DailyDose

ఈ నెల 25న విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ – TNI తాజా వార్తలు

ఈ నెల 25న విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ  – TNI తాజా వార్తలు

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలకు సంబంధించి త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 25న జరుగనున్నది. ఇంతకు ముందు కమిటీ ఒకసారి సమావేశం కాగా.. తాజాగా జరిగే భేటీ రెండోది. కేంద్ర హోంవాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో వర్చువల్‌ విధానంలో భేటీ జరుగనున్నది. సమావేశానికి తెలంగాణ తరఫున ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ పాల్గొనున్నారు.

*శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ ఎల్. శివ శంకర్ నరసరావుపేట, పలనాడు బస్టాండ్ వద్ద గల జిల్లా గ్రంథాలయ సంస్థ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంధాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న పుస్తకాలు వివరాలు, పోటీపరీక్షలకు ఉన్న పుస్తకాలు, మౌలిక సదుపాయాలు పై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బల్లలు, విద్యుత్ సరఫరా అంశములను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయాలని దానికి సంబంధించి జాబితాను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపించాలని తదనుగుణంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. గ్రంథాలయంలో ఫ్లోరింగ్ సరిగా లేకపోవడం గుర్తించిన ఆయన వెంటనే మరమ్మతులు చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. గ్రంథాలయానికి వచ్చిన విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లకుండా ఉండేలా వారికి అవసరమైన అన్ని వసతులు, పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మండల రెవెన్యూ అధికారి శ్రీ రమణ నాయక్, గ్రంథాలయ సంస్థ సిబ్బంది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

*కరోనా కారణంగా దాదాపుగా రెండేళ్ల నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందుకోసం దేశంలో రాష్ట్రాలకు కేంద్రం ధాన్యం లేదా, డబ్బులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ధాన్యం పండించే రాష్ట్రం కావడంతో కేంద్రం నుంచి నగదు తీసుకుంటుంది. ఉచిత బియ్యం పంపిణీ మార్చిలోనే ముగియాల్సింది ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఇంకో ఐదు నెలల వరకు పెంచింది. కానీ, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర నిల్వ చేసిన బియ్యం లేకపోవడంతో ఏప్రిల్ నుంచి ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసింది. గతంలో మే నెలలో మళ్ళీ ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కానీ, మే నెల వచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో ఇప్పుడు కూడా ఉచిత బియ్యం ఇవ్వడం కుదరదని డీలర్లు తేల్చి చెప్పారు.

*గడిచిన 75 ఏండ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన తెలంగాణ బీసీ స్టడీసర్కిల్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీల సర్వతోముఖాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. బీసీల కోసం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌కు బీసీలు రుణపడి ఉంటారని వెల్లడించారు.

*దేశ రాజ‌ధాని ఢిల్లీ గ‌త రెండు రోజుల నుంచి మండిపోతోంది. భానుడి భ‌గ‌భ‌గ‌తో న‌గ‌రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఇవాళ మ‌రింత తీవ్ర స్థాయిలో ఎండ‌లు ఉండ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఐఎండీ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. న‌గ‌రంలోని కొన్ని చోట్ల ఇవాళ 46 లేదా 47 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐఎండీ పేర్కొన్న‌ది. స‌ఫ్‌దార్‌జంగ్ అబ్జ‌ర్వేట‌రీ వ‌ద్ద‌ శుక్ర‌వారం అత్య‌ధికంగా 42.5 డిగ్రీలు న‌మోదు అయింది. ఇక న‌జ‌ఫ్‌గ‌ర్‌లో శుక్ర‌వారం అత్య‌ధికంగా 46.1 డిగ్రీల సెల్సియ‌స్ న‌మోదైంది. జ‌ఫార్‌పూర్‌, ముంగేశ్‌పూర్‌లో అత్య‌ధికంగా 45.6 డిగ్రీలు న‌మోదు అయ్యాయి. ఢిల్లీలోని పీతాంపుర‌లో కూడా రికార్డు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. అక్క‌డ 44.7 డిగ్రీలు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. ఆదివారం కోసం కూడా ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. వ‌చ్చే వారం మ‌బ్బులు నిండిన ఆకాశం, చిరు జ‌ల్లుల వ‌ల్ల కొంత ఊర‌ట ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ ఏడాది వేస‌విలో ఇది అయిదో హీట్‌వేవ్‌. మార్చిలో ఓసారి భారీ ఎండ‌లు కొట్టాయి. ఆ త‌ర్వాత ఏప్రిల్‌లో మూడుసార్లు అధిక ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అయ్యాయి.

*ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద స్థ‌లిని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ శ‌నివారం ప‌రిశీలించారు. ప్ర‌మాదం ఎలా జ‌రిగిందని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ అగ్ని ప్ర‌మాదంపై మెజిస్టీరియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అగ్ని ప్ర‌మాదానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని బాధిత కుటుంబాల‌కు హామీ ఇచ్చారు.

*జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అడవిలో తప్పిపోయిన మహిళ ఆచూకీ లభించింది. భూపాలపల్లి మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారి శిరీష.. రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు అడవిలోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తప్పిపోయింది. దీంతో రెండు రోజులుగా స్థానికులు, పోలీసులు, అటవీ సిబ్బంది అడవిలో గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ కోసం డ్రోన్‌ కెమెరాల సాయంతో వెతికారు.

*కెనడాలోని Ontario provincial polls బరిలో ఏకంగా 20 మంది పంజాబీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అక్కడి మొత్తం 123 నియోజకవర్గాలకు జూన్ 2న పోలింగ్ జరగనుంది. ఇక కెనడాలో పంజాబీల సంఖ్య అధికంగా ఉంటదనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశ రాజకీయాల్లో మనోళ్లు కీలక పాత్రం పోషిస్తున్నారు. పలు కీలక పదవుల్లో భారత సంతతి వారే ఉన్నారు. దీంతో ఆ దేశానికి చెందిన మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (NDP), ప్రోగ్రెసివ్ కన్జర్వేటివ్ పార్టీ (PC), లిబరల్స్ పంజాబీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో పంజాబీలే అత్యధికంగా కలిపిస్తుంటారు.

*కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవికి అహ్మద్ అలీ ఖాన్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… డీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతోనే డిసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీలో చేరాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదని… కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. లోకల్ ఎలక్షన్స్‌లో తనకు పార్టీ సపోర్ట్ చేయలేదని కాంగ్రెస్ నేత అహ్మద్ అలీ ఖాన్ అన్నారు.

*వరి ధాన్యం, ఉప్పు బియ్యం కొనుగోలు విషయంలో తెలంగాణ వర్సెస్ కేంద్ర ప్రభుత్వాలుగా పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మ‌రో 6.5 లక్షల మెట్రిక్ ట‌న్నుల ఫోర్టిఫైడ్‌ పారా బాయిల్డ్ బియ్యం సేక‌రించాల‌ని మోదీ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన రూపంలో కేంద్ర ఆహార‌, ప్రజా పంపిణీ వ్యవ‌హారాల మంత్రిత్వ శాఖ‌ తెలిపింది. బియ్యం భార‌త ఆహార సంస్థ (FCI) కు ఇవ్వాల‌ని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం స‌మాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొన్నది.

*రాజధాని గ్రామాలలో బీజేపీ ఎంపీ జీవిఎల్ పర్యటిస్తున్నారు. వెంకటపాలెం గ్రామం వద్ద జీవీఎల్‌కు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. మందడంలోని టిడ్కో ఇళ్లను సందర్శించి బీజేపీ ఎంపీ అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిడ్కో ఇళ్లకు రంగుల వివాదంపై ఎంపీ జీవీఎల్ ఆరా తీశారు.

*దేశంలో పెరుగుతున్న గోధుమల ధరలకు కళ్లెం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని శుక్రవారం పొద్దుపోయాక ప్రకటించింది. ఇప్పటికే జారీ అయిన లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌కు మాత్రమే ఎగుమతులను అనుమతిస్తామని తెలిపింది.

*యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. “షేక్ ఖలీఫా బిన్ జాయెద్ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధగా ఉంది” అని మోదీ ట్వీట్ చేశారు. దివంగత యూఏఈ ప్రెసిడెంట్ గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు అని కొనియాడారు. అతని ఆధ్వర్యంలో భారత్-యూఏఈ సంబంధాలు అభివృద్ధి పథంలో కొనసాయని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయ సమాజం యూఏఈ ప్రజలతో ఉన్నారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని ప్రార్థించారు. భారత విదేశాంగ శాఖమంత్రి ఎస్ జైశంకర్ కూడా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు.

*భీమవరం తాడేరు వంతెన వద్ద జనసేన శనివారం ఉదయం ఆందోళనకు దిగింది. వంతెన శిథిలావస్థకు చేరి రెండు సంవత్సరాలైనా నిర్మాణం చేపట్టకపోవడంపై జనసేన నిరసన చేపట్టింది. కనీసం 108 వెళ్లే పరిస్థితి కూడా లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*విజయవాడ: నగరంలోని విద్యార్థి సంఘాల రాజ్ భవన్(Raj Bhavan) ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గాంధీ నగర్ అలంకార్ సెంటర్ వద్ద విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం.. తోపులాట జరిగింది. చివరకు విద్యార్థి సంఘ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య ఆనందరావును రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

*2021-22 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులకు మే 14 చివరి పని దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల.జూన్-28 నుంచి టీచర్స్ స్కూల్స్ కి అటెండ్ కావాలి -స్కూల్ రెడీనేస్ కోసం 2022 జులై 4న (విద్యార్థులకు) పునఃప్రారంభం కానున్న పాఠశాలలు.

*కాంగ్రెస్ నేతలు ‘చింతన్ శివిర్’ పేరుతో ఉదయ్‌పూర్‌లో సమావేశాలు నిర్వహిస్తుండగా, గుజరాత్ బీజేపీ సైతం ‘మేథోమథన సదస్సు’ కు సన్నద్ధమవుతోంది. అహ్మదాబాద్‌ శివార్లలోని గోల్ఫ్ రిసార్ట్‌లో ఆది, సోమవారం ఈ సమావేశాలను నిర్వహించనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పర్యావరణం-అడవులు-వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపిందర్ యాదవ్‌, గుజరాత్‌ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ సిన్హ్ వాఘేలా, భార్గవ్ భట్, వినోద్ చావ్డా, రజనీ పాటిల్ సహా 35 నుంచి 40 మంది ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు.

*నిధుల సమీకరణలో విఫలమైన రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌, బస్సు ఛార్జీలు పెంచి ప్రజలపై మరిన్ని భారాలు మోపనుందని అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. సేలం జిల్లా ఆతూర్‌ సమీపం బుద్ధిరగౌండంపాళయంలో మురుగన్‌ ఆలయాన్ని శుక్రవారం కుటుంబసమేతంగా దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలు 70 శాతం డీఎంకే ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఆస్తి పన్ను 200 శాతం పెంచిన డీఎంకే, ప్రతి ఏడాది పన్ను పెంచుతామని ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని చెబుతూ త్వరలో విద్యుత్‌, బస్సు ఛార్జీలు పెంపునకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో రోడ్డు రవాణా సౌకర్యం పెరగాలన్న లక్ష్యంతో చెన్నై-సేలం మధ్య ఎనిమిది రహదారులతో కూడిన గ్రీన్‌ హైవే చేపట్టామన్నారు. అప్పడు ఆ ప్రాజెక్ట్‌కు డీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలు వ్యతిరేకించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాయని, ప్రస్తుతం అదే ప్రాజెక్ట్‌ డీఎంకే హయాంలో ప్రారంభం కానుండగా మిత్రపక్షాలు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువై ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేరాల అదుపుకు చర్యలు చేపట్టడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఈపీఎస్‌ డిమాండ్‌ చేశారు.

*సుప్రసిద్ధ శైవక్షేత్రం పళని పర్వతాలయానికి భక్తులను తీసుకెళ్లే మూడో ఎలక్ట్రికల్ వించ్‌ మరమ్మతులు శుక్రవారం తో ముగిశాయి. ఆ వించ్‌ పనితీరును భద్రతాధికారులు పరిశీలించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. పళని ఆలయానికి కొండదిగువ నుంచి భక్తులను తరలించేందుకు రోప్‌కారు, మూడు ఎలక్ట్రికల్ వించ్‌లను ఉపయోగిస్తున్నారు.
భద్రతావిభాగం అధికారులు నెలకొకసారి రోప్‌కారును, వించ్‌లను పరిశీలించడం ఆనవాయితీ. ఇటీవల వీటిని పరిశీలించినప్పుడు మూడో ఎలక్ట్రికల్ వించ్‌ ఇనుప దారం బాగా దెబ్బతినడం గమనించారు. దీంతో ఆ మూడో వించ్‌కు మరమ్మతులు చేపట్టారు. ఆ వించ్‌కు కొత్తగా ఇనుప తాడు బిగించి మరమ్మతులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈ వించ్‌లో పంచామృతం డబ్బాలు ఎక్కించి ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. కొండదిగువ నుంచి పర్వతాలయం వరకూ ఈ వించ్‌ సక్రమంగా నడవటంతో భద్రతా విభాగం అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మూడో ఎలక్ట్రికల్ వించ్‌ను ఒక రెండు రోజుల్లోగా ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. తుఫాన్, వరదల కారణంగా జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి, తక్షణమే రైతాంగానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల అసని తుఫాన్ వల్ల రైతులకు చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. దాదాపు ఎకరాకు రూ.50 వేల నుండి లక్ష వరకు నష్టం జరిగిందన్నారు. 2021 నవంబర్ 18 నుండి 23 వరకు కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి లక్షలాది ఎకరాల్లో పంట నష్టంతోపాటు 65 మందికి పైగా చనిపోయారని లేఖలో తెలిపారు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు తెగిపోవటం, ఇళ్లు కూలిపోవడం, వాగులు వంకలు పొంగి పొరలటం జరిగిందన్నారు. 6 మాసాలు గడిచినప్పటికీ పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పటివరకు అందలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధలు పట్టించుకోకపోవడం తగదన్నారు. తుఫానులు, వరదల బీభత్సం వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి, తగు నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు

*గుంటూరు: జిల్లాలోని పోస్టల్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ప్రజలు పొదుపు సొమ్ము రూ.26 లక్షలు లబ్దిదారుల అకౌంట్‌లో జమ చేయకుండా ఉద్యోగి సొంత అవసరాలకు వాడుకున్నాడు. విషయాన్ని గుర్తించిన అధికారులు సబ్ పోస్ట్ మాస్టర్ శివకాంత్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంపై డివిజనల్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఉద్యోగి శివకాంత్‌పై అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

*కరోనా కారణంగా దాదాపుగా రెండేళ్ల నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఇందుకోసం దేశంలో రాష్ట్రాలకు కేంద్రం ధాన్యం లేదా, డబ్బులు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ధాన్యం పండించే రాష్ట్రం కావడంతో కేంద్రం నుంచి నగదు తీసుకుంటుంది. ఉచిత బియ్యం పంపిణీ మార్చిలోనే ముగియాల్సింది ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఇంకో ఐదు నెలల వరకు పెంచింది. కానీ, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దగ్గర నిల్వ చేసిన బియ్యం లేకపోవడంతో ఏప్రిల్ నుంచి ఉచిత బియ్యం పంపిణీ నిలిపివేసింది. గతంలో మే నెలలో మళ్ళీ ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కానీ, మే నెల వచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో ఇప్పుడు కూడా ఉచిత బియ్యం ఇవ్వడం కుదరదని డీలర్లు తేల్చి చెప్పారు.

* శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ ఎల్. శివ శంకర్ నరసరావుపేట, పలనాడు బస్టాండ్ వద్ద గల జిల్లా గ్రంథాలయ సంస్థ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంధాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న పుస్తకాలు వివరాలు, పోటీపరీక్షలకు ఉన్న పుస్తకాలు, మౌలిక సదుపాయాలు పై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బల్లలు, విద్యుత్ సరఫరా అంశములను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయాలని దానికి సంబంధించి జాబితాను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపించాలని తదనుగుణంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. గ్రంథాలయంలో ఫ్లోరింగ్ సరిగా లేకపోవడం గుర్తించిన ఆయన వెంటనే మరమ్మతులు చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. గ్రంథాలయానికి వచ్చిన విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లకుండా ఉండేలా వారికి అవసరమైన అన్ని వసతులు, పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మండల రెవెన్యూ అధికారి శ్రీ రమణ నాయక్, గ్రంథాలయ సంస్థ సిబ్బంది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

*పుట్టపర్తిలో ఉజ్వల ఫౌండేషన్ లో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తోన్నాయి. అలాగే కోట్ల రూపాయల విలువైన భూమి చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం మలుపులు తిరుగుతుంది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల పాత్రపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంలో ఉజ్వల ఫౌండేషన్ ఎండీ రమేష్ సుబ్రహ్మణ్యం తెరపైకి వచ్చినట్లు తెలిసింది. పూర్తి ఆధారాలు త్వరలో వెల్లడిస్తానని రమేష్ సుబ్రహ్మణ్యం చెప్పినట్లు కూడా తెలిసింది. ఉజ్వల ఫౌండేషన్ భూ అక్రమాలపై సీఎం కార్యాలయ అధికారులు ఆరా తీస్తున్నారు.

*విద్య, ఉద్యోగ, వ్యాపార, పర్యాటక అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి కొవిడ్‌టీకా బూస్టర్‌ డోసును అందించే వ్యవధిని కేంద్ర ఆరోగ్యశాఖ తగ్గించింది. రెండో డోసును తీసుకున్న 3 నెలల విరామం తర్వాత బూస్టర్‌ను వేయించుకోవచ్చని ప్రకటించింది. ఈమేరకు కొవిన్‌ పోర్టల్‌లో మార్పులు చేస్తామని వెల్లడించింది. మిగతా వారంతా రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత బూస్టర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

* జమ్మూ-కశ్మీర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సుకు నిప్పంటుకోవడంతో నలుగురు మరణించగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని వారంతా మాతా వైష్ణోదేవి ఆలయ సందర్శన కోసం వెళ్తున్న భక్తులే. కాట్రాలోని బేస్‌ క్యాంపు వద్దకు వెళ్తుండగా, అక్కడి శని దేవుని మందిరం వద్ద ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. ఇందుకుగల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని స్థానికుల సాయంతో మంటలు ఆర్పారు.విద్రోహ చర్య కారణం కావొచ్చన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను జమ్మూలోని నారాయణ ఆస్పత్రికి తరలించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రకటించారు.

*భూమి దిశగా భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. దాదాపు 1600 అడుగుల వెడల్పు కలిగిన 388945(2008 టీజెడ్‌3) అనే ఆ శకలం ఈ నెల 16న భూమికి అతి సమీపం నుంచి దూసుకుపోతుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. 2020 మే నెలలో కేవలం 17లక్షల కిలోమీటర్ల దూరంలో ఇది భూమి సమీపం నుంచి వెళ్లిందని వివరించింది. అమెరికాలోని ఎంపైర్‌ స్టేట్‌ భవనం, పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే ఇది చాలా పెద్దదని పేర్కొంది. భూమికి అత్యంత సమీపంలో కేవలం 25లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది దూసుకుపోనుందని స్పష్టం చేసింది. అంతరిక్ష లెక్కల్లో ఇది చాలా తక్కువ దూరమని, అందుకే దానిపై ఓ కన్నేసి ఉంచామని చెప్పింది. తిరిగి 2024 మే నెలలో, ఆ తర్వాత 2163లో భూమికి సమీపంలోకి వస్తుందని నాసా వెల్లడించింది.

*జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని, కశ్మీర్‌ పండిట్‌ రాహుల్‌ భట్‌పై కాల్పులు జరిపి హత్య చేసింది ఆ ఉగ్రవాదులేనని భావిస్తున్నామని జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ ఓ జాతీయ మీడియాకు తెలిపా రు. బుడ్గాం జిల్లా చదూరా గ్రామంలోని తహసీల్దారు కార్యాలయంలోకి గురువారం చొరబడిన ఉగ్రవాదులు రాహుల్‌ భట్‌(35) అనే కశ్మీరీ పండిట్‌పై కాల్పులు జరి పి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యపై జ మ్మూకశ్మీర్‌లోని బుడ్గాంలో శుక్రవారం కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. శ్రీనగర్‌ విమానాశ్రయం వైపునకు వారు నిరసన ప్రదర్శనగా వెళ్లసాగారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేసి, టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. కాగా, కశ్మీరీ పండిట్ల నిరసనకు మద్ద తు తెలిపేందుకు వెళ్లాలనుకున్న తనను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారంటూ జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్‌ చేశారు. నిరసన ప్రదర్శనకు దిగిన కశ్మీరీ పండిట్లను అణచివేయాలనుకోవడం సిగ్గుచేటని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. తన భర్తను చంపేందుకు తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో చేతులు కలిపి కుట్ర పన్ని ఉండొచ్చని రాహుల్‌ భట్‌ భార్య మీనాక్షి భట్‌, తండ్రి బిట్టా భట్‌ ఆరోపించారు. రాహుల్‌ భట్‌ హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జమ్మూకశ్మీర్‌ అధికారులు తెలిపారు. రాహుల్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.

*పదవులను భర్తీ చేయకపోవడంతో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)మొత్తం కుప్పకూలిందని శుక్రవారం సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. కొత్తవారిని నియమించే వరకు ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలాన్ని తాత్కాలికంగా పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘‘మొత్తం ట్రైబ్యునల్‌ బెంచ్‌లకు 69 సభ్యుల పోస్టులను కేటాయించగా ప్రస్తుతం 27 మందే ఉ న్నారు. ఒక ఛైర్మన్‌, మరో 42 మంది సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. కొత్తవారిని నియమించడం లేదు. మిగిలిన ఆ 27 మంది కూడా పదవీ విరమణ చేస్తే మొత్తం ట్రైబ్యునల్‌ కుప్పకూలుతుంది’’ అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీ కాలాన్ని పొడిగించాలని ఆదేశించింది. అడ్మినిస్ర్టేటివ్‌, జ్యుడీషియల్‌ సభ్యులు రిటైరైన తరువాత వారి సమ్మతి తీసుకొని పదవీ కాలాన్ని పొడిగించాలని సూచించింది. కొత్త సభ్యులను నియమించే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. తదుపరి విచారణను ధర్మాసనం జులై 26కు వాయిదా వేసింది.

*ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌ లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను ( తప్పనిసరి చేయనున్నారు. ఈమేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా శుక్రవారంనాడు సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయగీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని అన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ యూపీ తరహాలో నిర్ణయం తీసుకోనున్నారనే అనే మీడియా ప్రశ్నకు, ఇది కచ్చితంగా పరిశీలించాల్సిన అంశమేనని, పరిశీలిస్తామని మంత్రి సమాధానమిచ్చారు.

*ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో ఆల్‌ నైన్స్‌ (TS09-FV 9999) నెంబర్‌కు భారీ ధర పలికింది. రూ.4,49,999 (నాలుగున్నర లక్షలు) చెల్లించి వాహనదారుడు రాజశేఖర్‌రెడ్డి ఆ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. TS09-FW 0001 నెంబర్‌ను శ్రీనిధి ఎస్టేట్స్‌ సంస్థ రూ.4 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. శుక్రవారం జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.33.58 లక్షల ఆదాయం వచ్చినట్లు రవాణా శాఖాధికారులు వెల్లడించారు.
*బంజారాహిల్స్‌లోని మింక్‌ అండ్‌ ఫుడింగ్‌ ఘటనతో పబ్‌లు, బార్లపై సిటీ సీపీ దృష్టి సారించారు. డ్రగ్స్‌ మూలాలను అణచివేసే చర్యల్లో భాగంగా పబ్‌లు, బార్‌ల యజమానులతో సీపీ సీవీ ఆనంద్‌ శుక్రవారం సమావేశమయ్యారు. డ్రగ్స్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్బుల నుంచి అధికస్థాయిలో ధ్వనులు వెలువడుతున్నట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, సౌండ్‌ ప్రూఫ్స్‌ వాడాలని యజమానులకు సూచించారు. రహదారులపై పార్కింగ్‌, బార్లు, పబ్బుల నుంచి మద్యం తాగి బయటకు వచ్చిన కొందరు రహదారులపై వెళ్లే వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి అంశాలను సీపీ ప్రస్తావించారు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం కొనసాగించాలని సమావేశానికి హాజరైన క్లబ్‌, పబ్‌, బార్ల యజమానులకు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

*పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలకు సీనియర్‌ అధికారులను నియమించారు. పరీక్షలు సవ్యంగా జరిగే విధంగా ఈ అధికారులు చర్యలు చేపడతారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరగను న్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. సీనియర్‌ అధికారులు.. జిల్లా స్థాయిలోని అన్ని విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించి, అవసరమైన నిర్ణయాలను తీసుకుంటారు. మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ, నారాయణపేట జిల్లాలకు హైదరాబాద్‌లోని రీజనల్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మిని నియమించారు.
*రిట్‌ అధికార పరిధిలో భూమికి సంబంధించిన టైటిల్‌ వివాదాన్ని తేల్చడం సాధ్యంకాదని హైకోర్టు పేర్కొంది. వివాదంలో ఉన్న భూమి యాజమాన్య హక్కులను నిరూపించుకోవడానికి సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని ఏడో నిజాం స్థాపించిన ఫెర్న్‌ హిల్‌ ట్రస్ట్‌కు స్పష్టంచేసింది. ఏడో నిజాం తన భార్య లైలా బేగంకు జన్మించిన ఏడుగురు సంతానం ప్రయోజనాల కోసం 1957లో ఫెర్న్‌ హిల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం గ్రామంలో 25 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. ఇందులో 3.08 ఎకరాల భూమిని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, దూరదర్శన్‌లు టీవీ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ ఏర్పాటు కోసం సేకరించాయి. 1976 నుంచి భూమి కేంద్రం ఆధ్వర్యంలో ఉంది. అయితే ఆ భూమికి పరిహారం చెల్లించలేదని ఫెర్న్‌ హిల్‌ ట్రస్ట్‌ 2002లో హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్‌ జడ్జి ధర్మాసనం ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ట్రస్ట్‌ డివిజన్‌ బెంచ్‌లో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై తాజాగా చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమిని ట్రస్ట్‌ డీడ్‌లో చేర్చారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సరైన కోర్టును ఆశ్రయించి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలని తెలిపింది. ఈ మేరకు సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థిస్తూ ఫెర్న్‌ హిల్‌ ట్రస్ట్‌ అప్పీల్‌ను కొట్టేసింది.

*కృష్ణా నదీ జలాల్లో సాగు నీటి వినియోగానికి సంబంధించిన వివాదంపై విచారణను బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ జూలై 13, 14, 15వ తేదీలకు వాయిదా వేసింది. తెలంగాణ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి, ఈ విచారణ మే 18, 19వ తేదీల్లో జరగాల్సి ఉంది. సాగు నీటి వినియోగంపై తెలంగాణ అఫిడవిట్‌ వేయగా. రాష్ట్రం తరపున పళినిస్వామి సాక్షిగా ఉన్నారు. పళినిస్వామి విచారణకు హాజరయ్యే పరిస్థితిలో లేనందున వాయిదా వేయాలని తెలంగాణ అభ్యర్థించింది. ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌ ప్రోటోకాల్‌, రూల్‌కర్వ్‌పై వేసిన మరో అఫిడవిట్‌లో సీడబ్ల్యూసీ మాజీ అధికారి చేతన్‌ పండిట్‌ సాక్షిగా ఉన్నారు. చేతన్‌ పండిట్‌ను త్వరలోనే ట్రైబ్యునల్‌లో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు.

*తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సమావేశమైంది. బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలో సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్‌ నూలి, కె.కిషోర్‌ గౌడ్‌ శుక్రవారం సచివాలయంలో సీఎం స్టాలిన్‌తో సమావేశమయ్యారు. తమిళనాడులో చేపట్టిన కులగణన, రిజర్వేషన్ల అమలు తీరుతెన్నుల అధ్యయనానికి బీసీ కమిషన్‌ అక్కడ పర్యటిస్తోంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించింది.

*‘‘సీఎం జగన్‌ పాలనలో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరు. వారంతా తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయి. మా పార్టీకి ప్రజలు ఎప్పుడో దూరమయ్యారు. ఈ విషయాన్ని గ్రహిస్తే పార్టీకి మంచిది. లేకపోతే ప్రజలకు మంచిది. సజ్జల పేర్కొన్నట్లుగా ప్రశ్నించే ప్రజలంతా టీడీపీ వారైతే నూటికి 90 శాతం మంది ప్రధాన ప్రతిపక్షం వైపే ఉన్నట్లు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడం, చట్టాలను పట్టించుకోకపోవడం, రాతి యుగం నాటి అధ్వానపు రోడ్లు, విద్యుత్తు సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడడం… ఇదేనా సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రవచించే రాజన్న రాజ్యం? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు తనకు అందలేదంటూ నిలదీసిన ఒక వ్యక్తికి మంత్రి అమర్‌నాథ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు వార్నింగ్‌ ఇవ్వడానికే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిందా? విద్యా దీవెన, విద్యా వసతి బోగస్‌ పథకాలు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తమ వద్దకు వచ్చే అధికారులను, శాసనసభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు వీటిపై నిలదీయాలన్నారు.

*వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న మొబైల్‌ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఆ రోజు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ దీనిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్‌ కింద తొలి విడత 175వాహనాల ద్వారా పశుపోషకుల ఇంటి వద్దే పశువైద్య, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు

*నకిలీ ఎరువుల తయారీ కేంద్రాలపై వ్యవసాయశాఖ వరుస దాడులు నిర్వహిస్తోంది. గన్నవరం మండలం సూరంపల్లి, విజయవాడ శివారు జగ్గంపూడిలోనూ నకిలీ ఎరువుల తయారీ గోదాముల్లో వ్యవసాయశాఖ శుక్రవారం తనిఖీలు చేసింది. నకిలీ ఎరువుల ముడిపదార్థాల నమూనాలు, కొన్ని పత్రాలను సేకరించి విచారణకు ఉపక్రమించింది. దీనికి సంబంధించి ఒక బయో కంపెనీ యజమాని పరారీలో ఉన్నట్లు గుర్తించారు.

*జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీఎ్‌ఫఐ) 8వ జాతీయ మహాసభలు ఈ నెల 20 నుంచి 23 వరకు విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ సభలకు సంబంధించిన కరపత్రాన్ని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న 30ఉపాధ్యాయ సంఘాలు హాజరవుతాయని తెలిపారు. 20వ తేదీన విజయవాడలో టీచర్ల మహార్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు. కాగా, సీపీఎస్‌ స్థానంలో పాత పింఛను విధానాన్ని అన్ని రాష్ట్రాల్లోనూ అమలుచేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, జాతీయ పింఛను సాధన ఉద్యమ నాయకుడు రామాంజనేయ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

*కొవిడ్‌ సమయంలో మరణించిన ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం కింద గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చినా చేరేందుకు సిద్ధమని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ నేత ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌లో మరణించిన ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల కుటుంబాల్లోని వారికి మళ్లీ ఉపాధ్యాయులుగానే అవకాశం ఇవ్వాలని, అయితే ఇలా చనిపోయిన 169మందిలో ఏ ఒక్కరి కుటుంబానికీ ఇంకా ఉద్యోగం ఇవ్వలేదని తెలిపారు.
*రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటి విడతలో 45 పురపాలక, నగరపాలక సంస్థల్లో గ్రీన్‌సిటీ చాలెంజ్‌ను ప్రతిపాదించినట్లు మున్సిపల్‌శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మున్సిపల్‌ కమిషనర్ల వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ గుర్తించిన పట్టణ స్థానిక సంస్థల్లో ప్రధాన, మీడియం రహదారుల్లో సెంట్రల్‌ మీడియన్స్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు.
*ఆవనూనె దిగుమతులపై దిగుమతి సుంకం తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
వంట నూనెల కొరత నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌కు శుక్రవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం ముడి ఆవ నూనెపై 38.5శాతం, శుద్ధిచేసిన ఆవనూనెపై 45శాతం దిగుమతి సుంకం ఉందని తెలిపారు. ఆవనూనె దిగుమతికి ఈ సుంకాలు ప్రతిబంధకంగా మారాయని పేర్కొన్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కనీసం ఏడాదికాలం పాటు దిగుమతి సుంకం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

* రోడ్డు అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ)ల నిర్మాణంలో విజయవాడ రైల్వే డివిజన్‌ రికార్డు సృష్టించింది. నాలుగు గంటల్లోనే ఆరు ఆర్‌యూబీలు నిర్మించి ఔరా.. అనిపించింది. విజయవాడ-దువ్వాడ సెక్షన్‌లో మానవ సహిత లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించేందుకు విజయవాడ రైల్వే డివిజన్‌ ఆరు ఆర్‌యూబీల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ సెక్షన్‌లో కేవలం నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ను బ్లాక్‌ చేసి ఆరు ఆర్‌యూబీలను దిగ్విజయంగా ఏర్పాటు చేసింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ ఆర్‌సీ బాక్సులను ఆరు చోట్ల ఏకకాలంలో అమర్చడం ద్వారా ఈ ఘనతను సాధించింది. స్వర్ణ చతుర్భుజి మార్గాలలో విజయవాడ-దువ్వాడ సెక్షన్‌ ఒకటి. ఈ మార్గంలో లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్న గుల్లిపాడు-పిఠాపురం, హంసవరం-తుని, తుని-గుల్లిపాడు, ఎలమంచిలి-నర్సింగపల్లి, నర్సీపట్నం-రేగుపాలెం, తుని-గుల్లిపాడుల మధ్య ఆర్‌యూబీలను తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించిన రికార్డు నెలకొల్పింది. *భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగనయాన్‌ ప్రయోగంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రయోగానికి ఉపయోగించనున్న లాంచ్‌ వెహికల్‌ మాడ్యూల్‌-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్‌ హెచ్‌ఎ్‌స-200కు శుక్రవారం ఇస్రో నిర్వహించిన భూస్థిర పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీ్‌షధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఈ పరీక్ష జరిగింది. 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెచ్‌ఎ్‌స-200 బూస్టర్‌లో 203 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి షార్‌లోని ఎస్‌ఎంపీసీ విభాగంలో భూస్థిర పరీక్షను నిర్వహించారు.

* రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్‌-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జూన్‌ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుంతో జూలై తొమ్మిదో తేదీ వరకు స్వీకరిస్తామని, ఇతర వివరాల కోసం ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ జ్ట్టిఞట://ఛ్ఛ్టిట. ్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ చూడాలని ఆయన కోరారు. కాగా జూలై 25న ఐసెట్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

*రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ పదవీకాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. ఇప్పటికే రిటైర్మెంట్‌ వయసు తర్వాత రెండు విడతలుగా ఆరు నెలలు పొడిగింపు లభించగా.. ఇప్పుడు ఒకేసారి ఆరు నెలలు అవకాశం దక్కింది. దీంతో నవంబరు వరకు ఆయనే సీఎ్‌సగా కొనసాగనున్నారు. పదవీవిరమణ తర్వాత ఏడాది కాలం పాటు సీఎ్‌సగా కొనసాగే అవకాశం ఇటీవలి కాలంలో సమీర్‌ శర్మకు మాత్రమే దక్కింది. గతంలో పనిచేసిన సీఎ్‌సలకు మూడు లేదా ఆరు నెలల పాటు మాత్రమే పొడిగింపు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకి మాధవరావు ఒక్కరికే ఏడాది పాటు కొనసాగింపు లభిం చింది.

*దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో ఈ నెల 16 నుంచి యాప్‌ ద్వారా హాజరు నమోదును తప్పనిసరి చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మాన్యువల్‌గా హాజరు నమోదు చేయరాదని పేర్కొంది. ప్రతి 20 మంది అంతకంటే ఎక్కువ మంది కూలీలకు వేస్తున్న మస్టర్లు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం(ఎన్‌ఎంఎంఎ్‌స) యాప్‌ ద్వారా వేస్తేనే వారికి వేతనాలు చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేసింది.

*దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో ఈ నెల 16 నుంచి యాప్‌ ద్వారా హాజరు నమోదును తప్పనిసరి చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మాన్యువల్‌గా హాజరు నమోదు చేయరాదని పేర్కొంది. ప్రతి 20 మంది అంతకంటే ఎక్కువ మంది కూలీలకు వేస్తున్న మస్టర్లు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం(ఎన్‌ఎంఎంఎ్‌స) యాప్‌ ద్వారా వేస్తేనే వారికి వేతనాలు చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేసింది.

*మాతృభాషలో మాట్లాడాలి.. అన్ని భాషలను గౌరవించాలని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, రచయిత్రి సుధామూర్తి అన్నారు. సుధామూర్తి ఆంగ్లంలో రాసిన పుస్తకాన్ని ఆలిండియా రేడియో విశ్రాంత డైరెక్టర్‌ మంజులూరి కృష్ణకుమారి ‘రెండు కొమ్ముల రుషి’ పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకావిష్కరణ సభ శుక్రవారం బంజారాహిల్స్‌లోని ‘సప్తపరిణి’లో జరిగింది. సుధామూర్తితోపాటు సంపాదకులు ఎం.నాగేశ్వరరావు, సీఎం సలహాదారు ఏకే ఖాన్‌, ప్రచురణకర్తలు అశోక్‌కుమార్‌, అరవింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ.. భాష వాహనమైతే వ్యక్తులు డ్రైవర్లు అని అన్నారు. తాను రచించిన 24 పుస్తకాలు తెలుగులో ప్రచురితమయ్యాయని చెప్పారు. భావి తరాలకు భాష, సంస్కృతి, సాహిత్యాలను అందించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్య, సంస్కృతులపై అభిరుచి కల్పించాలన్నారు. తాను రచయితగా మారడంలో తన తల్లి ప్రభావం ఎంతో ఉందని సుధామూర్తి చెప్పారు. చిన్నతనంలో తనను ఏదో ఒక అంశంపై కచ్చితంగా 25 లైన్లు రాయాలని ప్రోత్సహించేదని.. రాస్తేనే భోజనం అని షరతు పెట్టేదన్నారు. తల్లిదండ్రులు ఇలాంటి షరతులతోనే సంస్కృతి, సాహిత్యాలపై అభిరుచి కల్పించాలని సూచించారు. ప్రపంచంలో అన్నీ డబ్బుతో ముడిపడి ఉండవన్నారు. పురాణాలు చదివేందుకు ప్రస్తుత తరం వారికి ఓపిక ఉండడం లేదని.. అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా పుస్తకంలో వివరించానని సుధామూర్తి తెలిపారు. యూట్యూబ్‌, టీవీలు అందరి ఊహాశక్తిని నాశనం చేస్తున్నాయని.. పుస్తక పఠనం ద్వారా అది పెరుగుతుందని సూచించారు. తల్లిదండ్రులను, గురువులను, అతిథులను గౌరవించాలని సూచించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తాను.. అప్పుడు నిరుద్యోగిగా ఉన్న నారాయణమూర్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పారు.

* త్రిపుర కొత్త సీఎంగా డాక్టర్‌ మాణిక్‌ సాహా(69)ను బీజేపీ అధిష్టానం ఖరారుచేసింది. దీంతో ఆయన ముఖ్యయమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.అయితే, సాహా ప్రస్తుతం త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బాధ్యతలతో పాటుగా త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కాగా, ఆయన 2016లో బీజేపీలో చేరారు. ఇక, రాజకీయాల్లోకి రాకముందు త్రిపుర మెడికల్‌ కాలేజీలో డెంటల్‌ ఫ్యాకల్టీగా పనిచేశారు. అంతకు ముందు సీఎంగా ఉన్న బిప్లవ్‌ దేవ్‌ అధిష్టానం ఆదేశాల మేరకు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.