DailyDose

26 నుంచి వైకాపా బస్సు యాత్ర – TNI తాజా వార్తలు

26 నుంచి వైకాపా బస్సు యాత్ర –  TNI  తాజా వార్తలు

* దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో మంత్రివర్గంలో 77 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ అని చాటిచెప్పిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రెవెన్యూ, విద్యా శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తెలిపారు. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలసి గురువారం వారిద్దరూ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాల ద్వారా పేదల బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసి రాజ్యాధికారం కల్పించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించటాన్ని విపక్షాలు, ప్రధానంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓర్చులేకపోతున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వల్లె వేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే దుస్సాహసం చేస్తున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుందని తెలిపారు. యాత్ర సందర్భంగా రోజూ ఒకచోట బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తొలిరోజు 26న విజయనగరంలో, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

* తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు పంపిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. సిర్పూర్‌కర్‌ కమిషన్‌ నివేదికను సాఫ్ట్‌కాపీ రూపంలో.. కేసులోని భాగస్వాములందరికీ పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పుకోవాలని సూచించింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం.. విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. దిశ కేసుకు సంబంధించి అన్నిరికార్డులను హైకోర్టుకు పంపించింది.

* పోలీస్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్లు కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయో పరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సానుకూలంగా కేసీఆర్ స్పందించారు. అంతేకాదు హుటాహుటిన ఆదేశాలను సైతం జారీ చేశారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

* యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్‌ లాటరీని లండన్‌లోని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో(49), జెస్‌థ్వైట్‌(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్‌ పౌండ్ల) జాక్‌పాట్‌ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న వీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు.
భరత జో.. కమ్యూనికేషన్స్‌ సేల్స్‌ మేనేజర్‌ కాగా, జెస్‌ హెయిర్‌ డ్రెస్సింగ్‌ సెలూన్‌ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని జో, జెస్‌ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019 అక్టోబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్‌ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకోవడమే ఇప్పటి దాకా రికార్డుగా ఉంది. ఈ రికార్డును జో జంట తుడిచిపెట్టారు.

* పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పాటియాలా కోర్టులో లొంగిపోనున్నారు. 1998 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో మాజీ క్రికెట‌ర్ సిద్ధూకు ఏడాది జైలుశిక్ష ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ కేసులో లొంగిపోనున్నట్లు తెలిపిన సిద్ధు.. ఇందుకు కొన్ని వారాల సమయం కావాలని ఇవాళ సుప్రీంకోర్టులో ఆయన త‌ర‌పు న్యాయ‌వాది పిటిషన్‌ దాఖలు చేశారు. లాయ‌ర్ అభిషేక్ మ‌నూ సింఘ్వీ ఈ పిటిష‌న్ వేశారు. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్ ధ‌ర్మాస‌నం ముందు ఆయ‌న ఈ వివ‌ర‌ణ ఇచ్చారు. వైద్య సంబంధిత ఏర్పాట్లను చేసుకోవాలని సిద్ధూ తరఫున లాయ‌ర్ కోర్టును కోరారు.

* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల ఏర్పాట్ల‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు వివిధ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. సంద‌ర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీన సీఎం కేసీఆర్ ముందుగా గ‌న్‌పార్కులోని అమ‌ర‌వీరుల స్థూపానికి నివాళుల‌ర్పించ‌నున్న‌ట్లు తెలిపారు. అనంత‌రం ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్క‌రించ‌నున్నారు. పోలీసు ద‌ళాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించిన అనంత‌రం సీఎం ప్ర‌సంగిస్తార‌ని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం ప్ర‌ముఖులైన 30 మంది క‌వుల‌చే క‌వి స‌మ్మేళ‌నం ర‌వీంద్ర భార‌తిలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎస్ వెల్ల‌డించారు.

* కాకినాడ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యహత్య ఘటనలో ఎమ్మెల్సీని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు . ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన ట్విటర్‌లో కోరారు. సుబ్రహ్మణ్యంను రాత్రి కారులో తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కారణం చెప్పకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు, భార్యకు అప్పగించి వెళ్లడం అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.

* జ్ఞాన‌వాపీ మ‌సీదు విష‌యంలో శివ‌సేన బీజేపీపై తీవ్రంగా విరుచుకుప‌డింది. త‌న అధికారిక ప‌త్రిక సామ్నా వేదిక‌గా బీజేపీపై మండిప‌డింది.జ్ఞాన‌వాపీ మ‌సీదు లాంటి విష‌యాల‌ను ఉటంకిస్తూ… 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు బీజేపీ వెళ్తుంద‌ని శివ‌సేన అంచ‌నా వేసింది. ఈ సంద‌ర్భంగా సామ్నా ర‌ష్యాతో భార‌త్‌ను పోలుస్తూ వ్యాఖ్య‌లు చేసింది.

* ప్రధాని న‌రేంద్ర మోడీ ఈ నెల 26న హైద‌రాబాద్ రానున్నారు. న‌గ‌రంలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్స‌వంలో ఆయ‌న పాల్గొననున్నారు. అలాగే రామ‌గుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల క‌ర్మాగారాన్ని ఆయ‌న హైద‌రాబాద్ నుంచే వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించే అవ‌కాశాలున్నాయి. ఇక పార్టీ ప‌రంగా కూడా ప్రధాని మోడీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకునే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం.

* బెంగళూరు నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను పెంచారు.బెంగళూరు విమానాశ్రయంలో అదనపు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.శుక్రవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయం కంట్రోల్ రూంకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.‘‘శుక్రవారం తెల్లవారుజామున కంట్రోల్ రూమ్‌కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరిన్ని వివరాలు తర్వాత పంచుకుంటాం’’ అని బెంగళూరు పోలీసులు తెలిపారు.బెదిరింపు కాల్‌తో విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించాయి.విమానాశ్రయంలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు…

*రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు భారీగా ఏర్పాట్లుచేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లపై శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి తోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని అన్నారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవిసమ్మేళనం రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జిఎడి కార్యదర్శి శేషాద్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీ.వి.ఆనంద్, జల మండలి ఎం.డి దాన కిషోర్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకెష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ లతోపాటు పోలీసు, రోడ్లు భవనాలు,విధ్యుత్, సమాచార శాఖ, ఉద్యాన వన శాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

* ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అదేశించారు. శుక్రవారం సనత్ నగర్ నియోజక వర్గం పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలో వున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా ?…, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?, పాఠాలు మంచిగా చెబుతున్నారా ఈ విధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్ధులను పలు ప్రశ్నలు వేసి వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా 19 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పాఠశాలకు చెందిన విద్యార్ధులతో ఈ సందర్భంగా ఆయన ముచ్చటించారు.

* హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఇంటి వద్ద వందలాదిమంది అభిమానులు హంగామా సృష్టించారు. అర్ధరాత్రే ఎన్టీఆర్‌ ఇంటిముందు కేక్‌ కట్‌ చేశారు.ఎన్టీఆర్‌ బయటికి వస్తారేమోనని చాలాసేపు వెయిట్‌ చేశారు. అంతటితో ఆగకుండా రోడ్డుపై అభిమానులు నానా హంగామా చేశారు. డ్యాన్స్‌లు చేస్తూ రచ్చరచ్చ చేశారు.అభిమానుల అల్లరి శృతిమించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. తారక్‌ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్‌ చేసి చెదరగొట్టారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా చేరుకొని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు

* సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎస్పిఎఫ్. డీజీ ఉమేష్ షర్రాఫ్ స్వయంగా రచించిన రెండు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బహూకరించారు. బి ఆర్కే భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమేష్ షర్రాఫ్ రచించిన క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలను సవివరంగా ఆయన అందజేశారు. పోలీస్ అధికారులకు ఈ క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయని సి.ఎస్. సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఉమేష్ షర్రాఫ్ ను సీఎస్ అభినందించారు.

*సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎస్పిఎఫ్. డీజీ ఉమేష్ షర్రాఫ్ స్వయంగా రచించిన రెండు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బహూకరించారు. బి ఆర్కే భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమేష్ షర్రాఫ్ రచించిన క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలను సవివరంగా ఆయన అందజేశారు. పోలీస్ అధికారులకు ఈ క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయని సి.ఎస్. సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఉమేష్ షర్రాఫ్ ను సీఎస్ అభినందించారు.

*నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మెట్టుగూడ వద్ద ఘనస్వాగతం లభించింది. రిజర్వేషన్ల కల్పన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్‌కు గిరిజన సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం జనసేనాని మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు ఉద్యోగాల నియామకాల్లో వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. 10శాతం గిరిజన రిజర్వేషన్లు కోసం జనసేన పోరాటం చేస్తోందని తెలిపారు. నిరుద్యోగులు, గిరిజనులకు జనసేన మద్దతుగా నిలబడుతోందన్నారు. విద్యార్థులు తెలంగాణ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

*ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌లో షిప్‌లో స్వర్ణం గెలిచిన నిఖత్ జరీన్‌కు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో 52 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నిజామాబాద్‌ ముద్దుబిడ్డ, తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అభినందనలు’’ అంటూ స్పీకర్ తెలిపారు.

*ఐఐఐటీహెచ్‌ 2022 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌, క్యాంపస్‌ రెండు విధానాల్లో ఎంఎస్‌ఐటీ కోర్సుల్లో డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, యాప్‌ డెవల్‌పమెంట్‌లను స్పెషలైజేషన్‌ సబ్జెక్టులుగా ఎంచుకునే అవకాశం ఉంటుందని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు అర్హత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.mist.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

*దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ జయంతి(మే 22)ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి వేడుకల్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

* దేశంలోనే తొలి కరోనా బీఏ-4 వేరియంట్‌ను హైదరాబాద్‌లో గుర్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ-4 సోకిన దక్షిణాఫ్రికా వ్యక్తి ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో ఓ సమావేశానికి వచ్చి వెళ్లిపోయారు. ఆయనకు పాజిటివ్‌ రావడంతో.. ఆ సమావేశంలో పాల్గొన్న 24 మందికీ టెస్టులు చేశారు. నెగెటివ్‌ వచ్చినప్పటికీ వారందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. కరోనా కొత్త వేరియంట్‌ గురించి ఆందోళన అవసరం లేదని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. కాగా, బీఏ-4 వేరియంట్‌ కేసులు దక్షిణఫ్రికాలో భారీగా నమోదవుతున్నాయి. దీనికి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే గుణం ఉండడంతో ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. దేశంలోనే బీఏ-4 వేరియంట్‌ తొలి కేసు హైదరాబాద్‌లో నమోదు కావడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ వేరియంట్‌ ప్రభావం మన దేశంలో పెద్దగా ఉండకపోవచ్చని ఆరోగ్య శాఖ భావిస్తోంది.

* ప్రైవేట్‌ రవాణా వాహనాల రిజిస్ట్రేషన్‌ రుసుం పెంచుతూ కేంద్రం విడుదల చేసిన 714(ఈ) నోటిఫికేషన్‌ను తెలంగాణలో అమలు చేయొద్దని, లేని పక్షంలో వేలాది మంది రవాణా కార్మికులతో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు, ఓనర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం బంద్‌ పాటించి భారీ ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి వందలాది మంది తరలి వచ్చారు. అంతకుముందు జేఏసీ కన్వీనర్‌ బి.వెంకటేశం మాట్లాడుతూ వాహనాల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడమే కాకుండా, ఫిటెనెస్‌ లేని వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున జరిమానా వసూలు చేస్తామనడం దారుణమన్నారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఆటో, టాక్సీ డ్రైవర్స్‌ యూనియన్‌(బీఎంఎ్‌స) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద ఆందోళన నిర్వహించారు.

*సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎస్పిఎఫ్. డీజీ ఉమేష్ షర్రాఫ్ స్వయంగా రచించిన రెండు పుస్తకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బహూకరించారు. బి ఆర్కే భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమేష్ షర్రాఫ్ రచించిన క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలను సవివరంగా ఆయన అందజేశారు. పోలీస్ అధికారులకు ఈ క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ , ఎకనామిక్ ఆఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయని సి.ఎస్. సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా ఉమేష్ షర్రాఫ్ ను సీఎస్ అభినందించారు.

*కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. క్యాబినెట్ విస్తరణకు కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్ కోసం కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న సీఎంకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి పిలుపువచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు మందుగా క్యాబినెట్‌లో సంపూర్ణ మార్పులు జరగనున్నాయనే ఊహాగానాలు కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2021లో సీఎంగా బొమ్మై పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎనిమిది పర్యాయాలకు పైనే ఆయన ఢిల్లీకి వెళ్లారు. కాగా, కర్ణాటక క్యాబినెట్‌లో 34 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈనెల 22న దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లాలనుకుంటున్న బొమ్మైకి దీనికి ముందే ఢిల్లీ నుంచి పిలుపురావడంతో కర్ణాటక పార్టీ వర్గాల్లో ఉత్సుకత నెలకొంది.

*గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ తో ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు వై.వి.బీ. రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల నిధులు రూ.7660 కోట్లు దొంగలించారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం 14,15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు పంపించిన నిధులు రూ.7660 కోట్లు ఇవ్వగా… రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని గవర్నర్‌కు రాజేంద్రప్రసాద్ వినతి పత్రం అందజేశారు.

*ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. జి.సిగడాం మండలం విజయరాంపురంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సొంత పార్టీ నేతలే బహిష్కరించారు. తమ గ్రామానికి రావొద్దంటూ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నిరసనల మధ్య వెళ్లిపోయారు. స్థానిక నేతల మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది.

*రేపు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేయనుంది. జులై, ఆగస్టు మాసానికి సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 25 వేల టిక్కెట్లు విడుదల చేయనుంది. రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల కానున్నాయి.

*ప్రకాశం: జిల్లాలోని కనిగిరి మండలం గుడిపాడులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్‌ కు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ గడపకు రావొద్దంటూ ఓ మహిళ అడ్డుకుంది. వైసీపీకి ఓటు వేయాలని ఓ వృద్దున్ని ఎమ్మెల్యే అడగ్గా ‘‘మీరు చెప్తే నేను వేయాలా’’ అంటూ వృద్ధుడు ఎదురు ప్రశ్న వేశాడు.

*రాయదుర్గం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డికి జైలుశిక్ష విధించింది. అధికారులను బెదిరించిన కేసులో శ్రీనివాస్ రెడ్డికి మూడేళ్లు జైలుశిక్ష విధించారు. రూ.5 వేలు జరిమానా విధిస్తూ రాయదుర్గం కోర్టు తీర్పును వెలువరించింది. అనుమతికి మించి ఇనుప ఖనిజం తరలిస్తున్నారంటూ.. జిల్లా అటవీశాఖ అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ తనిఖీకి వెళ్లారు. విధులకు ఆటంకం కలిగించారని బిశ్వాస్‌ ఫిర్యాదు చేశారు.

*సుబ్రమణ్యం కుటుంబసభ్యులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఫోన్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆయన ఫోన్‌లో పరామర్శించారు. సుబ్రమణ్యం కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. యువకుడిని అన్యాయంగా చంపేశారన్నారు. కట్టుకథలతో కేసును తప్పుదోవ పట్టించారన్నారు. వైసీపీ నేతను కాపాడేలా వ్యవహరించడం దారుణమని నారా లోకేష్ పేర్కొన్నారు.

*సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy), హోంమంత్రి అనాలోచితంగా మాట్లాడటం వల్లే కొవ్వూరులో చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని మాజీ మంత్రి జవహర్(Jawahar) వ్యాఖ్యానించారు. లైంగిక దాడికి గురైన చిన్నారిని శుక్రవారం జవహర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వేళాకోళం, వెకిలి చేష్టలు, ప్రతీకారంతో పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. అత్యాచార ఘటనలు అడ్డుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమన్నారు. లైంగిక దాడి బాధితులకు ఫోక్సో చట్టం కింద ఇవ్వాల్సిన పరిహారం ఈ రోజుకి ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు మండలంలో అత్యాచార ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి దృష్టంతా గోంగూర గడ్డ ఇసుక ర్యాంప్ మీద ఉందని జవహర్ యెద్దేవా చేశారు.

*కాకినాడలో సుబ్రమణ్యం ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సుబ్రమణ్యం మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు వచ్చారు. మృతుడి కుటుంబీకులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) అనంతబాబుకు వ్యతిరేకంగా బాధితులు నినాదాలు చేశారు. అనంతబాబును అరెస్ట్‌ చేయాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

* విదేశీ పర్యటన కోసం తాడేపల్లి నివాసం నుంచి నేరుగా సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరవడంతో పాటు పది రోజుల విదేశీ పర్యటన చేయనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటన కోసం జ్యూరిచ్ సాయంత్రం 6 గంటలకు జగన్ చేరుకోనున్నారు. జ్యూరిచ్ నుంచి సాయంత్రం 8:30 గంటలకు జగన్ బృందం దావోస్ వెళ్లనుంది.

*ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు చేదు అనుభవం
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో నిర్వహిస్తున్న గడపగడప మన ప్రభుత్వంకార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. మాజేరు గ్రామంలో పథకాలు గురించి వివరించబోయిన ఎమ్మెల్యేకు కొందరు ఎస్టీబీసీ మహిళలు ఫిర్యాదు చేశారు. ఇళ్ళు కాలిపోయి సంవత్సరాలయినా పట్టించుకోలేదనిమొరపెట్టుకున్నారు. ఇల్లు కట్టించి ఇస్తామని ఎప్పుడో చెప్పిఇప్పుడు కట్టుకోమంటే ఎలాఅని వారు ప్రశ్నించారు. రోడ్లు సరిగా లేక బురదలో తమపిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనిఎస్సీ కాలనీ మహిళలు ఫిర్యాదు చేశారు.

* దుట్టా, యార్లగడ్డ వర్గీయులపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఘాటు విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన చేతిలో సింగిల్‌గా గ్రూపులు గ్రూపులుగా ఓడిపోయారని జోస్యం చెప్పారు. ఈగో వల్ల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత 3 ఎన్నికల్లో వాళ్లని ఒక్క అడుగు కూడా వేయనివ్వలేదని, అందుకే తాను నచ్చలేదన్నారు. నియోజకవర్గంలో ఎవరూ తనపై ఆధిపత్యం సాధించలేకపోయారని తెలిపారు. తనకు ఎవరితో సమస్య లేదని, వారికి ఎవరితో ఉందో తెలియదన్నారు. నియోజకవర్గ సమస్యలపైనే సీఎం పేషీకి వెళ్లానని వంశీ తెలిపారు. దుట్టా రామచంద్రరావును తనను కూర్చొబెట్టి మాట్లాడింది లేదన్నారు. నియోజకవర్గ నాయకులకి మాతో సమస్యా?..పార్టీతో సమస్యా? అని ప్రశ్నించారు. అధిష్ఠానంతో సమస్యా అనేది అర్థం కావడం లేదని చెప్పారు. వైసీపీ క్యాడర్‌ను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు. జగనన్న కాలనీల కోసమే గ్రామస్తులు మట్టితవ్వుకుంటున్నారని తెలిపారు. యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు అందరం కలిసే పనిచేసుకుంటున్నామని వంశీ తెలిపారు.

*రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె ఇళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం దాడులు చేసింది. అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది.లాలూ, అతని కుమార్తెల అవినీతి కేసులో ప్రాథమిక విచారణలో తేలడంతో సీబీఐ కొత్తగా మరో కేసు నమోదు చేసింది.లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధించి సీబీఐ శుక్రవారం 15 చోట్ల సోదాలు నిర్వహించింది.దాణా కుంభకోణం కేసులో బెయిల్‌ పొందిన కొన్ని వారాల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తాజా అవినీతి కేసులో అభియోగాలు నమోదయ్యాయి.

*రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు ప్రోగ్రామ్ సీఎం జగన్ ఊహించిన దానికంటే సక్సెస్ అయ్యిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అధికారం కోల్పోతామనే భయంతో జగన్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను గడప గడపకు పంపిస్తున్నారు..కానీ తమ గడపకు వద్దని ప్రజలు చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి పాలన పట్ల ప్రజలు విసిగిపోయి.. వైసీపీ నాయకుల మొహం మీదే ఉమ్మేస్తున్నారని తెలిపారు. గుంటూరులో బీటెక్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగినా.. తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారము చేసినా ప్రభుత్వం ఏమాత్రం చలించకుండా ఉందని మండిపడ్డారు. అమ్మాయిల జీవితాల కంటే జగన్‌కు తన అధికారమే ముఖ్యమని దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

*వరదరాజ పెరుమాళ్‌ ఆలయ రథోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది కాంచీపురంలో ప్రసిద్ధిచెందిన వరదరాజ పెరుమాళ్‌ ఆలయ వైశాఖి మాస బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలో వరదరాజ పెరుమాళ్‌ బంగారు సప్పరం, శేష, గరుడ, గజ తదితర వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో ప్రధానాంశంగా ఏడో రోజైన గురువారం రథోత్సవం నిర్వహించారు. తొలుత స్వామివారిని భూదేవి, శ్రీదేవి అమ్మవార్లతో కలిపి పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం 73 అడుగుల రథంపై ఉత్సవమూర్తులను ఉంచారు. భక్తులు ‘గోవింద నామస్మరణ చేస్తూ రథం లాగారు. తేరడి నుంచి బయల్దేరిన రథం ముంగిల్‌ మండపం, నాలుగు రాజ వీధుల మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. రథోత్సవంలో జిల్లా కలెక్టర్‌ ఆర్తీ, కాంచీపురం డీఐజీ సత్యప్రియ, ఎమ్మెల్యే ఎళిలరసన్‌, మేయర్‌ మహాలక్ష్మి, అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి వి.సోమసుందరం తదితరులు పాల్గొన్నారు. ఉత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో కాంచీపురం కిటకిటలాడింది. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం, మజ్జిగ, శీతల పానీయాలు అందజేశాయి. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 750 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు.

*స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతు నొక్కడానికి రాజద్రోహం చట్టాన్ని అమలు చేసిన బ్రిటిష్‌ వాళ్లే తమ దేశంలో ఈ చట్టాన్ని రద్దు చేశారు. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను సాధించి 75 ఏళ్లు అవుతున్న భారతదేశంలో ఇంకా ఈ చట్టాన్ని అమలు చేయడం దారుణం. హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడితే రాజద్రోహం అవుతుందా?’’ అని సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ) ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ కేవలం ప్రభుత్వాలు వాటి మనుగడ కోసమే రాజద్రోహం చట్టాన్ని అమలు చేస్తున్నాయని విమర్శించారు.

* సీపీఎస్‌ రద్దు చేసి గడప తొక్కండి అంటూ ఉద్యోగులు తమ ఇంటి వద్ద బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమానికి నిరసన తెలుపుతూ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెంలోని తన నివాసం వద్ద గుర్రం మురళీమోహన్‌ అనే ఉద్యోగి బోర్డు పెట్టారు. ఆయన సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి. సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసిన తర్వాతే మంత్రులు, శాసనసభ్యులు.. ఉద్యోగులు నివసించే ప్రాంతాలకు రావాల్సిఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీపీఎస్‌ ఉద్యోగులందరూ తమ నివాసాల వద్ద ఇలాగే బోర్డులు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

*ఉద్యమాల కోసం రోడ్డెక్కితే నిర్భందాలు, అక్రమ అరెస్టులు… కేసులు బెదిరింపులు… శాఖాపర శిక్షలు.. ఇలా…ఎన్నో ఎదుర్కోవాలి… సోషల్‌ మీడియాలోనూ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచలేని పరిస్థితి! సీపీఎస్‌ రద్దుకోసం తదుపరి అడుగులపై మథనం! ఇంతలో సీఎం జగన్‌ తన ప్రజాప్రతినిధులను గ్రామాలకు పంపడం సీపీఎస్‌ రద్దు ఉద్యమానికి కలిసివచ్చింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో పాల్గొనే మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ నిరసన సెగను ఇంటినుంచే చవిచూపిస్తున్నారు. సీపీఎస్‌ రద్దు చేసి…ఓపీఎస్‌ పునరుద్ధరించాకే తమ గడపలకు రావాలంటూ ఇళ్ల గేట్లకు బోర్డులను వేలాడదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్‌ విధానంలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్రలో నాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి జగన్‌ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఢంకా భజాయించారు.

*రాష్ట్రంలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా తాటిపర్తి ఘటనలో తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో క్లూ దొరికింది. తన ప్రేమను అంగీకరించలేదని, తన తో పెళ్లికి ఆమె కుటుంబ సభ్యు లూ ఒప్పుకోలేదన్న అక్కసుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు అయిన కావ్యశ్రీని.. సమీప బంధువు సురే్‌షరెడ్డి ఈ నెల 9న తుపాకీతో కాల్చి చంపి, తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు తేలింది. ఈ కేసు వివరాలను నెల్లూరులో గురువారం అదనపు ఎస్పీ (క్రైం) చౌడేశ్వరి విలేకరులకు వెల్లడించారు.

*తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సభ్యత్వం తీసుకోవడంతోపాటు కొందరు అభిమానులు ఈ విరాళాలు కూడా అందిస్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అధినేత భాష్యం ప్రవీణ్‌ ఇటీవల రూ.10 లక్షలు ఈ నిధికి విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలానికి చెందిన కుర్రా అప్పారావు రూ.5 లక్షలు, బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడుకు చెందిన యార్లగడ్డ మురళీకృష్ణ రూ.5 లక్షలు, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంకు చెందిన ఇంటూరి నాగేశ్వరరావు రూ.5 లక్షల నూట పదహార్లు, కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన వీఎ్‌సఆర్‌ రావు రూ.5.50 లక్షలు విరాళాలుగా టీడీపీకి అందచేశారు.

*వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ కార్యక్రమంలో తొలి విడతగా 175 పశువుల అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటి కోసం రూ.143 కోట్లు వ్యయం చేశారు. గురువారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జెండా ఊపి అంబులెన్స్‌లను ప్రారంభించారు. అంబులెన్స్‌లో ఉన్న సౌకర్యాలను పశుసంవర్థక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూగజీవాలు అనారోగ్యం పాలైతే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1962కు ఫోన్‌ చేసి రైతు పేరు, ఊరు, సమస్య చెబితే.. రైతు ఇంటి వద్దకే అంబులెన్స్‌ వెళ్లి వైద్య సేవలు అందిస్తాయని అధికారులు చెప్పారు. పశువులకు 20 రకాల పేడ పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షల సదుపాయం,వ్యాక్సిన్లు, మందులు అందించడంతో పాటు పశువులను వాహనాల్లో ఎక్కించేందుకు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ వంటి సౌకర్యాలున్నాయని వివరించారు.

*ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసే పంటలకు ముందస్తుగా సాగునీటి విడుదలకు ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. గురువారం దీనిపై గెజిట్‌ జారీ చేసింది. గోదావరి డెల్టాకు జూన్‌ 1న, జూన్‌ 10న కృష్ణా డెల్టా, గుంటూరు చానల్‌కు నీరు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఆయకట్టులో రైతులు ముందుగా విత్తనాలు నాటుకోవడం వల్ల తుఫాన్లు సంభవించినా నష్టపోకుండా ఉంటారని పేర్కొంది. అలాగే జూన్‌ 6న 3 వేల ట్రాక్టర్లు, 402 కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీకి, జూన్‌ 14న పంటల బీమా పరిహారం విడుదల, జూన్‌ 21న అమ్మఒడి కార్యక్రమాల నిర్వహణకు మరో షెడ్యూల్‌ విడుదల చేశారు. కాగా గ్రామ విత్తన పథకం కింద ధ్రువీకరించిన విత్తనోత్పత్తి కోసం రూ.12.94 కోట్లు విడుదల చేసింది.

*మయన్మార్‌కు ఆనుకుని గల్ఫ్‌ ఆఫ్‌ మార్టాబన్‌ పరిసరాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది శుక్రవారానికి మరింత బలపడి ఈశాన్యంగా పయనించి మయన్మార్‌ తీరం దిశగా పయనించనుంది. దీని ప్రభావంతో దక్షిణ, మధ్య భారతం మీదుగా గాలులు అల్పపీడనం దిశగా వెళ్లనున్నాయి. దీంతో శనివారం నుంచి రాష్ట్రం మీదుగా పడమర గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. కోస్తాలో 21వ తేదీ నుంచి ఎండలు పెరుగుతాయని, తరువాత ఐదారు రోజులపాటు పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని, 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. మయన్మార్‌ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా మారిందన్నారు. ఈ నెల 27 లేదా 28న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని, నెలాఖరు లేదా జూన్‌ 1న రాయలసీమలో, తరువాత ఒకటి, రెండు రోజుల్లో కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని అంచనా

*రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బూతులు మాట్లాడేవారు, ఇసుక అక్రమ దందా చేసేవారు, పేకాట ఆడించేవారే జగన్ మంత్రివర్గంలో ఉన్నారని విమర్శించారు. నలుగురు మంత్రులతో బస్సు యాత్రలు చేస్తే సామాజిక న్యాయం జరగదన్నారు. సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ పెడితేనే పీఎస్‌లో పెట్టి చావగొట్టేవారని, సామాజిక న్యాయమని జనంలోకి ఎలా వెళ్తారు? అని కళా వెంకట్రావ్‌ ప్రశ్నించారు.

*ఐఐఐటీహెచ్‌ 2022 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌, క్యాంపస్‌ రెండు విధానాల్లో ఎంఎస్‌ఐటీ కోర్సుల్లో డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, యాప్‌ డెవల్‌పమెంట్‌లను స్పెషలైజేషన్‌ సబ్జెక్టులుగా ఎంచుకునే అవకాశం ఉంటుందని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు అర్హత పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.mist.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

*మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల లోగో, బ్రోచర్లను తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల అసోసియేషన్‌ అధ్యక్షుడు కనపర్తి రవిప్రసాద్‌, జనరల్‌ సెక్రటరీ తుమ్మల రమేష్‌ నేతృత్వంలోని బృందం లోకేష్‌ను కలిసింది. ఈ నెల 28 నుంచి వచ్చే ఏడాది మే 28 వరకు నిర్వహించే శతజయంతి ఉత్సవాల వివరాలను వారు లోకేష్‌కు తెలియజేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని కోరుతూ సేకరించిన సంతకాలతో రూపొందించిన బుక్‌లెట్‌ను కూడా లోకేష్‌ ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ ముత్యాల్లాంటి అందమైన దస్తూరి(చేతి రాత) తెలుగు ఫాంట్‌గా ఆవిష్కరించాలన్న అసోసియేషన్‌ ప్రయత్నాన్ని లోకేష్‌ కొనియాడారు.

*ప్రభుత్వ భూముల ఉచిత క్రమబద్ధీకరణకు వచ్చిన దర ఖాస్తుల పరిశీలనను 10-15 రోజుల్లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జీవో నంబరు 58 కింద 125 గజాల దాకా భూమిని ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. ప్రతి 250 దరఖాస్తులకు ఒక పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో ఆయా దరఖాస్తుల పరిశీలనకు మండల స్థాయిలోని బృందం సిఫారసు చేస్తే… ఆ సిఫారసు ఆధారంగా ఆర్డీవోలు కలెక్టర్లకు ఆన్‌లైన్‌లో నివేదిక పంపిస్తారు. ఆ సిఫారసు ఆధారంగా కలెక్టర్లు దరఖాస్తులను ఆమోదిస్తారు. అనంతరం పట్టాలను ఆన్‌లైన్‌లో జనరేట్‌ చేస్తారు. 10-15 రోజుల్లోగా దరఖాస్తుల పరిశీలన పూర్తయితే రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. జీవో నంబరు 58 కింద ఇచ్చే భూములను బదలాయించడానికి అవకాశం ఉండదు. ఇక జీవో నంబరు 59 కింద నామమాత్రపు మార్కెట్‌ విలువలతో రాయితీతో భూముల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను రెండో విడతలో పరిశీలించనున్నారు.

*వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది. గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకును ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబీకులు ఆరోపించారు. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకుని వచ్చారు. కాగా… బాధితుల ఆందోళనతో అనంతబాబు కారు వదిలి వెళ్లిపోయారు. సుబ్రమణ్యంను హత్య చేశారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

*డీజిల్ ట్యాంకర్.. కలప తరలిస్తున్న ట్రక్కు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం మహారాష్ట్రలోని చంద్రాపుర్లో జరిగింది. గురువారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు వాహనాలు ఢీకొనగానే మంటలు చెలరేగాయని.. ఈ క్రమంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారని అధికారులు పేర్కొన్నారు.ఘటనపై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని.. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను చంద్రాపుర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.