NRI-NRT

14.3 కోట్ల డాల‌ర్ల‌కు అమ్ముడుపోయిన మెర్సిడీజ్ బెంజ్‌.

14.3 కోట్ల డాల‌ర్ల‌కు అమ్ముడుపోయిన మెర్సిడీజ్ బెంజ్‌.

1955 సంవ‌త్స‌రానికి చెందిన మెర్సిడీజ్ బెంజ్ కారు వేలంలో 14.3 కోట్ల డాల‌ర్ల భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది. ఆర్ఎం సూత్బే కంపెనీ ఈ విష‌యాన్ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. జ‌ర్మ‌నీలోని స్ట‌ట్‌గార్ట్‌లో ఉన్న మెర్సిడీజ్ బెంజ్ మ్యూజియంలో మే 5వ తేదీన ఈ కారు వేలం జ‌రిగింది. మెర్సిడీజ్ కంపెనీలోని రేసింగ్ డిపార్ట్‌మెంట్ ఈ కంపెనీని త‌యారీ చేసింది. చీఫ్ ఇంజినీర్ రుడాల్ఫ్ ఉలెన్‌హ‌ట్ పేరును ఈ కారుకు ఫిక్స్ చేశారు. వేలంలో ఓ ప్రైవేటు వ్య‌క్తి కొనుగోలు చేశారు. 300 ఎస్ఎల్ఆర్ ఉలెన్‌మ‌ట్ కూపే కారును ప‌బ్లిక్ సంద‌ర్శ‌న కోసం పెట్ట‌నున్న‌ట్లు అత‌ను తెలిపారు. బెంజ్ మ్యూజియంలో మ‌రో 300 ఎస్ఎల్ఆర్ కారు ఉన్న‌ట్లు సూత్బే వెల్ల‌డించింది. కారు వేలం ద్వారా వ‌చ్చిన డ‌బ్బును మెర్సిడీజ్ బెంజ్ ఫండ్‌కు వాడ‌నున్నారు. ఆ డ‌బ్బును ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ఆర్బీ సూత్బే తెలిపింది. గ‌తంలో 1962కు చెందిన ఫెరారీ 250జీటీ కారు 48 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్ముడుపోయిన విష‌యం తెలిసిందే.