DailyDose

మహానాడు నిర్వహణపై కమిటీలతో చంద్రబాబు సమీక్ష – TNI తాజా వార్తలు

మహానాడు నిర్వహణపై కమిటీలతో చంద్రబాబు  సమీక్ష  –  TNI  తాజా వార్తలు

* మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఒంగోలు మండవారిపాలెంలో ఈనెల 27, 28న మహానాడు జరుగనుంది భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండోరోజు బహిరంగ సభ ఉంటుంది. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియంను టీడీపీ కోరింది. స్టేడియం ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం నిరాకరించింది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుల నియామకం నిర్ణయాన్ని జాతీయ అధ్యక్షుడు ఖరారు చేయనున్నారు. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహణ ఆనవాయితీగా వస్తోంది. ఒక ఏడాది ఎన్నికల కారణం, రెండు ఏళ్ళు కోవిడ్ కారణంగా మాహానాడు ఆన్‌లైన్ కే పరిమితమైంది
*శివసేన ఎంపీ Sanjay Rautపై బీజేపీ నేత భార్య పరువునష్టం దావా
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా ముంబై కోర్టులో పరువునష్టం దావా వేయనున్నారు. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య రూ.100కోట్ల టాయిలెట్ కుంభకోణం చేశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గత నెలలో ఆరోపించారు. బీజేపీకి చెందిన కిరీట్ సోమయ్య అమిత్ షా పేరును ఉపయోగించి కోట్ల రూపాయలను దోపిడీ చేశాడని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తన భార్య ప్రొఫెసర్ డాక్టర్ మేధా కిరీట్ ముంబైలోని సెవ్రీ కోర్టులో కేసు పెట్టనున్నట్లు సోమయ్య ట్వీట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 499,500 కింద పరువునష్టం కేసు వేయనున్నట్లు సోమయ్య పేర్కొన్నారు.మొత్తంమీద బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ల మధ్య రాజుకున్న వివాదం కాస్తా కోర్టుకెక్కనుంది.
*ఏపీ దేవాదాయశాఖలో పదోన్నతులకు లంచావతారాల వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రమోషన్లకు డబ్బు చెల్లించాల్సిందేనని కోడ్‌ భాషలో బేరసారాలకు దిగుతున్నారు. జూనయర్ అసిస్టెంట్‌ ప్రమోషన్లకు సంబంధించి ఆడియో టేపులు లీక్ అయ్యాయి. ఆడియో టేప్‌ల లీక్‌తో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల్లో గుబులు మొదలైంద. ముందుగానే సంబంధిత ఉద్యోగిపై పీఎస్లో ఫిర్యాదు, కేసునమోదు చేశారు. పలాన సమయానికి రావాలంటూ పీఎస్ నుంచి ఉద్యోగులకు ఫోన్లు వచ్చాయి. మొత్తం వ్యవహారంపై సోషల్‌ మీడియాలో ఆడియో టేపుల హల్చల్ చేస్తున్నాయి. ఏపీ దేవాదాయశాఖలో ఆడియో టేప్‌ల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
*విద్యుత్ శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్మూర్‌లోని విద్యుత్ శాఖ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున్న వ్యాపిస్తున్నాయి. విద్యుత్ ఆఫీసులో ఉన్న ఫైల్స్, ఫర్నిచర్ మంటల్లో దగ్ధం అయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు
*ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు నిరసనల సెగ తగులుతోంది. హిందూపురం మూడో వార్డు శాంతినగర్‌లో చేపట్టిన కార్యక్రమంలో MP గోరంట్ల మాధవ్, MLC ఇక్బాల్ అహ్మద్ పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలేదని స్థానికి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తాం..ఎమ్మెల్సీని నిలదీయవద్దంటూ కాలనీ వాసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ పీఏ, వైసీపీ నాయకుడు గోపికృష్ణ. ఇదే సమయంలో వీడియో తీస్తున్న ఏబీఎన్ రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి సెల్‌ఫోన్‌ను గోపికృష్ణ లాకున్నారు. గోపికృష్ణ తీరుపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సెల్‌ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు.
*
*
*
*
*
*రాజుపాలెం మండలం, గణపవరం Central Bankలో క్లర్క్ చేతివాటం ప్రదర్శించాడు. ఖాతాదారుల బంగారం ప్రైవేట్ షాపులో అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ రైతు బ్యాంకులో 4 సవర్ల బంగారు గొలుసు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడు. తర్వాత నగదు కట్టి బంగారాన్ని విడిపించుకున్నాడు. అయితే తన బంగారు గొలుసును బ్యాంక్ క్లర్క్ మార్చినట్లు గ్రహించిన రైతు బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఖాతదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు బ్యాంక్‌లో తనిఖీలు చేప్పట్టారు. బ్యాంక్ మేనేజర్ క్లర్క్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పే అండ్ ప్లే విధానాన్ని వ్యతిరేకిస్తూ క్రీడాకారులు, తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వం నిర్ణయంతో పేద, మధ్య తరగతి పిల్లలు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పే అండ్ ప్లే విధానానికి వ్యతిరేకంగా గుంటూరు బీఆర్ స్టేడియంలో తల్లిదండ్రులు నిరసనకు దిగారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కోచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పే అండ్ ప్లే విధానాన్ని తీసుకువచ్చి రూ. 2 వందల ఫీజును రూ. 2 వేలు చేసిందని, యోగాకు సంబంధించి రూ. 50 నుంచి వెయ్యి చేసిందని, ఎంట్రీ ఫీజు రూ. 3వేలు చేసిందని చెప్పారు. ఈ విధానం వలన పేద, మధ్య తరగతి పిల్లలు క్రీడలకు దూరమవుతారని కోచ్ ఆవేదన వ్యక్తం చేశారు.
*గణపవరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన దృష్ట్యా విద్యార్థులపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. మూర్తి రాజు డిగ్రీ కాలేజీలో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఇదే కాలేజీలో సీఎం సభ ఏర్పాటు చేయడంతో పరీక్ష కేంద్రం మార్చారు. డిగ్రీ విద్యార్థుల పరీక్ష కేంద్రాన్ని శేషామహల్‌లోని గర్ల్స్ హైస్కూల్‌కు మార్చారు. సీఎం జగన్‌ పర్యటన ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు డిగ్రీ విద్యార్థులు.. గర్ల్స్ హైస్కూల్‌లో పరీక్షకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ శ్యామ్‌బాబు ప్రకటన చేశారు. పరీక్ష కేంద్రం మార్పుతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది.
* ఎన్టీఆర్ జిల్లా:చందర్లపాడు తహశీల్దార్ కార్యాలయం పై ఎసిబి అధికారులు దాడులు…ఆఫీస్ ను ఎసిబి అధికారుల స్వాధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు…తహశీల్దార్ వాహనం ను కూడా తనిఖీ నిర్వహించిన ఎసిబి అధికారులు…
*థామస్‌ కప్‌ను తొలిసారి సొంతం చేసుకున్న సందర్భంగా భారత షట్లర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇండోనేసియాతో పోటీ ముగిసిన వెంటనే షట్లర్లతో మోదీ ఫోన్‌లో సంభాషించారు. భారత్‌ చేరుకోగానే తన నివాసానికి రావాలంటూ షట్లర్లను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పీఎంఓ సిబ్బంది చూసుకుంటారని వారితో మోదీ చెప్పారు. తొలుత కిడాంబి శ్రీకాంత్‌తో ముచ్చటించిన ప్రధాని.. ఆ తర్వాత లక్ష్యసేన్‌ ప్రణయ్‌ చిరాగ్‌తో మాట్లాడారు. క్రీడారంగంలో భారత్‌ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇదొకటి. మీ అందరి సమష్ఠి కృషితో ఇది సాధ్యమైంది అని మోదీ అభినందించారు.
*బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 10.31 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలో వస్తువులు కదిలి శబ్ధాలు వచ్చాయి. పలువురు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ లోపే సాధారణ స్థితి నెలకొనటంతో ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది మాత్రం భూమి కంపించింది నిజమేనా లేక భ్రమా అన్న ఆలోచనలో ఉన్నారు. మిగిలిన వారితో మాట్లాడిన తరువాత భూమి కంపించింది నిజమేనని నిర్ధారించుకున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా ఏటా ఒకటి రెండు సార్లు అద్దంకి ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన ప్రజలలో నెలకొంది.
*తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధిగా మానుకొండ జాహ్నవిని తొలగించినట్లు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చదలవాడ అరవిందబాబు ఆదివారం తెలిపారు. మానుకొండ జాహ్నవిని హైదరాబాద్‌ పోలీసులు మాదకద్రవ్యాల కేసులో ఆదివారం అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో జాహ్నవిని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు అరవిందబాబు ప్రకటించారు
*విశాఖ ఎయిర్‌ కనెక్టివిటీ, టూరిజంపై ఎయిర్ ట్రావెలర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ మరిన్ని విమాన సర్వీసులు పెంచేలా ప్రభుత్వ సహకారం అందిస్తుందని తెలిపారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీని షో కేస్‌ చేస్తామన్నారు. విశాఖలో బీచ్‌ ఐటీ నినాదంతో ఐటీ రంగం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. త్వరలో శ్రీలంక, మలేషియాకు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. జులైలో విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖ నుంచి భువనేశ్వర్‌, గోవాకు కొత్త సర్వీసులు, జులై నుంచి విశాఖ-కొలంబో విమాన సర్వీసు ప్రారంభిస్తామని అమర్నాథ్‌ పేర్కొన్నారు.
*తిరుమలలో మరోసారి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. పాపవినాశనం మార్గంలోని పార్వేటమండపం వద్దకు ఆదివారం ఉదయం నాలుగు ఏనుగులు వచ్చి.. పరిసరాల్లో బీభత్సం సృష్టించాయి. ప్రహరీతోపాటు గార్డెన్‌ను ధ్వంసం చేశాయి. విషయం తెలుసుకున్న ఫారెస్టు విజిలెన్స్‌ అధికారులు అక్కడికి చేరుకుని సైరన్లు మోగించడంతో ఆ ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఏనుగులు ఇదే ప్రదేశంలో సంచరించిన విషయం తెలిసిందే.
*అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. రెవెన్యూ సర్కిళ్లలోని గ్రామాల్లో వేల మంది ప్రజలు వరదల బారినపడి అల్లాడుతున్నారు. హెక్టార్ల వ్యవసాయ భూములు వరదనీటిలో మునిగాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డిమా హసావో జిల్లాలోని గ్రామాల్లో శనివారం కొండచరియలు విరిగిపడ్డాయి.అసోం వరదల్లో ఇప్పటి వరకు ఓ చిన్నారి సహా ముగ్గురు మరణించారు. పశువులు వరద బారిన పడ్డాయి. ఇప్పటివరకు వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్నాయి.వరదల వల్ల డిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.
*కరోనా విలయతాండవం చేసిన గత రెండేళ్ల కాలంలో తమ సంఘం తరఫున అమోఘమైన సేవలందించినట్లు గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం ప్రెసిడెంట్‌ సాయిసుధ పాలడుగు ఓ ప్రకటనలో తెలిపారు. చేతన ఫౌండేషన్‌ సహకారంతో బాధితులకు మందులు, ఆహారంతోపాటు, కొవిడ్‌ వేలాది స్ర్కీనింగ్‌ కిట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కొవిట్‌ సేవల బృందాన్ని సత్కరించారు. ఈ బృందంలోని రామ్‌చౌదరి ఉప్పుటూరి, సాయిసుధ పాలడుగు, గోపాలకృష్ణ శీలంనేని రవి వెనిగళ్ల, ప్రసాద్‌ మట్టుపల్లిని సినీ నటుడు జగపతి బాబు చేతులమీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు.
*విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి, బీజేపీ నాయకురాలు రత్నప్రభ ఎస్సీ కాదంటూ వచ్చిన పిటిషన్‌పై దర్యాప్తు జరపాలని నాంపల్లి మూడో మెట్రో పాలిటిన్‌ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఏవీ రమణ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రత్నప్రభ ఫిర్యాదు మేరకు 2012లో రమణపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దాంతో సీసీఎస్‌ అధికారులు రమణను అరెస్టు చేశారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని, రత్నప్రభ ఎస్సీ కాదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అప్పటి షేక్‌పేట మండల తహసీల్దార్‌ చంద్రకళ ద్వారా ఎస్సీ సర్టిఫికెట్‌ తీసుకుని తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి పోలీస్‌ కమిషనర్‌ ఏకె ఖాన్‌పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. అన్ని విషయాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోర్టు బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది.
*యార్లగడ్డ రాఘవేంద్రరావు నేటి తరానికి ఆదర్శవంతమైన గొప్ప కవి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని ఎన్‌జీఓ హోంలో ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు ప్రదానోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉమ్మడిశెట్టి ట్రస్టు వ్యవస్థాపకుడు రాధేయ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి, కవి, అధ్యాపకుడు తూముచెర్ల రాజారాం చేతుల మీదుగా ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌ యార్లగడ్డ రాఘవేంద్రరావుకు అవార్డును అందజేశారు. ఆయన రచించిన ‘పచ్చి కడుపు వాసన’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. అలాగే డాక్టర్‌ ఎం.పార్వతి సాహితీ పురస్కారాలను ఒడిసాలోని బరంపురానికి చెందిన తుర్లపాటి రాజేశ్వరి, విజయవాడకు చెందిన వసుధారాణికి అందజేశారు. ఈ సందర్భంగా రాచపాళెం మాట్లాడారు. యార్లగడ్డ రాఘవేంద్రరావు రచనలన్నీ మన చుట్టూ నిత్యం జరిగే అంశాలను స్ఫురిస్తాయని అన్నారు. రైతులు, మహిళలు, మట్టి, వృద్ధులు, బంధాలు, బంధుత్వాలపై ఆయన రాసే కవితలు సమాజ హితానికి ఉపయోగపడతాయని అన్నారు. ఆయన తన రచనల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. అవార్డు గ్రహీత యార్లగడ్డ మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో ఉన్నంతమంది కవులు ఏ జిల్లాలోనూ ఉండరని అన్నారు. అనంతపురం జిల్లాలో మేధావులు, రచయితలు, సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉన్న వ్యక్తులు ఉన్నారని అన్నారు.
*‘కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో నుంచి నగరాల్లో పనులకోసం వచ్చిన రూ.2,500 కోట్లు ఏం చేశారు? వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ఈ పద్దు కింద రూపాయి పనులు కూడా జరగలేదు. నిధులు మాత్రం అయిపోయాయి’’ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. రుణంగా తీసుకొన్న డబ్బులకు ఏటా వడ్డీ కూడా ప్రభుత్వం కడుతోందనీ, డబ్బులు అయిపోయినా పనులు ఎందుకు జరగలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘‘టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలకు రూ.2,500 కోట్లు మంజూరయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరులో 70శాతం, నెల్లూరులో 80శాతం పనులు జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా ఒక్క శాతం కూడా పని జరగలేదు. డబ్బులు మాత్రం అయిపోయాయి. ఈ పనులపై విజిలెన్స్‌ విచారణ వేశామని గతంలో మంత్రి అనిల్‌ కుమార్‌ చెప్పారు. ఇప్పటికి రెండున్నరేళ్లు అయింది. అది బయటకు రావడం లేదు. బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు చేస్తున్న కంపెనీలు తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోయాయి. మూడేళ్లలో 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?’’ అని ప్రశ్నించారు. డబ్బులు లేవని ప్రభుత్వం చెబితే తాము ప్రజల వద్ద ముష్టి ఎత్తి అయినా ఇస్తామని, పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
*కాణిపాకంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వినాయక సదన్ వద్ద రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపైన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న కాణిపాకం ఆలయ శానిటేషన్ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు.
*ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఏలూరుజిల్లా గణపవరం రానున్నారు. గణపవరంలో రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పాల్గొనే సభాప్రాంగణాన్ని, ఏర్పాట్లను ఆదివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.విశ్వరూప్‌, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. సభావేదిక నిర్మాణ పనులు వీఐపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్న 16 గ్యాలరీలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు.
*విశాఖ ఎయిర్‌ కనెక్టివిటీ, టూరిజంపై ఎయిర్ ట్రావెలర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్‌ మాట్లాడుతూ మరిన్ని విమాన సర్వీసులు పెంచేలా ప్రభుత్వ సహకారం అందిస్తుందని తెలిపారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీని షో కేస్‌ చేస్తామన్నారు. విశాఖలో బీచ్‌ ఐటీ నినాదంతో ఐటీ రంగం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. త్వరలో శ్రీలంక, మలేషియాకు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. జులైలో విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖ నుంచి భువనేశ్వర్‌, గోవాకు కొత్త సర్వీసులు, జులై నుంచి విశాఖ-కొలంబో విమాన సర్వీసు ప్రారంభిస్తామని అమర్నాథ్‌ పేర్కొన్నారు
*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 17న ఓర్వకల్లు మండలానికి రానున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. మండలంలోని బ్రాహ్మణపల్లె మజరా గ్రామమైన గుమితం తండా గ్రామ సమీపాన గ్రీన్‌కో సంస్థ నిర్మిస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీఎస్‌)ను పరిశీలించనున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి 17న ఉదయం 9.34 గంటలకు సీఎం నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలిప్యాడ్‌ ద్వారా 11 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు గుమితం తండాకు చేరుకుంటారు.
*విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి, బీజేపీ నాయకురాలు రత్నప్రభ ఎస్సీ కాదంటూ వచ్చిన పిటిషన్‌పై దర్యాప్తు జరపాలని నాంపల్లి మూడో మెట్రో పాలిటిన్‌ కోర్టు పోలీసులను ఆదేశించింది. ఏవీ రమణ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రత్నప్రభ ఫిర్యాదు మేరకు 2012లో రమణపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దాంతో సీసీఎస్‌ అధికారులు రమణను అరెస్టు చేశారు. అయితే తనపై తప్పుడు కేసు పెట్టారని, రత్నప్రభ ఎస్సీ కాదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. అప్పటి షేక్‌పేట మండల తహసీల్దార్‌ చంద్రకళ ద్వారా ఎస్సీ సర్టిఫికెట్‌ తీసుకుని తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి పోలీస్‌ కమిషనర్‌ ఏకె ఖాన్‌పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. అన్ని విషయాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోర్టు బంజారాహిల్స్‌ పోలీసులను ఆదేశించింది.
*ప్రభుత్వ వెద్యవిద్య కళాశాలల్లో ఉన్న అధ్యాపకులతో కలిపి కొత్తగా తెలంగాణ టీచింగ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీటీజీడీఏ) ఏర్పాటైంది. ఆదివారం కోఠీలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఉన్న అధ్యాపకులతో టీటీజీడీఏ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో ప్రతి కాలేజీలో ఉన్న సమస్యలకు సానుకూల పరిష్కారాల గురించి చర్చించారు. అనంతరం టీటీజీడీఏ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అన్వర్‌ పాషా, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ కిరణ్‌ మాదాల, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ జలగం తిరుపతిరావు, కోశాధికారి కిరణ్‌ ప్రకాష్‌, జనరల్‌ సెక్రెటరీలుగా బాబు, రమేష్‌, కిరణ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు.
*తుక్కుగూడ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన అమిత్‌ షా కాదని.. అబద్ధాల బాద్‌షా అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అమిత్‌షా మాటలు విన్న తర్వాత ఆయనకు అల్జీమర్‌ వ్యాధి ఉందేమోనన్న సందేహం వస్తోందన్నారు. ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని విమర్శించారు. తుక్కుగూడ సభలో ప్రజా స్పందన లేదని, అమిత్‌షా స్ర్కిప్టు రైటర్‌ సరిగా లేరని, అమిత్‌షా.. అంటే అమిత్‌లో మిత్‌ (మిత్‌ అంటే మాయ) మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.
*రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను రెగ్యులర్‌ కోర్టులుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. వాటిని 22 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి, 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులుగా స్థాయి పెంచింది. ఈ మేరకు న్యాయశాఖ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శి ఎంఏ మన్నన్‌ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాలో 16 సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ప్రజలకు సత్వర న్యాయం అందజేస్తాయని తెలిపారు. రెగ్యులర్‌గా మార్చిన 38 కోర్టులతో పాటు మరో 14 అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టుల్లో 1406 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను ఆర్థికశాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేశారు. అందులో అదనపు జిల్లా కోర్టుల్లో 990, సివిల్‌ జడ్జి కోర్టుల్లో 416 పోస్టులున్నాయి. రెగ్యులర్‌ అయిన 22 అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి కోర్టుల్లో ఒక్కో జిల్లా జడ్జి, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. జూనియర్‌ అసిస్టెంట్‌ ఐదు పోస్టులు, టైపిస్ట్‌ రెండు పోస్టుల చొప్పున మంజూరు చేసింది. అదనపు జిల్లా కోర్టుల్లో ఖాళీలు(990): జిల్లా జడ్జి-22, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-36, సూపరింటెండెంట్‌(హెడ్‌ క్లర్క్‌)-36, సూపరింటెండెంట్‌(ట్రాన్స్‌లేటర్‌)-36, సీనియర్‌ అసిస్టెంట్‌-36, స్టెనోగ్రాఫర్‌ -36, జూనియర్‌ అసిస్టెంట్‌ – 152, టైపిస్ట్‌ – 58, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ – 94, ఎగ్జామినర్‌ – 36, కాపీయిస్ట్‌ – 36, ప్రాసెస్‌ సర్వర్‌ – 138, డ్రైవర్‌ – 36, రికార్డు అసిస్టెంట్‌ – 36, ఆఫీసర్‌ సబార్డినేట్‌ – 180 ఫుల్‌టైం మసలాచి – 22.సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల్లో ఖాళీలు(416): సీనియర్‌ సివిల్‌ జడ్జి – 16, సూపరింటెండెంట్‌ – 16, సీనియర్‌ అసిస్టెంట్‌(హెడ్‌ క్లర్క్‌) 16, సీనియర్‌ అసిస్టెంట్‌(యూడీబీసీ) – 16, స్టెనోగ్రాఫర్‌ – 16, జూనియర్‌ అసిస్టెంట్‌ – 80, టైపిస్ట్‌-32, ఫీల్డ్‌ అసిస్టెంట్‌-32, ఎగ్జామినర్‌-16, కాపీయిస్ట్‌-16, ప్రాసెస్‌ సర్వర్‌-48, రికార్డు అసిస్టెంట్‌-16, ఆఫీస్‌ సబార్డినేట్‌ -80, ఫుల్‌టైం మసలాచి-16.
*తుక్కుగూడ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన అమిత్‌ షా కాదని.. అబద్ధాల బాద్‌షా అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అమిత్‌షా మాటలు విన్న తర్వాత ఆయనకు అల్జీమర్‌ వ్యాధి ఉందేమోనన్న సందేహం వస్తోందన్నారు. ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని విమర్శించారు. తుక్కుగూడ సభలో ప్రజా స్పందన లేదని, అమిత్‌షా స్ర్కిప్టు రైటర్‌ సరిగా లేరని, అమిత్‌షా.. అంటే అమిత్‌లో మిత్‌ (మిత్‌ అంటే మాయ) మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.
*జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేస్తోందని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. జనగణనలో భాగంగా బీసీ కుల గణన చేపట్టాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 24న బెంగళూరులో జాతీయస్థాయి బీసీల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బీసీల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జాతీయ సదస్సు వాల్‌ పోస్టర్‌ను ఆర్‌.కృష్ణయ్య ఆవిష్కరించారు.
*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి అనుసరించాల్సిన విధానాలు, సమాచార సేకరణ నిమిత్తం రాష్ట్ర బీసీ కమిషన్‌ వచ్చే వారం కర్ణాటకలో పర్యటించనుంది. బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రదపటేల్‌ నూలి, కిషోర్‌ గౌడ్‌తో కూడిన బృందం ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు కర్ణాటకలో అధ్యయనం చేయనుంది. ఇదే అంశంపై అధ్యయనం కోసం తమిళనాడులో పర్యటించిన బీసీ కమిషన్‌ సభ్యులు.. సీఎం స్టాలిన్‌తోపాటు చైన్నైలో ప్రభుత్వ విభాగాధిపతులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఎంపీ విల్సన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రిజర్వేషన్లు 50ు దాటరాదని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నా.. తమిళనాడులో 69ు రిజర్వేషన్లు అమలు చేయడం ఎలా సాధ్యమైందన్న అంశంపై అక్కడి అధికారులతో రాష్ట్ర బీసీ కమిషన్‌ కూలంకుశంగా చర్చించింది. ఈ మేరకు పలు డాక్యుమెంట్లను సేకరించింది. కాగా, కర్ణాటకలో పర్యటన అనంతరం జూన్‌ మొదటి వారంలో కమిషన్‌ మహారాష్ట్రలోనూ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బృందం నివేదిక అందజేయనుంది.
*ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని బండా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత 28 ఏళ్లలో మొట్టమొదటిసారి 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రికార్డు నమోదైంది. 1994వసంవత్సరం మే 31వతేదీన బండా జిల్లాలో 48.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ ఏడాది మే 15వతేదీన ఆ రికార్డును బద్దలు కొట్టింది. వేడిగాలులు వీయడంతో ప్రజలు అల్లాడిపోయారు.ఆగ్రాలో ఆదివారం నాడు 47.7 డిగ్రీల సెల్సియస్, ఝాన్సీ జిల్లాలో 47.6 డిగ్రీలు, ప్రయాగ్‌రాజ్‌లో 46.9, కాన్పూర్‌లో 46.1, వారణాసిలో 46, చుర్క్‌లో 45.6, హమీర్‌పూర్‌లో, ఫతేపూర్‌లో 45. 2, ఒరాయ్‌లో 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
*అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 222 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. 15 రెవెన్యూ సర్కిళ్లలోని 222గ్రామాల్లో 57 వేల మంది ప్రజలు వరదల బారినపడి అల్లాడుతున్నారు. 10321 హెక్టార్ల వ్యవసాయ భూములు వరదనీటిలో మునిగాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో శనివారం కొండచరియలు విరిగిపడ్డాయి.అసోం వరదల్లో ఇప్పటి వరకు ఓ చిన్నారి సహా ముగ్గురు మరణించారు. 1,434 పశువులు వరద బారిన పడ్డాయి. ఇప్పటివరకు వరదల వల్ల 202 ఇళ్లు దెబ్బతిన్నాయి.వరదల వల్ల డిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది.
*తుఫాన్ల సమయంలో తీరప్రాంతాల్లోని విద్యుత్‌ సరఫరా వ్యవస్థలకు జరిగే నష్టాన్ని తగ్గించేందుకు గాను గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)కి చెందిన పరిశోధకులు కొత్త పరిష్కారాన్ని అభివృద్ధి చేశారు. గతంలో ఒడిశాపై విరుచుకుపడిన ఫని తుఫానును నమూనాగా తీసుకుని, గాలి తీవ్రత అత్యంత అధికంగా ఉండే చోట్లలోని కొన్ని విద్యుత్‌ టవర్లను తమ పరిశోధనకు ఎంచుకున్నారు. ఆయా టవర్ల పరిధిలో అత్యధిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తీరానికి సమీపంలో ఉన్న ఆ టవర్లను మరింతగా బలోపేతం చేయడం ద్వారా ఫలితం కనబడినట్లు వారు పేర్కొన్నారు. ఇటువంటి అధ్యయనం ఇదే తొలిసారని, తక్కువ వ్యయంతో ఎక్కువ ఫలితాన్ని సాధించవచ్చని వివరించారు.
*త్రిపుర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాణిక్‌ సాహా ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం ఉదయం ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్య.. మాణిక్‌ సాహాతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. త్రిపుర ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మాణిక్‌ సాహ చెప్పారు. కాగా, ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష సీపీఎం ఎమ్మెల్యేలు బహిష్కరించారు.
*కేసుల పరిష్కారం విషయంలో జాతీయ పౌరుల రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ)లో పొందుపర్చిన సమాచారంపై ఆధారపడొద్దని అసోంలోని ఎన్‌ఆర్‌సీ కోఆర్డినేటర్‌ హితేశ్‌ దేవ్‌ శర్మ… ఆ రాష్ట్ర ఫారినర్స్‌ ట్రైబ్యునల్‌కు సూచించారు. ఎన్‌ఆర్‌సీ సమాచారంలో తప్పులుండే అవకాశం ఉందని, ఆ జాబితాను రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఫైనల్‌గా ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు. అయితే ఎన్‌ఆర్‌సీ కోఆర్డినేటర్‌ అభిప్రాయంతో ట్రైబ్యునల్‌ ఏకీభవించలేదు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఎన్‌ఆర్‌సీ సమాచారాన్ని ఫైనల్‌గా భావించవచ్చని పేర్కొంది.