DailyDose

‘గాడిదల ఫామ్​’ పెట్టిన గ్రాడ్యుయేట్.. ఏటా కోట్ల ఆదాయం..

‘గాడిదల ఫామ్​’ పెట్టిన గ్రాడ్యుయేట్.. ఏటా కోట్ల ఆదాయం..

అతడు చదివింది డిగ్రీ. చేసే వ్యాపారం.. గాడిద పాలు అమ్మడం. బిజినెస్ లాంఛ్​ కూడా మామూలుగా జరగలేదు! ఏకంగా జిల్లా కలెక్టర్​ వచ్చి గాడిదల ఫారాన్ని ప్రారంభించారు. ఎవరతడు? గాడిద పాల వ్యాపారం అంత లాభదాయకమా?

డిగ్రీ చదివిన ఓ యువకుడు.. వినూత్న వ్యాపారం మొదలుపెట్టాడు. తమిళనాడు తిరునెల్వేలి జిల్లా తులుకపట్టి గ్రామంలో గాడిదల ఫామ్​ను నెలకొల్పాడు. ఆ రాష్ట్రంలో తొలి గాడిదల ఫామ్​ ఇదే కాగా.. ఈనెల 14న జరిగిన ప్రారంభోత్సవానికి తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ విష్ణు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నెల్లాయ్ జిల్లాకు చెందిన బాబు.. ‘ద డాంకీ ప్యాలెస్​’ ఫామ్​కు యజమాని. అతడు వంద గాడిదలతో ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. వాటి కోసం సకల సదుపాయాలు కల్పించాడు. పాలు తీసి, ప్రాసెస్ చేసి, నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. రత్​లో గాడిదల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతుండగా.. వాటి పాలకు మాత్రం డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉండే గాడిద పాలను సౌందర్య ఉత్పత్తుల తయారీలో విక్రయిస్తారు. రోజూ సేకరించిన పాలను.. బెంగళూరులో సబ్బులు, ఇతర కాస్మోటిక్స్​ తయారు చేసే సంస్థలకు సరఫరా చేయనున్నట్లు గాడిదల ఫామ్ యజమాని బాబు వెల్లడించారు. బహిరంగ మార్కెట్​లో లీటరు గాడిద పాల ధర రూ.7వేల వరకు ఉంటుందని కలెక్టర్ విష్ణు చెప్పారుబాబు తరహాలోనే ఒంటె పాలతో వ్యాపారం చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.

దేశంలో గాడిద జనాభా ఇలా..:
వినియోగం తగ్గటం, చోరీలు, మేత భూమి కొరత, అక్రమంగా వధించటం.. ఇలా కారణాలేవైనా దేశంలో గాడిదల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. 2012 నుంచి 2019 వరకు.. అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలో గాడిదలు 61 శాతం తగ్గినట్లు ఓ అధ్యయనం తేల్చింది. ‘బ్రూక్‌ ఇండియా’ అనే సంస్థ దేశంలో గాడిదల ఉనికి, ఈ మూగ జంతువులతో చేస్తున్న అక్రమ వ్యాపారాలపై అధ్యయనం చేసింది.దేశంలో అక్షరాస్యత పెరగడం, మోతకు గాడిదలను వాడే ఇటుకల పరిశ్రమ వంటి వాటిలో యంత్రాలు రావడం, రవాణాకు కంచర గాడిదల వైపు మొగ్గుచూపటం వంటి కారణాలతో కూడా గాడిదల సంఖ్య తగ్గుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. గాడిదలను అక్రమంగా రవాణా చేయడం, వాటి తోలు, మాంసం అక్రమ మార్గాల్లో దేశ సరిహద్దులు దాటించడం కూడా గాడిదల సంఖ్య తగ్గడానికి కారణాలు అవుతున్నట్లు ‘బ్రూక్‌ ఇండియా’ తేల్చింది. మందుల తయారీ కోసం గాడిదల చర్మం చైనాకు ఎక్కువగా రవాణా అవుతోంది. ‘ఎజియావో’ అనే ఈ ఔషధం పలురకాల రుగ్మతలకు చికిత్సలో వాడతారు. ప్రస్తుతం భారత్​లో లక్షా 40 వేల గాడిదలు ఉన్నాయి. తమిళనాడులో వాటి సంఖ్య 428 మాత్రమే.