DailyDose

ఎన్నారైకి రూ.3.11 కోట్ల టోకరా – TNI నేర వార్తలు

Auto Draft

* రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో ప్రవాస భారతీయుడిని రూ.3.11 కోట్లకు మోసం చేసిన ఇద్దరిపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు కేసు నమోదు చేశారు.నగరంలోని పారామౌంట్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ లండన్‌లో నివసిస్తున్నారు. వ్యాపార పనుల కోసం ఏటా నాలుగైదుసార్లు సిటీకి వస్తుంటారు. 2013లో వచ్చిన సందర్భంలో రిజ్వాన్, మహ్మద్‌ షోయబ్‌ అనే వ్యక్తులు ఇక్బాల్‌ను కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేలా ఇక్బాల్‌ను ఒప్పించారు. వీరి మాటలతో వివిధ దఫాల్లో ఇక్బాల్‌ డబ్బులిచ్చాడు. 2014 ఏప్రిల్‌ 3న షాద్‌నగర్‌ సమీపంలోని 2 ఎకరాల 4 గంటల స్థలాన్ని విక్రయిస్తామని చెప్పారు. రూ.44 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. నగదు ముట్టినప్పటికీ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయకుండా దాటవేస్తూ వచ్చారు. దీంతో బాధితుడు ఆరా తీయగా సదరు స్థలానికి, రిజ్వాన్, షోయబ్‌లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. రూ.3.11 కోట్ల మేర వారు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

* బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న షేక్ సనావుల్లాను అరెస్టు చేశారు. బెంగుళూరులో రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొని హైదరాబాదుకు తీసుకెళ్తున్నట్లు సనావుల్లా పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడు. బెంగళూరుకు చెందిన రిజ్వాన్, హైదరాబాద్ కు చెందిన తరుణ్, మక్బూల్, నరేంద్ర సింగ్, విజయవాడకు చెందిన యశ్వంత్ రెడ్డి, ఏకేశ్వర రెడ్డిలను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురు అరెస్టు చేయగా.. మరికొందరు కోసం పోలీసులు గాలిస్తున్నారు. షేక్ సనావుల్లా దగ్గర 4.3 గ్రాములు, యశ్వంత్ రెడ్డి, ఏకేశ్వర రెడ్డిల నుంచి 3 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రిజ్వాన్ కు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తుందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.
*మైలవరం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చండ్రగూడెం సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆగివున్న ట్రాక్టర్ ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ముందు నిలబడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరి గాయాలయ్యాయి. బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*దేశపాత్రునిపాలెం పంచాయతీ శీరంశెట్టివానిపాలెం గ్రామంలోని ఒక ఇంట్లో నిల్వచేసి ఉంచినసుమారు రూ.10లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లను పోలీసులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి గ్రామానికి చెందినఅంధవరపు నారాయణమూర్తి అనే వ్యక్తి శీరంశెట్టివానిపాలెంలో ఒక ఇంటిని తీసుకుని, అందులో ఖైనీ ప్యాకెట్లు నిల్వ ఉంచుకుని, వివిధ ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తుంటాడు. నారాయణమూర్తి స్వస్థలం చీపురుపల్లి అయినా విశాఖపట్టణంలోని సీతమ్మధారలో నివాసం ఉంటూ ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఇక్కడ పెద్దఎత్తున ఖైనీ ప్యాకెట్లు ఉంచి వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసులకు సోమవారం సాయంత్రం సమాచారం వచ్చింది. దీంతో సీఐ ఎస్‌.బాలసూర్యారావు, ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ తమ సిబ్బందితో గ్రామానికి వెళ్లి ఖైనీ ప్యాకెట్లు నిల్వ ఉంచినఇంటిని సోదా చేశారు. ఖైనీప్యాకెట్లు గుట్టలుగుట్టలుగా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. స్వాధీనం చేసుకున్న ప్యాకెట్ల విలువసుమారు రూ.10లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ మేరకు నిందితుడు నారాయణమూర్తిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు తెలిపారు.
*నరసరావుపేట ద్విచక్ర వాహనం తాకట్టు విషయంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడి మృతికి దారితీసింది. ఇద్దరు స్నేహితుల మధ్య ద్విచక్ర వాహనం తాకట్టు విషయమై వివాదం చోటు చేసుకుంది. పోలిచర్ల అఖిల్‌పై శివాపరపు అఖిల్ మరి కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన పోలిచర్ల అఖిల్‌ను కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పోలిచర్ల అఖిల్ ఈ రోజు మృతి చెందాడు. మృతదేహంతో అఖిల్ కుటుంబ సభ్యులు రోడ్డుపై భైఠాయించారు.
*గుడివాడ మండలం సెరిదింటకుర్రులో (YCP) వైసీపీ సర్పంచ్ కుటుంబ సభ్యులు హత్య చేసిన బాధిత కుటుంబానికి కొన్నికుటుంబాలు అండగా నిలిచాయి. సర్పంచ్ కుటుంబసభ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో తమ‌పైనే ఫిర్యాదు చేస్తారా? అని సర్పంచ్ కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ కట్ చేశారని సర్పంచ్ ప్రోద్భలంతో నలుగురుపై పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల తీరును నిరసిస్తూ.. గుడివాడ ఎండీవో కార్యాలయం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పంచాయతీ కార్యదర్శి వద్ద ఆధారాలు ఉంటే చూపాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
*(శ్రీకాకుళం పాతపట్నంలో పరీక్ష రాస్తూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూనియర్ కాలేజ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి బోరాడ కార్తీక్ స్వస్థలం సారవకోట మండలం దాసుపురం. పరీక్ష రాస్తుండగా కార్తీక్‌కు వాంతులు కావడంతో పాటు తీవ్ర తలనొప్పితో కుప్పకూలిపోయాడు. అంతా చూస్తుండగానే మరణించాడు.
*కొడవలూరు మండలం రేగడచెలిక జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీని మినీ వ్యాన్ ఢీకొట్టింది. వ్యాన్‌లో 12 మంది ప్రయాణికులు ఉండగా.. 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సత్తెనపల్లి నుంచి తిరుమలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది.
*తెనాలిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్థానిక అమరావతి కాలనీలో ఓ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళా మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. పెనుగులాటలో బాధిత మహిళ సూర్యదేవర విజయలక్ష్మి మెడకు స్వల్పంగా గాయమైంది. త్రీ టౌన్ పోలీసులకు విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
*తెనాలిలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్థానిక అమరావతి కాలనీలో ఓ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళా మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. పెనుగులాటలో బాధిత మహిళ సూర్యదేవర విజయలక్ష్మి మెడకు స్వల్పంగా గాయమైంది. త్రీ టౌన్ పోలీసులకు విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
*పిఠాపురం విద్యుత్నగర్లో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాలతో అత్త రమణమ్మ(46)ను అతి కిరాతకంగా అల్లుడు హత్య చేశాడు. దాడి చేస్తున్న సమయంలో అడ్డుకున్న మామ, బావమరిదిపై అల్లుడు రమేష్ కత్తితో దాడి చేశాడు. అడ్డుపడ్డవారికి తీవ్ర దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*
*డ్రైవర్ నిద్రమత్తు కారణంగా 14 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఇండోనేసియా సురబాయలోని మోజోకెర్తోలో సోమవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులంతా పర్యటకులు. సురబాయకు చెందిన వారంతా మధ్య జావాలోని ప్రముఖ పర్వత ప్రాంతమైన డీంగ్ పీఠభూమికి విహార యాత్రకు వెళ్లి తిరిగొస్తున్నారు. సోమవారం ఉదయం మోజోకెర్తో వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఓ హోర్డింగ్ను ఢీకొట్టింది. అనేక మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
*అమెరికాలో మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దుండుగుడి కాల్పుల్లో పది మంది మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్‌ మార్కెట్‌లోకి సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
*ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ని వివిధ ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడిన గోల్కొండ కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మైలవరం ఏసీపీ కెవివి ప్రసాద్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరువూరు రూరల్ మండలం లోని మల్లెల గ్రామం ఎన్ ఎస్ పి కాలువ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతనివద్ద నుండి 8 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సిఐ రుద్రరాజు భీమరాజు,ఎస్సైలు చి హెచ్ దుర్గాప్రసాద్,పద్మారావు పాల్గొన్నారు.కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులతో పాటు ఏ ఎస్సైలు వెంకటేశ్వరరావు,మల్లికార్జునరావు అభినందించి,రివార్డుల కొరకు పై అధికారులకు సిఫార్సు చేస్తామని తెలిపారు.
*వడదెబ్బతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణం సర్‌సిల్క్‌ చిన్న మార్కెట్‌లో నివాసముంటున్న వంగ బోదమ్మ (70) వడదెబ్బతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండ తీవ్రత తో ఆదివారం బోదమ్మ అస్వస్తతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. కాగా మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురంలో సోమవారం వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం చిన్న కిష్టాపురం గ్రామానికి చెందిన మాలోతు సోల్తా(55) ఉపాధి పనికి వెళ్లింది. పని చేస్తున్న క్రమంలో వడదెబ్బ తగిలి స్పృహా కోల్పోయి కిందపడిపోయింది. తోటి కూలీలు మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులున్నారు.
*అప్పుల బాధతో నంద్యాల జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కొప్పెర సుబ్బరాయుడు (42)కు 1.50 ఎకరాల పొలం ఉంది. మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. దిగుబడి లో నష్టాలు వచ్చి రూ.5 లక్షలు అప్పులయ్యాయి. మనోవేదనతో సుబ్బరాయుడు విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామానికి చెందిన లింగాల చంద్రశేఖర్‌రెడ్డి (45) అనే రైతు తన పొలంలో పురుగుల మందుతాగాడు. నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యవసాయంలో కలిసి రాక, అనారోగ్యంతో అప్పుల పాలై తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రశేఖర్‌రెడ్డి భార్య నాగేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
*అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తానామిట్ట వద్ద సోమవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఓ యువకుడు మృతిచెందాడు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ్ల తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన ఖాదర్‌బాషా (19), అతడి పెదనాన్న కుమార్తె అజీరా (36), ఆమె పిల్లలు జోయా (8), జునెద్‌ (6) సోమవారం ద్విచక్రవాహనంపై మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. దారిలో కురబలకోట మండలం తానామిట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. ఘటనలో ద్విచక్రవాహనం లారీ ముందు చక్రాల కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఖాదర్‌బాషా, జోయా, జునెద్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా అజీరా తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ముదివేడు పోలీసులకు సమాచారం అందించి అజీరాను చికిత్సనిమిత్తం 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. ఎస్‌ఐ సుకుమార్‌ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.
*పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు మృతిచెందారు. పది గొర్రెలు కూడా మరణించాయి. కడప జిల్లా దువ్వూరులో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దువ్వూరుకు చెందిన నల్లబోతుల హనుమంతు(56), శెట్టిపలె ్ల మునిరావ్‌ (32) రోజులాగే ఉదయం తమ గొర్రెలను మేతకని సమీపంలోని గుట్టకు తోలుకెళ్లారు. మధ్యాహ్నానికి ఆకాశం మేఘావృతమై వర్షం మొదలైంది. దీంతో వీరు గొర్రెలతో సహా మంచినీళ్ల బావి వద్ద ఉన్న మర్రిచెట్టు కిందకు చేరారు. కాసేపటికి ఆ చెట్టుపై పిడుగు పడ్డంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. 10 గొర్రెలు కూడా మృతిచెందాయి. ఇతర గొర్రెల కాపరులు గమనించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ కేసీ రాజు తెలిపారు.
*తండ్రి, కొడుకు… వారు అపురూపంగా చూసుకునే ఎడ్ల జత ఒకే క్షణం, ఒకే చోట చనిపోవడం ఆ కుటుంబంతోపాటు ఆ ఊరు మొత్తాన్ని కంటతడి పెట్టించింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం గ ంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మధిర నాగరాజు (32) తొమ్మిది ఎకరాలు కౌలు పొలం తీసుకొని పత్తి, మిర్చి పంట సాగు చేశాడు. ఈ ఏడాది చీడపీడల వలన పైరు పూర్తిగా దెబ్బతిన్నది. ఆ పైరును దున్నివేసి మొక్కజొన్నపంట సాగు చేశాడు. చేలో ఉన్న పంటను సోమవారం ఇంటికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో కుమారుడు వెంకటచరణ్‌ను(8) తీసుకొని మొక్కజొన్న కండెలను ఎడ్లబండిలో వేసుకుని ఒక ట్రిప్పు కల్లంలోకి చేర్చాడు. రెండవ ట్రిప్పు కోసం వెళ్తుండగా, ఊరికి సమీపంలో ఉన్న రామన్నకుంటను చూడగానే నీళ్లు తాగడానికి ఎడ్లు అటువైపు కదిలాయి. కొద్దిసేపటికే అవి కుంటలోకి వెళ్లిపోయాయి. కుంట లోతుగా ఉండటంతో ఎడ్లు ఒక్కసారిగా మునిగిపోయి..బండి బోర్లపడింది. బండిమీద ఉన్న నాగరాజు, అతని కుమారుడు వెంకటచరణ్‌ కింద పడిపోయారు. బోర్ల పడిన బండి కింద చిక్కుకుపోయి ఊపిరాడక ఎడ్లు చనిపోయాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎడ్లను, బండిని బయటకు తీశారు. అవి అప్పటికే చనిపోయాయి. తండ్రీ,కొడుకు జాడ కనిపించలేదు. కొందరు యువకులు కుంటలో దిగి వెతుకులాడగా వారి మృతదేహాలు కనిపించాయి.
*మామిడితోటలో దాచి ఉంచిన నల్లబెల్లంగుట్కా ప్యాకెట్లను ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్సన్నపేట పట్టణ శివారులో మచినేని అరవిందుకు చెందిన మామిడితోటలో ఎస్ఈబీ పోలీసులు సోదా చేశారు. నాటుసారాకు ఉపయోగించే  బస్తాల నల్ల బెల్లంనిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరవింద్‌పై కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు.
*వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. బాధితులు పెళ్లి సామాన్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. మృతులు సీతమ్మ, బిచ్య, స్వామి, గోవింద్, శాంతమ్మగా గుర్తించారు. మృతులంతా పర్షతండాకి చెందిన వారు. శుభకార్యం జరగాల్సిన ఇంట విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
*జూలూరుపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిరాం తండా సమీపంలో ప్రైవేటు బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*రోడ్డుపైనే ఓ వ్యక్తి యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన బీజేఆర్‌ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. బీజేఆర్‌నగర్‌లోని మల్లికార్జునగర్‌లో శంకర్‌ (29) భార్య ముగ్గురు పిల్లలతో కలసి ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చెలరేగేవి. ఈ క్రమంలోనే మంగళవారం మల్లికార్జునగర్‌ కమాన్‌ వద్ద శంకర్‌ యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు 108 సిబ్బంది హుటాహుటిన అక్కడకి చేరుకొని శంకర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
*ళ్లి, పుట్టిన రోజు వంటి వేడుకల్లో స్నేహితులు, బంధువుల నుంచి బహుమతులు అందుతుంటాయి. తమకు వచ్చిన బహుమతుల్లో ఏముంటుందో అనీ తెరిచి చూడడానికి చాలా మందికి ఆతృత ఉంటుంది. అయితే ఇలాగే పెళ్లికి వచ్చిన ఓ బహుమతి కొత్తగా పెళ్లైన యువకుడి చెయ్య పోగొట్టుకునే వరకు వచ్చింది. అతడితో పాటు అతడి 3 ఏళ్ల మేనల్లుడు సైతం గాయపడ్డాడు. గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో జరిగిందీ ఘటన.గాయపడ్డ పెళ్లి కుమారుడి పేరు లాతిష్ గావిట్. మే 12న సల్మాతో వివాహం జరిగింది. కాగా బంధువులు, స్నేహితుల నుంచి వీరి పెళ్లికి పెద్ద ఎత్తునే బహుమతులు అందాయి. లాతిష్ మరదలి పాత బాయ్‌ఫ్రెండ్ కూడా ఒక బహుమతి ఇచ్చాడు. అయితే మంగళవారం బహుమతులను తెరిచే కార్యక్రమం పెట్టుకున్నాడు లాతిష్. ఇందులో భాగంగా తన మరదలి ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ బహుమతి తెరుస్తుండగా అది పేలింది. దీంతో లాతిష్, అతడి దగ్గరలోనే ఉన్న 3 ఏళ్ల చిన్నారి గాయపడ్డారు.
*గుజరాత్‌లోని మోర్బిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. హల్వాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక సాల్ట్ ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు కాగా, సాల్ట్ ఫ్యాక్టరీ గోడ కూలిపడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందిన విషయాన్ని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ధ్రువీకరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రకటించారు.