NRI-NRT

అమెరికాలో 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

అమెరికాలో 28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను మే 28 న అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్లో పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ – యూఎస్ఏ ప్రతినిధి ఉయ్యూరు శ్రీనివాస్ తెలిపారు . తెలుగుజాతి ఆత్మగౌరవానికి ఆవిర్భావ దినోత్సవంగా .. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వివరించారు . ప్రతి శుక్ర , శని , ఆదివారాల్లో వర్జీనియాలో ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనల ద్వారా .. ఏడాది పొడవునా శతజయంతి వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని . తెలిపారు . రోజుకు 1,000 మందికి భోజనం అందించేలా గుంటూరులో ఏర్పాటు చేసే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వివరించారు .
n3