Politics

పేరు గొప్ప… ఊరు దిబ్బలా జగన్ ప్రభుత్వం – TNI రాజకీయ వార్తలు

పేరు గొప్ప… ఊరు దిబ్బలా జగన్ ప్రభుత్వం – TNI రాజకీయ వార్తలు

* వైసీపీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ సాకె శైలజానాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రోడ్లకు మరమత్తులు ఏవి అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుంటే రోడ్లు ఎలా వేస్తారని నిలదీశారు. రివర్స్ టెండర్‌తో పాలన అంతా రివర్స్ అంటూ విమర్శించారు. ఎన్‌డీబీ నుంచి తీసుకున్న రుణం ఏమైందని అడిగారు. పేరు గొప్ప… ఊరు దిబ్బలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌లో కాకుండా రోడ్లపై జగన్ రెడ్డి తిరగాలని హితవుపలికారు. రహదారులపై కేటాయించిన రూ.6400 కోట్లు ఎటు మళ్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
*ప‌క్క‌ రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా ఏపీని చూపిస్తున్నారు: నారా లోకేష్రా
ష్ట్రంలో రోడ్లు న‌డిచేందుకు కూడా వీలుగా లేదని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ప‌క్క‌ రాష్ట్ర పాల‌కులు అధ్వాన పాల‌న‌కి ఉదాహ‌ర‌ణ‌గా మ‌న ఏపీని చూపిస్తున్నారన్నారు. అయినా ప్ర‌భుత్వ స్పంద‌న శూన్యమన్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా, ఆధ్మాత్మిక ప్ర‌పంచానికి ద‌గ్గ‌ర‌గా, హిందూ ధ‌ర్మ ప్ర‌చార‌మే జీవిత‌ ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌హ‌దారుల దుస్థితిపై ఆవేద‌న‌తో స్పందించారని నారా లోకేష్ పేర్కొన్నారు. గ‌తుకులు-గుంత‌లు, ఒడిదుడుకుల గురించి ప్ర‌స్తావిస్తూనే.. జంగారెడ్డి గూడెం నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌ర‌కూ రోడ్డు ప్ర‌యాణం ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోనుంద‌ని రోడ్ల దుస్థితిని భ‌క్తుల‌కు చెబుతున్న‌ట్టే ప్ర‌వ‌చ‌నంలో భాగంగానే వ్యాఖ్యానించ‌డం చూస్తుంటే.. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో ర‌హ‌దారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్ప‌ష్టం అవుతోందని నారా లోకేష్ పేర్కొన్నారు.
*వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు’
‘‘వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రశ్నించిన రైతుని, రైతుని ఆపలేదని పోలీస్ అధికారిని, కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిని నోటికొచ్చినట్టు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడటం దారుణమన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో బ్రాహ్మణులను కించపరిచేలా ‘‘పంతులూ నీ సంగతి చూస్తా’’ అంటూ పాత్రికేయుడు గణేష్‌ను బెదిరించడం వైసీపీ నాయకుల అహంకారానికి నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ఫ్రస్టేషన్‌లో మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించడం, రైతుని బూతులు తిట్టడం, ఎస్సైని ఒరేయ్ అంటూ చిందులు తొక్కడం చూస్తుంటే.. వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడినట్టే కనిపిస్తోందని లోకేష్ అన్నారు.
*నేను నిప్పులాంటి మనిషిని.. నన్నెవరూ ఏమీ చేయలేరు..
తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు వేదికగా వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాము కన్నెర్ర చేస్తే సీఎం వైఎస్ జగన్‌ తట్టుకోలేరని ఒకింత హెచ్చరించారు. కర్నూలులో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించి వైసీపీ జెండాలు పెట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు అని వ్యాఖ్యానించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
*TRSలో ఉద్యమకారులకు చోటు లేదు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్టీ
ఆర్ఎస్‌లో ఉద్యమకారులకు చోటు లేదని BJP సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రాజ్యసభ సభ్యల ఎంపికతో ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో స్థానం లేదను రుజువైందన్నారు. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సిటు కేటాయించడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఇచ్చే నిధులతో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పేదలకు కేంద్రం ఉపాధి చూపిస్తుంటే.. కమిషన్‌లు రావడంలేదని ఆ పథకాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం గాడి తప్పిందన్నారు. ఇంటింటికీ బీరు, వీధికో బారు, ఇదే కేసీఆర్ దర్బార్ అనే తరహాలో కేసీఆర్ పాలన సాగుతుందని విమర్శించారు. వచ్చే నెల ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఆర్థిక పరిస్థితిపై శ్వేతా పత్రం విడుదల చేయాలి ప్రభాకర్ డిమాండ్ చేశారు.
*మున్నూరు కాపులకు CM KCR సముచిత స్థానం ఇచ్చారు: మంత్రి గంగుల
తెలంగాణ రాకముందు మున్నూరు కాపులను రాజకీయంగా వాడుకున్నారని, బీసీల్లో అధిక శాతం ఉన్న మున్నూరు కాపులకు CM కేసీఆర్ పదవులు ఇచ్చి గౌరవించడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థి‌గా వద్దిరాజు రవిచంద్రకు అవకాశం ఇచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. కుల సంఘం సమావేశం పెట్టడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే తన కులాన్ని ముందు తాను గౌరవిస్తానని చెప్పారు. అన్నీ పార్టీలు గుర్తించాలంటే కుల సంఘాలు పటిష్టంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బీసీలకు నాలుగు మంత్రిత్వ శాఖలు కేటాయించారని, హైదరాబాద్ మహానగరంలో మున్నూరు కాపులకు రెండు సార్లు మేయర్ పదవీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే కోకాపేటలో కోట్ల విలువైన స్థలం మూన్నురు కాపు భవనానికి ఇచ్చారని, మున్నూరు కాపులు ఎల్లప్పుడూ కేసీఆర్ వెన్నంటే ఉంటారని పేర్కొన్నారు.
*అందుకే విద్యుత్ పన్నుల పెంపు
కేంద్ర సంస్కరణలకు తలొగ్గే ఏపీలో విద్యుత్ పన్నుల పెంపని సీపీఎం నేత రాఘవులు అన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో ఏపీ ప్రభుత్వంలో నిజాయితీ కనిపించడం లేదని, ఓట్ల కోసమే జగన్ మొక్కుబడి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులకు కేంద్రం భంగం కలిగిస్తున్నా వైసీపీ ప్రశ్నించడం లేదన్నారు. ప్రతిపక్షం కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం నినదిస్తే మద్దతిస్తామన్నారు.
*అడుగడుగునా దగా చేస్తున్నారు: lanka dinakar
అన్ని రకాల ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే అన్న సీఎం జగన్‌ రాజ్యసభ స్థానాలు మాత్రం స్థానికేతరులతో నింపారని బీజేపీ నేత లంకా దినకర్‌ అన్నారు. తన తండ్రి మరణానికి కారణమని ఆరోపించినవారి మాటపైనే జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని చెప్పారు. స్థానికేతరులను రాజ్యసభకు పంపి ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రపై ద్వేషం విరజిమ్మేవారిని సలహాదారుగా నియమించారని, ఇప్పుడు నేరుగా చట్టసభలకు పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటూనే అడుగడుగునా దగా చేస్తున్నారని మండిపడ్డారు.
*నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదని అర్థమైంది: ఏబీవీ
ఏపీ సెక్రటేరియట్‌కు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. జీఏడీలో ఆయన రిపోర్టు చేశారు. జాయినింగ్ రిపోర్టుతో సీఎస్‌ను కలిసేందుకు ఏబీవీ ప్రయత్నించారు. అయితే రిపోర్టును పేషీలో ఇచ్చి వెళ్లాలని ఏబీవీకి సీఎస్‌ సూచించారు. అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జీఏడీలో జూనియర్‌ అధికారులుంటారని, సివిల్‌ సర్వీసెస్‌ సంప్రదాయాల ప్రకారం జూనియర్లకు రిపోర్ట్‌ చేయకూడదన్నారు. సీనియర్‌ అధికారి లేకపోతే వారి పీఏకు ఇవ్వాలనడం సంప్రదాయమని తెలిపారు. ఆఫీస్‌లో సీఎస్‌ ఉండి కూడా రిపోర్ట్‌ పేషీలో ఇచ్చేసి వెళ్లిపోమన్నారని చెప్పారు బిజీగా ఉంటే రేపు సమయమిచ్చి రమ్మని ఉంటే బాగుండేదన్నారు. తనను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదని అర్థమైందని తెలిపారు. ఏదేమైనా తన పని రిపోర్ట్‌ చేయడం వరకేనని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

*బీజేపీ విచ్ఛిన్నకర విధానాలను తిప్పికొట్టాలి: సీపీఎం
రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మసీదులో శివలింగం ఉందంటూ మత ఘర్షణలను సృష్టిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. బీజేపీ విచ్ఛిన్నకర విధానాలను లౌకికవాదులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాముడి పేరుతో బాబ్రీ మసీదును కూల్చారని, ఇప్పుడు జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అలాగే, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం భగత్‌సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించడాన్ని తప్పుబట్టారు. ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలాన్ని బోధించేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒక్కరైన హెడ్గేవార్‌ పాఠ్యాంశాన్ని చేర్చడం దారుణమన్నారు. బీజేపీ విధానాలను సమర్థిస్తాయా? లేక దేశ సమైక్యతకు కట్టుబడి ఉంటాయో వైసీపీ, టీడీపీ, జనసేన తేల్చాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని 551 రోజులుగా దీక్షలు చేస్తున్న టీటీడీ ఫారెస్టు కార్మికులకు సంఘీభావం తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి, జిల్లా కార్యదర్శి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
*రాష్ట్రంలో బీసీలే లేరా?: కంది మురళీనాయుడు
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వింత, వింతగా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో బీసీ నాయకులే లేరా? పొరుగు రాష్ట్రం వారికి రాజ్యసభ సీట్లు కేటాయించడం సబబా? అని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కంది మురళీనాయుడు ప్రశ్నించారు. విజయనగరంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలోని బీసీ వ్యక్తికి ఆంధ్రా కోటా నుంచి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు.
*టీఆర్‌ఎస్‌-వైసీపీ రహస్య బంధం రుజువైంది: ధూళిపాళ్ల
టీఆర్‌ఎస్‌, వైసీపీ మధ్య చాలా దృఢమైన రహస్య బంధం ఉందని, వారి స్వప్రయోజనాల కోసం కలిసి పని చేస్తారన్న వాస్తవం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ద్వారా మరోమారు రుజువైందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత సహ నిందితుల ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువు చేశారని విమర్శించారు. వైసీపీ తరఫున తన కేసులు వాదించే తెలంగాణకు చెందిన నిరంజన్‌రెడ్డి, తన సహనిందితుడు విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీట్లు ఇవ్వగా, తన రాజకీయ గురువు కేసీఆర్‌ సహకారంతో మరో నిందితుడు హెటిరో పార్ధసారధిరెడ్డిని టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయించుకోగలిగారని పేర్కొన్నారు. చట్టంలోని లొసుగులను వినియోగించుకుని, నేరస్తులు, వారికి అండగా నిలిచే వారిని పెద్దల సభకు చేరుకునే కార్యక్రమం జరగడం బాధాకరమని ఆక్షేపించారు.
*YCP ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేసింది?: Chandrababu
వైసీపీ ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేసింది? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కడప జిల్లా లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులు దెబ్బతిన్నారని, యువతకు ఉద్యోగాలు రాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో టెక్నాలజీ రంగాన్ని డెవలప్‌ చేశానని గుర్తుచేశారు. ప్రజల కోసం 24 గంటలు పనిచేస్తానని ప్రకటించారు. ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయికి ఎదిగే శక్తి ఏపీ యువతకు ఉందని తెలిపారు. మద్యం ధరలు ఇష్టానుసారం పెంచడంతో.. ప్రజలు సారా, గంజాయి వైపు మళ్లారని తెలిపారు. డబ్బు కోసం కల్తీ మద్యం అమ్ముతున్నారని తప్పుబట్టారు. జే-బ్రాండ్‌తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం వందల ఎకరాలు కొట్టేశారని, ఊరికో సైకోను తయారు చేశారని చంద్రబాబు ఆరోపించారు.
*Polavaram నిర్మాణంపై జగన్‌ నోరుమెదపాలి: దేవినేని ఉమాt
పోలవరం నిర్మాణంపై సీఎం జగన్‌ నోరుమెదపాలని మాజీమంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి మౌనం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందన్నారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రితో పిచ్చిమాటలు చెప్పిస్తే సరిపోదన్నారు. తనను, టీడీపీ అధినేత చంద్రబాబును తిడితే పోలవరం పూర్తికాదని చెప్పారు. జగన్‌ మూర్ఖత్వం, అవగాహనారాహిత్యమే పోలవరానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు. పోలవరంపై పొరుగురాష్ట్ర వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం.. జగన్‌ అసమర్థత కాదా? అని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టుపెడతారా?.. మూడేళ్లలో జగన్‌ ఒక్క ప్రాజెక్టైనా పూర్తి చేశారా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
*జగన్‌ కక్కుర్తికి పోలవరం బలి: దేవినేని ఉమ
ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి డబ్బు కక్కుర్తికి పోలవరం ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘పోలవరం ప్రాజెక్టులో వేగంగా పనులు చేస్తున్న కంట్రాక్టర్లను జగన్‌ తరిమేశాడు. తన వాళ్లను తెచ్చి పెట్టుకొంటే కమిషన్లు వస్తాయని ఆశపడ్డాడు. పనులు వేగంగా జరిగే సమయంలో కంట్రాక్టర్లను మార్చడం సరికాదని, వరదలు వచ్చే సమయంలో పనులు ఆగితే చేసిన నిర్మాణాలు కూడా దెబ్బ తింటాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నెత్తీనోరు కొట్టుకొంది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే సలహా ఇచ్చింది. నిపుణులూ అదే మాట చెప్పారు. అయినా ముఖ్యమంత్రి మూర్ఖంగా కొత్త కంట్రాక్టర్లను తెచ్చి పెట్టాడు. ఇప్పుడు తీరిగ్గా డయాఫ్రం వాల్‌ దెబ్బ తిందని… దానిని పూడ్చడానికి సమయం పడుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. డయాఫ్రం వాల్‌ ఎప్పుడు దెబ్బ తిందో తెలియదు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు దాని గురించి చెబుతున్నారు. ఎంత మేర దెబ్బ తిందో ఇప్పటివరకూ పరీక్షలు కూడా జరపలేదు. జగన్‌ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్టును సమాధి చేసింది’ అని విమర్శించారు.