Politics

కాంగ్రెస్‌ ప్రజలను ఐక్యంగా ఉంచితే… బీజేపీ విభజిస్తోంది – TNI రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ ప్రజలను ఐక్యంగా ఉంచితే… బీజేపీ విభజిస్తోంది – TNI రాజకీయ వార్తలు

*కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు తమ పార్టీ పని చేసిందని తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రజల్లో విభజనలు సృష్టిస్తోందని విమర్శించారు. తాము పేదల కోసం పని చేస్తే, బీజేపీ బడా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నదని ఆరోపించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజులపాటు జరిగిన చింతన్‌ శివిర్‌లో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, సోమవారం గిరిజనులు అధికంగా ఉండే బన్‌స్వారా జిల్లా దుంగార్‌పూర్‌లోని వాల్మీకి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.ధనవంతులు, కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని రూపొందించాలని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. మరోవైపు దళితులు, గిరిజనులు, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తున్నదని తెలిపారు. ‘ఇది ఒక పోరాటం. ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు. అందరినీ కలుపుతూ, అన్ని సంస్కృతులను గౌరవిస్తూ, పరిరక్షిస్తూ మనం ముందుకు సాగాలని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు బీజేపీ విభజించడానికి, అణిచివేసేందుకు పనిచేస్తుంది’ అని అన్నారు.

* ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు: lokesh
గ్రామ గ్రామాన వైసీపీ నేతలను ప్రజలు అడ్డుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ బాదుడే బాదుడు తట్టుకోలేని జనం వైసీపీ నేతలను నిలదీస్తున్నారని మండిపడ్డారు. ప్రజా తిరుగుబాటుతో ఆందోళనలో వైసీపీ నేతలు ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ కూడా అధికారుల రక్షణతోనే బయటకు వస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో జగన్ సర్కార్కు అర్థమవుతోందన్నారు.

*అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టు పనులు పూర్తి: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య
తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందించడంతో పాటు ఆలూరులో టమోటా ఫాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గడప గడప వైసీపీ కార్యక్రమంలో పాల్గొనే ధైర్యం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. పోలీసుల సాయం తీసుకుని వెళ్లడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి వచ్చేందుకు జగన్ అపుడు ముద్దులు పెడితే ఇపుడు గుద్దులు పెడుతున్నాడని విమర్శించారు. వైసీపీని నమ్మి మోసపోవద్దని కోట్ల సూర్య ప్రజలను కోరారు.

*పేద ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ ఆశయం: Talasani
పేద ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. పేదల కష్టాలను దూరం చేయాలని, మీరు సంతోషంగా ఉండాలనే విశాలమైన అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇండ్ల నిర్మాణం చేపట్టే ముందు కొంతమందికి అనుమానాలు ఉండేవని, అద్భుతమైన ఇండ్లను నిర్మించి అనుమానాలను పటా పంచలు చేసినట్లు తెలిపారు. ఈ బస్తీలో ఎంతో కాలం నుండి నివసిస్తున్న అర్హులైన వారిని బస్తీ ప్రజల సమక్షంలో బహిరంగంగా గుర్తించి వారందరికీ ఇండ్లను ఇస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరో ఏదో చెబితే వారి మాటలు నమ్మి డబ్బులిచ్చి నష్టపోవద్దని ఆయన హెచ్చరించారు. కాలనీ ప్రజల కోసం ఒక బస్తీ దవాఖాన, ఒక అంగన్ వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

*AP టౌన్ ప్లానింగ్శాఖలో Corruption ఉంది: మంత్రి సురేష్
ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్, ఏసీబీ ఫైల్స్ చూస్తే ఎక్కువ కేసులు టౌన్ ప్లానింగ్ మీదే ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల తీరు మారాలని సూచించారు. కర్నూలు జిల్లాకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని తెలిపారు. కర్నూలుకు జుడీషియల్ క్యాపిటల్ వస్తోందని ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

*అధికారంలోకి రాగానే మిల్లర్లపై చర్యలు: రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
తాము అధికారంలోకి రాగానే బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ జేఎన్‌టీయూ సమీపంలో మసీదు స్థలం కోర్టు పరిధిలో ఉందని, దానిపై కాకినాడ నగర ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం తప్ప ఉత్తరాంధ్ర , రాయలసీమలో ఒక్క ప్రాజెక్ పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులను వెంట బెట్టుకుని గడప గడపకు వైసీపీ కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వైసీపీకి తామే నిజమైన ప్రతిపక్షం అని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*రాష్ట్రానికి తెదేపా అవసరాన్ని చాటేలా.. మహానాడు జరపాలి : చంద్రబాబు
ఒంగోలు సమీపంలోని మండవారిపాలెంలోనే తెదేపా మహానాడు నిర్వహించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా అవసరాన్ని తెలిపేలా మహానాడు ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తెదేపా ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించే ‘మహానాడు’ను ముందుగా అనుకున్న ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండవారిపాలెంలో నిర్వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించారు. మహానాడు నిర్వహణపై కమిటీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వాలని తెదేపా నేతలు కోరినా.. ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించిందని చంద్రబాబుకు నేతలు తెలిపారు. అవసరమైన ఫీజు చెల్లించినా, ముందుగానే సంప్రదించినా స్టేడియం ఇవ్వడం కుదరదన్నారని వాపోయారు. సమావేశానికి స్టేడియం ఇవ్వకపోవడంపై నేతలు మండిపడ్డారు.ఏదిఏమైనా.. ఒంగోలు నగర సమీపంలోని మండవారిపాలెంలోనే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ జరపనున్నట్లు పేర్కొన్నారు. నూతనత్వంతో భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్తుకు తెదేపా అవసరాన్ని తెలిపేలా మహానాడు ఉండాలని దిశానిర్దేశం చేశారు.

*ఎస్సీ వర్గీకరణ పట్ల వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉంది : మందకృష్ణ
మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే.. అందుకు కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుర్తుచేశారు. అయితే.. ఎస్సీ వర్గీకరణ పట్ల వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే.. అందుకు కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు వల్లే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని తెలిపారు. విజయవాడలో తెదేపా నేత వర్ల రామయ్యను మందకృష్ణ మాదిగ ఆయన నివాసంలో కలిశారు.కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న ఆయన.. చంద్రబాబు దీనిపై చొరవ తీసుకోవాలని కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ పరిష్కారానికి తెదేపా తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని వర్లరామయ్యను కోరారు. ఎన్నికల్లో సీట్లకు సంబంధించి మాల-మాదిగ, రెళ్లి ప్రజలకు 50-50 నిష్పత్తిలో సీట్లు కేటాయించేలా చొరవ చూపాలన్నారు. ఎస్సీలందరికీ సమాన రాయితీ ఫలాలు దక్కేలా మందకృష్ణ కృషి చేస్తున్నారని వర్లరామయ్య అన్నారు. మందకృష్ణ లెవనెత్తే అంశాలన్నీ తెదేపా ఆలోచనల్లో ఉన్నవేనని ఆయన స్పష్టంచేశారు.

*స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యలపై… తెదేపా నేతల ఆగ్రహం
స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. త‌ప్పులు అనే రోగాలతో.. తీవ్ర అనారోగ్యంతో కుంగి కృశించి.. అప్పుల‌నే వెంటిలేట‌ర్‌పై ఉందని.. ఏ క్షణ‌మైనా వెంటిలేట‌ర్ తీసేయొచ్చని ఎద్దేవా చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. గౌర‌వ‌నీయ‌మైన స్పీక‌ర్ హోదాను మాట‌ల‌తోనూ, చేత‌ల‌తోనూ అత్యంత అగౌర‌వంగా మార్చేసిన ఘనత తమ్మినేనిదేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. త‌ప్పుల‌నే తీవ్ర అనారోగ్యంతో కుంగి కృశించి.. అప్పుల‌నే వెంటిలేట‌ర్‌పై ప్రభుత్వం ఉందని.. ఏ క్షణ‌మైనా వెంటిలేట‌ర్ తీసేయొచ్చని ఎద్దేవా చేశారు. గత తెదేపా ప్రభుత్వం నరేగా నిధుల‌తో అభివృద్ధి చేసిన శ్మశానంలో అన్ని ఏర్పాట్లూ చ‌క్కగా చేసి పెట్టామని.. జ‌గ‌న్ స‌ర్కారుకి త‌ల‌కొరివి పెట్టేందుకు జ‌నం ఉవ్విళ్లూరుతున్నారని అయ్యన్న దుయ్యబట్టారు.మేము నరేగా నిధుల‌తో అభివృద్ధి చేసిన శ్మ‌శానంలో అన్ని ఏర్పాట్లూ చ‌క్క‌గా చేసి పెట్టాం. మీ జ‌గ‌న్ స‌ర్కారుకి త‌ల‌కొరికి పెట్టేందుకు జ‌నం ఉవ్విళ్లూరుతున్నారు. తమ నాయకుడు చంద్రబాబు సమర్ధుడు కాబట్టే మూడు సార్లు సీఎం అయ్యారని తెలుగు మహిళ అధ్యక్షరాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముదిగొండ మారణ హోమంలో ఏడుగురు రైతులను కాల్చి చంపింది వైఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీసీ, మైనారిటీలకు ఒక్క రూపాయి అన్నా ఇచ్చారా అని నిలదీశారు. చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన స్పందన చూసాక వైకాపా నాయకులకు మైండ్ సరిగా పని చేయడం లేదని విమర్శించారు. లండన్ మందులు కాకపోయినా కనీసం వారికి ఉచిత కోటాలో వచ్చేవైనా వాడటం మంచిదని అనిత ఎద్దేవా చేశారు.

*Jagan సభలో గందరగోళం
సీఎం జగన్‌ సభలో గందరగోళం నెలకొంది. జగనన్నా.. ఇళ్ల స్థలాలు ఇప్పించాలని ప్రజలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఫ్లెక్సీలు ప్రదర్శించిన వ్యక్తులను పోలీసులు బయటకు పంపారు. మరోవైపు గణపవరంలో జగన్ (Jagan) పర్యటన దృష్ట్యా విద్యార్థులపైనా పోలీసులు (police) ఆంక్షలు విధించారు. మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఇదే కాలేజీలో సీఎం సభ ఏర్పాటు చేయడంతో పరీక్ష కేంద్రం మార్చారు. డిగ్రీ విద్యార్థుల పరీక్ష కేంద్రాన్ని శేషామహల్‌లోని గర్ల్స్ హైస్కూల్‌కు మార్చారు. సీఎం జగన్‌ పర్యటన ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు డిగ్రీ విద్యార్థులు.. గర్ల్స్ హైస్కూల్‌లో పరీక్షకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ శ్యామ్‌బాబు ప్రకటన చేశారు. పరీక్ష కేంద్రం మార్పుతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.
*అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రాజెక్టు పనులు పూర్తి: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య
తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల (Project) ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (Kotla) చెప్పారు. కర్నూలు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందించడంతో పాటు ఆలూరులో టమోటా ఫాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గడప గడప వైసీపీ కార్యక్రమంలో పాల్గొనే ధైర్యం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. పోలీసుల సాయం తీసుకుని వెళ్లడం దురదృష్టకరమన్నారు. అధికారంలోకి వచ్చేందుకు జగన్ అపుడు ముద్దులు పెడితే ఇపుడు గుద్దులు పెడుతున్నాడని విమర్శించారు. వైసీపీని నమ్మి మోసపోవద్దని కోట్ల సూర్య ప్రజలను కోరారు.

*బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు లేదు: రాహుల్‌
బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నియంతృత్వ శక్తులని, వాటితో దేశానికి ప్రమాదమని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ హెచ్చరించారు. బీజేపీని బలంగా ఎదుర్కొనే సామర్థ్యం ప్రాంతీయ పార్టీలకు లేదని చెప్పారు. కాంగ్రెస్‌ మాత్రమే బలమైన, ప్రధానమైన జాతీయ ప్రతిపక్షంగా బలోపేతం కావాలని తెలిపారు. ఇది సిద్ధాంతాల మధ్య పోరుగా పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో ఆదివారం ఆయన ప్రసంగించారు. సిద్ధాంతాలు లేని వారిని ఓడించడం సులభమని బీజేపీ భావిస్తోందని చెప్పారు. వివిధ వ్యవస్థలను పద్ధతి ప్రకారం కుప్పకూలుస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను లొంగదీసుకుందని.. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తోందని.. ఇజ్రాయెల్‌ నుంచి స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా రాజకీయ నేతల స్వరాన్ని కూడా తొక్కి పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రజలతో కాంగ్రె్‌సకు సంబంధాలు తెగిపోయిన మాట నిజమేనని అంగీకరించారు

*బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు లేదు: రాహుల్‌
బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ నియంతృత్వ శక్తులని, వాటితో దేశానికి ప్రమాదమని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ హెచ్చరించారు. బీజేపీని బలంగా ఎదుర్కొనే సామర్థ్యం ప్రాంతీయ పార్టీలకు లేదని చెప్పారు. కాంగ్రెస్‌ మాత్రమే బలమైన, ప్రధానమైన జాతీయ ప్రతిపక్షంగా బలోపేతం కావాలని తెలిపారు. ఇది సిద్ధాంతాల మధ్య పోరుగా పేర్కొన్నారు. ఉదయ్‌పూర్‌ చింతన్‌ శిబిర్‌లో ఆదివారం ఆయన ప్రసంగించారు. సిద్ధాంతాలు లేని వారిని ఓడించడం సులభమని బీజేపీ భావిస్తోందని చెప్పారు. వివిధ వ్యవస్థలను పద్ధతి ప్రకారం కుప్పకూలుస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను లొంగదీసుకుందని.. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టిస్తోందని.. ఇజ్రాయెల్‌ నుంచి స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా రాజకీయ నేతల స్వరాన్ని కూడా తొక్కి పెట్టిందని ధ్వజమెత్తారు. ప్రజలతో కాంగ్రె్‌సకు సంబంధాలు తెగిపోయిన మాట నిజమేనని అంగీకరించారు.

*ఎమ్మెల్యే Vamsi వల్ల నాకు ప్రాణహాని..: YCP నేత
ఎమ్మెల్యే వంశీ వలన తనకు ప్రాణహాని ఉందని వైసీపీ (YCP)కి చెందిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. చలో తాడేపల్లి కార్యక్రమంలో అరెస్ట్ అయిన రామిశెట్టి నాగ వెంకట సాయి ఉమామహేశ్వరరావు , బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి వార్నింగ్‌‌‌‌‌ ఇచ్చారని ఉమామహేశ్వరరావు ఆరోపించాడు. కొందరు వ్యక్తులు వచ్చి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తే ఊరుకునేది లేదని తన మొబైల్ లాక్కున్నారని దీంతో బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించినట్లు ఉమామహేశ్వరరావు తెలిపాడు.

*మంత్రి అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు
ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబుపై అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు సంస్కార హీనుడు అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తెల్లచొక్కా వేసి కళ్లజోడు పెట్టినంత మాత్రాన కామాంధులు సంస్కారవంతులు కాలేరని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఓ టీవీ ఛానల్ వెనక రాసలీలల గెస్ట్ హౌస్ నుంచి.. విజయవాడ హనీ గెస్ట్‌హౌస్ వరకూ అంబటి కామచరిత్ర బయటకు వస్తోందని అయ్యన్న ఆరోపించారు. ఇంకా ఉడత ఊపులు ఎందుకు కామబాబు? అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఒక యాంకర్ అని నేను మెసేజ్ పెడితే అంబటి, అతని మనుషులు.. ఆరుగురికి ఫోన్లు చేసి తప్పైందని, మెసేజ్‌లు డిలీట్ చేయాలని కోరారని అయ్యన్న అన్నారు.

*ఎంబీసీ విభాగాన్ని ఏర్పాటు చేయాలి: దాసోజు
ఏఐసీసీ, పీసీసీ, డీసీసీల స్థాయిల్లో ఎంబీసీలు, సంచార తెగల విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ లేఖ రాశారు. ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ల కేటాయింపునకు ఒక విధానం రూపొందించాలని విన్నవించారు. కాంగ్రెస్‌ చింతన్‌బైఠక్‌ నేపథ్యంలో ఆ లేఖ రాసినట్లు దాసోజు చెప్పారు.

*ఏపీ లో “స్టాప్ గ్యాప్ ప్రభుత్వం” నడుస్తోంది: Lanka Dinakar
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. 9 నెలలైనా పులిచింతల ప్రాజెక్ట్‌కు గేటు పెట్టలేనివారికి పోలవరం పూర్తి చేసే సామర్థ్యం ఉందా? అని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. పులిచింతలకు రూ.7.75 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో జగన్ సర్కార్ ఉందని వెల్లడించారు. ఏపీలో “స్టాప్ గ్యాప్ ప్రభుత్వం” నడుస్తోందని, అందుకే పులిచింతల దగ్గర “స్టాప్ లాగ్ గేట్”తో కాలం వెల్లబుచ్చుతున్నారని మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్ట్ దగ్గర అశ్రద్ధతో వచ్చిన ఇబ్బంది.. 45.77 టీఎంసీ సామర్థ్యం ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌ దగ్గర కూడా రావచ్చని లంకా దినకర్ గుర్తు చేశారు. ఒక చిన్న గేట్ ఏర్పాటుపైనా ఇంత అశ్రద్ధ ఉంటే ఎలా అని లంకా దినకర్ అన్నారు. జగన్‌ పాలనలో నీటి ప్రాజెక్టుల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని లంకా దినకర్ వెల్లడించారు

*kcrపై విరుచుకుపడ్డ బండి సంజయ్t
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణను ఒక మూర్కుడు పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. బండి సంజయ్ ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. పువ్వాడ అజయ్ వేధింపులతోనే సాయి గణేష్ చనిపోయాడని ఆరోపించారు. సాయి గణేష్‌ది ఆత్మహత్య కాదని, టీఆర్ఎస్ హత్యగా అభివర్ణించారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలాన్ని అధికారులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తన దుర్మార్గాలను కప్పిపుచ్చుకునేందుకు పువ్వాడ అజయ్ కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకుంటున్నాడని, ఈ విషయాన్ని కమ్మ కులస్థులు గమనించాలన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ తొంభై శాతం తన ఫాం హౌస్‌లో గడిపారని ఆరోపించారు.

*ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ’
కేంద్రమంత్రి అమిత్‌ షా అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తానని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ‘ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుకు తాము మద్దతు ఇచ్చామో లేదో రికార్డులు చూసుకోమన్నారు.తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. మిషన్ భగీరథకు కేంద్రం రూ.2,500 కోట్లు కాదు కదా.. రూ.2 కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని.. పార్లమెంట్‌లో కేంద్రమంత్రే ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు.

*నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం: సోము
రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలసి అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదల ఇళ్ల కోసం లక్షా 80 వేలు ఇస్తున్నామని, తాము అధికారంలోకి వస్తే దాదాపుగా ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేయడం తప్ప ఖజానా నింపుకునే పరిస్థితి లేదని తప్పుబట్టారు. ప్రభుత్వం లిక్కర్‌ను ఆదాయ వనరుగా చూస్తోందని, ఇది సరికాదని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*ఎమ్మెల్యే Vamsi వల్ల నాకు ప్రాణహాని..: YCP
కృష్ణా జిల్లా ఎమ్మెల్యే వంశీ వలన తనకు ప్రాణహాని ఉందని వైసీపీ కి చెందిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. చలో తాడేపల్లి కార్యక్రమంలో అరెస్ట్ అయిన రామిశెట్టి నాగ వెంకట సాయి ఉమామహేశ్వరరావు బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. నిన్న సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి వార్నింగ్‌‌‌‌‌ ఇచ్చారని ఉమామహేశ్వరరావు ఆరోపించాడు. కొందరు వ్యక్తులు వచ్చి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తే ఊరుకునేది లేదని తన మొబైల్ లాక్కున్నారని దీంతో బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించినట్లు ఉమామహేశ్వరరావు తెలిపాడు.

*అధికారంలోకొస్తే ఉచితంగా ఇళ్లు: సోము
‘‘రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలసి అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిపుష్ఠికి చర్యలు తీసుకుంటాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు పేదల ఇళ్ల కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నాం. మేం అధికారంలోకి వస్తే దాదాపుగా ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం ’’ అని సోము అన్నారు.

*నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం: సోము వీర్రాజు
రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలసి అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేదల ఇళ్ల కోసం లక్షా 80 వేలు ఇస్తున్నామని, తాము అధికారంలోకి వస్తే దాదాపుగా ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేయడం తప్ప ఖజానా నింపుకునే పరిస్థితి లేదని తప్పుబట్టారు. ప్రభుత్వం లిక్కర్‌ను ఆదాయ వనరుగా చూస్తోందని, ఇది సరికాదని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*మోదీ, షాలు కలిసొచ్చినా ముస్లిం రిజర్వేషన్లను తీసేయలేరు: షర్మిల
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు కలిసొచ్చినా వైఎస్‌ హయాంలో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 4ు రిజర్వేషన్లను తీసేయలేరని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ఊదు కాలదు.. పీరీ లేవదన్నట్లుగా అమిత్‌షా వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రతి పథకంలోనూ తమ వాటా ఉందంటున్న బీజేపీకి.. కేసీఆర్‌ అవినీతిలోనూ వాటా లేదంటే నమ్మాలా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదని, ఇక ఏం ముఖం పెట్టుకుని ఒక్క చాన్సు అడుగుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు.

*అమిత్‌షా వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే: కాంగ్రెస్‌
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 4ు రిజర్వేషన్‌ కల్పనకు సంబంధించిన కేసు ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్‌లోనే ఉందన్నారు. అయితే తుది తీర్పునకు లోబడి రిజర్వేషన్లు కొనసాగించవచ్చంటూ సుప్రీం కోర్టు పేర్కొనడంతో ఆ రిజర్వేషన్‌ అమలవుతోందని ఆయన పేర్కొన్నారు. అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు మోసపూరితమైనవని టీపీసీసీ నేత నిరంజన్‌ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్‌ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు.

*ఎంబీసీ విభాగాన్ని ఏర్పాటు చేయాలి: దాసోజు
ఏఐసీసీ, పీసీసీ, డీసీసీల స్థాయిల్లో ఎంబీసీలు, సంచార తెగల విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ లేఖ రాశారు. ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ల కేటాయింపునకు ఒక విధానం రూపొందించాలని విన్నవించారు. కాంగ్రెస్‌ చింతన్‌బైఠక్‌ నేపథ్యంలో ఆ లేఖ రాసినట్లు దాసోజు చెప్పారు.

*మోదీ, షాలు కలిసొచ్చినా ముస్లిం రిజర్వేషన్లను తీసేయలేరు: షర్మిల
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు కలిసొచ్చినా వైఎస్‌ హయాంలో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 4ు రిజర్వేషన్లను తీసేయలేరని వైఎ్‌సఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. ఊదు కాలదు.. పీరీ లేవదన్నట్లుగా అమిత్‌షా వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రతి పథకంలోనూ తమ వాటా ఉందంటున్న బీజేపీకి.. కేసీఆర్‌ అవినీతిలోనూ వాటా లేదంటే నమ్మాలా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా ఇచ్చిన విభజన హామీలకే దిక్కులేదని, ఇక ఏం ముఖం పెట్టుకుని ఒక్క చాన్సు అడుగుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో నిలదీశారు.

*అమిత్‌షా వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే: కాంగ్రెస్‌
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్ల కోటాను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 4ు రిజర్వేషన్‌ కల్పనకు సంబంధించిన కేసు ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్‌లోనే ఉందన్నారు. అయితే తుది తీర్పునకు లోబడి రిజర్వేషన్లు కొనసాగించవచ్చంటూ సుప్రీం కోర్టు పేర్కొనడంతో ఆ రిజర్వేషన్‌ అమలవుతోందని ఆయన పేర్కొన్నారు. అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు మోసపూరితమైనవని టీపీసీసీ నేత నిరంజన్‌ మండిపడ్డారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కేసీఆర్‌ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రశ్నించారు.

*ఎంబీసీ విభాగాన్ని ఏర్పాటు చేయాలి: దాసోజు
ఏఐసీసీ, పీసీసీ, డీసీసీల స్థాయిల్లో ఎంబీసీలు, సంచార తెగల విభాగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ లేఖ రాశారు. ఈ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత దృష్ట్యా ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. వారికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ల కేటాయింపునకు ఒక విధానం రూపొందించాలని విన్నవించారు. కాంగ్రెస్‌ చింతన్‌బైఠక్‌ నేపథ్యంలో ఆ లేఖ రాసినట్లు దాసోజు చెప్పారు.

*తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారు: లక్ష్మణ్
మంత్రి కేటీఆర్ (KTR) తండ్రి పేరుతో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీష్‌రావును అబద్దాల వర్సిటీకి వీసీని చేయొచ్చన్నారు. తెలంగాణ ద్రోహులు కూడా బీజేపీపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ మజ్లిస్ చెప్పుచేతల్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఆవాస్ యోజన నిధులు దారిమళ్లిస్తున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

* టర్న్‌ కీతో నాకు సంబంధం లేదు: తితిదే మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డి
ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో సబ్‌కాంట్రాక్టర్‌గా ఉన్న టర్న్‌కీ సంస్థతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని, ఏపీలో వ్యాపార కార్యకలాపాలేవీ తాను నిర్వహించడం లేదని తితిదే బోర్డు మాజీ సభ్యుడు, చెన్నైలోని తితిదే లోకల్‌ అడ్వైజర్‌ కమిటీ సభ్యుడు, వ్యాపారవేత్త జె.శేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్పారు. తమ వద్ద గతంలో చెన్నైకే చెందిన శ్రీనివాసులు నాయుడు పని చేసేవారని, అప్పట్లో పత్రికల్లో ఆయన పేరు శ్రీనివాసరెడ్డి అని వచ్చిందని తెలిపారు. తాము గతంలో ఎస్‌ఆర్‌ఎస్‌ మైనింగ్‌ పేరిట తమిళనాడులో ఇసుక తవ్వకాల్లో లిఫ్టింగ్‌ కాంట్రాక్టు మాత్రమే చేశామని, 2017లో ఆ కంపెనీ మూసేశామని చెప్పారు. అది ఇన్‌ఫ్రా కంపెనీ మాత్రమేనని తెలిపారు. దానికి చెందిన మిషనరీని అవసరమైన వారికి అద్దెకు ఇస్తున్నామని వివరించారు.

* ‘దేశ విభజనకు మోదీ యత్నం.. ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశాన్ని విభజించాలని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో కూడిన మరో దేశాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని రెండుగా మార్చుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హిందుస్థాన్ ధనిక, పేద అనే దేశాలుగా మారిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అందరినీ కలుపుకొంటూ వెళ్తుంటే.. భాజపా ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉండే దక్షిణ రాజస్థాన్లోని బంస్వారా ప్రాంతంలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. రెండు భిన్నమైన భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు.”మోదీ రెండు భారత దేశాలను తయారు చేయాలని అనుకుంటున్నారు. దళితులు, రైతులు, పేదలు, అణగారిన వర్గాలకు ఒక దేశాన్ని.. ఇద్దరు- ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం మరో దేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ మాత్రం ఒకే భారత్ను కోరుకుంటోంది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలనే కాంగ్రెస్ చెబుతుంది. అణచివేయడం, విభజించడం, చరిత్రను ఏమార్చేందుకు ప్రయత్నించడం, ఆదివాసీల సంస్కృతిని నాశనం చేయడమే భాజపా చేసే పని. మేం పేద ప్రజలకు అండగా ఉంటే.. వారు కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారు.” యూపీఏ ప్రభుత్వం బలంగా తీర్చిదిద్దిన భారత ఆర్థిక వ్యవస్థను మోదీ ధ్వంసం చేస్తున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. “భాజపా ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. నోట్లరద్దు పరిణామాలు, జీఎస్టీని సరిగా అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారేందుకు యూపీఏ ప్రభుత్వం పనిచేసింది. నరేంద్ర మోదీ మాత్రం ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తున్నారు. తమకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని దేశంలో యువత భావిస్తోంది. ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరుగుతోంది” అని రాహుల్ విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చిందన్న రాహుల్.. అన్నదాతల నిరసనలకు తలొగ్గి వెనక్కి తీసుకుందని అన్నారు. ఆ చట్టాల వల్ల ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనం కలిగేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలతో ఎంతో కాలం నుంచి లోతైన అనుబంధం ఉందని రాహుల్ చెప్పుకొచ్చారు. ‘మీ చరిత్రను గౌరవిస్తాం. దాన్ని సంరక్షిస్తాం. యూపీఏ పాలనలో చారిత్రక చట్టాలను తీసుకొచ్చి ఆదివాసీల అడవులు, నీటివనరులను సంరక్షించాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా రాజస్థాన్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. రైతులు, దళితులు, ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అశోక్ గహ్లోత్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.