Business

హరియాణాలో మారుతీ సుజుకీ ప్లాంట్‌ – TNI వాణిజ్య వార్తలు

హరియాణాలో మారుతీ సుజుకీ ప్లాంట్‌   – TNI వాణిజ్య వార్తలు

* వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ హరియాణాలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రం కోసం తొలి దశలో రూ.11,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. హరియాణా స్టేట్‌ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సోనిపట్‌ జిల్లాలో ఐఎంటీ ఖర్ఖోడ వద్ద 800 ఎకరాలను మారుతీ సుజుకీ కోసం కేటాయించింది. సామర్థ్యం పెంపునకు మరిన్ని తయారీ యూనిట్లను ఇక్కడ నెలకొల్పేందుకు సరిపడ స్థలం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది. తొలి దశ 2025 నాటికి పూర్తి కానుంది. తొలుత ఏటా 2.5 లక్షల యూనిట్ల కార్లను తయారు చేయగల సామర్థ్యంతో ఇది రానుంది. హర్యానా, గుజరాత్‌లో ఉన్న ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22 లక్షల యూనిట్లు.

*అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.

*ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.

*దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు

*న్యూజిలాండ్‌కు చెందిన ద ఎనర్జీ కలెక్టివ్‌ (టీఈసీ)కి అనుబంధ సంస్థగా ఉన్న ఎనర్జీ టెక్‌ గ్లోబల్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈసీఐఎల్‌లోని కేంద్ర కార్యాలయంలో, హైటెక్‌ సిటీలో ఉన్న శాటిలైట్‌ కేంద్రంలో అదనపు మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎండీ కిషోర్‌ బొర్రా తెలిపారు. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులుండగా ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు చెప్పారు.

*యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,557.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 22.68 శాతం వృద్ధి చెందింది. స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన 8.26 శాతం వృద్ధితో రూ.1,440 కోట్ల లాభం నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 25.29 శాతం పెరిగి రూ.6,769 కోట్లకు చేరింది.

*యూకో బ్యాంక్‌.. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.312 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.80 కోట్లతో పోలిస్తే 290 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 2021-22 ఏడాది మొత్తానికి రూ.930 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది లాభం రూ.167 కోట్లతో పోలిస్తే 457 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.1,652 కోట్లకు, మొత్తం ఏడాదికి రూ.6,473 కోట్లకు చేరిందని పేర్కొంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022 మార్చి చివరి నాటికి బ్యాంక్‌ మొత్తం వ్యాపా రం 9.1 శాతం వృద్ధితో రూ.3,24,324 కోట్ల నుంచి రూ.3,53,850 కోట్లకు చేరింది.

*దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.9,114 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 క్యూ4లో ఆర్జించిన లాభం రూ.6,451 కోట్లతో పోల్చితే ఇది 41.28 శాతం అధికం. కాగా మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 55.19 శాతం వృద్ధితో రూ.20,401 కోట్ల నుంచి రూ.31,676 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 15.26 శాతం పెరిగి రూ.31,198 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 0.29 శాతం పెరిగి 3.40 శాతంగా నమోదైంది. స్థూల ఎన్‌పీఏలు 3.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.02 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాలు 0.43 శాతానికి తగ్గాయి.

*దేశీయ కార్పొరేట్‌ రంగంలో ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) హవా కొనసాగుతోంది. ఫోర్బ్స్‌ పత్రిక తాజా గా రూపొందించిన టాప్‌ గ్లోబల్‌-2000 కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్‌కు 53వ స్థానం లభించింది. ఈ విషయంలో మరే భారతీయ కంపెనీ రిలయన్స్‌ దరిదాపుల్లోకి కూడా రాలేదు. గత ఏడాదితో పోలిస్తే. రిలయన్స్‌ ఈ ఏడాది రెండు స్థానాలు ముందుకు వచ్చింది. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, ఆయా కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ ఆధారంగా ఫోర్బ్స్‌ ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది.

*ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనూహ్యమైన ప్రకటన చేశారు. 44 బిలియన్ డాలర్ల(రూ.3.3 లక్షల కోట్లు పైమాటే) విలువైన ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు పెండింగ్‌లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లలో 5 శాతం కంటే తక్కువగా ఉన్న స్పామ్ లేదా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన లెక్కలు అందాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై ట్విటర్ ఇంతవరకూ స్పందించలేదు. ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనతో ట్విటర్ షేర్లు శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో ఏకంగా 20 శాతం మేర భారీగా పతనమయ్యాయి.

*బీమా కంపెనీలు.. చిన్న తరహా గృహాలు, చిన్న వ్యాపారులకు అగ్ని ప్రమాదాలు, సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యామ్నాయ పాలసీలు ప్రారంభించేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. కస్టమర్లకు విస్తృత ఎంపికలు అందించడం, బీమా మరింతగా విస్తరింపచేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అగ్ని ప్రమాదాల వ్యాపారంలో కొత్త కవరేజీలకు డిమాండ్‌ పెరుగుతుండడమే ఈ ప్రత్యామ్నాయాలకు అనుమతించడానికి ప్రధాన కారణమని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ కొత్త ప్రత్యామ్నాయ పాలసీలు గతంలోని భారత్‌ గృహ రక్ష, భారత్‌ సూక్ష్మ ఉద్యమ్‌ సురక్ష, భారత్‌ ఉద్యమ్‌ సురక్ష వంటి ప్రామాణిక ఉత్పత్తులకు కొత్త పాలసీలు లేదా యాడ్‌ అన్‌గా అందించవచ్చని పేర్కొంది.

*ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందిస్తున్న జియో ఫైబర్‌ తెలుగు రాష్ట్రాల్లో సేవలను 71 ప్రధాన పట్టణాలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతో పాటు ఏలూరు, నెల్లూరు, ఒంగోలు వంటి పట్టణాల్లో కూడా జియో ఫైబర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఏపీలో మొత్తం 43 పట్టణాల్లో సేవలు అందిస్తున్నామని జియోఫైబర్‌ తెలిపింది. కాగా తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు జగిత్యాల్‌, అదిలాబాద్‌, కోదాడ వంటి మొత్తం 28 పట్టణాల్లో జియోఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

*గత ఆర్థిక సంవత్సరానికి అవంతీ ఫీడ్స్‌ వాటాదారులకు 625ు డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై రూ.6.25 డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన త్రైమా సికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ.1,116 కోట్ల నుంచి రూ.1,348 కోట్లకు పెరిగింది.

*గత ఆర్థిక సంవత్సరానికి అవంతీ ఫీడ్స్‌ వాటాదారులకు 625ు డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై రూ.6.25 డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన త్రైమా సికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ.1,116 కోట్ల నుంచి రూ.1,348 కోట్లకు పెరిగింది.

*ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ స్థానాన్ని యాపిల్‌ కోల్పోయుంది. ఆ స్థానాన్ని ఇప్పుడు సౌదీ ఆరామ్కో చేజిక్కించుకుంది. బుధవారం మార్కెట్‌ ముగిసే సమయానికి సౌదీ ఆరామ్కో 2.42 లక్షల కోట్ల డాలర్లతో మార్కెట్‌ విలువలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండగా యాపిల్‌ 2.37 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానానికి దిగజారింది. క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదల సౌదీ ఆరామ్కో ప్రథమ స్థానానికి చేరడానికి దోహదపడింది. ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్‌ మార్కెట్‌ విలువ 3 లక్షల కోట్ల డాలర్లు, సౌదీ ఆరామ్కో విలువ 1 ట్రిలియన్‌ డాలర్లుంది. ఈ నాలుగు నెలల కాలంలో యాపిల్‌ 20 శాతం విలువను నష్టపోగా సౌదీ ఆరామ్కో విలువ 28 శాతం పెరిగింది.

*జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌.. భారత మార్కెట్లోకి సరికొత్త వెర్షన్‌ సీ-క్లాస్‌ సెడాన్‌ను విడుదల చేసింది. మూడు వేరియంట్లలో సీ-క్లాస్‌ సెడాన్‌ అందుబాటులో ఉండనుంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన సీ 200 ధర రూ.55 లక్షలుగా ఉండగా 2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌తో కూడిన సీ 220డీ ధర రూ.56 లక్షలు, సీ 330 డీ ధర రూ.61 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. ఐదో తరం సీ-క్లాస్‌ కోసం ఇప్పటికే 1,000 పైగా ప్రీ బుకింగ్స్‌ వచ్చినట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ తెలిపింది. ఈ ఏడాది భారత మార్కెట్లోకి కొత్తగా 10 మోడళ్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో భాగంగానే తొలుత మేబాక్‌ ఎస్‌-క్లా్‌సను తీసుకురాగా తాజాగా సీ-క్లాస్‌ సెడాన్‌ను తీసుకువచ్చినట్లు మెర్సిడెస్‌ వెల్లడించింది.

*ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ) 8 సంవత్సరాల గరిష్ట స్థాయి 7.8 శాతానికి చేరుకుందని వెల్లడించింది. భారతీయ వినియోగదారులు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతం నుంచి ఏప్రిల్‌లో దాదాపు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.8 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 8.4శాతం, దేశంలోని పట్టణ ప్రాంతాలు 7.1 శాతం ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నాయని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గురువారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. వినియోగదారుల ఆహార ధరల సూచిక మార్చిలో 7.7శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది.