NRI-NRT

ఇంగ్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో ఎన్నారైకి కీలక పదవి

ఇంగ్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో ఎన్నారైకి కీలక పదవి

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ) ఎక్స్‌టర్నర్‌ సభ్యురాలుగా ప్రముఖ విద్యావేత్త, భారతీయ సంతతి మహిళ డాక్టర్‌ స్వాతి ధింగ్రా నియమితులయ్యారు.ఈ కీలక బాధ్యతల్లో భారతీయ సంతతి మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌ అప్లైడ్‌ మైక్రోఎకనామిక్స్‌లో స్పెషలైజేషన్‌ ఉన్న ధింగ్రా ప్రస్తుతం లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎల్‌ఎస్‌ఈ)లో ఎకనామిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో స్వాతి ధింగ్రా విద్యను అభ్యసించారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుండి మాస్టర్స్‌ పట్టా పొందారు. యూనివర్శిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌–మాడిసన్‌ నుండి ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. బ్రిటన్‌ ట్రేడ్‌ మోడలింగ్‌ రివ్యూ ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 9న ఆమె ఎంపీసీలో చేరి, మూడేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహి స్తారు. 2016 ఆగస్టు నుంచి ఎంపీసీ సభ్యునిగా పనిచేస్తున్న మైఖేల్‌ సాండ్రూస్‌ స్థానంలో ఆమె ఈ బాధ్యతలు చేపడతారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఎంపీసీలో గవర్నర్‌తోపాటు, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. బ్యాంకులో ఒక సీనియర్‌ ఆధికారితోపాటు, నలుగురు బయటి స్వ తంత్రులు సభ్యులుగా ఉంటారు. వీరిని బ్రిటన్‌ ఆర్థికమంత్రి నియమిస్తారు