DailyDose

మే నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు

మే నెల 27, 28 తేదీల్లో  ఒంగోలులో టీడీపీ మహానాడు

టీడీపీ మహానాడు తేదీలు ఖరారయ్యాయి. ఒంగోలులో మే నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు కార్యక్రమం జరగనుంది. మహానాడు నిర్వహణకు 80 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఒంగోలు శివారు మండవవారిపాలెంలో ఈ కార్యక్రమం జరగనుంది. మహానాడు పనులకు అచ్చెన్నాయుడు భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.11 నుంచి 11.20 గంటల మధ్య భూమిపూజ చేయనున్నారు. భూమిపూజ అనంతరం మహానాడు పనులు ప్రారంభంకానున్నాయి.