Politics

‘జల్ జీవన్ మిషన్ పథకం’ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు – TNI రాజకీయ వార్తలు

‘జల్ జీవన్ మిషన్ పథకం’ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు – TNI రాజకీయ వార్తలు

*నంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు.జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి కుళాయి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్తో పాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తాగు, సాగునీటి సమస్యలకు సంబంధించిన పలు అంశాలను సమావేశంలో చర్చించారు.ఇటీవల అనంతపురం రూరల్ కక్కలపల్లి కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు సచివాలయాన్ని ముట్టడించారని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో తాము తాగునీటి సమస్య కోసం ఆ ప్రాంత ప్రజలతో కలిసి నిరసనలు చేశామని గుర్తు చేశారు. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న నీటి ప్రాజెక్టులకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని కాపు రామచంద్రారెడ్డి మంత్రిని కోరారు. గుంతకల్ ప్రాంతంలో అత్యధిక చెరువులు ఉన్నాయని.., వాటిలో నీరు నిల్వ ఉండేలా చూడాలని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మంత్రిని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్న మంత్రి పెద్దిరెడ్డి.. అధికారులకు పలు సూచనలు చేశారు.

*ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కు పరాజయమే’.. పీకే జోస్యం!
ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్తో కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది చివర్లో భాజపా పాలిత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘోర ఓటమి తప్పదని అన్నారు. ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిర్తోనే కాంగ్రెస్కు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు పీకే.”ఉదయ్‌పుర్‌ చింతన్‌ శిబిర్‌ గురించి మాట్లాడాలని నన్ను పదే పదే అడుగుతున్నారు. నా అభిప్రాయంలో.. దీంతో(చింతన్ శిబిర్తో) పార్టీకి వచ్చిందేమీ లేదు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల ఓటమి వరకు కాంగ్రెస్‌ అధినాయకత్వానికి సమయం ఇవ్వడం, యథాతథ స్థితిని మరికొంత కాలం కొనసాగించడానికి తప్ప అర్థవంతమైన పరిష్కారాన్ని సాధించడంలో ఆ శిబిరం విఫలమైంది.” అని ట్వీట్ చేశారు ప్రశాంత్ కిశోర్.ప్రశాంత్ కిశోర్ ట్వీట్వరుస ఓటములతో సతమతమవుతున్న తరుణంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఇటీవల మూడు రోజుల ‘చింతన్‌ శిబిర్‌’ నిర్వహించింది కాంగ్రెస్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నవ సంకల్ప చింతన శిబిరం నిర్వహించింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా పలువురు సీనియర్‌ నేతలు ఈ శిబిరంలో ప్రసంగించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్‌ నాయకత్వంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించేలా ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు.ఈ శిబిరానికి కొద్ది వారాల ముందే కాంగ్రెస్‌, ప్రశాంత్‌ కిశోర్‌ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. పీకేను.. కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీలోకి ఆహ్వానించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన ట్వీట్ చేశారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్కు ‘నాయకత్వం’ అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్‌ చింతన్‌ శివిర్‌పై పీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇటీవల సంకేతాలిచ్చిన ప్రశాంత్ కిశోర్ మే 5న కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి ఎలాంటి పార్టీ పెట్టట్లేదని స్పష్టం చేశారు. రాబోయే 3-4 నెలల్లో.. రాష్ట్రానికి చెందిన 17- 18 వేల మంది ప్రముఖుల్ని కలిసి మాట్లాడనున్నట్లు వివరించారు పీకే. బిహార్లో మంచి పరిపాలన(జన్ సురాజ్) కోసం.. వారి నుంచి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే ఈ సందర్భంగా వెల్లడించారు.

* గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ మేధోమథనం వల్ల ఒరిగిందేమీ లేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు.కేవలం యథాతథ స్థితిని కొనసాగించడానికే ఈ సమావేశాలు ఉపయోగపడ్డాయన్నారు. రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.ప్రశాంత్ కిశోర్ శుక్రవారం ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాజస్థాన్‌లో జరిగిన కాంగ్రెస్ నవ సంకల్ప చింతన్ శివిర్‌ ఫలితంపై స్పందించాలని తనను చాలా మంది కోరారని చెప్పారు. ఈ సమావేశాలు ఏదైనా అర్థవంతమైనదానిని సాధించడంలో విఫలమయ్యాయన్నారు. అయితే కనీసం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో రాబోతున్న ఓటమి వరకు యథాతథ స్థితిని సాగదీయడానికి కాంగ్రెస్ నాయకత్వానికి కాస్త సమయం ఇచ్చాయన్నారు.ప్రశాంత్ కిశోర్ ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. పార్టీ పునరుజ్జీవం కోసం వ్యూహాలపై వీరు చర్చించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరినప్పటికీ కొన్ని కారణాలను చూపుతూ ఆయన తిరస్కరించారు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపు సభ్యునిగా ఉండాలని ఆ పార్టీ కోరినప్పటికీ తిరస్కరించారు. పార్టీ అధ్యక్షురాలు ఇచ్చే ఆదేశాల మేరకు ఏర్పడే ఈ గ్రూపునకు పార్టీలో పెద్దగా అధికారం ఏమీ ఉండదని తన అభిప్రాయమని చెప్పారు.ఇదిలావుండగా, గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో జరగవచ్చు. గుజరాత్‌లో కాంగ్రెస్ కీలక నేత హార్దిక్ పటేల్ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు

*ప్రజలకు సాయపడండి : రాహుల్ గాంధీ
అస్సాంలో వరద బీభత్సం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాధ్యమైనంతగా సాయపడాలని కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ శుక్రవారం పిలుపునిచ్చారు. లక్షలాది మంది ప్రజలు ఈ వరదల వల్ల సమస్యల్లో చిక్కుకున్నారని శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొన్నారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 7,17,046 మంది వరద ప్రభావానికి గురయ్యారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం 1,413 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. నాగావ్ జిల్లా చాలా తీవ్రంగా దెబ్బతింది. ఈ జిల్లాలో 2.88 లక్షల మంది బాధితులయ్యారు. కచ్చార్ జిల్లాలో 1.2 లక్షల మంది, హోజాయ్ జిల్లాలో 1.07 లక్షల మంది ప్రభావితులయ్యారు. నాగావ్ జిల్లాలోని కామ్‌పూర్-కథియటలి రోడ్డు వరదల్లో కొట్టుకుపోయింది. వరద సహాయక కార్యకలాపాల్లో అస్సాం రైఫిల్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, భారత సైన్యం పాల్గొంటున్నాయి. ఇదిలావుండగా, సిల్చార్-గువాహటి మధ్య అత్యవసర విమాన సేవలను ప్రారంభించాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించింది. దిమా హసావో-బారక్ లోయ మధ్య కొండచరియలు విరిగిపడి, రవాణా సదుపాయాలకు ఆటంకాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కచ్చార్ జిల్లాలో విద్యా సంస్థలను, సాధారణ ప్రైవేటు సంస్థలను 48 గంటలపాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

*‘TDP కోసం అవసరమైతే చస్తాను: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
‘టీడీపీ కోసం అవసరమైతే చస్తానని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన టీడీపీ మినీ మహానాడలో ఆయన మాట్లాడారు. మహానాడుకు హాజరైన వారిలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, టీడీపీ నేత దివ్యవాణి, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వరరావు, యర్రపతినేని శ్రీనివాసరావు, జయమంగళ వెంకటరమణ, పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మహానాడులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానిపై అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. ‘ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన కొడాలి నాని, నేడు చంద్రబాబును విమర్శిస్తాడా?.శ్రీకాకుళం వచ్చి సన్న బియ్యం ఇస్తానని, రెండేళ్ళ తర్వాత మాట మార్చిన ఘనుడు నాని. పేకాట క్లబ్ నడిపి, క్యాసినో నిర్వహిస్తూ డబ్బులు కుప్పేసుకున్న చరిత్ర నానిది. నాపై11 కేసులు పెట్టారు. ఈ వయసులో నాపై రేప్ కేసు పెడ్డడం బాధాకరం. నేను ఎవరికి భయపడే రకం కాదు. రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్న జగన్ కు రోజులు దగ్గరపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మూడేళ్లు పట్టించుకోని ప్రజాప్రతినిధులు.. నేడు మెడలో కండువాలు వేసుకొని గడప గడపకు వెళ్లడం హాస్యాస్పదం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, ఎన్టీఆర్ రుణం తీర్చుకోవాలి’ అని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మహానాడు ప్రతి టీడీపీ కార్యకర్తకు పండుగ లాంటిదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై వందలాది అక్రమ కేసులు పెట్టారు. వాటికి భయపడేది లేదన్నారు. టీడీపీ నేత దివ్యవాణి ప్రసంగిస్తూ.. గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తామన్నారు. క్యాషినోనాని గుడివాడలో రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు.

*గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తాం: దివ్యవాణి
గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తామని టీడీపీ నాయకురాలు దివ్యవాణి పేర్కొన్నారు. గుడివాడ అంటే అన్న ఎన్టీఆర్ పేరు గుర్తుకు వచ్చేదని.. నేడు దానిని క్యాసినోవాడగా మాజీ మంత్రి కొడాలి నాని మార్చాడన్నారు. రాజకీయం కోసం, పదవుల కోసం బూతులు మాట్లాడితే, పంచలు ఊడదీసి కొడతామన్నారు. క్యాసినో నాని ముందు గుడివాడలో రోడ్లు అభివృద్ధి చెయ్యాలని దివ్యవాణి సూచించారు.

*బాధితులకు అండగా వచ్చే వారిపై పోలీసుల ప్రతాపం సిగ్గుచేటు: సీపీఐ
గుంటూరు జీజీహెచ్లో సీపీఐ ఆందోళనకు దిగింది. గ్యాంగ్ రేప్ బాధితురాలు పరామర్శకు సీపీఐ వచ్చింది. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా సీపీఐ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాధితులకు అండగా వచ్చే వారిపై పోలీసులు ప్రతాపం చూపించడం సిగ్గుచేటు అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ సీపీఐ పోరాటం కొనసాగుతుందని సీపీఐ పేర్కొంది.

*కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలి: Ramakrishna
కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. గతంలో తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌లో చనిపోయాడని చెప్పి, మృతదేహాన్ని అనంతబాబు కారులో తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం నిజంగా యాక్సిడెంట్‌లో చనిపోతే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఎలా తరలించారని నిలదీశారు. వైసీపీ నేతలకు చట్టాలు వర్తించవా అని అడిగారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

*నా జీవితంలో ఇలాంటి ఉత్సాహం చూడలేదు
‘‘నా జీవితంలో ఇలాంటి ఉత్సాహం చూడలేదు ఎక్కడ చూసినా కార్యకర్తలే… కార్యకర్తలే సంపద’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ… కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన నియోజకవర్గంలోనే బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఎన్టీ రామారావుకు అనంతపురం మీద ఎనలేని ప్రేమ ఉండేదని.. సొంత నియోజకవర్గం గుడివాడను వదిలిపెట్టి హిందూపురం ఎంచుకున్నారని తెలిపారు. బాదుడే బాదుడు భయంకరంగా ఉందా లేదా చెప్పండి తమ్ముళ్ళు అంటూ బాబు ప్రశ్నించారు. కరువు జిల్లా అనంతపురంలో సస్యశ్యామలం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. 13 వేల కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేసి 30 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. మూడు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. రౌడీయిజానికి జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిందని చంద్రబాబు అన్నారు.

*అమ్మాయిల జీవితాల కంటే జగన్‌కు అధికారమే ముఖ్యం: Devathoti
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు ప్రోగ్రామ్ సీఎం జగన్ ఊహించిన దానికంటే సక్సెస్ అయ్యిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అధికారం కోల్పోతామనే భయంతో జగన్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను గడప గడపకు పంపిస్తున్నారు..కానీ తమ గడపకు వద్దని ప్రజలు చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి పాలన పట్ల ప్రజలు విసిగిపోయి.. వైసీపీ నాయకుల మొహం మీదే ఉమ్మేస్తున్నారని తెలిపారు. గుంటూరులో బీటెక్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగినా.. తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారము చేసినా ప్రభుత్వం ఏమాత్రం చలించకుండా ఉందని మండిపడ్డారు. అమ్మాయిల జీవితాల కంటే జగన్‌కు తన అధికారమే ముఖ్యమని దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

*తలకిందులైనా జగన్‌కు బీసీలు మద్దతివ్వరు: బుద్దా
జగన్‌ తలకిందులుగా వేలాడి జపం చేసినా బీసీల మద్దతు లభించదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ‘బాదుదే బాదుడు’ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోందన్నారు. ఇది చూసి ఓర్వలేక సీఎం జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీల పేరుతో బీసీ జపం చేస్తున్నాడన్నారు. ఆర్‌.కృష్ణయ్యను తీసుకువచ్చి వైసీపీలోని బీసీ నాయకులను అవమానించారన్నారు. బీసీల ప్రయోజనం కన్నా జగన్‌కు రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్నారు. బీసీ మంత్రులతో బస్సు యాత్ర చేయడమంటే… ప్రశ్నించే ప్రజలపై దాడి చేయిస్తామనడానికి సంకేతమా అని ప్రశ్నించారు. వైసీపీ బీసీలను మోసగించిన తీరుపై విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను నిర్వహిస్తామని బుద్దా తెలిపారు.

*ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలి: హరీశ్‌
తెలంగాణలోని పేదలపై వైద్య ఖర్చుల భారం పడకుండా వైద్య విభాగాలు కృషి చేయాలని మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ేసవలు 8ు పెరగడం అభినందనీయమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలును గురువారం ఆయన సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2019-20లో ఆరోగ్యశ్రీ సేవలు 35ుఉండగా, 2021-22లో 43శాతానికి పెరిగాయని, వీటిని మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మోకాలు ఆపరేషన్లు చేయడంతో పాటు సమీప ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, సిద్దిపేట జిల్లా లదునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎన్‌ఎం రేణుక(38) కుటుంబానికి అండగా ఉంటామని హరీశ్‌రావు పేర్కొన్నారు. మృతురాలి భర్త ప్రసాద్‌బాబుకు ఆరోగ్యశాఖలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తామని, వారి పిల్లల చదువుకు చేయూత ఇస్తామని హామీఇచ్చారు. తక్షణ ఆర్థిక సహాయం కింద హరీశ్‌రావు రూ.2లక్షలు ప్రకటించారు.

*పాలకుల మనుగడ కోసమే.. ‘రాజద్రోహం’ కేసులు: ఆర్‌.నారాయణమూర్తి
‘‘స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతు నొక్కడానికి రాజద్రోహం చట్టాన్ని అమలు చేసిన బ్రిటిష్‌ వాళ్లే తమ దేశంలో ఈ చట్టాన్ని రద్దు చేశారు. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను సాధించి 75 ఏళ్లు అవుతున్న భారతదేశంలో ఇంకా ఈ చట్టాన్ని అమలు చేయడం దారుణం. హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడితే రాజద్రోహం అవుతుందా?’’ అని సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. రాజద్రోహం కేసులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజద్రోహం వేరు, దేశద్రోహం వేరు అన్న సుప్రీంకోర్టు తీరుపై సంతోషం వెలిబుచ్చారు. గురువారం ఆయన మీడియాతో స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా మనదేశంలో రాజద్రోహం చట్టాన్ని అమలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రభుత్వాలు వాటి మనుగడ కోసమే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని ఆర్‌.నారాయణమూర్తి విమర్శించారు.

*పిల్లి’ వ్యాఖ్యలపై సీఎం నోరు విప్పాలి: సోము వీర్రాజు
‘‘ధాన్యం కొనుగోలులో దోపిడీని అరికట్టాలి. ప్రతిపక్షాలుగా మా మాటలు లెక్కచేయని సీఎం… ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌ వ్యాఖ్యలపై నోరు విప్పాల్సిందే. ధాన్యం కొనుగోలులో ప్రతి బస్తాపై రూ.200 లకు పైగా దోచుకొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో వరికి కనీస మద్దతు ధర రూ.1,455 చెల్లించాల్సి ఉంది. అయితే రూ.1,200 కూడా ఇవ్వకుండా అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై దోచేసుకుంటున్నారు. ధాన్యం కొనే మిల్లర్లు, లేక్కేసే ఆర్బీకేలు కుమ్మక్కై చేస్తున్న దోపిడీపై విచారణకు ఆదేశించాలి. మద్దతు ధరపై రైతులకు సీఎం భరోసా ఇవ్వాలి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని లేఖలో వీర్రాజు డిమాండ్‌ చేశారు

*పంచాయతీ సమస్యలను ప్రస్తావిస్తా: ఉత్తమ్‌
రాష్ట్రంలోని గ్రామపంచాయతీల సమస్యలను రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో తాను ప్రస్తావిస్తానని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు.పంచాయతీలకు నిధులు పెంచాలని కోరతానన్నారు. సీఎం కేసీఆర్‌ వల్ల తెలంగాణలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. బిల్లులు రాకపోవడంతో వారికి ఆత్మహత్యలే శరణ్యంగా మారిందన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులను ఇవ్వడం తప్పని సీఎం కేసీఆర్‌ అనడంపై ఉత్తమ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

*వాసాలమర్రికి కేసీఆర్ వెళ్లనే లేదు: రఘునందన్‎రావు
కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (Cm Kcr), మంత్రి కేటీఆర్ పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఓ ప్రకటనలో అన్నారు. గ్రామాలకు నేరుగా నిధులు ఇవ్వడం కొత్తకాదన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియదా అని నిలదీశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందన్నారు. నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తే అవినీతి తగ్గుతుందని చెప్పారు. నేరుగా గ్రామాలకు నిధులు ఇస్తే తప్పేముందో చెప్పాలని డిమాండ్ చేశారు. పంచాయతీ‎లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు ఇచ్చాయో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళుగా వ్యవసాయ పని ముట్లకు సబ్సిడీ ఇవ్వడం లేదని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌లు చేస్తున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే పంచాయతీలకు కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుందని రఘునందన్ రావు తెలిపారు.

*ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్ఈ
నెల 21 నుంచి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ఉంటుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. క్యాడర్ చాలా ఇబ్బందుల్లో ఉందన్నారు. క్యాడర్‌ను డిస్ట్రబ్ చేసి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు మొత్తం కరప్షన్‌గా మారిపోయాయని చెప్పారు. ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉందన్నారు. తనకు వచ్చే ఎన్నికలే చివరివి కావచ్చన్నారు.

*బోగస్‌ నోటిఫికేషన్లు బూటకపు మాటలు: భట్టిt
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బోగస్‌ నోటిఫికేషన్లు, బూటకపు మాటలతో, నిరుద్యోగ భృతిని గంగలో కలిపి, ఎన్నికల హామీని తుంగలోకి తొక్కిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులను మభ్యపెడుతూ కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఫీజ్‌రీయింబర్సుమెంట్‌ ద్వారా లక్షలమంది నిరుపేద విద్యార్ధులకు చదువుకునేందుకు అవకాశం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. ప్రస్తుత కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి, వంద రోజుల ఉపాధి హామీ జాబ్‌కార్డులను ఇస్తోందని ఎద్దేవాచేశారు. దాంతో ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదువుకున్న యువకులు ఉపాధి పనులకు వెళుతున్నారని, ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలును ఆలస్యం చేయకుండా, అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని భట్టి విక్రమార్క కోరారు.

*Vamsiతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు: దుట్టా
గన్నవరం నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుపై తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం పంచాయతీ జరిగింది. ఈ పంచాయతీలో వైసీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు, వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు గోసుల శివభరత్‌ రెడ్డితోపాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి సుమారు 2 గంటలపాటు ఇరువర్గాల వారితో వేర్వేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా వంశీ అక్రమాలపై దుట్టా వర్గం ఓ నివేదికను సజ్జలకు అందజేసినట్టు సమాచారం. పంచాయతీ అనంతరం దుట్టా రామచంద్రరావు విలేకరులతో మాట్లాడారు. గన్నవరం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను సజ్జలకు వివరించామని తెలిపారు. వైసీపీ పాత కేడర్‌ను వంశీ కలుపుకొని పోవడం లేదని, వారిని తొక్కేస్తున్నారని సజ్జలకు తెలిపామని చెప్పారు. వంశీ వల్ల తాము చాలాఇబ్బందులు పడుతున్నామని, కలిసి పనిచేయలేమని స్పష్టం చేశామని దుట్టా వెల్లడించారు.

*ఆక్వా దాణా ధర తగ్గింపు: మంత్రి సీదిరి
రాష్ట్రంలో రొయ్యలు, చేపల దాణా ధర కిలోకి రూ.2.56 తగ్గిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. గురువారం సచివాలయంలో ఆక్వా దాణా తయారీదారులు, రైతు ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆక్వా దాణా ధర కిలో ప్రస్తుతం రూ.89 ఉండగా, తక్షణం రూ.2.56తగ్గించనున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్‌లో కిలోకి రూ.2.60, మే నెలలో రూ.3.40, ఆగస్టులో రూ.5.40పెంచగా, 2022మార్చిలో రూ.5, ఏప్రిల్‌లో రూ.2.56 చొప్పున దాణా ధరలను వ్యాపారులు పెంచినట్లు చెప్పారు.