహం జరిగింది. బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భర్త దత్తు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*బాసర వద్ద గోదావరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మహారాష్ట్ర యువకులు… పుణ్యస్నానాలు చేస్తూ నీట మునిగారు. విషయం తెలిసిన వెంటనే ఈతగాళ్లు నదిలో గాలించి యువకుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు మహారాష్ట్రలోని అకోలకి చెందిన కిరణ్ (19), ప్రతీక్ (19)గా గుర్తించారు.

*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ముస్కు విక్రమ్‌ రెడ్డి (20) శనివారం ఉదయం ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విక్రమ్‌రెడ్డి బలవన్మరణానికి గాల కారణాలు ఇంకా తెలియరాలేదు
*పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత జి. పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

*హైదరాబాద్‌: నగరంలోని ఫిల్మ్‌ నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు… మరో కారు, ద్విచక్ర వాహాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వస్తున్న వృద్దుడు, మరో మహిళకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్రేక్‌పై కాలు వేయబోయి, టెన్షన్‌లో ఎక్స్‌లెటర్ మీద కాలు వేశానని డ్రైవర్ చెపుతున్నాడు. మరోవైపు కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కృష్ణ జింకలను వేటాడిన దుండగులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. గుణ జిల్లాలో అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. పోలీసు వాహనం డ్రైవర్ గాగాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మరణించిన వారిలో ఆరోన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ జాతవ్, హెడ్ కానిస్టేబుల్ నీలేష్ భార్గవ, కానిస్టేబుల్‌ శాంతారామ్ మీనా ఉన్నారు. సాయుధులైన వేటగాళ్లు పోలీసు బృందంపై కాల్పులు జరిపారని గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. కృష్ణ జింకలను వేటాడేందుకు వచ్చిన కొందరు వేటగాళ్లు ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు గాలింపు చేపట్టగా.. ఈ దాడి జరిగిందన్నారు. బైక్‌పై వచ్చిన దుండగులు పోలీసులను చుట్టుముట్టి దాడికి కాల్పులకు దిగారని, పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారని వెల్లడించారు. వేటగాళ్ల దాడిపై పోలీసులు ప్రతీకారం తీర్చుకుంటారని, అయితే దట్టమైన అడవిని అడ్డుపెట్టుకొని వేటగాళ్లు తప్పించుకోగలిగారని మిశ్రా చెప్పారు. గుణ అటవీ ప్రాంతం నుంచి పలు కృష్ణజింకల కళేబరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

*అధికారిణిపై దాడి.. టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై కేసు..
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదైంది. మున్సిపల్‌ అధికారిణిపై దాడి చేసిన కేసులో పత్తిపాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్‌ ప్లాంట్‌ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు

*భవానిపురం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా..ఐన్యూస్ నిఘా కెమెరాలకు అడ్డంగా దొరికిన రేషన్ బియ్యం అక్రమ రవాణా..ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటింటికి రేషన్ బియ్యం వాహనాలు…కాని అదే వాహనాలలోనే అక్రమ రేషన్ బియ్యం తరలింపు…ప్రభుత్వ వాహనం లోని రేషన్ మాఫియా…?అక్రమార్కులకు ప్రభుత్వ వాహనాలు అడ్డాగా మారాయా…?ప్రభుత్వ వాహనంలో దొరికిన 60 బస్తాలు..గోడౌన్ ఉన్న 20 టన్నుల బియ్యం సిజ్..ప్రభుత్వ వాహనాన్ని డ్రైవర్ వద్దనుండి హ్యాండ్ ఓవర్ చేసుకున్న అధికారులు..మరో ప్రైవేటు వాహనం AP39TL 1169 వాహనాన్ని సిజ్ చేసిన అదికారులు..

*ప్రేమ విఫలమైందని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్కీ చికెన్ సెంటర్‌లో సయ్యద్ పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయంతో యువకుడు ప్రేమలో పడ్డాడు. కానీ ఆ అమ్మాయి దక్కదేమోననే మనస్థాపంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*కృష్ణ జింకలను వేటాడిన వేటగాళ్లు దారుణానికి తెగబడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శనివారం వెలుగు చూసింది.గుణ అటవీప్రాంతంలో శనివారం తెల్లవారుజామున కృష్ణ జింకలను వేటాడిన వేటగాళ్లు ఎదురుపడిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ వేటగాళ్ల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మరణించారు.వేటగాళ్లు ముగ్గురు పోలీసు సిబ్బందిని కాల్చి చంపిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుధీర్ సక్సేనా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, గుణ పరిపాలనా విభాగం ఈ సమావేశానికి హాజరుకానున్నారు.సాయుధులైన వేటగాళ్లు పోలీసు బృందంపై కాల్పులు జరిపారని గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు.

*గుంటూరులో వైద్యం వికటించిన.. బాలిక ఆరాధ్య మృతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరాధ్య(12) మృతి
కంటి కింద కణితి తొలగించాలని చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరిన ఆరాధ్య శస్త్ర చికిత్స తర్వాత ఆరాధ్య పరిస్థితి విషమం. వెంటిలేటర్‌పై చికిత్సవైద్యం వికటించి వెంటిలేటర్‌పైకి చేరినట్లు తల్లిదండ్రుల ఆరోపణలు. నాలుగు రోజుల క్రితం జీజీహెచ్ నుంచి రమేశ్‌ ఆస్పత్రికి తరలింపు. రమేశ్‌ ఆస్పత్రిలో కూడా వెంటిలేటర్‌కే పరిమితమైన ఆరాధ్య
కొద్దిసేపటి క్రితం ఆరాధ్య మరణించినట్లు వైద్యుల ప్రకటన…!!

*16వ నంబ‌రు జాతీయ ర‌హ‌దారిపై గ‌ణ‌ప‌వ‌రం ప‌రిధిలో శుక్ర‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఓ యువ‌కుడు దుర్మ‌ర‌ణం చెందాడు. సేక‌రించిన వివ‌రాల ప్ర‌కారం ద్విచ‌క్ర‌వాహ‌నంపై చిల‌క‌లూరిపేట వైపు వ‌స్తున్న యువ‌కుడు వాహ‌నం అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టాడు. ఈ క్ర‌మంలో కింద‌ప‌డి తీవ్రంగా గాయ‌ప‌డి మృతిచెందాడు. మృతుడి వ‌ద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా యువ‌కుడి పేరు క‌ణదం సాయిఅవినాష్‌(22)గా గుర్తించారు. స‌ద‌రు యువ‌కుడు ప్ర‌కాశం జిల్లా , పెద్ద‌ద‌ర్శి, టంగువారు వీధిలో నివ‌శిస్తున్న‌ట్టు , యువ‌కుడి తండ్రి హ‌నుమంత‌రావుగా ఆధార్‌కార్డులో చిరునామా ఆధారంగా తెలుస్తోంది. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు…

*అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో ఈ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రిలోని రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

*కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌ఐ ముత్తవరపు గోపాలకృష్ణ(32) సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సీఎం బందోబస్తు కోసం ఇచ్చిన గన్‌ను పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో పెట్టుకుని తన నివాసంలో కాల్చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య, పిల్లలు బెడ్రూమ్‌లో నిద్రిస్తున్నారు. పిస్టల్‌ శబ్దం విని కంగారుగా వచ్చి చూసిన భార్య రక్తపుమడుగులో ఉన్న భర్తను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

*నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి లో గైనకాలజీ విద్యార్థిని, డాక్టర్‌ శ్వేత మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు వార్డులో విధుల్లో ఉన్న ఆమె.. అనంతరం విశ్రాంతి గదిలో నిద్రలోనే చనిపోవడం ఆస్పత్రిలో కలకలం రేపింది. తోటి విద్యార్థిని విధులు ముగించుకుని శ్వేతను లేపేందుకు యత్నించారు. శ్వేత అప్పటికే చనిపోయిందని గుర్తించి సీనియర్‌ వైద్యులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం శ్వేత తల్లిదండ్రులకు ఆస్పత్రి సిబ్బంది సమాచా రం అందించారు. పోలీసులు శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

* దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 27మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్‌కు సమీపంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో సాయంత్రం 4 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి చాలా మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.

*నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాల ప్రసూతి విభాగంలో శ్వేత అనే పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రాత్రి విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకున్న ఆమె.. తెల్లవారేసరికి విగతజీవిగా మారారు. పోలీసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ నగర శివారులోని తిమ్మాపూర్‌కు చెందిన గుర్రం శ్రీనివాస్‌, కవిత దంపతుల కుమార్తె శ్వేత (27) చెలిమెడ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 2020లో పీజీలో చేరారు. గురువారం రాత్రి 11.30 గంటలకు డ్యూటీ ముగియడంతో పక్కనే ఉన్న గదిలో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. ఆమెతో పాటు అక్కడ విశ్రాంతి తీసుకున్న కొందరు మహిళా హౌస్‌సర్జన్లు తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లిపోయారు. శస్త్రచికిత్సలు ఉండటంతో ఉదయం ఆరు గంటలకు శ్వేతను నిద్ర లేపేందుకు సిబ్బంది ప్రయత్నించగా.. ఆమె అచేతనంగా పడి ఉన్నారు. సమాచారం తెలిసి వైద్యులు, పోలీసులు, సూపరింటెండెంట్‌ అక్కడికి చేరుకున్నారు. శ్వేతకు గతంలో రెండుసార్లు కొవిడ్‌ వచ్చిందని, అందువల్లే గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ చెప్పారు. శ్వేత తోటి వైద్యులందరికీ గురువారం సాయంత్రం సరదాగా టీ పార్టీ ఇచ్చారని, తన తల్లితో ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తె ఎలా చనిపోయిందో సమాధానం చెప్పాలని కరీంనగర్‌ నుంచి వచ్చిన శ్వేత తల్లిదండ్రులు వైద్యులను నిలదీశారు. మృతి చెందిన కుమార్తెను చూసి వారు భోరున విలపించారు. ఝార్ఖండ్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్న శ్వేత సోదరుడు రవి వచ్చాక శవపరీక్ష చేశారు. ఆమె కుటుంబీకులు సీపీ నాగరాజును కలిసి శ్వేత మృతికి గల కారణాలు తెలుసుకోవాలని విన్నవించారు. శ్వేతకు పెళ్లిచూపులు పూర్తవడంతో త్వరలో నిశ్చితార్థం చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆమె తండ్రి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో విజయ్‌ తెలిపారు.

*ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన గుజ్జుల పద్మ కూలీ పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి(19) పదో తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తన చిన్నమ్మ కుమారుడు మల్లికార్జున్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అంతదూరంలోని పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని తల్లికి యువతి చెప్పింది. అయినా పెద్దలు వినలేదు. శుక్రవారం ఉదయం 9గంటలకు వివాహమైంది. సాయంత్రం అప్పగింతలకు ముందే వధువు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్‌ మొదటి పట్టణ ఠాణా ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

*అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో ఈ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు చెలరేగిన వెంటనే ఆసుపత్రిలోని రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

*ఖమ్మం: నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌లో బర్త్‌డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బర్త్‌డే కేక్‌ కట్‌ చేసేందుకు భరత్‌ అనే యువకుడు స్నేహితులతో కలిసి వచ్చాడు. చేతులు కడుక్కునేందుకు నీటిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తూ మునిగి భరత్‌ (19) మృతి చెందాడు9. మృతుడు తనికెళ్ల వాసి భరత్‌ గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.