Politics

దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే – TNI రాజకీయ వార్తలు

దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే  – TNI రాజకీయ వార్తలు

* ఏపీలో జరుగుతోన్న అభివృద్ధి అంతా బీజేపీదేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మంత్రి బొత్స తిరిగే రోడ్లను వేసిందే కేంద్రమన్నారు. దేశంలో అతి పెద్ద మతతత్వ పార్టీ వైసీపీనే అని పేర్కొన్నారు. హనుమాన్ యాత్రపై బీరు బాటిళ్లు వేసిన ఘటనలు.. వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలేనని సోము వీర్రాజు పేర్కొన్నారు.
**సీఎంకు సేవ చేసినవారికే సీట్లు:విష్ణుకుమార్‌రాజు
‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనకు వ్యక్తిగత సేవ చేసినవారికే రాజ్యసభ సీట్లు ఇచ్చారు. తన సీబీఐ కేసులు వాదిస్తున్న నిరంజన్‌రెడ్డికి సీటు ఇవ్వడం సరైన పద్ధతి కాదు’’ అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. ఆయన విశాఖపట్నంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రజాసేవ చేసేవారికి ఇస్తే పది మందికి మేలు జరుగుతుంది. రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుంది. ఇలా వ్యక్తిగత పనులు చేసే వారికి ఇవ్వడం బాధాకరం. ఏపీ ప్రభుత్వాన్ని జగన్‌ తన సొంత కంపెనీలా మార్చేసుకుంటున్నారు’’ అని విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు.
*Jagan దృష్టిలో నేను ఉన్నాను: అలీ
అనూహ్య పరిణామాల మధ్య నటుడు అలీ వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయనను రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణలో భాగంగా అది కుదరలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది ముచ్చట తీరలేదు. తీరా.. అలీని రాజ్యసభకు పంపడం ఖాయమని వైసీపీ శిబిరం ప్రచారం చేసింది. అక్కడ కూడా ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఏపీ నుంచి నలుగురిని రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తీరా చూస్తే ఈ లిస్టులో అలీ లేరు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. తాను రాజ్యసభ సీటును ఆశించలేదని వెల్లడించారు.‘‘జగన్ దృష్టిలో నేను ఉన్నాను. భవిష్యత్‌లో ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తా. నీకు ఫలానా పదవి ఇస్తామని జగన్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదు, ఏదో ఒక పదవి ఇస్తామని గట్టిగా చెప్పారు. నేను ఆ నమ్మకంతోనే ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు వక్ఫ్‌ బోర్డు చైర్మన్ పదవి కూడా నాకు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆ పదవి వేరే వాళ్ళకు కేటాయించారు. ప్రభుత్వం నుంచి ఒకరోజు పిలుపు వస్తుంది. ఆరోజు మీడియా ముందుకు వస్తాను’’ అని అలీ ప్రకటించారు.
*మేమొస్తే మొదటి 30 నెలల్లోనే రుణమాఫీ:రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 నెలల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రైతులకు రుణమాఫీని విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని రేవంత్‌ చెప్పారు. రాష్ట్రంలో వృథా ఖర్చును పూర్తిగా నిరోధిస్తామన్నారు. రైతుబంధును పేదలకు ఇవ్వాల్సి ఉండగా ధనికులకు ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకునే వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించామని రేవంత్‌ తెలిపారు. ఏడేళ్లలో కేసీఆర్‌ రూ.5లక్ష కోట్ల అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసే తెలంగాణ ఇచ్చామని రాహుల్‌గాంధీ చెప్పారన్నారు. రానున్న రోజుల్లో వైద్యం, విద్య, నిరుద్యోగంపై డిక్లరేషన్లు ప్రకటిస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వస్తే పంటల విషయంలో గందరగోళ పరిస్థితులు ఉండవని.. పంట మార్పిడి అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.
*వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప: తులసిరెడ్డి
‘‘వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయింది. అప్పు ఆంధ్రప్రదేశ్‌గా, రుణాంధ్రప్రదేశ్‌గా తయారైంది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందన్నారు. తలసరి అప్పు రూ.1.50 లక్షలు, కుటుంబ తలసరి అప్పు రూ.6 లక్షలు అని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎ్‌సడీపీలో) రాష్ట్రం మొత్తం అప్పు 25 శాతం దాటకూడదన్నారు. కానీ ఏపీలో 36.4 శాతంగా ఉందన్నారు. ప్రకటనల పేరుతో, సలహాదారుల పేరుతో, పర్యటనల కాన్వాయ్‌ల పేరుతో భారీగా దుబారా జరుగుతోందన్నారు. కాగ్‌ అక్షింతలు వేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇలాగే ఆర్థిక అరాచకత్వం కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక అవుతుందన్నారు. భారత రాష్ట్రపతి జోక్యం చేసుకొని రాజ్యాంగంలోని 360 అధికరణ ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని విధించాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.

*బాదుడే బాడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళుతోందని..: అచ్చెన్న
ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గడప గడపకు వైసీపీ అని పెడితే ప్రజలు వెంటపడతారని.. గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారన్నారు. బాదుడే బాడుడుతో టీడీపీ ప్రజల వద్దకు వెళుతోందని.. పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తోందన్నారు. తాడికొండలో ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 స్థానాల్లో గెలిచి టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారన్నారు. వైసీపీ ఓ గాలి పార్టీ అని.. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుందన్నారు. వైసీపీకి అసలు రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హతే లేదన్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఇద్దరికి, జగన్ దొంగ లెక్కలు రాసే ఒకరికి, సీబీఐ కేసులు వాదించే ఇంకొకరికి రాజ్యసభ సీట్లిచారన్నారు. బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ బంధాన్ని జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా విడదీయలేరన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా బీసీలను టీడీపీ నుంచి వేరు చేయటం జగన్ తరం కాదన్నారు. పదవులు ఇచ్చి బీసీల నోటికి ప్లాస్టరు వేస్తున్నారన్నారు. రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చారని అచ్చెన్న పేర్కన్నారు.
*రాష్ట్రంలో ఒక కుట్ర జరుగుతోంది: బొత్స
పార్టీని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులకు, జిల్లా మంత్రులకు వుందని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యకలాపాలు జరగబట్టేఅధికారంలోకి వచ్చామన్నారు. ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమం అధికారులు నిర్వహించాలని చెప్పారు. రెండోసారి అధికారంలోకి రావడం కోసం మొదటిసారి ఎన్నికైన ప్రతి నాయకుడు కష్టపడాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అధిష్టానం వద్ద గుర్తుంపు ఉంది వారికే పార్టీ పదవులని పేర్కొన్నారు. అలాగే రేపటి నుంచి లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లింపులు జరుగుతాయన్నారు. ఎన్.ఆర్.జిఎస్ నిధుల బకాయిలను ఈ నెల ఆఖరిలోగా ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం చాలా అవసరమన్నారు. రాష్ట్రంలో ఒక కుట్ర జరుగుతోందని, బలహీన వర్గాలను అనిచెందుకు ప్రతి పక్షం పావులు కదుపుతోందన్నారు.
*ప్రజలపై Jagan సైకోలను వదిలారు: చంద్రబాబు
ప్రజలపై సీఎం జగన్ (Jagan) సైకోలను వదిలారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ సైకోలనూ వదలం.. వడ్డీతో సహా తీర్చుకుంటామని హెచ్చరించారు. బుధవారం చంద్రబాబు (Chandrababu) మీడియాతో మాట్లాడుతూ సొంత నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వలేని సీఎం రాష్ట్రాభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నందునే అప్పులు పుట్టలేదని తెలిపారు. తప్పులు ఎత్తిచూపితే ఎల్లో మీడియా ముద్ర వేస్తున్నారని చెప్పారు. జగన్ శాడిజం, అరాచకం, విధ్వంసాన్ని ప్రజలు చూస్తున్నారని హెచ్చరించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే ఆలోచించి ఉంటే.. జగన్ ఇడుపులపాయ దాటి బయటికి వచ్చేవాడు కాదన్నారు. మాజీమంత్రి వివేకా హత్య విషయంలో జగన్ విశ్వసనీయత ప్రజలకు తెలిసిపోయిందన్నారు. వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, అధికారులు కూడా ప్రజావ్యతిరేకంగా పనిచేస్తున్నారని చంద్రబాబు తప్పుబట్టారు.
*కేంద్రం నిధులకు జగన్‌ స్టిక్కరా..!: సాదినేని
‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు కేంద్రం నిధులిస్తోంది. ఆ పథకాలన్నీతానే ఇచ్చినట్లు జగన్‌ స్టిక్కర్‌ వేసుకుని, ప్రజల్ని మోసం చేస్తున్నారు’’ అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామినీశర్మ ఆరోపించారు. అబద్ధపు లెక్కలతో, అవాస్తవ ప్రకటనలతో ప్రజల్ని ఇంకెంత కాలం మోసం చేస్తారని నిలదీశారు.
*గడప గడపకు పోలీస్‌, వలంటీర్ల సాయం: సోము
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని పోలీసులు, వలంటీర్ల సహాయంతో ముందుకు తీసుకెళుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. కాకినాడలో బీజేపీ నాయకులు నిర్వహించిన శక్తి కేంద్రాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంద అన్నారు. కాకినాడ జేఎన్‌టీయూకే సమస్య కోర్టులో ఉండగా స్థానిక ఎమ్మెల్యే బీజేపీపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు లేఖ రాస్తామని, స్థానిక ఎమ్మెల్యేను బర్త్‌రఫ్‌ చేసే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీకి పోలవరం ప్రాజెక్టు తప్ప ఇతర ప్రాజెక్టులేమి కనబడడం లేదని, ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు అయినా ప్రారంభించారా అని వీర్రాజు ప్రశ్నించారు.
*మోదీని గద్దె దించితేనే దేశ అభివృద్ధి: రామకృష్ణ
భారతదేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ లాంటి మతోన్మాదిని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. భారతదేశంలో ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ మతతత్వ పరిపాలన సాగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి దూరంగా ఉందని విమర్శించారు. సీఎంకు అప్పులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు.
*ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి ఉంది: adimulapu suresh
ఏపీ టౌన్ ప్లానింగ్శాఖలో అవినీతి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విజిలెన్స్, ఏసీబీ ఫైల్స్ చూస్తే ఎక్కువ కేసులు టౌన్ ప్లానింగ్ మీదే ఉన్నాయన్నారు. టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల తీరు మారాలని ఆయన సూచించారు. కర్నూలు జిల్లాకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయన్నారు. అలాగే కర్నూలుకు జుడీషియల్ క్యాపిటల్ వస్తోందన్నారు.
*సాగుబోర్లకు మీటర్లు బిగిస్తున్నారు: dhulipalla narendra
వైసీపీ పాలనలో వ్యవసాయానికి సాయం తగ్గిందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రైతులను కులాల పేరుతో వైసీపీ ప్రభుత్వం విభజిస్తోందన్నారు. రాష్ట్రంలో సాగుబోర్లకు మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. రాయితీలు ఇవ్వడం ఎందుకు?.. మీటర్లు బిగించడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ ఎత్తివేసే కుట్రలో భాగంగానే మీటర్లన్నారు. ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఆర్‌బీకేల పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
*పవన్ సాయం చేసింది వారికి కాదా?: nadendla manoha
రైతులను మోసం చేయడంలో జగన్‌ను మించినవారుండరని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. పవన్ సాయం చేసింది కౌలు రైతులకు కాదా?, కౌలు రైతులకు జనసేన సాయం చేయలేదని జగన్‌ చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. కౌలుకు తీసుకుని అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని, పోలీస్ రికార్డుల్లో వివరాలు చూపిస్తామన్నారు. సీబీఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. రైతులను కులాలవారీగా విభజించిన ప్రభుత్వమిదేనన్నారు. సీబీఐ దత్తపుత్రుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సాయాన్ని కూడా రాజకీయంగా చూడటానికి సిగ్గుండాలన్నారు.
*సీఎం కేసీఆర్ మాట‌లు బారెడు.. ప‌నులు మూరెడు: విజయశాంతి
సీఎం కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసిన‌ట్టే ఉంటాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. సీఎం చెప్పే మాట‌లు బారెడని… చేసే ప‌నులు మాత్రం మూరెడు అని ఆమె విమర్శించారు. దొర‌గారి ఎన్నిక‌ల‌ హామీలు నీటిమూట‌ల్లాగే మిగిలిపోతున్నాయన్నారు. ఇప్పుడు ఓరుగ‌ల్లు బిడ్డ‌లు రోడ్డెక్కి ధ‌ర్నా చేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విజయశాంతి గుర్తు చేశారు. రెండు వారాలుగా ఏదో ఒక రూపంలో నిరసనలు చేస్తున్నారని, వ‌రంగ‌ల్ ఒక్క చోటే కాదని, తెలంగాణ మొత్తం ఇదే జ‌రుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణ ప్ర‌జానీక‌మే కేసీఆర్ స‌ర్కార్‌ను బంగాళాఖాతంలో క‌లప‌డం ఖాయమని విజయశాంతి వ్యాఖ్యానించారు. ‘‘తమకు ఇల్లు కట్టిస్తమని చెప్పి కట్టివ్వకపోగా… తాము వేసుకుంటున్న గుడిసెలను తొలగించుడేందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బడాబాబులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసినా పట్టించుకోని అధికారులు… గరీబోళ్ల మీద పగబట్టినట్లు చేసుడేందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారుతో తాడో పేడో తేల్చుకుందమని పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారు. వీటిని రెవెన్యూ, పోలీస్‍ అధికారులు జేసీబీలు పెట్టి కూల్చేస్తున్నారు. కొన్నిచోట్ల అగ్గిపెడుతుంటే పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లవుతున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్లో పేదలు రోడ్డెక్కుతున్నారు. కిరాయి ఇండ్లకు నెలనెలా వేలల్లో ఇంటి కిరాయిలు కట్టే స్థోమత లేక అల్లాడుతున్నారు.’’ అని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
*రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు – రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐసిసి నిర్వహించిన చింతన్ శిబిర్లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకున్నారని చెప్పారు. చింతన్ శిబిర్ నిర్ణయాలు ఆమోదిస్తూ తీర్మానానికి నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను జనంలోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి నెలరోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు జరుగతాయన్నారు. మే 21న ప్రతి నేత గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలని పిలుపునిచ్చారు.
*గౌతమ బుద్ధుని బోధనలు అనుసరణీయం: Kcr
గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(kcr) బుద్ధుని బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని సీఎం అన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిడవిల్లిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున ప్రకృతి రమణీయవతల నడుమ అన్ని హంగులతో నాగార్జున సాగర్ లో అంతర్జాతీయ స్ధాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం బౌద్ధకేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని సీఎం అన్నారు
*మోదీ 2 హిందుస్థాన్లను కోరుతున్నారు: రాహుల్‌
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలో అత్యంత బలంగా తయారైన ఆర్థిక వ్యవస్థను మోదీ బలహీన పరిచారని విమర్శించారు. రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ.. దేశాన్ని రెండు హిందుస్థాన్‌లుగా విభజించాలని చూస్తున్నారు. ఒకటి.. ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల కోసం కాగా.. మరొకటి రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాల కోసం. కానీ, కాంగ్రెస్‌ ఒకే హిందుస్థాన్‌ను కోరుకుంటోంది’’ అని రాహుల్‌ చెప్పారు.
*గుజరాత్‌లో 182 సీట్లు గెలవాలి: అమిత్‌ షా
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 182 సీట్లలో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కేవలం 35-40 మంది ముఖ్యనేతలు హాజరయ్యారు. గత ఎన్నికల్లో వందసీట్లు దాటలేకపోయామని, కానీ ఈసారి బీజేపీ ప్రభంజనం వీచేలా చూడాలని అమిత్‌ షా చెప్పినట్లు సమాచారం.
*గుజరాత్‌లో 182 సీట్లు గెలవాలి: అమిత్‌ షా
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 182 సీట్లలో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కేవలం 35-40 మంది ముఖ్యనేతలు హాజరయ్యారు. గత ఎన్నికల్లో వందసీట్లు దాటలేకపోయామని, కానీ ఈసారి బీజేపీ ప్రభంజనం వీచేలా చూడాలని అమిత్‌ షా చెప్పినట్లు సమాచారం.
*జ్ఞానవాపి మరో బాబ్రీ కానీయను: ఒవైసీ
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు బాబ్రీ పరిస్థితి రానీయబోనని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సోమవారం గుజరాత్‌లోని వడ్‌గాంలో ఆయన ప్రసంగిస్తూ.. చట్టా న్ని ఉల్లంఘించి జ్ఞానవాపి మసీదులో సర్వే జరుపుతున్నారని.. ఇది తనను బాధిస్తోందని ఆందోళన వ్య క్తం చేశారు. ‘‘నేను అంతరాత్మను అమ్ముకోలేదు. అం దుకే జ్ఞానవాపి మసీదుపై మాట్లాడుతునే ఉంటా. అ ల్లాకే తప్ప మోదీకో, యోగీకో భయపడను. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం నాకు భావ ప్రకట న స్వేచ్ఛ ఇచ్చింది. అందుకే ఈ సమస్యపై మాట్లాడుతునే ఉంటా’’ అని చెప్పారు. ఇలా చేయడం ద్వారా కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తున్నట్టు తనను విమర్శిస్తున్నారన్నారు. తనను ప్రశ్నించే వారు ప్రార్థనా మందిరాల చట్టం-1991లోని సెక్షన్‌ 4(2)ను చదువుకోవాలని చెప్పారు. ఈ సెక్షన్‌ ప్రకారం ప్రార్థనా మందిరాల్లో 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న పరిస్థితులను మార్చేలా వ్యాజ్యాలు వేయకూడదన్నారు. హిజాబ్‌, జాబ్‌ జిహాద్‌ అంటూ గాడ్సే భక్తులే ముస్లింలపై విద్వేషం కలిగేలా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మేలు చేయడానికే ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేస్తోందన్న విమర్శలను ఒవైసీ ఖండించారు.