DailyDose

కువైత్‌లో భారత ప్రవాసుడు మృతి – TNI నేర వార్తలు

కువైత్‌లో భారత ప్రవాసుడు మృతి – TNI  నేర వార్తలు

*కువైత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూశాడు. భావన్స్ కువైత్ అనే ఇండియన్ స్కూల్‌లో నాన్-టీచింగ్ స్టాఫ్‌గా పనిచేసే కేఎస్ సునీల్ కుమార్(45) శుక్రవారం మధ్యాహ్నం(కువైత్ స్థానిక కాలమానం ప్రకారం) చనిపోయాడు. వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో అక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. చివరికి ఆరోగ్యం క్షీణించడంతో చనిపోయినట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కేరళ రాష్ట్రం చెర్తలకు చెందిన సునీల్ గత 15 ఏళ్లుగా భావన్స్ కువైత్ స్కూల్‌లో ఆడియో వీడియో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సునీల్ మృతిపట్ల భావన్స్ కువైత్ పాఠశాల యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
* భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. జూలూరుపాడు మండలం భోజ్యాతండా వద్ద ఘటన చోటు చేసుకున్నది. స్నానం కోసం కాలువలో దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని నర్సింహరావు (34), బాబురావు (42)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి ఆచూకీ
స్థానికుల సహాయంతో గాలిస్తున్నారు.
* భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. జూలూరుపాడు మండలం భోజ్యాతండా వద్ద ఘటన చోటు చేసుకున్నది. స్నానం కోసం కాలువలో దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని నర్సింహరావు (34), బాబురావు (42)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి ఆచూకీ
స్థానికుల సహాయంతో గాలిస్తున్నారు.
* డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు (Case) నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ రిపోర్టు వచ్చాక పూర్తిస్థాయి విచారణ చేపడుతామని తెలిపారు.సాధ్యమైనంత త్వరగా కేసు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. తిరుపతిని కమిషనరేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తిరుపతి-చిత్తూరు సరిహద్దుల్లో మూతపడ్డ చెక్‌పోస్టులు తెరుస్తామని ప్రకటించారు. ఏబీవీ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
* మహారాష్ట్రలో శివసేన, మాజీ నటి, ఎంపీ నవనీత్‌ రాణా దంపతుల మధ్య పొలిటికల్‌ వార్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శనివారం ఎంపీ నవనీత్ రాణా, మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాకు నోటీసులు జారీ చేసింది.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఖార్‌ ప్రాంతంలో నవనీత్‌ రాణా దంపతులు తమ ఇంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ గుర్తించారు. ఈ క్రమంలో వారి ఫ్లాట్‌ వద్ద అక్రమ నిర్మాణాన్ని ఏడు రోజుల్లో తొలగించాలని బీఎంసీలు అధికారులు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో బీఎంసీ చర్యలు తీసుకొని కూల్చివేస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే MMC చట్టంలోని సెక్షన్ 475-A ప్రకారం ఫ్లాట్ యజమానికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
*హైదరాబాద్‌లో బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్‌ పన్వార్‌ (21) అనే యువకుడిని కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.
*ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే రహదారి భద్రతా గోడ శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయిది. దీంతో రిషికేశ్-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న 10 వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకున్నారు. జంకిచట్టి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.
ఈ ర‌హ‌దారుల‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి కనీసం 3 రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చిన్న చిన్న వాహ‌నాల‌ను పంప‌డానికి అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాహ‌నాల్లో ఉన్న యాత్రికులకు మాత్రం ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అధికారులు పేర్కొంటున్నారు.
కాగా బుధవారం భారీ వర్షాలు కురవడంతో సయనచట్టి, రణచట్టి మద్య ఉన్న రహదారి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 24 గంటలు మూసేసి తిరిగి గురువారం సాయంత్రం హైవే తెరిచారు. అయితే ఇంతలోనే మరోసారి రోడ్డు కూలిపోవడంతో ప్రస్తుత ఇబ్బంది పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
*కామారెడ్డి-సిరిసిల్ల బైపాస్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి శశాంక్‎గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది
*భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం మీదుగా ఝార్ఖండ్‌కు కారులో గంజాయిని తరలించేందుకు దుండగులు యత్నించారు. ఈ క్రమంలో భద్రాచలం శివారు ప్రాంతంలో కారును ఆపేందుకు ఎక్సయిజ్ శాఖ సిబ్బంది ప్రయత్నించింది. కారు ఆపకుండా వేగంగా వెళ్ళిపోయిన ఇద్దరు గంజాయి దొంగలు రామాలయం ప్రాంతంలో గంజాయితో సహా కారును వదిలేసి పరారయ్యారు. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కారుతో పాటు కారులో ఉన్న సుమారు 150 కేజీల గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
*కామారెడ్డి-సిరిసిల్ల బైపాస్ హైవేలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి శశాంక్‎గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది
*హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దర్జాగా బయట తిరుగుతున్నారు. కాసేపట్లో రాజవొమ్మంగి మండలంలో గృహ మంజూరు పత్రాల పంపిణీకి ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. ఇందుకోసం టెంట్లు వేసి మరీ అధికారులు జనాన్ని పోగేసి సభ నిర్వహిస్తున్నారు. అతిధిగా వస్తున్న ఎమ్మెల్సీ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. నిన్న దర్జాగా రంపచోడవరం ఎమ్మెల్యేతో కలిసి రెండు వివాహాలకు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. అయితే ఇంత జరుగుతున్నప్పటకీ పోలీసులు కళ్లప్పగించి చూస్తుడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
*గోపన్‌పల్లిలో బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యానికి దిగారు. చెరువుల పరిరక్షణ పేరుతో చెరువులను బీజేపీ నేతలు సందర్శిస్తున్నారు. బీజేపీ నేతలు యోగనంద్, మువ్వు సత్యనారాయణ, జ్ఞానేంద్ర ప్రసాద్, నరేష్, ప్రభాకర్‌ గోపన్‌పల్లిలో దేవుళ్ళ చెరువు సందర్శనకు వెళ్లారు. కార్పొరేటర్ గంగాధర్ చెరువులో ఎకరం భూమిని కబ్జా చేసి పార్టీ ఆఫీస్‌, గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. వ్యవహారాన్ని తెలుసుకోవడానికి బీజేపీ నేతలు వెళ్లారు. ఎందుకు వచ్చారంటూ బీజేపీ నేతలపై గంగాధర్ అనుచరులు దాడికి దిగారు. వీడియోలు తీయొద్దంటూ ఫొటోగ్రాఫర్‌పై కార్పొరేటర్ గంగాధర్‌ దాడి చేశాడు. బీజేపీ నేతలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో మువ్వ సత్యనారాయణ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చందానగర్ పీఎస్‌లో కార్పొరేటర్ గంగాధర్‌పై కమిటీ సభ్యుల ఫిర్యాదు చేశారు.
*సిరిసిల్ల రోడ్డు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొని… శశాంక్ అనే సివిల్ సప్లై కాంట్రాక్టర్ మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
*కలువాయిమండలంలోని ఉయ్యాలపల్లిఎర్రబల్లికోటూరుపల్లి గ్రామాల్లో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి  మందిని గాయపరిచింది. చిన్నారులు ఎక్కువ మంది ఉండడంతో కుక్కకాటుకు విలవిలలాడిపోతున్నారు. కలువాయి పీహెచ్‌సీలో చికిత్స అనంతరం కొందరిని మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు వైద్యశాలకు తరలించామని వైద్యాఽ దికారి సురేంద్రబాబు తెలిపారు. పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో పిచ్చి కుక్కలను పట్టి తరలించాలని కోరుతున్నారు.
*అరేబియా సముద్రంలో లక్షద్వీప్‌ తీరానికి సమీపంలో రెండు పడవల్లో తరలిస్తున్న డ్రగ్స్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ)భారత కోస్ట్‌గార్డ్స్‌(ఐసీజీ) పట్టుకున్నాయి. ఈ నెల మొదటివారం లో డీఆర్‌ఐకి వచ్చిన సమాచారంతో వ తేదీ నుంచి ఈ రెండు సంస్థలు అరేబియా సముద్రంలో పడవలు, నౌకల కదలికలపై నిఘా పెట్టాయి. ఈ నెల 18న అనుమానస్పదంగా వస్తున్న ‘ప్రిన్స్‌’, ‘లిటిల్‌ జీజస్‌’ అనే పడవలను తనిఖీ చేశాయి. ఈ రెండు పడవల్లో 218 కిలోల హెరాయిన్‌ను గుర్తించారు. కిలోకు ఒకటి చొప్పున మొత్తం 218 ప్యాకెట్లను సీజ్‌ చేశామని, పడవల్లో ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి, కోచిలోని నౌకాదళ ప్రధాన కార్యాలయానికి తరలించామని డీఆర్‌ఐ అధికారులు వివరించారు.
*తెలంగాణ ఆర్టీసీ బస్‌లో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్ నుంచి బంగారం, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఓ శుభ కార్యక్రమం నిమిత్తం మహిళ రాజమండ్రి నుండి జంగారెడ్డిగూడానికి బస్సులో బయలుదేరారు. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్‌లో బస్ దిగి బ్యాగ్ చూసుకోగా ఖాళీగా వుండటంతో బాధితురాలు అవక్కైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బస్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీ చేస్తున్నారు.
*డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై కేసు (Case) నమోదు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ రిపోర్టు వచ్చాక పూర్తిస్థాయి విచారణ చేపడుతామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా కేసు పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. తిరుపతిని కమిషనరేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తిరుపతి-చిత్తూరు సరిహద్దుల్లో మూతపడ్డ చెక్‌పోస్టులు తెరుస్తామని ప్రకటించారు. ఏబీవీ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
*పాలకొడేరు మండలంలోని దేవాలయాలలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. వేండ్ర గ్రామంలో గబ్బల మంగమ్మ, కొండేపూడి గ్రామంలోని రామాలయంలో హుండీలు చోరీకి గురయ్యాయి. మూడు హుండీలను దొంగలు ఎత్తుకుపోయారు. వాటిలోని డబ్బంతా తీసుకుని.. హుండీలను రోడ్డు పక్కన, పంట కాలువల్లో పడేశారు. గ్రామాలలో వరుస దొంగతనాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*చిత్తూరు: జిల్లాలోని సదుం మండలం జాండ్రపేటలో అక్కాతమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. అక్క రాధ, తమ్ముడు నరసింహులు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. గత అర్ధరాత్రి హత్య జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే రాధ భర్తకు దూరంగా ఉంటోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
*పల్నాడు: జిల్లాలోని పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్‌‌లో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్య వర్ధన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలు, అప్పుల బాధ తాళలేక రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 45 రోజుల క్రితం సత్య వర్ధన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్‌ రోడ్డులో శుక్రవారం రాత్రి జీడికర్రల లారీ బ్రేక్‌లు ఫెయిల్‌ కావడంతో 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. లారీ డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నడింపాలెం గ్రామానికి చెందిన సుంకరి పండుకు చెందిన 30 టన్నుల జీడిమామిడి కర్రల లోడుతో బయలుదేరిన లారీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో చింతాలమ్మ ఘాట్‌ మూడవ మలుపు వద్ద 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ దూకేందుకు ప్రయత్నించగా డోర్‌ ఓపెన్‌ కాలేదు. అయితే లారీ వెనుక ద్విచక్రవాహనంపై వస్తున్న యజమాని పండు.. డ్రైవర్‌ కేకలు విని ఆగాడు. తర్వాత అతికష్టం మీద లోయలోకి దిగి లారీ డోర్‌ తెరవడంతో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. లారీలో డ్రైవర్‌ మినహా మరెవ్వరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
*కలువాయి మండలంలోని ఉయ్యాలపల్లి, ఎర్రబల్లి, కోటూరుపల్లి గ్రామాల్లో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి 15 మందిని గాయపరిచింది. చిన్నారులు ఎక్కువ మంది ఉండడంతో కుక్కకాటుకు విలవిలలాడిపోతున్నారు. కలువాయి పీహెచ్‌సీలో చికిత్స అనంతరం కొందరిని మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు వైద్యశాలకు తరలించామని వైద్యాఽ దికారి సురేంద్రబాబు తెలిపారు. పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో పిచ్చి కుక్కలను పట్టి తరలించాలని కోరుతున్నారు.
*చిత్తూరు జిల్లా:::యువతి, యువకుడు దారుణ హత్య.సదుం మండలం జాండ్రపేటలో ఇద్దరి అనుమానాస్పద మృతి.వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న రాధా, వెంకటేషు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది చంపినట్లుగా తెలుస్తోంది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మృతి చెందిన ఇద్దరు మదనపల్లి ప్రాంతానికి చెందిన వారని స్థానికులు తెలిపారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడలో ఓ కుటుంబం రూ.3 కోట్లు అప్పులు చేసి ఉడాయించింది. శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామంలో 75 మంది దగ్గర అప్పు తీసుకున్నారు. ఇటీవల అనారోగ్యంతో శ్రీనివాస్ మరణించాడు. ఆస్తులమ్మి అప్పులు తీరుస్తానని అతని భార్య బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చింది. తీరా గడువు ముగియడంతో విలువైన సామగ్రితో ఆమె కుటుంబంతో సహా పారిపోయింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
*హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ దర్జాగా బయట తిరుగుతున్నారు. కాసేపట్లో రాజవొమ్మంగి మండలంలో గృహ మంజూరు పత్రాల పంపిణీకి ఎమ్మెల్సీ హాజరుకానున్నారు. ఇందుకోసం టెంట్లు వేసి మరీ అధికారులు జనాన్ని పోగేసి సభ నిర్వహిస్తున్నారు. అతిధిగా వస్తున్న ఎమ్మెల్సీ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. నిన్న దర్జాగా రంపచోడవరం ఎమ్మెల్యేతో కలిసి రెండు వివాహాలకు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. అయితే ఇంత జరుగుతున్నప్పటకీ పోలీసులు కళ్లప్పగించి చూస్తుడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.