Movies

అందుకే ‘ఎఫ్‌ 3’ ట్రైలర్‌లో నన్ను దాచేశారు!

Auto Draft

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌ 3’. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. సోనాల్‌ చౌహన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈనెల 27న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సోనాల్‌ మాట్లాడుతూ ‘‘లెజెండ్‌ సమయంలో అనిల్‌ రావిపూడి నాకు పరిచయం అయ్యారు. ‘మనం కలిసి వర్క్‌ చేద్దాం’ అన్నారు. కానీ.. ఆయన్నుంచి ఫోన్‌ రావడానికి చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు ‘ఎఫ్‌ 3’లో నాకు అవకాశం ఇచ్చారు. అంతకు ముందే నేను ‘ఎఫ్‌ 2’ చూశాను. కామెడీ పంచడంలో అనిల్‌ రావిపూడి కింగ్‌. అందుకే మరో ఆలోచన లేకుండా ‘ఎఫ్‌ 3’లో నటించడానికి ఒప్పుకొన్నా. ఈ సినిమాలో నా పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. నా పాత్ర ఓ ట్విస్ట్‌కి కారణం అవుతుంది. అది రివీల్‌ అయినప్పుడు అంతా ఆశ్చర్యపోతారు. అందుకే ట్రైలర్‌లోనూ నన్ను దాచి పెట్టారు. ఈ సినిమాలో చాలా పాత్రలున్నప్పటికీ అందరికీ ప్రాధాన్యం ఉంటుంది. పూర్తిస్థాయి వినోద భరిత చిత్రం చేయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. వెంకీ లాంటి సీనియర్‌ నటుడితో కలిసి తెర పంచుకోవడం ఓ గౌరవం. అనిల్‌ గారి వర్కింగ్‌ స్టైల్‌ చాలా కూల్‌గా ఉంటుంది. ఈ సినిమా తరవాత.. తమన్నా, మెహరీన్‌ మంచి స్నేహితులు అయిపోయారు. ‘ఎఫ్‌ 3’ అనేది నా కెరీర్‌లో పెద్ద మార్పు తీసుకొస్తుందని గట్టిగా నమ్ముతున్నా’’ అన్నారు.