NRI-NRT

వేడుకగా GWTCS ఉగాది వేడుకలు

వేడుకగా GWTCS ఉగాది వేడుకలు

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షురాలు పాలడుగు సాయిసుధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు సినీనటుడు జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కళాకారులు, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జగపతిబాబు మాట్లాడుతూ అమెరికాలో ప్రవాసులు తెలుగు ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తున్నారని ప్రశంసించారు. సాయి సుధ మాట్లాడుతూ స్థానిక యువతీ యువకులను ప్రోత్సహించేందుకు ఈ వేడుక చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమన సతీశ్‌, చంద్ర మల్లోతు, భాను మాగులూరి, విజయ్‌, సుధీర్‌ కొమ్మి, నరేన్‌ కొడాలి, కవిత చల్లా, సత్య సూరపనేని తదితరులు పాల్గొన్నారు.