Movies

వర్ణవివక్షకు వ్యతిరేకంగా

వర్ణవివక్షకు వ్యతిరేకంగా

హీరోయిన్‌ ఇలియానా నటిస్తున్న సినిమా ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ’.రణ్‌దీప్‌ హుడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బల్వీందర్‌సింగ్‌ జుంజువా దర్శకుడు. సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో వర్ణవివక్షను వ్యతిరేకిస్తూ సాగే పాత్రలో ఇలియానా నటిస్తున్నది. ఆమె పాత్ర పేరు లవ్‌లీ, రంగు తక్కువగా ఉండే ఆమె సమాజం నుంచి ఎలాంటి వివక్షను ఎదుర్కొంది అనేది సినిమాలో చూపిస్తున్నారు.ఈ సినిమా గురించి ఇలియానా మాట్లాడుతూ…‘రంగు బాగుంటేనే అందంగా ఉన్నట్లు అని ఇప్పటికీ మనం అనుకుంటూ ఉంటాం. మా సినిమా ద్వారా ఈ సంప్రదాయ ఆలోచనలు మార్చే ప్రయత్నం చేస్తున్నాం. రంగు తక్కువగా ఉన్న లవ్‌లీ అనే అమ్మాయి సమాజంతో చేసిన పోరాటమే ఈ సినిమా. అలాగని మా సినిమాలో సందేశాలు ఇవ్వలేదు.వినోదాత్మకంగా కథను చెబుతూనే ఆలోచింపచేశాం. ఇది చూశాక కొందరిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం’ అని చెప్పింది. ఇలియానా ప్రస్తుతం విద్యాబాలన్‌, ప్రతీక్‌ గాంధీలతో కలిసి షిర్షా గుహ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నది.