NRI-NRT

భారతీయ కుర్రాడిని ప్రేమించిన విదేశీ యువతి.. ప్రత్యేక వీసా తీసుకుని మరీ భారత్‌కు వచ్చి హిందూ ఆచారం ప్రకారం పెళ్లి..

భారతీయ కుర్రాడిని ప్రేమించిన విదేశీ యువతి.. ప్రత్యేక వీసా తీసుకుని మరీ భారత్‌కు వచ్చి హిందూ ఆచారం ప్రకారం పెళ్లి..

ఆమెమో ఫిలిప్పీన్స్‌కు చెందిన వనితి. అతడేమో భారతీయుడు. ప్రేమలకు పరిమితులు ఉండవని వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవలే వివాహ బంధంలో ఒక్కటయ్యారు. బిహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ వివాహం స్థానికుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. బాత్రా గ్రామానికి చెందిన ధీరజ్ ప్రసాద్ ఫిలిప్పైన్స్‌లోని ఓ హోటల్‌లో మేనేజర్‌. అక్కడ ఉండగానే అతడు వేలుమ్ దుమ్రా అనే యువతితో ప్రేమలో పడ్డాడు. వేలుమ్ మార్కెటింగ్ డీలర్‌గా పనిచేస్తుంటాడు. ఆ తరువాత వారు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
https://dainik-b.in/iaGJLUmIaqb
మే 18న వరుడి స్వగ్రామంలో అంగరంగ వైభవంగా ఈ జంట వివాహం జరిగింది. వేలుమ్.. ప్రత్యేక వీసాపై భారత్‌కు వచ్చింది. ఆమె తల్లిదండ్రులకు వీసా రాకపోవడంతో ఆమె ఒంటిరిగానే భారత్‌కు వచ్చింది. హిందీ రాకపోయినా, భారత సంస్కృతి సంప్రదాయాలతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మనసుపడ్డ వాడిని మనువాడేందుకే ఆమె నిశ్చయించుకుంది. అయితే.. వీరి వివాహంతో గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.