NRI-NRT

అమెరికాలో పసిపిల్లల ఆహారానికి కొరత

అమెరికాలో పసిపిల్లల ఆహారానికి కొరత

అమెరికాలో పసిపిల్లల ఆహారానికి(సెరెలాక్‌, నాన్‌ ప్రో లాంటి ఫార్ములా) కొరత ఏర్పడింది. దేశంలోనే అతిపెద్దదైన అబాట్‌ న్యూట్రిషన్‌ ప్లాంట్‌ను మూసివేయడంతో కొన్ని రోజులుగా ఈ ఆహార ఫార్ములా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో అధ్యక్షుడు బైడెన్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. పసిపిల్లల ఆహార ఫార్ములా ఉత్పత్తిని పెంచడానికి చర్యలు చేపట్టారు.ఫార్ములా తయారీకి అవసరమైన ముడి సరుకును విదేశాల నుంచి వేగంగా దిగుమతి చేసుకొనేందుకు రక్షణ విమానాలను కేటాయించారు. దీనికి అమెరికా ‘ఆపరేషన్‌ ఫ్లై ఫార్ములా’ అని పేరు పెట్టింది. ‘దేశవ్యాప్తంగా తల్లిదండ్రులందరూ పిల్లలకు ఆహారం కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఎంత బాధాకరమైనదో ఒక తండ్రిగా, ఒక తాతగా నాకు తెలుసు’ అని బైడెన్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ వ్యాఖ్యానించారు. ఈ చట్టం ప్రకారం.. ఫార్ములా తయారీ సంస్థలు చిన్నపిల్లల ఫార్ములాను బయట అమ్మకూడదు. ప్రభుత్వానికే ఇవ్వాలి. అబాట్‌ న్యూట్రిషన్‌ సంస్థలో క్రోనోబాక్టర్‌ బాక్టీరియా కనిపించడంతో సంస్థను మూసివేశారు.