Movies

కరాటే కళ్యాణ్ పై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు

కరాటే కళ్యాణ్ పై పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు

సినీ నటి కరాటే కళ్యాణిపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా ఓ బాధితుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు.బాధితుడు గోపీకృష్ణ. ట్విట్టర్లో కంప్లైంట్ చేస్తూ “కరాటే కళ్యాణి బాధితుల్లో మేం కూడా ఒకరమే. ఓ ఇంటి కొనుగోలు విషయంలో మా నుంచి 3.5 లక్షలు వసూలు చేసి మాతో ఒప్పందం చేసుకుంది”“SBIకు చెల్లించాల్సిన మొత్తాన్ని మేమే చెల్లించాలంటూ బెదిరించారు. ఆమె పురుగుమందు తాగిన వీడియో పంపి భయబ్రాంతులకు గురి చేసింది. ఆమె విషయంలో వెంటనే స్పందించిన SHO ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కరాటే కళ్యాణి బాధితుల్లో ఒకరైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం”
ఎస్ఆర్‌ నగర్ పోలీస్ స్టేషన్ యూసుఫ్ గూడ బస్తీలో ఇటీవలే నటి కరాటే కళ్యాణి & యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.కరాటే కళ్యాణి యు ట్యూబర్ శ్రీకాంత్ పై ఇచిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 323, 506, 509 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణిపై చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 323, 448, 506 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.