Movies

హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ సీమంతం ఫంక్షన్‌

హీరోయిన్‌  ప్రణీత సుభాష్‌   సీమంతం ఫంక్షన్‌

హీరోయిన్‌ ప్రణీత సుభాష్‌ త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! గత నెలలో స్కానింగ్‌ కాపీని చూపిస్తూ గర్భం దాల్చిన విషయాన్ని అభిమానులకు వెల్లడించిందీ ప్రణీత. ఇటీవలే బేబీ బంప్‌ ఫొటోలను సైతం నెట్టింట షేర్‌ చేయగా అవి కాస్తా వైరల్‌ అయ్యాయి. తాజాగా ప్రణీతకు సీమంతం జరిగింది.పసుపు పచ్చని చీరలో అందంగా ముస్తాబైన ఆమె అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ సీమంతం ఫొటోలు చూసిన అభిమానులు హీరోయిన్‌కు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.కాగా సెకండ్‌ లాక్‌డౌన్‌లో అంటే 2021 సంవత్సరంలో మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది ప్రణీత. పెళ్లి సింపుల్‌గా చేసుకుని, ఆ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపిన ఈ హీరోయిన్‌.. తల్లి కాబోతున్న విషయాన్ని సైతం అదే సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. తన లైఫ్‌లో జరిగే ప్రతి మంచి విషయాన్ని సైతం ఫ్యాన్స్‌కు తెలియజేస్తానంది.