Devotional

భారతదేశంలో ఏకైక పురుష నది ‘బ్రహ్మపుత్ర’ – TNI ఆధ్యాత్మికం

భారతదేశంలో ఏకైక పురుష నది  ‘బ్రహ్మపుత్ర’ – TNI ఆధ్యాత్మికం

బ్రహ్మ బిడ్డగా ప్రసిద్ధి చెందిన ఈ నది భారతదేశంలోనే ఏకైక పురుష (మగ) నదిగా పేరుగాంచింది. ఇది చైనాలోని టిబెట్ లో పుడుతుంది. అక్కడ దీన్ని యార్లంగ్ త్సాంగ్పో అని పిలుస్తారు. బ్రహ్మపుత్రను హిందువులు, జైనులు మరియు బౌద్ధులు అత్యంత భక్తిప్రవత్తులతో దేవత నదిగా కొలుస్తారు. బ్రహ్మ పుత్ర నది మానస సరోవర శ్రేణుల నుంచి ఉద్భవించిన రెండవ నది. చైనాలోని టిబెట్ లో గల మానస సరోవర్ సరస్సు సమీపంలో ఉన్న అంగ్సీ హిమానీ నదం నుంచి ఉద్భవించింది. ఇది భారతదేశంలోని ఏకైక ‘మగ నది’గా పిలుస్తారు. అరుణచల్ ప్రదేశ్ లో భారత్ లోకి ప్రవేశించింది. అనంతరం అస్సాం గుండా ప్రయాణించి బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంద.. భారత్ లో దీని మొత్తం పొడువు 916 కిలోమీటర్లు మాత్రoబంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా ‘జమున’ నదిగా సాగి దిగువ గంగ నదిలో కలుస్తుంది. దీనిని పద్మా నది అని కూడా పిలుస్తారు
వేరొక బ్రహ్మపుత్ర నది ‘మేఘ్నా నదిలో’ కలుస్తుంది. ఈ రెండు నదులు బంగ్లాదేశ్ లోని ‘చాంద్ పూర్’ అనే ప్రదేశంలో కలిసి బంగాళాఖాతంలో కలుస్తాయి.చాలా కాలం క్రితం చాంగ్ థాంగ్ పీఠభూమి ఒక గొప్ప సరస్సు అని బౌద్ధులు విశ్వసించారు. కరుణామయుడైన బోధిసత్వుడు ఈ సరస్సు నీళ్లు దిగువ ప్రజలకు చేరాలని తీవ్రంగా ప్రయత్నించాడు. యార్లంగ్ త్సాంగ్పో నది దిగువకు ప్రవహించడానికి.. మైదానాలను సుసంపన్నం చేయడానికి హిమాలయ పర్వతాల గుండా ఒక కాలువను సృష్టించాడని అక్కడి ప్రజలు చెబుతుంటారు.
**బ్రహ్మపుత్రా నది చరిత్ర తెలుసుకుందాం…
హిందువులకు దేవుడైన బ్రహ్మ-అమోఘల కుమారుడే బ్రహ్మపుత్ర. శంతనుడు అనే మహర్షి కూతురైన అమోఘ అందమైన రూపానికి.. ఆమె అందానికి బ్రహ్మ మంత్రముగ్ధుడై వివాహమాడాడని చరిత్రలో చెబుతారు. అమోఘతో కాపురం చేయగా.. ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బాలుడే నీరులా ప్రవహించాడని.. మహర్షి శంతనుడు ఈ ‘బ్రహ్మ కుమారుడిని’ కైలాస, గంధమాదన, జరూధి మరియు సంబ్వర్తక్క అనే నాలుగు గొప్ప పర్వతాల మధ్యలో ఉంచాడని చెబుతారు. అతను ‘బ్రహ్మ కుండ్’ అనే గొప్ప సరస్సుగా ఎదిగాడని చెబుతారు. పరశురాముడు తన తల్లిని చంపిన పాపం నుండి విముక్తి పొందేందుకు ఈ నదిలో పుణ్యస్నానం చేయమని గొప్ప ఋషులు సలహా ఇచ్చారు. నది దిగువకు ప్రవహించడానికి.. మానవాళిని ఆశీర్వదించడానికి అతను పర్వతం యొక్క ఒక వైపున గొడ్డలితో దారి మళ్లించాడు.. దాన్ని కిందకు భారతదేశం వైపునకు ప్రవహించేలా చేశాడని ప్రతీతి. టిబెట్‌లోని కైలాష్ శ్రేణిలోని చెమయుంగ్‌డుంగ్ గ్లేసియర్‌లో ‘టిబెటన్ ఊయల’గా పిలువబడే యార్లంగ్ త్సాంగ్పో నదినే భారత్ లో ‘బ్రహ్మపుత్ర’గా పిలుస్తారు. ఇది టిబెట్ నుండి అత్యంత వేగంగా కిందకు ప్రవహించే నదిగా గుర్తింపు పొందింది. మొదట తూర్పు వైపు 1,000 కి.మీ ప్రవహిస్తుంది, తర్వాత పెమాకోప్ ప్రాంతంలోని భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాదియాలోని నామ్చే బర్వా దగ్గర పడమర వైపు గుర్రపు షూ ఆకారంలో వంపు ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఈ నదికి ‘సియాంగ్’ అని నామకరణం చేశారు. నామ్చే బర్వా (7,782 మీ.) మరియు గియాలా పెరి (7,294 మీ.) రెండు విభిన్న శిఖరాలు.. ఇవి హిమాలయాల తూర్పు చివరన ఉంటాయి. ఈ రెండు పర్వతాల మధ్య నుంచి బ్రహ్మపుత్ర వంపును తీసుకొని భారత్ లోకి వస్తుంది. బ్రహ్మపుత్ర ప్రతి సంవత్సరం భారీ వరదలు సృష్టిస్తుంది. ఆ వరద తాకిడికి దాని గమనాన్ని మారుస్తుంది. తద్వారా కొత్త భూభాగాలు దీని తీరంలో ఏర్పడుతుంటాయి., ఈ నది బేసిన్‌లో స్థిరపడిన ప్రజల జీవనాడిగా బ్రహ్మపుత్ర నది పేరుగాంచింది. మనుషులు.. వస్తువులను రవాణా చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. మత్స్యకారులు, పడవలు నడిపేవారు.. రోజువారీ కూలీలుగా ఉపాధి మార్గాలను అందిస్తున్న ఈ నది దాని ఒడ్డున నివసించే ప్రజల సామాజిక-ఆర్థిక జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇది నీటిపారుదల.. నావిగేషన్ లకు ముఖ్యమైన మూలంగా వర్ధిల్లుతోంది. ఈ పరీవాహక ప్రాంతంలోని గొప్ప వర్షారణ్యాలు అనేక రకాల వృక్షజాతులు.. తుజాలానికి నిలయంగా ఉన్నాయి. అనేక స్థావరాలు ఉన్నాయి. ఇది కజిరంగా, మానస్ మరియు కాంచన్‌గంగా వంటి జాతీయ ఉద్యానవనాలను కలిగి ఉంది. దేశంలోని మిగతా నదులన్నీ గంగా, గోదావరి, కృష్ణ, యమున, నర్మదా, కృష్ణా, సింధూ, మహా, కావేరి, తపతి మొదలైన అన్ని నదులను స్త్రీ దేవతలుగా భావించి స్త్రీ  నామాలనే పెట్టారు. వీటన్నింటిని నదీమ తల్లులు అని కొలుస్తారుఒక్క బ్రహ్మపుత్ర మాత్రమే మగనదిగా.. బ్రహ్మ పుత్రుడిగా పేరుగాంచింది.

2. జూలై 15 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ రద్దు
వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ను పరిమితం చేశామన్నారు. తిరుమలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నామన్నారు. భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కల్పించేలా చలువపందిళ్లు, నేలపై చలువసున్నం, కార్పెట్లు వేశామని, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు సేదతీరేలా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. పేదలకు పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామన్నారు. జమ్మూ, సీతంపేట, అమరావతి ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఏప్రిల్‌ నెలలో 20.64 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించామని, రూ.127 కోట్లు హుండీ ఆదాయం సమకూరిందన్నారు. శ్రీవారికి ఈ-హుండీ ద్వారా రూ.4.41 కోట్లు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఈ-హుండీ ద్వారా రూ.13 లక్షలు లభించాయన్నారు.

3. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు టీవీఎస్‌ సంస్థ చైర్మన్‌ సుదర్శన్‌ శుక్రవారం రూ.కోటి విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్‌నుఈవో ధర్మారెడ్డికి అందజేశారు.

4. ద్వారకా తిరుమల చిన వెంకన్నను రాష ్ట్రహైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన స్వామిఅమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరిపారు.

5. యాదాద్రి జిల్లాలో మధ్యరాతియుగంచిత్రాలు
యాదాద్రి – భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం, యావపూర్‌ గ్రామపంచాయితీ పరిధిలోని మధిర గ్రామం కాశీపేటలో ఒక చిన్నరాతి గుట్టమీద పది వేల ఏళ్లకుపైబడిన మధ్యరాతియుగం చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ శుక్రవారం తెలిపారు. వాటిని మొదట తమ బృందం సభ్యులు మహమ్మద్‌ నజీర్‌, కొరివి గోపాల్‌ గుర్తించారని చెప్పారు. 30 అడుగుల ఎత్తున్న చిన్నరాతి గుట్టమీద పడిగెరాయి లోపలివైపు ఎరుపురంగులో రాతి చిత్రాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడి గుహను స్థానికులు వెంకటేశ్వరాలయంగా పిలుస్తారు. కొన్నేళ్లుగా పండగ లు, పర్వదినాలలో గుహ అంచులకు జాజు, సున్నం పూయడంతో రాతిచిత్రాలు మరుగునపడ్డాయని తెలిపారు. 4 అడవి దున్నలు, ఇద్దరు పురుషులు, మరొక చోట గుర్రాన్ని పోలిన జంతువుల రాతిచిత్రాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. ఈ బొమ్మల్లోని రేఖల ఆధారంగా ఈ చిత్రాలు పది వేల ఏళ్ల కంటే ముందునాటి మధ్యరాతియుగానికి చెందినవిగా అభిప్రాయపడుతున్నారు.

6. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలకు శుక్రవారం సంప్రదాయరీతిలో శ్రీకారం చుట్టారు. ఆలయ ఉద్ఘాటన పర్వాల అనంతరం ప్రధానాలయంలో స్వయంభువుడు పాంచ నారసింహుడి జయంతి వేడుకలు తొలిసారిగా నిర్వహిస్తున్నారు. వేకువజామున స్వయంభువులను మేల్కొలిపిన అర్చకులు నిజాభిషేకంనిత్యార్చనలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా తిరువేంకటపతి నాథుడిగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో విశ్వక్సేనుడికి తొలిపూజలతో నృసింహ జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

7. నెల్లూరు: జిల్లాలోని రాపూరు మండలంలో పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామి వారికి సింహ వాహన సేవ నిర్వహించారు. రాత్రి ప్రధాన ఘట్టమైన (నృసింహుని జయంతి) బంగారు గరుడ వాహనంపై భక్తులకు శ్రీపెనుశిల లక్ష్మీనృసింహస్వామి దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవార్లకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు

8. ఉత్త‌రాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అయితే ఆ యాత్ర‌కు వెళ్లిన భ‌క్తుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 31 మంది మృతిచెందిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. మే 3వ తేదీన చార్‌ధామ్ యాత్ర ప్రారంభ‌మైంది. మౌంటేన్ సిక్నెస్‌తో పాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల భ‌క్తులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. హై బీపీ, హార్ట్ అటాక్‌, మౌంటేన్ సిక్నెస్‌తో యాత్రికులు చ‌నిపోయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ డీజీ డాక్ట‌ర్ శైల‌జా భ‌ట్ తెలిపారు. ప్ర‌యాణ మార్గంలో ఉన్న పాయింట్ల వ‌ద్ద హెల్త్ స్క్రీనింగ్ చేప‌డుతున్న‌ట్లు చెప్పారు. రిషికేశ్‌లోని రిజిస్ట్రేష‌న్ సైట్ వ‌ద్ద ప్ర‌యాణికుల‌ను స్క్రీనింగ్ చేస్తున్నారు. పండుకేశ్వ‌ర్ వ‌ద్ద కూడా స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.