Politics

కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే..- TNI రాజకీయ వార్తలు

కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదే..- TNI రాజకీయ వార్తలు

*నేతలంగా కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్రమంత్రి అమిత్‌ షా ఆకాంక్షించారు. శనివారం హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా.. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో బీజేపీ కోర్‌ కమిటీ భేటీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలంతా అమిత్‌ షాకు వివరించగా, ప్రతిగా ఆయన నేతలకు రాజకీయ దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్‌తో పోటీ, బీజేపీకి అవకాశాలపై అమిత్‌ షాకు వివరణ ఇచ్చారు నేతలు. గత రెండేళ్లుగా పార్టీ అన్ని విషయాల్లో మెరుగుపడిందన్న బీజేపీ నేతలు.. పార్లమెంట్‌, దుబ్బాక, గ్రేటర్‌, హుజురాబాద్‌ ఎన్నికల ప్రస్తావన అమిత్‌ షా దగ్గర తీసుకొచ్చారు. ఆపై మీడియాలో వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక కథనాలను ఆయనకు చూపించారు. ప్రాంతాల వారీగా పార్టీ పరిస్థితిని అమిత్‌షాకు వివరించిన నేతలు.. ఈ క్రమంలో నియోజకవర్గానికి ముగ్గురు ఆశావహుల పేర్లను సిద్ధం చేస్తున్నట్లు నేతలు అమిత్‌ షాకు వివరించారు. ఈ సందర్భంగా.. ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, కష్టపడితే తెలంగాణలో అధికారం బీజేపీదేనిన నేతలతో అమిత్‌షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసి పని చేయాలని నేతలకు సూచించారాయన. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ విమర్శలను తిప్పికొట్టాలని, ముఖ్యంగా కేంద్రం ఏం చేయలేదన్న వాదనకు గట్టి కౌంటర్‌ ఇవ్వాలని తెలిపారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు గురించి తెలుసుకున్న అమిత్‌ షా.. తెలంగాణలో బీజేపీ పరిస్థితి చాలా బాగుందని కితాబిచ్చారు.

*ముసలోడైనా చంద్రబాబునే ప్రజలు కోరుకుంటున్నారు
‘‘జగన్‌ కన్నా… ముసలోడైనా చంద్రబాబే మేలని ప్రజలు అనుకుంటున్నారు. బాబునే వారు కోరుకుంటున్నారు. జగన్‌ బయటకు వస్తే షాపులన్నీ బంద్‌ చేయిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా షామియానాలు కడుతున్నారు. ప్రజలు జగన్‌ను చూసే పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్‌ బురఖా వేసుకున్నట్లే’’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురంలోని తన నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఒకే బోటులో పరిగెడుతున్నాయి. రెండు పార్టీలకు కార్యకర్తలు లేరు. నాయకులుగా మేమే కార్యకర్తలను కనపడనీకుండా చేశాం. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేల వెంట ఉంది కార్యకర్తలు కాదు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు మాత్రమే. అందుకే గడప గడపకు వైసీపీ అని కాకుండా… గడప గడపకు ప్రభుత్వం అని పేరు పెట్టారు. పోలీస్‌ అనే మహావృక్షం కింద వైసీపీ ఉంది’’ అని ప్రభాకరరెడ్డి విమర్శించారు

*సొమ్మొకడిది.. సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి: యనమల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సొమ్మొకడిది.. సోకొకడిదిలా జగన్ వైఖరి ఉందని యనమల మండిపడ్డారు. ఓఎన్జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్య్సకారులకు పరిహారమిచ్చేది కేంద్రమని, సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ వ్యవహారం ఉందని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. మత్స్యకారులకు పరిహారాన్ని 6 నెలలుగా తొక్కిపెట్టారని, పరిహారం ఇవ్వకుండా తొక్కిపెట్టడం జగన్‌ మోసం చేయడమే అని యనమల తెలిపారు. మూడేళ్లలో మీరేం చేశారో చెప్పే దైర్యం లేదా? అని సీఎంను యనమల ప్రశ్నించారు

*అవినీతి రహిత ఉద్యోగ నియామకాలు : హిమంత బిశ్వ శర్మ
ప్రభుత్వోద్యోగ నియామకాల్లో పారదర్శకతను పాటిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. శనివారం ఆయన 22,958 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వీరు 11 ప్రభుత్వ శాఖల్లో నియమితులయ్యారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ, 2011 నుంచి తాను అవినీతి రహిత, పారదర్శక నియామకాలను ప్రారంభించానని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశానన్నారు. అవినీతి లేకుండా, పారదర్శకంగా నియామకాలను చేపట్టడం వల్ల రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ కన్నా దేశానికే పెద్ద పీట వేయాలని తమకు బీజేపీ బోధించిందన్నారు.

*పాదయాత్రకు ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు: btech ravi
ఈనెల 18న చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వెల్లడించారు. వైసీపీ నేతలు రైతులపై దృష్టి పెట్టకుండా.. వివేకా కేసు నిందితుడు..శివశంకర్‌రెడ్డిని బయటకు తేవాలని ఆలోచిస్తున్నారని అన్నారు. రైతుల కోసం పాదయాత్ర చేయాలని అనుమతి కోరితే ఇంతవరకు అనుమతి ఇవ్వలేదన్నారు.

*వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో.. ప్రభంజనం మాదే : కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో శుక్రవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఆంధ్ర, తెలంగాణతోపాటు దేశ అప్పులపై అమిత్‌షాతో చర్చించినట్లు పాల్‌ తెలిపారు. ఈ సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో.. ఒక్క హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామన్న ఆయన.. దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం మినహా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. అలాగే దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందని.. ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశ అప్పులపై కేంద్ర మంత్రి అమిత్‌షాతో చర్చించినట్లు కేఏ పాల్‌ తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్‌ షాతో భేటీ అనంతరం కేఏ పాల్‌ మాట్లాడారు.
‘ఏపీ అప్పులు రూ.8 లక్షల కోట్లు.. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.4.50 లక్షల కోట్లుగా ఉంది. భారత్‌ అప్పులు చూస్తే రూ.కోటి లక్షలకు చేరింది. కేవలం రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసిన శ్రీలంక ఇవాళ దివాళా తీసింది. ఇందుకు కుటుంబ పాలన కూడా ఒక కారణం. కేసీఆర్‌ కుటుంబం 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. రూ.7 లక్షల కోట్లు ఏమయ్యాయో కేసీఆర్‌, కేటీఆర్ చెప్పరు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రా, తెలంగాణ అప్పులపై అమిత్‌ షాతో చర్చించాను. నాపై జరిగిన దాడిని అమిత్‌ షా తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు లేవు.. ఇవ్వండని అమిత్‌ షాను కోరాను. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఓటు బ్యాంక్‌ లేని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెంట ఎందుకు పడుతున్నారని కేంద్ర మంత్రిని అడిగాను. మేం ఆయన వెంట పడటమేంటి.. ఆయనే మా వెంట పడుతున్నారని అమిత్‌ షా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ మినహా అన్ని ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లాను. ఇక ప్రజలే నిర్ణయిస్తారు’ అని కేఏ పాల్‌ పేర్కొన్నారు.

*ఆ జాబితాలో ఏపీ ముందజలో ఉంది: పట్టాభి
పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదట అని టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగనన్న కాలనీలతో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్ల ఖర్చు అన్నారు. కనెక్షన్లపై సీఎంతో అధికారులు చెప్పినా డబ్బులు లేవన్నారట అని చెప్పారు. విద్యుత్ చార్జీలు పెంచి జనాలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోతే వారెక్కడ ఉండాలని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా కంపెనీలకు ఏపీ భారీ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యుత్ బకాయిల జాబితాలో అందరికంటే ముందంజలో ఏపీ ఉందన్నారు.

*అమిత్‌ షా జీ.. తెలంగాణకు ఏమిచ్చారో చెబుతారా.. ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బిడ్లలకు కేంద్రం ఏమిచ్చిందో బెబుతారా అంటూ వివిధ అంశాలపై ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.3 వేల కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి గ్రాంటు రూ.1350 కోట్లు, జీఎస్టీ పరిహారం రూ.2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటని కవిత ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు.మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పాలని కోరారు. కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. అంతేకాదు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై, భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం, ఎల్‌పీజీని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనంపై మీ సమాధానం ఏమిటని కేంద్ర మంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు

*గత ఏడాది పుట్టిన రోజు మరిచిపోకుండా చేశారు: MP Raghurama
గత సంవత్సరం పుట్టిన రోజును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ మరచిపోకుండా చేశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత సంవత్సరం పుట్టిన రోజున తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను ఎంపీ మీడియాకు వెల్లడించారు. గత 18 సంవత్సరాల నుండి తన మిత్రుడు రామానాయుడు జరిపేవారని తెలిపారు. ‘‘నాపై సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ గోల్ఫ్ పేరుతో రెక్కీ నిర్వహించి నన్ను అరెస్ట్ చేయించారు. సీఐడీ గుంటూరు ఆఫీసులో కెమెరాలు తీసివేసి, నా వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపి జగన్ మోహన్ రెడ్డి, పీవీ సునీల్‌ కుమార్ కుట్రపన్ని నాపై దాడి చేసారు. పోలీసులు నాపై చేసిన దాడిని లైవ్ ద్వారా ఉన్మాదికి చూపించారు. పుట్టినరోజు ఆఖరిరోజు అవుతుందనే భయం వేసింది. దాడి సంధర్భంగా నాపై దుర్భాషలు ఆడుతూ విచక్షణారహితంగా కొట్టారు. ఆరోజు రాత్రి 11:45 గంటల నుండి 12:10 గంటల వరకు విచక్షణారహితంగా కొట్టారు. సినిమాలో కూడా నాపై దారిచేసిన విధంగా సన్నివేశాలు ఉండవు. ముఖ్యమంత్రి , సునీల్‌ కుమార్ ఇద్దరూ ఒకరిని మించిన కళాకారులు. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా భయభ్రాంతులకు గురయ్యాను. కాళ్లు వాచిపోయేలా కొట్టారు. నన్ను కొట్టిన దెబ్బలకు మరుసటిరోజు వక్రభాష్యాలు చెప్పారు. గత సంవత్సరం నా పుట్టినరోజును మరపురాని పుట్టినరోజుగా చేసిన ఉన్మాదికి ధన్యవాదాలు’’ అంటూ వ్యాఖ్యానించారు

*దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ గంగ‌లో క‌లిసింది… వెంట‌నే సెట్ చేయండి : చిదంబ‌రం
దేశ ఆర్థిక ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయ స్థితికి ప‌డిపోయింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. చిదంబ‌రం విమ‌ర్శించారు. ఆర్థిక విధానాల‌ను వెంట‌నే మార్చాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌పంచ, దేశీయ ప‌రిణామాల‌ను లెక్క‌ల‌కు తీసుకొని, విధానాల‌ను మార్చాల‌న్నారు.సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్ వేదిక‌గా చిదంబ‌రం శ‌నివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. వృద్ధిరేటు మంద‌గ‌మ‌నంతో ఉంద‌ని, ఇదే మోదీ ప్ర‌భుత్వం హాల్‌మార్క్‌గా మారిపోయింద‌ని చిదంబ‌రం ఎద్దేవా చేశారు. క‌రోనా త‌ర్వాత కూడా ఆర్థిక వ్య‌వ‌స్థ ఇంకా మంద‌గ‌మ‌నంలోనే ఉంద‌ని, నిర్లిప్తంగానే వుంద‌న్నారు.ఇక‌.. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉన్న ఆర్థిక సంబంధాల‌ను కూడా కూలంక‌షంగా మ‌రోసారి చ‌ర్చించుకోవాల‌ని చిదంబ‌రం అభిప్రాయ‌ప‌డ్డారు. జీఎస్టీ విధానాల‌ను అతి పేల‌వంగా మోదీ స‌ర్కార్ రూపొందించింద‌ని, రూపొందించ‌డ‌మే కాకుండా ఆ విధానాల‌ను 2017 లో అమలు చేసింద‌న్నారు. వాటి ప‌ర్య‌వ‌సానాల‌ను దేశం అనుభ‌విస్తోంద‌ని చిదంబ‌రం ఎద్దేవా చేశారు

*రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయింది: జీవీఎల్ రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం రాజధాని గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ… మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పనులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలోనే 80, 90 శాతం పనులు అయిపోయినా ఇప్పుడు 10శాతం పనులు కూడా పూర్తి కాలేదని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పగించకుండా వదిలేశారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని ఎంపీ చెప్పారు. జగన్ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని వ్యాఖ్యానించారు. రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు.

*Yసీపీ మేనిఫెస్టోలోని హామీలను విస్మరించింది: Tulasi reddy
మేనిఫెస్టోలోని హామీలను వైసీపీ విస్మరించిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మండిపడ్డారు. మూడేళ్లలో మూడు ఇళ్లు కూడా కట్టించలేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. మద్యపాన నిషేధం బదులు మద్యపాన నిషా అమలవుతోందని వ్యాఖ్యానించారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి హామీల్లో మాట తప్పారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

*కాంగ్రెస్‌కు Sunil jakhar రాజీనామా
ఓవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై “చింతన్ శివిర్” నిర్వహిస్తుండగా మరోవైపు ఆ పార్టీకి సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు Sunil Jakhar షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి శనివారంనాడు రాజీనామా చేశారు. ఫేస్‌బుక్‌లో ‘దిల్ కీ బాత్’ స్ట్రీమ్‌లో తన రాజీనామా ప్రకటన చేశారు. ”గుడ్ లక్…గుడ్ బై కాంగ్రెస్” అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ పంజాబ్ యూనిట్ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించి నవజ్యోత్ సింగ్ సిద్ధూను పీపీసీసీ చీఫ్‌గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో సిద్ధూ సైతం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొద్దికాలంగా సునీల్ జాఖర్ పరోక్షంగా కాంగ్రెస్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీకి ఆయన ఉద్వాసన చెప్పే అవకాశాలున్నాయనే ఊహాగానాలు కూడా వినిపించాయి

*దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ: KTR
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… రాబోయే 10-15 ఏళ్లలో ఢిల్లీ కంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మహానగరం దేశానికే ఒక దిక్సూచి అని చెప్పుకొచ్చారు. దేశంలో మహానగరాలకు ఎక్కడైనా ప్రతికూల పరిస్థితులున్నాయని అన్నారు. పలు కారణాలతో చాలా నగరాల్లో ఇబ్బందులున్నాయని తెలిపారు. కొన్ని నగరాల్లో రైలు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు. కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలు ఇతర నగరాల్లో కూడా ఉన్నాయని మంత్రి అన్నారు. కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ప్రతిదీ అనుకూల పరిస్థితి అని వెల్లడించారు. గతంలో జలమండలి ముందు ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారన్నారు. రూ.1,450 కోట్లతో కృష్ణా నీటిని అదనంగా తరలించే కార్యక్రమం చేపట్టామని… వచ్చే వేసవి వరకు ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు

*గత ఏడాది పుట్టిన రోజు మరిచిపోకుండా చేశారు: MP Raghurama
గత సంవత్సరం పుట్టిన రోజును ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ మరచిపోకుండా చేశారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత సంవత్సరం పుట్టిన రోజున తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను ఎంపీ మీడియాకు వెల్లడించారు. గత 18 సంవత్సరాల నుండి తన మిత్రుడు రామానాయుడు జరిపేవారని తెలిపారు. ‘‘నాపై సీఐడీ ఛీఫ్ సునీల్‌ కుమార్ గోల్ఫ్ పేరుతో రెక్కీ నిర్వహించి నన్ను అరెస్ట్ చేయించారు. సీఐడీ గుంటూరు ఆఫీసులో కెమెరాలు తీసివేసి, నా వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపి జగన్ మోహన్ రెడ్డి, పీవీ సునీల్‌ కుమార్ కుట్రపన్ని నాపై దాడి చేసారు. పోలీసులు నాపై చేసిన దాడిని లైవ్ ద్వారా ఉన్మాదికి చూపించారు. పుట్టినరోజు ఆఖరిరోజు అవుతుందనే భయం వేసింది. దాడి సంధర్భంగా నాపై దుర్భాషలు ఆడుతూ విచక్షణారహితంగా కొట్టారు. ఆరోజు రాత్రి 11:45 గంటల నుండి 12:10 గంటల వరకు విచక్షణారహితంగా కొట్టారు. సినిమాలో కూడా నాపై దారిచేసిన విధంగా సన్నివేశాలు ఉండవు. ముఖ్యమంత్రి , సునీల్‌ కుమార్ ఇద్దరూ ఒకరిని మించిన కళాకారులు. ఆరోజు రాత్రంతా నిద్రలేకుండా భయభ్రాంతులకు గురయ్యాను. కాళ్లు వాచిపోయేలా కొట్టారు. నన్ను కొట్టిన దెబ్బలకు మరుసటిరోజు వక్రభాష్యాలు చెప్పారు. గత సంవత్సరం నా పుట్టినరోజును మరపురాని పుట్టినరోజుగా చేసిన ఉన్మాదికి ధన్యవాదాలు’’ అంటూ వ్యాఖ్యానించారు

*ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆందోళనకరం : చిదంబరం
దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం చెప్పారు. కాంగ్రెస్ మేధోమథనం సమావేశాల నేపథ్యంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించినపుడు ఆర్థిక విధానాలను విభిన్నంగా మార్చడం గురించి పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పారు. గడచిన ఎనిమిదేళ్ళలో వృద్ధి రేటు మందగమనం ప్రస్తుత ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనమని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం నిర్లిప్తంగా ఉందని, నిలిచిపోయిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించవలసిన సమయం ఆసన్నమైందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాలను మోదీ ప్రభుత్వం పేలవంగా రూపొందించిందని, GST Lawsను 2017లో అనుచితంగా అమలు చేసిందని, ఆ పర్యవసానాలను ప్రతి ఒక్కరూ చూడవలసి వస్తోందని చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేనంతగా బలహీనపడిందన్నారు. ఈ విషయంలో అత్యవసర ఉపశమన చర్యలు అవసరమని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం 1991లో సరళీకరణ నూతన శకాన్ని ఆవిష్కరించిందని గుర్తు చేశారు. ఈ సరళీకరణ వల్ల దేశానికి గొప్ప ప్రయోజనాలు లభించాయని తెలిపారు. సంపద సృష్టి, కొత్త వ్యాపారాలు, నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మధ్య తరగతి ప్రజల సంఖ్య పెరుగుదల, లక్షలాది ఉద్యోగావకాశాలు, ఎగుమతులు, పదేళ్ళలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం వంటి ప్రయోజనాలు చేకూరాయని చెప్పారు

*వైసీపీ ఎమ్మెల్యేలకు ఛీత్కారాలు…జగన్‌లో ఆందోళన మొదలు: నాదెండ్ల
నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సి.బి.ఐ. దత్తపుత్రుడుకి తెలిసిన విద్య అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్ష లు ఎగ్గొడుతున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారని మండిపడ్డారు. సి.పి.ఎస్. రద్దుపై మాట తప్పారన్నారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకు లేదని అన్నారు. ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని నిలదీశారు. గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారన్నారు. పరిపాలన చేతగాని సి.బి.ఐ.దత్తపుత్రుడైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని నాదెండ్ల మనోహర్ అన్నారు

*దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ: KTR
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… రాబోయే 10-15 ఏళ్లలో ఢిల్లీ కంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ మహానగరం దేశానికే ఒక దిక్సూచి అని చెప్పుకొచ్చారు. దేశంలో మహానగరాలకు ఎక్కడైనా ప్రతికూల పరిస్థితులున్నాయని అన్నారు. పలు కారణాలతో చాలా నగరాల్లో ఇబ్బందులున్నాయని తెలిపారు. కొన్ని నగరాల్లో రైలు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు. కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలు ఇతర నగరాల్లో కూడా ఉన్నాయని మంత్రి అన్నారు. కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ప్రతిదీ అనుకూల పరిస్థితి అని వెల్లడించారు. గతంలో జలమండలి ముందు ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారన్నారు. రూ.1,450 కోట్లతో కృష్ణా నీటిని అదనంగా తరలించే కార్యక్రమం చేపట్టామని… వచ్చే వేసవి వరకు ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

*Jaganకు షాకిచ్చిన సొంత పార్టీ నేత.. ఏకంగా అధినేత నిర్ణయానికే ఎదురుతిరిగాడుగా..!
‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై బొబ్బిలి వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు ఎదురు తిరిగారు. అభివృద్ధి చేయకుండా గడప గడపకు ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గడప గడపకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలని నిలదీశారు. పేరుకే పథకాలు.. ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లే
దని మండిపడ్డారు. తమ బాధ పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్ధితి ఏర్పడిందని రామారావు వాపోయారు.

*రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయింది: GVL
రాజధాని గ్రామాలలో అభివృద్ధి ఆగిపోయిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం రాజధాని గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. అనంతరం ఏబీఎన్‌తో మాట్లాడుతూ… మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పనులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలోనే 80, 90 శాతం పనులు అయిపోయినా ఇప్పుడు 10శాతం పనులు కూడా పూర్తి కాలేదని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అప్పగించకుండా వదిలేశారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని ఎంపీ చెప్పారు. జగన్ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని వ్యాఖ్యానించారు. రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర అభివృద్ధిని ఆపడం సరికాదన్నారు. పనులు చేపట్టాలని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు లేఖ రాసినట్లు చెప్పారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా.. రైతులకు అండగా ఉంటామని జీవీఎల్‌ స్పష్టం చేశారు.

*ఆ జాబితాలో ఏపీ ముందజలో ఉంది: పట్టాభి
పేదలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదట అని టీడీపీ నేత పట్టాభి అన్నారు. జగనన్న కాలనీలతో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి రూ.4,500 కోట్ల ఖర్చు అన్నారు. కనెక్షన్లపై సీఎంతో అధికారులు చెప్పినా డబ్బులు లేవన్నారట అని చెప్పారు. విద్యుత్ చార్జీలు పెంచి జనాలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోతే వారెక్కడ ఉండాలని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా కంపెనీలకు ఏపీ భారీ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యుత్ బకాయిల జాబితాలో అందరికంటే ముందంజలో ఏపీ ఉందన్నారు.

*15 లక్షల మందిలో లక్ష మందికే భరోసా: కొల్లు
‘‘రాష్ట్రంలో మత్స్యకార వృత్తిపై 15 లక్షల మంది ఆధారపడి ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం లక్ష మందికి మాత్రమే మత్స్యకార భరోసా పేరుతో రూ.10 వేలు ఇస్తోంది. అదే పెద్ద మహాకార్యం మాదిరిగా కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు గుమ్మరిస్తోంది. ఇదో పెద్ద ఘనతా..!’’ అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘జీవో 217 ద్వారా రిజర్వాయర్లు, నదులపై మత్స్యకారుల హక్కులను రద్దు చేసి లక్షల మంది పొట్టగొట్టారు. కరెంటు చార్జీలు, పెట్రో ఉత్పత్తుల రేట్లు, నిత్యావసరాల ధరలు పెంచేశారు. రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు వారినుంచి గుంజుతున్నారు’’ అని ఆరోపించారు.

*అసమర్థ పాలన వల్లే అంధకారం: లంకా దినకర్‌
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి, కళాశాలలు సంక్షోభంలోకి కూరుకు పోతున్నాయని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ ఆరోపించారు. విద్యా దీవెనలో కోతల భారం పేద విద్యార్థుల జీవితాలపై శరాఘాతంగా మారిందని పేర్కొన్నారు.

*ఆంధ్రకు.. శ్రీలంకకూ ఏం సంబంధం: కోన
ఏపీ కూడా శ్రీలంక అవుతుందంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులు అసలు ఏపీకి, శ్రీలంకకు ఏం సంబంధం ఉందో చెప్పాలని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ప్రశ్నించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. 18 శాతం పర్యాటక రంగంపై ఆధారపడిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కరోనాతో కుదేలైందన్నారు.

*త్వరలో ఆయిల్‌పామ్‌కు ధర నిర్ణయం: మంత్రి కాకాణి
రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ రైతులు, ఫ్యాక్టరీలకు నష్టం లేకుండా ముడిపంటలో చమురు నిష్పత్తి ఆధారంగా త్వరలో శాస్త్రీయ విధానంలో, అందరికీ ఆమోదయోగ్యమైన ధర నిర్ణయిస్తామని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయిల్‌పామ్‌ ధరలపై అధికారులు, రైతులు, ఫ్యాక్టరీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.

*వైసీపీ, టీడీపీలతో పొత్తు సమస్యే లేదు: వీర్రాజు
‘‘రాబోయే ఎన్నికల్లో జనసేన, బీజేపీ మాత్రమే కలసి పోటీ చేస్తాయి. టీడీపీ, వైసీపీ వంటి తల్లీపిల్ల పార్టీలతో పొత్తు పెట్టుకునే సమస్యే లేదు. నిధులిచ్చే బీజేపీని, జనం కోసం పనిచేసే జనసేనను గెలిపిస్తారు… ఇది తథ్యం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ, టీడీపీలు అభివృద్ధి నిరోధకులు. ఈ విషయంపై ఓపెన్‌ డిబేట్‌కు తాను సిద్ధమన్నారు.

*మళ్లీ జగనే సీఎం.. పందేనికి సిద్ధం: తమ్మినేని
‘‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే. ఈ విషయంలో ఎవరు పందెం కాసినా నేను సిద్ధం’’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సవాల్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్‌ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘‘ఆముదాలవలస నియోజకవర్గంలో గతసారి 15,000 ఓట్ల మెజారిటీ వస్తే ఈసారి 25,000 ఓట్ల మెజారిటీ వస్తుంది. దీనిపైనా నేను బెట్టు కాయడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీలో ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’’ అన్నారు.

*ఓయూలో 3డీ ప్రింటింగ్‌ ల్యాబ్‌: కేటీఆర్‌
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్‌సీఏఎం, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో శుక్రవారం నిర్వహించిన 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ జాతీయ సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్ట్రేలియా తరఫున ఆసియా గ్లోబల్‌ కమిషనర్‌గా ఉన్న మిచెల్‌ వేడ్‌తో కలిసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. త్రీడీ ముద్రిత వైద్య పరికరాల సాంకేతికత అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉస్మానియా వర్సిటీ (ఓయూ)తో ఈ కార్యక్రమంలో త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీపై సదస్సు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ‘‘అమెరికా ప్ర భుత్వం (యూఎ్‌సఎ్‌ఫడీఏ) 3డీ ప్రింటింగ్‌ ద్వారా రూపొందించిన 100కుపైగా వైద్య పరికరాలు, 3డీ ప్రింటెడ్‌ టైటానియం ఉత్పత్తుల వినియోగానికి అనుమతిచ్చింది. నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతపై రాష్ట్రం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఉస్మానియా వర్సిటీలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడిట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నాం. కొత్త సాంకేతికల ప్రోత్సాహంలో భాగంగా గడచిన ఐదేళ్లలో రూ. 1800 కోట్లు ఖర్చు చేశాం. దేశంలోనే పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా పేరుగాంచిన టీవర్క్స్‌కు త్వరలో 78వేల చదరపుగజాల్లో భవనం అందుబాటులో రానుంది. అందులోనే 3డీ ప్రింటింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తాం’’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో పలు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా 3డీ ప్రింటింగ్‌ మార్కెట్‌లో భారత్‌ వాటా కేవలం 2 శాతమేనని ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విభాగం ఓఎ్‌సడీ రమాదేవి లంకా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య పరికరాలు, ఇంప్లాంట్స్‌ రంగంపై దృష్టిసారించిందని పేర్కొన్నారు.

*మిషన్‌భగీరథతో కల్వకుంట్ల కుటుంబానికే లబ్ధి: ప్రవీణ్‌కుమార్‌
మిషన్‌ భగీరథ అంతా ఒక మాయని, సూమారు రూ.36వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంతో కల్వకుంట్ల కుటంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో రూ.100 కోట్ల భూమిని కేవలం రూ.4లక్షలకే గుంజుకున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని ఆరోపించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్‌.. దళితులకు, మూడెకరాలు ఇస్తానని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. రూ. 36వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం పెట్టి జేబులు నింపుకొన్నారన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సరైన వైద్య సదుపాయలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లలో ప్రజల కోసం ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఏం చేయలేకపోయిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిగిలిన కాలంలో ఏం చేస్తుందని ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

*మోడీ పాలనపై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం: Kishan Reddy
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తండ్రీ కుమారులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. వారి అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌ కుటుంబపాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రంపై బురదజల్లే కుట్రకు తెరలేపారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

*మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: Bundi Sanjay
బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bundi Sanjay) ప్రకటించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాగులదోని తండా, దయ్యాల గుండు తండా, మహేశ్వరం గ్రామంలో ప్రజా సంగ్రామయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ హిందూ కులవృత్తులను సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. గిరిజన తండాలకు కేసీఆర్‌ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా విస్మరించిందని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. భాగ్యనగరంలో ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేసి ఎంఐఎంకు బుద్ధి చెబుతామని బండి సంజయ్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సంజయ్‌ సవాల్‌ చేశారు.

*Gajwel నుంచి తిరుపతికి రైలు: హరీశ్‌రావు
త్వరలోనే గజ్వేల్‌ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్‌ నియోజకవర్గానికి 2014 తర్వాత మహర్దశ పట్టుకుందన్నారు. గజ్వేల్‌ నుంచి తిరుపతికి త్వరలోనే రైళ్లు నడుస్తాయని ఎవరూ ఊహించలేదని, అది త్వరలో జరుగబోతుందని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ దశ, దిశ మారిందని, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 99లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే తెలంగాణ వచ్చాక 2లక్షల కోట్ల 59 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండుతుందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సొంత జాగ ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు త్వరలోనే అందించనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు.

*విద్వేషాలు రెచ్చగొట్టడానికే పాదయాత్ర: సబిత
విద్వేషాలు రెచ్చగొట్టడానికే బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకునే కేంద్రమంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో నీటివాటా ఎందుకు ఇవ్వట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని రేపు అమిత్‌షా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ, ఐఐఎస్సిఆర్, ఎన్ఐటి, ఐఐఎం, నవోదయ, మెడికల్ కాలేజీలు.. ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పడానికే అమిత్‌షా వస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సబిత డిమాండ్ చేశారు.

*కారుచౌకగా భూములు కొట్టేస్తున్న.. టీఆర్ఎస్: విజయశాంతి
టీఆర్‎ఎస్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కొట్టేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వారి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘‘అధికార పార్టీ ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం కారుచౌకగా భూమిని కేటాయించారు. పార్టీ హైదరాబాద్‌ జిల్లా కార్యాలయానికి ప్రభుత్వం రూ.70 కోట్ల విలువైన భూమిని కేటాయించింది. ఇంత విలువైన భూమిని గజం రూ.100 చొప్పున కేటాయించడం విచిత్రంగా ఉంది. హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లో ఉన్న ఎన్‌బీటీ నగర్‌లో సర్వే నం.403/పీలో ఎకరం భూమిని టీఆరెస్ పార్టీ ఆఫీసు కోసం కేటాయించారు. టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కె.కేశవరావు ఇంటి పక్కనే ఈ స్థలం ఉంది. దీన్ని కేటాయించాలని టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేయగానే… సచివాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నెల 9న జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ ప్రతిపాదనలు పంపారు. ఆ మరుసటి రోజే భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం… భూమి కేటాయింపుపై సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ఫైలును పంపించింది.’’ ‘‘ఆ త‌ర్వాత రోజు అంటే, మే 11న రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆగ‌మేఘాల మీద‌ భూమిని కేటాయిస్తూ జీవో నం.47ను జారీ చేశారు. ఎన్‌బీటీ నగర్‌లో గజం రూ.లక్షన్నర ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ రూ.70 కోట్లపైనే. కానీ, 2018 ఆగస్టు 16న ప్రభుత్వం విడుదల చేసిన పాల‌సీ ప్రకారం గజం రూ.100 చొప్పున టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ స్థలానికి రూ.4.93 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. కేసీఆర్ స‌ర్కార్ అధికార దుర్వినియోగానికి ఇదొక మ‌చ్చు తున‌క మాత్ర‌మే.. ఇలాంటి రాష్ట్రవ్యాప్తంగా కోకొల్ల‌లుగా జరుగుతునే ఉన్నాయి. కేసీఆర్… నీ ఆట‌లు ఇక ఎంతో కాలం సాగ‌వు. ప్ర‌జ‌లు అన్నీ చూస్తునే ఉన్నరు. నీకు, నీ పార్టీకీ త‌గిన బుద్ధి చెప్పే రోజు తొంద‌ర్లోనే రానుంది’’. అని విజయశాంతి పేర్కొన్నారు.

*కేసీఆర్… తాగుబోతుల తెలంగాణగా మార్చారు: VH
రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజలను తాగుబోతులను చేసి.. సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. పర్మిట్ రూమ్‌లంటూ బార్ షాపుల తయారు చేశారన్నారు. ఈ ప్రభుత్వంపై తిరగబడేందుకు మహిళలు రోడ్డు మీదకు రావాలని పిలుపునిచ్చారు. ఒకే బస్తీలో మూడు, నాలుగు బార్, వైన్ షాపులు తెరిచారన్నారు. ప్రభుత్వం విస్కీ‌, వైన్ అమ్మకాలతోనే నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్(KCR)…తాగుబోతుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్‌తో ఆలోచన చేసి.. మధ్యపాన నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళల తరుపున తాను పోరాటం చేస్తానని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని విహెచ్ హితవు పలికారు.

*మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ.. ఎందుకంటే..?
సత్యవేడులోని ఆరణి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వైకాపా నేతల అండతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలపై అధికారులు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఇసుక తవ్వకాల వీడియోలను విడుదల చేశారు. గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. సత్యవేడులోని ఆరణి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. అక్రమంగా తవ్విన ఇసుక తమిళనాడుకు తరలిస్తున్నారని… రాష్ట్రానికి ఆర్థిక నష్టంతోపాటు సహజ వనరులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను ఏపీ లారీల్లో లోడ్‌ చేసి వే బిల్లు సిద్ధం చేస్తారని… తమిళనాడు ట్రక్కులోకి మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో వెల్లడించారు.ఒకే వేబిల్లుపై అనేకసార్లు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని వాపోయారు. వైకాపా నేతల అండతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరణి నది ఒడ్డున ఉన్న గ్రామాలకు వరద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. తవ్వకాలపై అధికారులు స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోందని అన్నారు. మాఫియాతో అధికారులు కుమ్మక్కయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆరోపించారు. ఇసుక తవ్వకాల వీడియోలను వర్ల రామయ్య విడుదల చేశారు.