WorldWonders

పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!

పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!

ఆ ఆవుదూడ వయసు 11 నెలలే. ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు. అయినా రోజుకు మూడున్నర లీటర్లు పాలు ఇస్తోంది. ఎక్కడ? ఎలా సాధ్యం?నెలలగర్భం దాల్చకుండానే పాలు ఇస్తున్న ఓ ఆవు దూడ.. కేరళ కన్నూర్​ జిల్లాలో చర్చనీయాంశమైంది. కంగోల్​కు చెందిన సజేశ్​.. 11 నెలల వయసున్న ఈ దూడకు యజమాని. 2021లో ఆవును, దూడను కొనుగోలు చేశాడు. ఆవు పొదుగుకు ఇన్ఫెక్షన్​ సోకగా.. దాన్ని అమ్మేశాడు. దూడను మాత్రం తానే పెంచుతున్నాడు.పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!కొద్దిరోజుల క్రితం ఈ దూడ పొదుగు ఉబ్బిఉండడాన్ని గమనించింది సజేశ్​ పొరుగింటి మహిళ. విషయాన్ని యజమానికి చెప్పింది. సజేశ్ పరిశీలించి చూడగా.. పల్చటి పాలు వచ్చాయి. దూడకు మంచి మేత వేస్తూ.. కొన్నిరోజుల తర్వాత మరోసారి పాలు పితికి చూశాడు సజేశ్. ఈసారి చిక్కటి పాలు వచ్చాయి.పాలు ఇస్తున్న 11 నెలల దూడ- రోజుకు 3.5 లీటర్లు!గత 15 రోజులుగా.. నిత్యం రెండు విడతల్లో ఆ దూడ మూడున్నర లీటర్ల పాలు ఇస్తోంది. అనుమానంతో వాటిని సజేశ్ పరీక్ష చేయించాడు. వాటితో ఏ ఇబ్బందీ లేదని తేలింది. దూడ ఇస్తున్న పాలలో 8.8శాతం వరకు కొవ్వు ఉంటున్నట్లు వెల్లడైంది. అరుదైన సందర్భాల్లో హార్మోన్లలో తేడా కారణంగానే ఇలానే జరుగుతుందని వైద్యులు సజేశ్​కు చెప్పారు.
c1