NRI-NRT

అమెరికాలో పదే పదే ఎమర్జెన్సీ నెంబర్‌కు ఓ వ్యక్తి ఫోన్.. అతడు చెప్పింది విని అతడినే అరెస్ట్ చేసిన పోలీసులు..!

Auto Draft

911.. ప్రమాద సమయంలో సాయం కోసం అమెరికా ప్రజలు డయల్ చేయాల్సిన నెంబర్ ఇది. 911కు కాల్ చేసిన వెంటనే సాయం అందుతుంది. కానీ.. 911కు కాల్ చేసిన ఓ అమెరికా వ్యక్తిని అక్కడి పోలీసులే అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన కథనం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం అతడి విపరీత ధోరణే..! ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన జేకబ్ ఫిల్‌బెక్(29) ఇటీవల పలుమార్లు 911 నెంబర్‌కు ఫోన్ చేసి అక్కడి సిబ్బందిని ఇబ్బంది పెట్టాడు. జైల్లో మగ్గుతున్న డ్రగ్స్ కింగ్‌పిన్ ఎల్ చాపోను విడుదల చేయాలని, అమెరికా అధ్యక్షుడిని జైలు పాలు చేయాలని చెప్పాడు. మొదటి సారి అధికారులు అతడి వైఖరిని క్షమించి వదిలేశారు. అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన ఈ నెంబర్‌ను ఇలా దుర్వినియోగ పరచకూడదని హెచ్చరించారు. కానీ జేకబ్ మాత్రం వారి హెచ్చరికలను బేఖాతరు చేశారు. పదే పదే..911కు ఫోన్ చేసి బైడెన్‌ను జైల్లో పెట్టాలంటూ తన పిచ్చి ప్రేలాపనను కొనసాగించాడు. దీంతో.. అధికారులు అతడిని అరెస్టు చేశారు. అతడు ఫోన్‌లో మాట్లాడుతుండగానే ఇంటి తలుపు తట్టిన పోలీసులు జేకబ్‌ను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో కూడా అతడు.. బైడెన్‌ను జైల్లో పెట్టాలంటూ పోలీసులను కోరడం విశేషం. అయితే.. 150 డాలర్లు పూచికత్తుపై పోలీసులు అతడిని విడుదల చేశారు. పినెల్లాస్ కౌంటీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.