NRI-NRT

ఘనంగా సౌత్ఆఫ్రికా మహానాడు వేడుకలు

ఘనంగా సౌత్ఆఫ్రికా మహానాడు వేడుకలు

40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుపుకుంటున్న సందర్భంలో లో అన్న ఎన్టీఆర్ ఆర్ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా గా సౌత్ ఆఫ్రికా దేశం లో టిడిపి ఎన్ఆర్ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు 14 మే న జోహనేస్బర్గ్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా మాజీ మంత్రివర్యులు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ జవహర్ గారు మరియు తెలుగుదేశం జనరల్ సెక్రెటరీ శ్రీమతి గౌతు శిరీష హాజరయ్యారు. సౌత్ ఆఫ్రికా లో ఉన్న వివిధ నగరాల నుంచి టిడిపి ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌతు శిరీష మాట్లాడుతూ జన్మభూమి విధానాన్ని ప్రవేశపెట్టి ఇప్పుడు కొనసాగింపుగా GFST గ్లోబల్ ఫారం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక అంశంగా అందరూ గుర్తించి ముందుకు నడిపించాలని పేర్కొంటూ NRI TDP సభ్యత్వాలు మీద గౌతు శిరీష తీర్మానం ప్రవేశ పెట్టారు. జవహర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎన్నారై టిడిపి కార్యకర్త రానున్న ఎన్నికల్లో పార్టీకి అందుబాటులో ఉండాలని అదేవిధంగా పార్టీ కూడా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ టీడీపీ సమస్యల మీద స్పందిస్తుందని తెలియజేస్తూ NRITDP ని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా పార్టీ సంసిద్ధంగా ఉన్నదని పార్టీ భవిష్యత్తులో చేయబోయే సహకారాలు మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జవహర్ గారి పిట్ట కథలతో సభను రక్తికట్టించారు.
Whats-App-Image-2022-05-15-at-8-10-46-PM
ఈ సమావేశం లో ప్రత్యేకంగా zoom ద్వారా NRITDP Cell ఇంఛార్జి చప్పిడి రాజ శేఖర్ మాట్లాడుతూ ఈ విభాగం యొక్క విధి విధానాలను వివరిస్తూ NRITDP సభ్యత్వాలను నమోదు చేసుకోవలసిందే గా కోరారు. అదే zoom lo కొవ్వూరు నుండి దివ్యంగురాలు లావణ్య లక్షి మాట్లాడుతూ తెలుగుదేశం అధికారం లోకి ఎందుకు రావాలో దానికి తానే ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు.
Whats-App-Image-2022-05-15-at-8-10-47-PM-1
ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా ఎన్నారై టిడిపి అధ్యక్షుడు రామకృష్ణ పార మాట్లాడుతూ గతంలో ఎన్నో రకాల సదుపాయాలు ప్రభుత్వాలు అందజేయగా ఇప్పటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో కొమ్మినేని మురళి గుమ్మడి శ్రీరాములు ఇందిరా, రాధా మోహన్, ఆనంద్ మరియు NRITDP సౌత్ ఆఫ్రికా కౌన్సిల్ మెంబర్లు తో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Whats-App-Image-2022-05-15-at-8-10-47-PM-2
Whats-App-Image-2022-05-15-at-8-10-47-PM-3
Whats-App-Image-2022-05-15-at-8-10-47-PM
ఘనంగా సౌత్ఆఫ్రికా మహానాడు వేడుకలు
Whats-App-Image-2022-05-15-at-8-10-48-PM-2
Whats-App-Image-2022-05-15-at-8-10-48-PM-3
Whats-App-Image-2022-05-15-at-8-10-48-PM-2

Whats-App-Image-2022-05-15-at-8-10-48-PM-3