Business

నాసిక్‌లో కిమ్స్‌ హాస్పిటల్‌ – TNI వాణిజ్య వార్తలు

నాసిక్‌లో కిమ్స్‌ హాస్పిటల్‌   – TNI వాణిజ్య వార్తలు

* కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) మహారాష్ట్రలోని నాసిక్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ప్రముఖ అంకాలజీ సర్జన్‌ రాజ్‌ నాగర్కర్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. కిమ్స్‌ మానవత హాస్పిటల్‌ పేరుతో ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రిలో 51 శాతం వాటా కిమ్స్‌కు, 49 శాతం వాటా రాజ్‌ నాగర్కర్‌కు ఉంటుందని కిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ రావు తెలిపారు. 325 పడకలతో ఏర్పాటు చేసే ఈ కొత్త ఆసుపత్రి 2024 మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే వీలుంది. నాసిక్‌లో కొత్త హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మహారాష్ట్రలోకి అడుగు పెడుతున్నాం. సర్జికల్‌ అంకాలజీలో అగ్రగామిగా ఉన్న నాగర్కర్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉందని భాస్కర్‌ రావు చెప్పారు. పెట్టుబడులు త్వరలో వెల్లడిస్తామన్నారు. నాగర్కర్‌ 45 వేలకు పైగా క్యాన్సర్‌ సర్జరీలు చేశారు. 275 పడకల సమగ్ర క్యాన్సర్‌ కేంద్రం హెచ్‌సీజీ మానవత కేన్సర్‌ సెంటర్‌కు అధిపతిగా ఉన్నారు.
*అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డు సృష్టించింది. 10,000 కోట్ల డాలర్ల వార్షికాదాయాన్ని నమోదు చేసుకున్న తొలి భారత కంపెనీగా అరుదైన ఘనత ను నమోదు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) కంపెనీ ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు పెరిగింది. అమెరికన్‌ కరెన్సీలో ఈ విలువ 10,200 కోట్ల డాలర్లకు సమానం. 2021-22కి గాను రిలయన్స్‌ రూ.60,705 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతేకాదు, వాటాదారులకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.8 డివిడెండ్‌ చెల్లించనున్నట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని వ్యాపార విభాగాల్లో కలిపి కొత్తగా 2.1 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కరోనా సంక్షోభ సవాళ్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవ త్సరానికి సమృద్ధికరమైన పనితీరు కనబరచగలిగిందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.
* ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌.. 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం ఏకంగా 64.90 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లుగా నమోదైంది. వడ్డీ ఆదాయాలు గణనీయంగా పెరగటంతో పాటు మొండి పద్దులు తగ్గటం కలిసివచ్చిందని కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎల్‌వీ ప్రభాకర్‌ వెల్లడించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020 -21) ఇదే కాలంలో బ్యాంక్‌ నికర లాభం రూ.1,010,87 కోట్లుగా ఉంది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం కూడా రూ.21,040.63 కోట్ల నుంచి రూ.రూ.22,323.11 కోట్లకు పెరిగింది. కాగా మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.7,005 కోట్లుగా ఉందని ప్రభాకర్‌ తెలిపారు.
*దేశీయ ఐటీ రంగంలో మెగా విలీనం జరగనుంది. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన రెండు ఐటీ కంపెనీలు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ), మైండ్‌ట్రీ ఒక్కటి కాబోతున్నాయి. ఈ విలీన ప్రతిపాదనకు మైండ్‌ట్రీ, ఎల్‌టీఐ బోర్డులు శుక్రవారం ఆమోదం తెలిపాయి. తద్వారా 350 కోట్ల డాలర్ల (రూ.26,600 కోట్లు) వార్షికాదాయ ఐటీ సంస్థగా అవతరించనుంది. అలాగే, విలీనం తర్వాత కంపెనీ పేరు ‘ఎల్‌టీఐమైండ్‌ట్రీ’గా మారనుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా జరగనున్న ఈ డీల్‌లో భాగంగా మైండ్‌ట్రీకి చెందిన ప్రతి 100 షేర్లకు గాను 73 ఎల్‌ అండ్‌ టీ షేర్లను కేటాయించనున్నారు.వచ్చే 9-12 నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా. మెర్జర్‌ తర్వాత ఏర్పడే సంస్థలో ఎల్‌ అండ్‌ టీ 68.73 శాతం వాటా కలిగి ఉండనుంది. విలీనం పూర్తయ్యేవరకు రెండు కంపెనీలు విడివిడిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయని, ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ తెలిపారు.
*డీమార్ట్‌ బ్రాండ్‌తో రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.426.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం (రూ.413.87 కోట్లు)తో పోల్చితే లాభం స్వల్పంగా 3.11 శాతం పెరిగింది. త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 18.55 శాతం వృద్ధితో రూ.7,411.68 కోట్ల నుంచి రూ.8,786.45 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ.8,210.13 కోట్లుగా ఉన్నాయి.
* అమెరికా కేంద్ర బ్యాంక్‌ ‘ఫెడరల్‌ రిజర్వ్‌’ వడ్డీ రేట్ల పెంపు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను బెంబేలెత్తిస్తోంది. ఫెడ్‌ ఒక్కసారిగా వడ్డీ రేట్లు అర శాతం పెంచింది. దీంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఈ నెల 12 నాటికి 99.13 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. 2020 డిసెంబరు తర్వాత ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల మార్కెట్‌ క్యాప్‌ 100 లక్షల కోట్ల డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. గత కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు 22 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.1,705 లక్షల కోట్లు) మార్కెట్‌ క్యాప్‌ నష్టపోయాయి. ఇదే సమయంలో భారత స్టాక్‌ మార్కెట్‌.. మార్కెట్‌ క్యాప్‌ కూడా 3.03 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. దీంతో ఈ ఏడాది మార్చిలో మార్కె ట్‌ క్యాప్‌ పరంగా ప్రపంచంలో ఐదో స్థానంలో ఉన్న భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి ప్రారంభంతో పోల్చినా బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 12.4 శాతం మేర నష్టపోయింది.
*కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) మహారాష్ట్రలోని నాసిక్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ప్రముఖ అంకాలజీ సర్జన్‌ రాజ్‌ నాగర్కర్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. కిమ్స్‌ మానవత హాస్పిటల్‌ పేరుతో ఏర్పాటు చేసే ఈ ఆసుపత్రిలో 51 శాతం వాటా కిమ్స్‌కు, 49 శాతం వాటా రాజ్‌ నాగర్కర్‌కు ఉంటుందని కిమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ రావు తెలిపారు. 325 పడకలతో ఏర్పాటు చేసే ఈ కొత్త ఆసుపత్రి 2024 మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే వీలుంది. నాసిక్‌లో కొత్త హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా మహారాష్ట్రలోకి అడుగు పెడుతున్నాం. సర్జికల్‌ అంకాలజీలో అగ్రగామిగా ఉన్న నాగర్కర్‌తో చేతులు కలపడం సంతోషంగా ఉందని భాస్కర్‌ రావు చెప్పారు. పెట్టుబడులు త్వరలో వెల్లడిస్తామన్నారు. నాగర్కర్‌ 45 వేలకు పైగా క్యాన్సర్‌ సర్జరీలు చేశారు. 275 పడకల సమగ్ర క్యాన్సర్‌ కేంద్రం హెచ్‌సీజీ మానవత కేన్సర్‌ సెంటర్‌కు అధిపతిగా ఉన్నారు.
* మెజారిటీవాదం భారత భవిష్యత్‌కు అత్యంత ప్రమాదకరమని, దాన్ని అడుగడుగునా ప్రతిఘటించాలని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ‘‘దేశంలో మెజారిటీవాద ట్రెండ్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పరిణామాలన్నీ ఆర్థిక పురోభివృద్ధికి విరుద్ధమైనవే’’నని ఓ వెబినార్‌లో ప్రసంగిస్తూ ఆయన హెచ్చరించారు. విమర్శలకు చట్టపరమైన అవరోధాలను తొలగించడం ద్వారా ప్రభుత్వాన్ని విమర్శలకు మరింతగా స్పందించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు
* న్యూజిలాండ్‌కు చెందిన ద ఎనర్జీ కలెక్టివ్‌ (టీఈసీ)కి అనుబంధ సంస్థగా ఉన్న ఎనర్జీ టెక్‌ గ్లోబల్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈసీఐఎల్‌లోని కేంద్ర కార్యాలయంలో, హైటెక్‌ సిటీలో ఉన్న శాటిలైట్‌ కేంద్రంలో అదనపు మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎండీ కిషోర్‌ బొర్రా తెలిపారు. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులుండగా ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు చెప్పారు.
*యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,557.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 22.68 శాతం వృద్ధి చెందింది. స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన 8.26 శాతం వృద్ధితో రూ.1,440 కోట్ల లాభం నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 25.29 శాతం పెరిగి రూ.6,769 కోట్లకు చేరింది.
*యూకో బ్యాంక్‌.. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.312 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.80 కోట్లతో పోలిస్తే 290 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 2021-22 ఏడాది మొత్తానికి రూ.930 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది లాభం రూ.167 కోట్లతో పోలిస్తే 457 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.1,652 కోట్లకు, మొత్తం ఏడాదికి రూ.6,473 కోట్లకు చేరిందని పేర్కొంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022 మార్చి చివరి నాటికి బ్యాంక్‌ మొత్తం వ్యాపా రం 9.1 శాతం వృద్ధితో రూ.3,24,324 కోట్ల నుంచి రూ.3,53,850 కోట్లకు చేరింది.
*దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.9,114 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 క్యూ4లో ఆర్జించిన లాభం రూ.6,451 కోట్లతో పోల్చితే ఇది 41.28 శాతం అధికం. కాగా మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 55.19 శాతం వృద్ధితో రూ.20,401 కోట్ల నుంచి రూ.31,676 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 15.26 శాతం పెరిగి రూ.31,198 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 0.29 శాతం పెరిగి 3.40 శాతంగా నమోదైంది. స్థూల ఎన్‌పీఏలు 3.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.02 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాలు 0.43 శాతానికి తగ్గాయి.
*దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.9,114 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 క్యూ4లో ఆర్జించిన లాభం రూ.6,451 కోట్లతో పోల్చితే ఇది 41.28 శాతం అధికం. కాగా మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 55.19 శాతం వృద్ధితో రూ.20,401 కోట్ల నుంచి రూ.31,676 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 15.26 శాతం పెరిగి రూ.31,198 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 0.29 శాతం పెరిగి 3.40 శాతంగా నమోదైంది. స్థూల ఎన్‌పీఏలు 3.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.02 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాలు 0.43 శాతానికి తగ్గాయి.
*కో లొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, గ్రూప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్ర మణియన్‌ బెయిల్‌ దరఖాస్తులను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. వారికి బెయిలు మంజూరు చేయడానికి తగి న ఆధారాలు లేవని ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు.