DailyDose

శ్రీకాకుళంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య – TNI నేర వార్తలు

శ్రీకాకుళంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య – TNI  నేర వార్తలు

*ఆంధ్రప్రదేశ్‎లో గంజాయి రవాణా ముఠా కలకలం రేపుతోంది. ఏవోబీ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు భూపతిపాలెం జలాశయం దగ్గర స్కార్పియోను వదిలి పరారయ్యారు. కారులో సుమారుగా 300 కిలోల గంజాయిని రంపచోడవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్య చేసుకున్నాడు. రోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*నిద్రమత్తులో ఓ వ్యక్తి మూడో అంతస్థు నుంచి పడి చనిపోయాడు. జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప బ్లాక్ 24, రూమ్ 25లో బండమీది గోపి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రాత్రి 3 గంటల సమయంలో బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

* వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృతనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. నరసింహ(27) అనే వ్యక్తి ముఖంపై కొందరు స్థానికులు పెట్రోలు పోసి నిప్పంటించారు. నరసింహ ముఖం తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి వివాదం.. ఈ దారుణానికి దారి తీసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రొద్దుటూరు గ్రామీణ ఎస్సై సంజీవ రెడ్డి తెలిపారు.

*కుటుంబ కలహాల కారణంగా గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడికొండూరు మండలం తురకాపాలెంలో షేక్ భరన్ చెక్క పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన భార్య ప్రవర్తన సరిగా లేదని, గత ఏడాది నుంచి తరుచూ మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందని షేక్ భరన్ ఆరోపణ. ఆత్మహత్యకు ముందు షేక్ భరన్ సెల్ఫీ వీడియో తీసి అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రోల్‌కాల్‌ నుంచి తిరిగి వచ్చాక పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

*ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పెర్కిట్ శివారులో కంటైనర్-కారు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను స్థానికులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*పలమనేరు గంగమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యంతో భక్తురాలు మృతి చెందింది. ఆలయ క్యూలైన్‌లో మహిళ దర్శనానికి వెళ్తుండగా విద్యుత్‌ వైర్లు తగులడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వర్షం కారణంగా ఆలయంలో విద్యుత్ తీగలు తడవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయ అధికారులపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*నార్కట్‎పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనకనుంచి భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలు కాగా, అందులో 10మందికి తీవ్ర గాయాలు కావడంతో, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు నార్కట్‎పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం నుంచి హైదారాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

*శ్రీకాకుళం.ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్యపోలీ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణంరోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక ఆత్మహత్యకు పాల్పడిన సుబ్బారావు.. శ్రీకాకుళం.ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్య పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణం రోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక ఆత్మహత్యకు పాల్పడిన సుబ్బారావు..

*ఆంధ్రప్రదేశ్‎లో గంజాయి రవాణా ముఠా కలకలం రేపుతోంది. ఏవోబీ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు భూపతిపాలెం జలాశయం దగ్గర స్కార్పియోను వదిలి పరారయ్యారు. కారులో సుమారుగా 300 కిలోల గంజాయిని రంపచోడవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* కుటుంబ కలహాల కారణంగా గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడికొండూరు మండలం తురకాపాలెంలో షేక్ భరన్ చెక్క పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తన భార్య ప్రవర్తన సరిగా లేదని, గత ఏడాది నుంచి తరుచూ మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందని షేక్ భరన్ ఆరోపణ. ఆత్మహత్యకు ముందు షేక్ భరన్ సెల్ఫీ వీడియో తీసి అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

*ఆంధ్రప్రదేశ్‎లో గంజాయి రవాణా ముఠా కలకలం రేపుతోంది. ఏవోబీ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో స్మగ్లర్లు భూపతిపాలెం జలాశయం దగ్గర స్కార్పియోను వదిలి పరారయ్యారు. కారులో సుమారుగా 300 కిలోల గంజాయిని రంపచోడవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

* వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మహిళా వాలంటీర్‌ను అతి కిరాతకంగా పొడిచి చంపిన సంఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద (27)ను అదే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి 2008లో వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శారద స్థానికంగా వాలంటీర్‌గా పనిచేసేది. అదే గ్రామానికి చెందిన ఎం.పద్మారావుతో ఆమెకు నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. ఆరు నెలల క్రితం ఆమె ప్రవర్తనను అనుమానించిన పద్మారావు సచివాలయం వద్ద ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ విషయంపై అప్పట్లో సచివాలయం మహిళా పోలీస్‌ వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతన్ని మందలించి వదిలేశారు. ఈ నేపథ్యంలో శారదపై ద్వేషం పెంచుకున్న పద్మారావు ఆదివారం సాయంత్రం ఆమె ఇంటి ముందు శుభ్రం చేస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు.
తప్పించుకోబోయిన ఆమెను కొద్దిదూరం వెంటబడి మెడపై కోసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హత్య విషయం తెలుసుకున్న వేమూరు పోలీసులు, చుండూరు సీఐ కల్యాణ్‌రాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. శారద, పద్మారావు మధ్య వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో ఆమె దూరంగా ఉంచడం, ఆమె ప్రవర్తనపై అనుమానంతోనే పద్మారావు హత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి సుగుణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* మిట్ట మధ్యాహ్నం ఇంటిలో ఒంటరిగా ఉన్న 20 ఏళ్ల మూగ యువతిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. తల్లిదండ్రులు శనివారం కూలి పనుల కోసం వెళ్లగా ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గుర్తించిన ఇదే ప్రాంతానికి చెందిన కొదముల రాజు అలియాస్‌ జక్రయ (27) ఆ యువతిపై అత్యాచారం చేశాడు. రాత్రి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు యువతి సైగల ద్వారా జరిగిన దారుణాన్ని వివరించింది. ఆ రాత్రే యువతి తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు జక్రయ్యను అదుపులోకి తీసుకుని అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.

* వ్యవసాయం, ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని చీకోడ్‌లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొమ్మెన ఎల్లయ్య (54)కు ఎకరం భూమిని సాగు చేస్తూ కూలీగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయానికి రూ.15 లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక భూమిని అమ్మకానికి పెట్టగా, ఆశించిన ధర రాలేదు. దీంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

*కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం తీసుకొస్తున్న 18 లారీలను ఆదివారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం చందాపూర్‌ శివారు, కృష్ణా చెక్‌ పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ధాన్యం విలువ రూ.1.09 కోట్లకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. తెలంగాణలో ధాన్యం మద్దతు ధర రూ.1,965లు ఉండగా కర్ణాటకలో రూ.1300- 1400 వరకు ఉంది. దీంతో అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, నారాయణపేట, మక్తల్‌, కృష్ణా కొనుగోలు కేంద్రాల్లో స్థానిక రైతుల పేరుతో విక్రయించేందుకు ఈ ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చందాపూర్‌ శివారులో పట్టుబడిన 16 ధాన్యం లారీలను గంజ్‌లో ఉంచామని, లారీ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేయించామని డిప్యూటీ తహసీల్దార్‌ గురురాజారావు తెలిపారు. కృష్ణా చెక్‌ పోస్టు వద్ద మరో రెండు లారీలను పట్టుకున్నట్లు తహసీల్దార్‌ రామకోటి తెలిపారు.

*యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసే లక్ష్మీ పుష్కరిణిలో ఓ బాలిక మృతిచెందింది. దేవుడిని దర్శించుకొని.. మొక్కులు తీర్చుకుందామని వచ్చిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహంపై పడి తల్లీ, కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు భక్తులను కంటతడి పెట్టించింది. నృసింహ జయంతి అయిన ఆదివారం ఈ విషాదం జరిగింది. మృతురాలి కుటుంబసభ్యుల వివరాల మేరకు.. హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌కు చెందిన బొం తల అనిత, ఆమె కూతురు జ్యోతి (15), ఇతర కుటుంబసభ్యులు, బంధువులు మరో ఐదుగురు కలిసి ఆదివారం సాయంత్రం యాదగిరిగుట్టకు వచ్చారు.

*పల్నాడు జిల్లా యడ్లపాడు పరిధిలోని ఎర్రకొండపై ఉన్న రహదారిమాత దేవాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చెన్నై-కోల్‌కతా పదహారో నంబరు జాతీయరహదారి పక్కన ఉన్న ఈ దేవాలయంలో శనివారం అర్ధరాత్రి మేరిమాత, ఏసుప్రభువు విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. తెల్లని వస్త్రానికి పసుపుకొమ్ము కట్టి మేరిమాత విగ్రహం మెడలో వేశారు. ఆదివారం ఉదయం ప్రార్థనలకు వెళ్లిన భక్తులు, మత పెద్దలు కొండపైకి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బారావు, అర్బన్‌ సీఐ రాజేశ్వరరావుతోపాటు యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల ఎస్‌ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మత పెద్దలు, భక్తులతో మాట్లాడారు. క్లూస్‌టీంలు, డాగ్‌స్వాడ్‌లను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.

*రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి మానుకొండ జాహ్నవిని ఆదివారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌ దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ సిబ్బంది స్థానిక రూరల్‌, రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌ల సీఐల సమక్షంలో ఆమెను అరెస్టు చేసి తీసుకు వెళ్లారు. ఈ విషయమై రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డిని వివరణ కోరగా జాహ్నవిని అరెస్టు చేసిన విషయం వాస్తవమేనన్నారు. ఆమెపై 2013లో హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌, దుండిగల్‌ పోలీసు స్టేషన్‌లో మాదక ద్రవ్యాలకు సంబందించిన చట్టం కింద కేసు నమోదైందయిందని తెలిపారు. న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయటంతో నరసరావుపేట రూరల్‌ పరిధిలో ఆమె ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు వచ్చి అరెస్టు చేసినట్టు తెలిపారు.

*అమడగూరు మండలం, లోకోజూపల్లిలో లక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అల్లుడు బాబు అత్త లక్ష్మీదేవిని కిరాతకంగా హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు. తన భార్య ప్రవర్తన మారడానికి అత్త లక్ష్మీదేవే కారణమంటూ అల్లుడు బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భార్య మీద అనుమానంతో అత్తను హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు.

*MP డాక్టర్ సంజీవ్ కుమార్‌ను‌ ఆన్ లైన్‌ లో మోసం చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. కీలక సూత్రధారి పరారీలో ఉన్నాడు. పది రోజుల క్రితం పాన్ కార్డు అప్డేట్ చేయాలంటూ.. సైబర్ నేరగాళ్లు ఓటీపీ వివరాలతో రూ. 97 వేల నగదు ఆన్‌లైన్‌లో డ్రా చేసుకున్నారు.

* కర్ణాటక నుంచి తెలంగాణకు అక్రమంగా ధాన్యం తీసుకొస్తున్న 18 లారీలను ఆదివారం తెల్లవారుజామున నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం చందాపూర్‌ శివారు, కృష్ణా చెక్‌ పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ధాన్యం విలువ రూ.1.09 కోట్లకుపైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. తెలంగాణలో ధాన్యం మద్దతు ధర రూ.1,965లు ఉండగా కర్ణాటకలో రూ.1300- 1400 వరకు ఉంది. దీంతో అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, నారాయణపేట, మక్తల్‌, కృష్ణా కొనుగోలు కేంద్రాల్లో స్థానిక రైతుల పేరుతో విక్రయించేందుకు ఈ ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చందాపూర్‌ శివారులో పట్టుబడిన 16 ధాన్యం లారీలను గంజ్‌లో ఉంచామని, లారీ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేయించామని డిప్యూటీ తహసీల్దార్‌ గురురాజారావు తెలిపారు. కృష్ణా చెక్‌ పోస్టు వద్ద మరో రెండు లారీలను పట్టుకున్నట్లు తహసీల్దార్‌ రామకోటి తెలిపారు.